భూమా విఖ్యాత్‌రెడ్డిని డీఫాల్టర్‌గా ప్రకటించిన విజయ డెయిరీ
నంద్యాల (అర్బన్): మ్యాక్స్ చట్టం, విజయ డెయిరీ బైలా ప్రకారం విజయ పాల డెయిరీకి పరోక్షంగా, ప్రత్యక్షంగా నష్టం కలిగించిన జగత్ డెయిరీ వర్కింగ్ పార్ట్‌నర్, ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డిని విజయ డెయిరీ డీఫాల్టర్‌గా ప్రకటించింది. ఆదివారం విజయ డెయిరీ చైర్మన్ ఎస్‌వీ జగన్‌మోహన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ జగత్ డెయిరీ వర్కింగ్ పార్ట్‌నర్‌గా భూమా విఖ్యాత్ ఉంటూ విజయడెయిరీ ద్వారా రూ.1.30 కోట్లు రుణం తీసుకొని పలుమార్లు నోటీసులు పంపినా అప్పు చెల్లించలేదన్నారు. 2014–2020 వరకు జగత్ పాల డెయిరీని విజయ డెయిరీకి సమానంగా నడిపారని.. ఆ సమయంలో 30% వ్యాపారం విజయ డెయిరీకి నష్టం వచ్చిందన్నారు.
జగత్ డెయిరీ మూతపడిన అనంతరం మళ్లీ విజయ డెయిరీ లాభాల్లోకి వచ్చిందన్నారు. నాలుగేళ్లుగా తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో నోటీసులిచ్చినా విఖ్యాత్ స్పందించలేదని, ప్రైవేట్ డెయిరీలో పనిచేస్తున్న వారికి విజయ డెయిరీలో స్థానం లేదని స్పష్టం చేశారు. జగత్ విఖ్యాత్ విజయపాల డెయిరీకి సమాంతర వ్యాపారం నిర్వహిస్తూ విజయ డెయిరీ నష్టాలకు బాధ్యులయ్యారని తెలిపారు. ఆయన ప్రాతినిధ్యం వస్తున్న చక్రవర్తులపల్లె పాల సొసైటీ పాలకవర్గాన్ని కూడా రద్దు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment