Thalaassani Srinivas Yadav
-
కాంగ్రెస్ నేతలు దద్దమ్మలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు దద్దమ్మలని...టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతకాని దద్దమ్మని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ వార్తల్లో ఉండేందుకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌రెడ్డితో కలసి శ్రీనివాస్ యాదవ్ తెలంగాణభవన్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్‌ను కలసి రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఉందన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులపై ఉత్తమ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు ఈనీతులు ఏమయ్యాయని ప్రశ్నించారు. స్పీకర్ హైదరాబాద్‌లో ఉండకుండా పారిపోయారని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం అర్థరహితమన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డిని రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయని, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సంగతిని మరిచి ఇటువంటి రాజకీయాలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ఇకనైనా కాంగ్రెస్ నేతలు నోరుదగ్గరపెట్టుకుని మాట్లాడాలని సూచించారు. ఫలితాల రోజు అదే తీర్పు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టారని, లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజు కూడా అదే తీర్పు వస్తుందని తలసాని జోస్యం చెప్పారు. ఇన్నేళ్లు పాలించిన కాంగ్రెస్ నేతలు కాళేశ్వరంలాంటి ప్రాజెక్టును ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించారు. ఇంటర్ ఫలితాల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే చర్యలు తీసుకున్నారని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు.శనివారం ఉదయం తొమ్మిది గంటలకు తెలంగాణ భవన్ టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు జరుగుతాయని తలసాని, శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈ వేడుకలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలి పారు. ఈ వేడుకలకు టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. -
చిల్లరగాళ్లకు చిల్లరగాడు చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ‘చిల్లరగాళ్లకు చిల్లర గాడు’ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వ్యాఖ్యానించారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ శాతం బాగుందని, అక్కడ ప్రచారం ముగిసిన తర్వాత కూడా చంద్రబాబు ఎన్నికల కమిషన్‌ను కలసి ఒక డ్రామా సృష్టించారన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మీడియా ముందు సీఎం ప్రచారం చేశారని ఆరోపించారు. మూడు నెలల ఉపన్యాసాలతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఉద యం నుంచి రాత్రి పడుకునేవరకు తలచుకున్నారన్నారు. టెక్నాలజీతోపాటు సెల్‌ఫోన్‌ను కూడా తానే కనిపెట్టిన అని చెప్పుకునే చంద్రబాబు.. తాను ఓటు వేస్తే ఎటు పోయిందో అంటూ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. చంద్రబాబులో ఓటమి భయం స్పష్టంగా కనబడుతోందని, నాలుగు ఓట్ల కోసం ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. రాష్ట్రంలో గూండాయిజం జరుగుతోందని చెప్పిన ఆయనే నర్సరావుపేట, సత్తెనపల్లి, మంగళగిరి, ఆళ్లగడ్డల్లో డ్రామాలాడించారన్నారు. సత్తెనపల్లి పోలింగ్ స్టేషన్లోకి వెళ్లి మరీ తలుపులు పెట్టుకుని ఎవరు ఏం చేశారో టీవీల్లో తాము చూశామని పరోక్షంగా ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఉదంతాన్ని ప్రస్తావించారు. ఇక్కడ ఆస్తులున్న వారిని బెదిరించారని, కొట్టారని ఎన్నికల్లో ప్రచారం