సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో 21,189 జల వనరులలో 80.69 కోట్ల చేప పిల్లల విడుదలకు ఆమోదం తెలిపే ఫైలుపై పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తొలి సంతకం చేశారు. శుక్రవారం ఆయన సచివాలయంలో బాధ్యతలు చేపట్టా రు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు, ఇతర మంత్రుల సమక్షంలో కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. కృత్రిమ పద్ధతి ద్వారా వీర్య సరఫరా చేసి లేగదూడలను ఉత్పత్తి చేయడానికి సంబంధించి రూ.47.50 కోట్లతో కరీంనగర్‌లో ఏర్పా టు చేయనున్న ప్రాజెక్టు అనుమతుల ఫైలుపై రెండో సంతకం చేశారు.
ఇక రాష్ట్రంలోని పశువైద్యశాలల్లో ఆధునీకరణ, పరికరాలను సమకూర్చేందుకు సంబంధించి రూ. 12.18 కోట్ల ప్రతి పాదనలకు ఆమోదం తెలిపే ఫైలుపై మూడో సంతకం చేశారు. కాగా సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయ అర్చకులు వేదమంత్రాలు, పూర్ణకుంభంతో మంత్రికి సచివాలయంలో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం 10.52కి మంత్రి బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా తలసానికి హోంమం త్రి మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, పశుసంవర్థకశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ తదితరులు అభినందనలు తెలిపారు.
విజయ డ్రింకింగ్ వాటర్‌కు శ్రీకారం
విజయ డెయిరీ నూతన ఉత్పత్తులు, ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్, దూద్ పేడ నూతన ప్యాకింగ్, పెట్ జార్లలో నెయ్యి ప్యాకింగ్‌లను తలసాని ఆవిష్కరించారు. పశు ఆరోగ్య కార్డులను విడుదల చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక, మత్స్య శాఖల కు రూ. వేల కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నట్లు తలసాని తెలిపారు. రానున్న రోజుల్లో విజయ డెయిరీ నంబర్‌వన్ స్థానంలో నిలవడం ఖాయ మన్నారు. అనంతరం విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయదారులు నలుగురికి బెస్ట్ వెండర్ అవార్డులను మంత్రి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment