flower garland
-
నా పెళ్లి నా ఇష్టం
పెళ్లిలో పెళ్లికొడుకు మెడలో పూలదండ కనిపించడం సాధారణమే. హరియాణ రాష్ట్రం ఖురేషీపూర్ గ్రామానికి చెందిన ఈ వరుడు మాత్రం సంప్రదాయానికి భిన్నంగా ఖరీదైన కొత్తరకం దండ తయారు చేయించాడు. దీని అర్థం... ఖరీదైన పువ్వులతో దండ తయారు చేయించాడు అని కాదు. అది కరెన్సీ దండ. 20 లక్షల అయిదు వందల నోట్లతో తయారు చేయించిన ఈ వరుడి దండ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్‌పై నెటిజనులు రకరకాలుగా స్పందించారు. కొందరు ‘ఆహా! అద్భుతం’ అంటే– మరికొందరు ‘ఏమిటీ అతి’ అని చురకలు అంటించారు. ‘ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్లకు ఫిర్యాదు చేస్తాం’ అని కొందరు బెదిరించారు. ఎవరి స్పందన ఎలా ఉన్నా ఈ వీడియో క్లిప్ 15 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ఈ మధ్య వచ్చిన ‘కీడా కోలా’ సినిమాలో హీరో బార్బీ డాల్ మీద మనసు పడతాడు. పెళ్లంటూ చేసుకుంటే బార్బీ డాల్నే చేసుకుంటానని ప్రతినపూనుతాడు. అది సినిమా కాబట్టి నవ్వుకుంటాం. ‘నిజజీవితంలో ఇంత సీన్ ఉంటుందా!’ అనుకుంటాం. అయితే బ్రెజిల్‌కు చెందిన రోచా మోరీస్ వివాహవేడుకను చూస్తే ‘నిజ జీవితంలో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి’ అనే వాస్తవం బోధపడుతుంది. రోచా ‘మార్సెల్’ను పెళ్లి చేసుకుంది. సదరు ఈ మార్సెల్ మానవమాత్రుడు కాదు. ఓ బొమ్మ. 40 మంది గెస్ట్‌లతో ఈ పెళ్లి ఘనంగా జరిగింది. -
'మరోసారి పూలదండలు, బొకెలు వద్దు'
హైదరాబాద్ : తనవద్దకు వచ్చేవారు పూలదండలు, బొకేలు తీసుకు రావద్దని మంత్రి పదవి చేపట్టిన వ్యవసాయ, పాడి పరిశ్రమ శాఖామంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. తార్నాకల డివిజన్ లాలాపేటలోని విజయ డెయిరీని ఆయన తొలిసారిగా మంత్రి హోదాలో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు పెద్ద ఎత్తున పూల బొకెలతో, దండలతో ఉద్యోగులు బాణసంచా కాలుస్తూ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం డెయిరీ ఎండీ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో మరికొందరు ఉద్యోగులు పూల బొకెలతో శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చారు. దీన్ని గమనించిన పోచారం తాను మరోసారి డెయిరీకి వస్తే ఎవరూ పూల బొకేలు, దండలు తీసుకు రావద్దని సూచించారు. డబ్బును దుర్వినియోగం చేయరాదని పోచారం కోరారు.