చేశారన్నారు. పాలు, పెరుగు అమ్మితే రూ.1,600 కోట్లు వస్తాయా? ఏపీ పైన అంత ప్రేమ ఉంటే హైదరాబాద్‌లో ఉన్న బాబు ఆస్తులు అమ్మేసి శాశ్వతంగా ఏపీకి వెళ్లిపోవాలని తలసాని అన్నారు. పాలు, పెరుగు, కూరగాయలు అమ్ముకునే వారు రూ.1600 కోట్లు సంపాదించగలరా, హెరిటేజ్‌లో అన్ని దొంగ లెక్కలే ఉన్నాయన్నారు. చంద్రబాబు నిజాయతీ పరుడైతే ఎన్నికలకు ఖర్చు పెట్టలేదని మీ పిల్లల పైన కాణిపాకం వినాయకుని ముందు ఒట్టు వేయాలన్నారు. చంద్రబాబు అవినీతి పరుడని తమ పిల్లల పైన ఒట్టు వేస్తానన్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబని, ఆయన మనవడి పేరిట రూ.75 కోట్ల ఆస్తులు ఎక్కడివో చెప్పాలన్నారు. ఐదేళ్ల నుంచి అమలు చేయని అన్నదాత సుఖీభవ, పసుపు –కుంకుమ లాంటి పథకాలు ప్రజలను మభ్యపెట్టడానికి ఎన్నికల వేళ అమల్లోకి తెచ్చారన్నారు. టీడీపీకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు , జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అని చేప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా ఆ పార్టీకి ఎంఎల్ఏలు ఎక్కడ ఉన్నారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల్లో డబ్బుల పంపిణీ ప్రారంభించిందే చంద్రబాబు అని ఆరోపించారు. కేసీఆర్ లాగా ఆరు నెలల ముందే టిక్కెట్లు ఇస్తానని చెప్పి నామినేషన్ల ఉపసంహరణ నాడు అభ్యర్థులను ప్రకటించారన్నారు. దుర్మార్గుల చేతిలో ఈ రాష్ట్రాన్ని పెట్టకండంటూ ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు తమ్ముళ్లూ అంటూ జూనియర్ ఆర్టిస్టులతో బస్సు ఎక్కి డ్రామా చేశారని, ఐదేళ్లలో కనక దుర్గ గుడి దగ్గరి ఫ్లై ఓవర్‌నే కట్టని దద్దమ్మ చంద్రబాబు అని అన్నారు. రూ.2 వేల నోట్ల కట్టలను ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ పంపించారని మాట్లాడటం సరికాదన్నారు. చంద్రబాబు ఇమేజ్ బురదలో పడి పొర్లుతోందని, వయసు మీదపడటంతో మతిస్థిమితం కోల్పోతున్నాడన్నారు. 18 కేసులపై కోర్టులో స్టేలు తెచ్చుకుని, తిరుగుతూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడన్నారు. తెలంగాణలో 16 పార్లమెంటు స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని, సీఎం కేసీఆర్ పాలనాదక్షతను గుర్తించిన పేదలు, బడుగు బలహీన వర్గాల వారు టీఆర్ఎస్ పార్టీని బలపరుస్తున్నారన్నారు. సికింద్రాబాద్ పార్ల మెంట్ పరిధిలో ప్రజల స్పందన చాలా బాగుందన్నా రు. మే 23న వెలువడే ఫలితాలు ఏకపక్షంగా ఉంటా యన్నారు.టీఆర్ఎస్ పార్టీ తమకు అన్ని విధాలుగా సహకరిస్తుందని ప్రజలు భావిస్తున్నారన్నారు. -
నాలుగు ఓట్లకోసం ఇంతలా దిగజారాలా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి వచ్చే నాలుగు ఓట్ల కోసం ప్రధాని మోదీ దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. నోరుపెద్దగా ఉందని ఏదిపడితే అది మాట్లాడటం ప్రధాని స్థాయికి తగదని హితవు పలికారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్పై మోదీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ‘ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ చాలా మాట్లాడారు. కానీ హైదరాబాద్‌కు ఏం చేశారో చెప్పలేకపోయారు. మెట్రో రైలు ఘనత తనదే అన్నట్లు మాట్లాడారు. ఎంఐఎం స్టీరింగ్‌తో ప్రభుత్వం నడుస్తోందని మోదీ ఆరోపించడమేంటి.. ఎంఐఎం మా మిత్రపక్షమని బహిరంగంగానే చెబుతున్నాం’ అని అన్నారు. ‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడింది, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అతి కష్టంగా ఒక్క సీటు గెలిచింది. 