
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బన్సిలాల్‌లో ఉన్న జీహెచ్‌ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌లో గత నెల 30న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు.
తలసానిపై తక్షణమే కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ విచ్చలవిడిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి సోమవారం ఈ–మెయిల్ ద్వారా ఆయన ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించే హోర్డింగ్లు, ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఆయన కోరారు.