
'మరోసారి పూలదండలు, బొకెలు వద్దు'
హైదరాబాద్ : తనవద్దకు వచ్చేవారు పూలదండలు, బొకేలు తీసుకు రావద్దని మంత్రి పదవి చేపట్టిన వ్యవసాయ, పాడి పరిశ్రమ శాఖామంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. తార్నాకల డివిజన్ లాలాపేటలోని విజయ డెయిరీని ఆయన తొలిసారిగా మంత్రి హోదాలో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు పెద్ద ఎత్తున పూల బొకెలతో, దండలతో ఉద్యోగులు బాణసంచా కాలుస్తూ ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం డెయిరీ ఎండీ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో మరికొందరు ఉద్యోగులు పూల బొకెలతో శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చారు. దీన్ని గమనించిన పోచారం తాను మరోసారి డెయిరీకి వస్తే ఎవరూ పూల బొకేలు, దండలు తీసుకు రావద్దని సూచించారు. డబ్బును దుర్వినియోగం చేయరాదని పోచారం కోరారు.