2014లో సికింద్రాబాద్‌లో బీజేపీ గెలిచింది. బీసీ నేత అయిన దత్తాత్రేయ ను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించడంతో పాటు ఈసారి టికెట్ కూడా నిరాకరించారు’ అని విమర్శించారు. ఈ విషయాలపై మోదీ ఎందుకు మాట్లాడలేదు. అబద్ధాలు మాట్లాడటం ప్రధాని స్థాయికి తగునా అని ప్రశ్నిం చారు. ఉద్యోగాల గురించి మోదీ మాట్లాడుతున్నారు.. ఆయన ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పగలరా అని నిలదీశారు. తెలంగాణలో 75 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. మా రాష్ట్రం లో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. వచ్చేది ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వమే.. తెలంగాణలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవదని, కేంద్రంలో బీజేపీకి 150కి మించి సీట్లు రావని, ఇక కాంగ్రెస్ 70 సీట్లు కూడా దాటదన్నారు. కేంద్రంలో ఏర్పాటు అయ్యేది ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ తోడుదొంగలు, ఎన్నికలు రాగానే బీజేపీకి హిందూత్వ గుర్తుకు వస్తుంది, బీజేపీ నేతలు ఇంట్లో పూజలు కూడా సరిగా చేయరు కానీ, బయట మతం గురించి మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. మోదీ సహా బీజేపీ నేతలు పుల్వామా దాడిని రాజకీయం చేశారన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగలేదంటున్న మోదీ.. మంత్రులను పొగిడిన విషయం మరిచారా? అని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ అవినీతిలో పుట్టిన పార్టీ అని, రాహుల్ గాంధీ కూడా అవినీతి గురించి మాట్లాడటమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు అడ్రస్ లేకుండా పోతాయని తలసాని చెప్పారు. టీఆర్ఎస్లోకి బీఎన్ రెడ్డి తెలుగుదేశం ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. ఇప్పటిదాకా బీఎన్ రెడ్డి తెలుగుదేశం అధికార ప్రతినిధిగా, ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరించారు. -
తెలంగాణకు బీజేపీ ఏమీ చేయలేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 2014లో ఏదో ఉద్ధరిస్తారని మోదీని గెలిపిస్తే ఏం చేయలేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు మోదీ ఏం చేశారో చెప్పగలరా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శి వల్లభ్, పలువురు ఇతర నేతలు తెలంగాణ భవన్లో గురువారం టీఆర్ఎస్లో చేరారు. మంత్రి తలసాని వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో యువతదే కీలక పాత్ర. యువకులు రాజకీయాల్లోకి రావడానికి కేటీఆర్ ఆదర్శమవుతున్నారు. టీఆర్ఎస్కు సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎవరూ పోటీ లేరు. మా నియోజకవర్గంలో మాకు మాకే పోటీ. ప్రచారంలో గులాబీ జెండా తప్ప మరొకటి కనిపించడం లేదు. కాంగ్రెస్ నేతలు మాట్లాడటానికే తప్ప పనులు చేయడానికి పనికి రారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందిస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే. లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలిపిస్తే ఇతర పార్టీలతో కలిపి వాటిని 216 చేసే శక్తి కేసీఆర్‌కు ఉంది. కాంగ్రెస్, బీజేïపీలను ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది. ఏపీ సీఎం చంద్రబాబుకు నిద్రలో కూడా కేసీఆర్ కనబడుతున్నారు. ఆంధ్రా వాళ్లను కొడుతున్నారని, వారి ఆస్తులు లాక్కుంటున్నారని చంద్రబాబు మాట్లాడుతున్నారు. చంద్రబాబు తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. ఆంధ్రా రాజకీయాలన్నీ కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి’అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్ పాల్గొన్నారు. -
తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితమైందని, పార్టీ నడపడం చేతగాని ఆ నేతలంతా టీఆర్ఎస్పై పడి ఏడుస్తున్నారని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం విలేకరుల సమావేశంలో తలసాని మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ, ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘తెలంగాణలో అభివృద్ధి లేకుండానే.. ప్రజ లంతా టీఆర్ఎస్ను తిరిగి గెలిపించారా.. తెలంగాణలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ నేతలకు పార్టీ నడపడం చేత కాక మా మీద పడి ఏడుస్తున్నారు. ఉన్న పది మంది కాంగ్రెస్ నేతల్లో ఒకరంటే మరొకరికి పడదు. వలసలపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు గురివింద సామెతను గుర్తు చేస్తున్నాయి. టీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకునేప్పుడు ఈ నీతులు ఎటు పోయాయి. కాంగ్రెస్ నేతలు దద్దమ్మ ల్లా మారారు. కాంగ్రెస్ తెలంగాణలో భూస్థాపితం అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో 103 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ కూడా మాట్లాడుతోంది. మతాన్ని నమ్ముకుని, అమ్ముకుని ఓట్లడిగే పార్టీ బీజేపీ. మోదీ దేశానికి చేసిందేమీ లేదు. 2 ఎంపీ సీట్లతో కేసీఆర్ తెలంగాణ సాధించారు. 16 ఎంపీ సీట్లు గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి తెలంగాణకు రావాల్సినవి తెస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు. అమరావతికి పారిపోయిన దొంగ.. బాబు ఓటుకు కోట్లు కేసులో దొరికి అమరావతికి పారిపోయిన దొంగ చంద్రబాబు అని తలసాని అన్నారు. ‘ఏపీ ప్రజలు మోసగాడైన బాబును ఇంటికి పంపా లని ఎపుడో నిర్ణయించుకున్నారు. ఎన్నికల కోసమే పసుపు–కుంకుమ పేరిట డబ్బులు ఇస్తున్నారు. ఇది దగా.. మోసం.. కేసీఆర్‌ను ప్రతిక్షణం తలుచుకోవడమే బాబు బతుకు. బాబు ప్రసంగాలతో జనాలకు బోర్ కొడుతోంది. అమరావతి రాజధాని నిర్మాణం మాట దేవుడెరుగు.. విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టలేక పోయారు. వైసీపీ 120 నుంచి 130 సీట్లు గెలవబోతోంది.. రాసి పెట్టుకోండి. 22 నుంచి 23 ఎంపీ సీట్లు వైసీపీకి రావడం ఖాయం. ఓడిపోయాక చంద్రబాబు చేరుకునేది హైదరాబాద్ ఇంటికే’ అని వ్యాఖ్యానించారు. బాబు చరిత్ర నా దగ్గరుంది.. ‘చంద్రబాబు ఓడిపోతారనే భయంతో కేసీఆర్ మీద ఏదేదో మాట్లాడుతున్నారు. చేసింది చెప్పుకోలేకే బాబు చిల్లరగా, దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబువి అన్నీ దొంగ మాటలే. హైదరాబాద్‌లో ఆస్తులున్న టీడీపీ నేతలను టీఆర్ఎస్ బెదిరిస్తుందంటూ బాబు ప్రజల్లో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్‌కి బాబు మాటలే ఫ్రీ పబ్లిసిటీ. అందరి చరిత్రలు బయటపెడతా అని బాబు అంటున్నారు. బాబు చరిత్ర నా దగ్గర ఉంది’ అని తలసాని వ్యాఖ్యానించారు. -
చేప పిల్లల పంపిణీపై తొలి సంతకం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో 21,189 జల వనరులలో 80.69 కోట్ల చేప పిల్లల విడుదలకు ఆమోదం తెలిపే ఫైలుపై పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తొలి సంతకం చేశారు. శుక్రవారం ఆయన సచివాలయంలో బాధ్యతలు చేపట్టా రు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు, ఇతర మంత్రుల సమక్షంలో కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. కృత్రిమ పద్ధతి ద్వారా వీర్య సరఫరా చేసి లేగదూడలను ఉత్పత్తి చేయడానికి సంబంధించి రూ.47.50 కోట్లతో కరీంనగర్లో ఏర్పా టు చేయనున్న ప్రాజెక్టు అనుమతుల ఫైలుపై రెండో సంతకం చేశారు. ఇక రాష్ట్రంలోని పశువైద్యశాలల్లో ఆధునీకరణ, పరికరాలను సమకూర్చేందుకు సంబంధించి రూ. 12.18 కోట్ల ప్రతి పాదనలకు ఆమోదం తెలిపే ఫైలుపై మూడో సంతకం చేశారు. కాగా సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయ అర్చకులు వేదమంత్రాలు, పూర్ణకుంభంతో మంత్రికి సచివాలయంలో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం 10.52కి మంత్రి బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా తలసానికి హోంమం త్రి మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, పశుసంవర్థకశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ తదితరులు అభినందనలు తెలిపారు. విజయ డ్రింకింగ్ వాటర్‌కు శ్రీకారం విజయ డెయిరీ నూతన ఉత్పత్తులు, ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్, దూద్ పేడ నూతన ప్యాకింగ్, పెట్ జార్లలో నెయ్యి ప్యాకింగ్‌లను తలసాని ఆవిష్కరించారు. పశు ఆరోగ్య కార్డులను విడుదల చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక, మత్స్య శాఖల కు రూ. వేల కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నట్లు తలసాని తెలిపారు. రానున్న రోజుల్లో విజయ డెయిరీ నంబర్‌వన్ స్థానంలో నిలవడం ఖాయ మన్నారు. అనంతరం విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయదారులు నలుగురికి బెస్ట్ వెండర్ అవార్డులను మంత్రి అందజేశారు. -
‘తలసానిపై కేసు నమోదు చేయాలి’
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బన్సిలాల్‌లో ఉన్న జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో గత నెల 30న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. తలసానిపై తక్షణమే కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ విచ్చలవిడిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి సోమవారం ఈ–మెయిల్ ద్వారా ఆయన ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించే హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఆయన కోరారు. -
సమంత ఇంట్లో సంతోషం చేరింది
– నాగచైతన్య ‘తెలుగు చిత్రసీమ చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, రామానాయుడు వంటి దిగ్గజాలు చేసిన కృషి మరువలేనిది. అప్పట్నుంచి చిత్రసీమ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. దీన్ని మరింత అభివృద్ధి చేయడానికి, సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ముందుంటుంది. ఇక, అవార్డుల విషయానికి వస్తే విలేకరి స్థాయి నుంచి పత్రికాధినేతగా ఎదిగి, 15 ఏళ్లుగా అవార్డుల ప్రదానోత్సవాలు నిర్వహిస్తున్న ‘సంతోషం’ సురేశ్ కొండేటి ఎంతగా కష్టపడ్డాడో అర్థమవుతోంది’’ అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ‘సంతోషం’ సౌతిండియన్ ఫిల్మ్ అవార్డుల వేడుక జరిగింది. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ప్రేమమ్), నటిగా సమంత (అఆ), దర్శకుడిగా బోయపాటి శ్రీను (సరైనోడు), నిర్మాతగా రాజ్ కందుకూరి (పెళ్లి చూపులు) అవార్డులు అందుకున్నారు. స్వర్గీయ దాసరి నారాయణరావు పేరు మీద ఈ ఏడాది నుంచి దాసరి స్మారక అవార్డులనూ ‘సంతోషం’ సురేశ్ ఇవ్వడం ప్రారంభించారు. నిర్మాతగా అల్లు అరవింద్, నటుడిగా మురళీమోహన్, రచయితలుగా పరుచూరి సోదరులు, విలేకరిగా పసుపులేటి రామారావులు దాసరి స్మారక పురస్కారాన్ని, అల్లు రామలింగయ్య స్మారక అవార్డును సప్తగిరి అందుకున్నారు. నటి రోజా రమణి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ‘‘ప్రేక్షకులు, విమర్శకుల ప్రోత్సాహంతో ‘ప్రేమమ్’కు అవార్డు వచ్చింది. అలాగే, సమంత ఇంటినిండా ఉన్న అవార్డుల్లో సంతోషం అవార్డు కూడా చేరింది’’ అన్నారు నాగచైతన్య. ‘‘దాసరిగారి పేరు మీద తొలిసారిగా సురేశ్ అవార్డు నెలకొల్పడం, అదీ నేను అందుకోవడం సంతోషం’’ అన్నారు అల్లు అరవింద్. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. -
సీబీఐ విచారిస్తే ఆధారాలిస్తాం
భూకుంభకోణంలో తలసాని: మల్లు రవి సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూముల కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపిస్తే మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాత్రకు సంబంధిం చిన ఆధారాలు ఇస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి చెప్పారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ.. తలసాని పిట్ట బెది రింపులకు భయపడేది లేదన్నారు. భూకుంభకోణంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ కూడా ఇదే చెప్పారన్నారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణమైన దీన్ని సీబీఐకి కాకుండా సీఐడీకి అప్పగించడంలో రహస్యమేంట ని ప్రశ్నించారు. తలసాని బాగోతం బయటపడుతుందనే భయంతోనే సీబీఐకి ఇవ్వడం లేదన్నారు. పెద్ద పెద్ద రాజకీయ, పోలీసు అధికారుల హస్తముందనే నయీం కేసును ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. కేసీఆర్‌కు నైతిక విలువలుంటే తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని మర్చి పోవద్దని మల్లు సూచించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు గాంధీభవన్‌లో శనివారం జరిగాయి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సోనియా ఫొటో లేకుండా, రాజకీయ స్వార్థంతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సంద ర్భంగా పలువురు ఉద్యమకారులను సన్మానించారు. -
తలసాని మతి తప్పి మాట్లాడుతున్నారు
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి సాక్షి, హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మతి తప్పి మాట్లాడుతున్నారని, మంత్రి స్థాయిని దిగజార్చినందుకు వెంటనే మంత్రివర్గం నుంచి తప్పించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. దిగజారిపోయి ప్రవర్తిస్తున్న తలసానిపై చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీపై, నేతలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తమ కార్యకర్తలు తగిన బుద్ధి చెబుతారని మల్లు హెచ్చరించారు. -
కటింగ్ బాబూ.. కటింగ్..
సూర్యాపేట: విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మంగళవారం సూర్యాపేట పట్టణంతో పాటు మండలంలో కూలి పనులు చేశారు. వివిధ రకాల పనులు చేసి రూ.2,37,500 సంపాదించారు. సూర్యాపేట బిగ్‌బాస్ క్షౌ రశాలలో బాలుడికి కటింగ్ కూడా చేశారు. చాయ్.. గరమ్ చాయ్.. హైదరాబాద్: వరంగల్ టీఆర్ఎస్ బహిరంగసభకు నిధుల సమీకరణలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మంగళవారం పలుచోట్ల కూలి పనులు చేశారు. రికార్డు స్థాయిలో రూ.16.50 లక్షలు సంపాదించి కూలి నంబర్–1గా నిలిచారు. సనత్‌నగర్ టిఫిన్ సెంటర్లో టిఫిన్, లక్కీ హోటల్లో చాయ్, బీకేగూడలో పుస్తకాల అమ్మకం, జలవిహార్ వాటర్ జోన్లో టికెట్ల అమ్మారు. చేపలమ్మా.. చేపలూ.. హైదరాబాద్: బౌద్ధనగర్ వీధుల్లో మంత్రి పద్మారావుగౌడ్ మంగళవారం చేపలు విక్రయించారు. దీంతో పాటు వివిధ కూలీ పనులు చేసిన మంత్రి రూ.15 లక్షల ఆదాయం ఆర్జించారు. చిటికెలో చేస్తా.. సిమెంట్ పని.. హైదరాబాద్: హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి గాంధీనగర్‌లో కూలీగా పనిచేసి మొత్తం రూ.3,51,232 సంపాదించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న కళాజ్యోతి ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసినందుకు గాను రూ.1,00,116 చెక్కును అందుకున్నారు. గాంధీనగర్‌లోని ఉదయ్ ఆదితి డెవలపర్స్ వద్ద సిమెంట్ పని చేసి రూ. 2,51,116 సంపాదించారు. కూల్ కూల్ ఐస్‌క్రీమ్.. హైదరాబాద్: గులాబీ కూలిలో భాగంగా ఎంపీ కే.కేశవరావు బంజారాహిల్స్ ఓరిస్ హోటల్లో ప్రత్యేకంగా తయారు చేసిన ఐస్‌క్రీమ్‌కు తెలంగాణ ఐస్‌క్రీమ్‌గా నామ కరణం చేశారు. ఇందుకు గాను కేకే రూ.2 లక్షలు అందుకున్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఆయన వెంట ఉన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ నోవా ఇంజినీరింగ్ కాలేజీలో పాఠాలు చెప్పి మరో రూ.2 లక్షలు సంపాదించారు.