అడుగడుగునా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు
సీఎం రమేష్ ఓవరాక్షన్.. పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఎన్నికల ప్రచారం
టీడీపీ ఏజెంట్లతో ఫొటో షూట్
క్యూలో నిల్చున్న ఓటర్లకు ప్రలోభాల ఎర
ఓటమి భయం కూటమి నేతల కుతంత్రాలకు తెరతీసింది. బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు అడుగడుగునా ఎన్నికల కోడ్‌ను అతిక్రమించారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ ధన, అనుచర బలంతో పేట్రేగిపోయారు. డబ్బులు వెదజల్లి సీటు దక్కించుకున్న కూటమి ఎంపీ అభ్యర్థి రమేష్ గత నెల రోజుల నుంచీ చేస్తున్న అరాచకాలను పోలింగ్ రోజైన సోమవారం మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. పోలింగ్ ప్రారంభానికి ముందే మొదలైన ఈ దారుణాలను పోలింగ్ పూర్తయ్యే వరకూ కొనసాగించారు. పోలీసులు, అధికారులు కూడా భయపడ్డ పరిస్థితి.
సాక్షి, అనకాపల్లి: ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికల్ని కూటమి నేతలు తమ అరాచకాలతో పలు చోట్ల ఓటర్లను భయాందోళనకు గురిచేశారు. పోలింగ్ బూత్‌ల వద్ద క్యూలో ఉన్న ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయతి్నంచారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా తన అనుచరులతో పోలింగ్ బూత్‌ల్లోకి నేరుగా సెల్‌ఫోన్‌లతో ప్రవేశించిచారు. టీడీపీ ఏజెంట్లతో ఫోటోలు దిగారు. జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారులపై దూషణలకు పాల్పడ్డారు. పార్టీ కండువాలతో పోలింగ్ బూత్‌ల్లో ప్రవేశించి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ ఓట్లు వేశారు. ఓటర్ స్లిప్‌లతో పాటు టీడీపీ మేనిఫెస్టో పంపిణీ చేస్తూ అడుగడుగునా నిబంధనలకు తూట్లు పొడిచారు.
సీఎం రమేష్ ఓవరాక్షన్
బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే కాకుండా పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల ప్రచార కేంద్రంగా మార్చేశారు. మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం కాశీపురం ప్రభుత్వ హైసూ్కల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆయన వెళ్లారు. క్యూ లైన్‌లో ఉన్న ఓటర్లను కలిసి బీజేపీకి ఓటేయాలంటూ ప్రలోభాలకు గురిచేశారు. పోలింగ్ బూత్‌లో ఉన్న టీడీపీ ఏజెంట్లతో ఫొటో షూట్‌కు దిగారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓటింగ్ ప్రక్రియకు ఆటంకం కల్గిస్తున్న ఆయన్ని లోపలికి రానించడంతోపాటు, ఎన్నికల సిబ్బంది సకల గౌరవ మర్యాదలు చేయడం, వంగి వంగి నమస్కారాలు పెట్టడం గమనార్హం. అనంతరం దేవరాపల్లి హైసూ్కల్ పోలింగ్ బూత్ వద్ద కూడా ఇదే విధంగా ఆయన వ్యవహరించారు. వారి అనుచరులతో పోలింగ్ బూత్‌లోకి చొరబడి ఓటింగ్ ప్రక్రియకు ఆటకం కలిగించారు.
బూతుల అయ్యన్న
ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో ప్రజల ఛీత్కాలు ఎదుర్కొనే మాజీ మంత్రి, టీడీపీ నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యన్నపాత్రుడు పోలింగ్ రోజూ తన నోటి దురుసును ప్రదర్శించారు. నర్సీపట్నం టౌన్ గరŠల్స్ హైసూ్కల్ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారులను బండ బూతులు తిడుతూ రెచ్చిపోయారు. రాయడానికి వీళ్లేని తిట్లందుకున్నారు. దీంతో అధికారులు నివ్వెరపోయారు. ఆ బూతులు విని ఓటర్లు అయ్యన్నను అసహ్యించుకున్నారు. ఓటేసేందుకు లైన్లలో నిరీక్షిస్తున్న మహిళల ముందే ఈయన ఈ బూతుల్ని అందుకున్నారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రవి పట్టన్‌శెట్టి, రిటర్నింగ్ అధికారి హెచ్‌వీ జయరాంలను దూషించి మాట్లాడాడు.
ఓటరు స్లిప్పుల పేరిట మేనిఫెస్టో కాపీలు
ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలో టీడీపీ నేతలు మరింతగా దిగజారారు. ఓటర్ స్లిప్‌లతో పాటు టీడీపీ మేనిఫెస్టోను పంపిణీ చేశారు. భీమిలి నియోజకవర్గంలో మూలకుద్దు, మధురవాడ, సంతపేట అంబేడ్కర్ హైసూ్కల్, పెద»ొడ్డేపల్లి ఆర్సీఎం స్కూల్, రామారావుపేట, శివపురం తదితర ప్రాంతాల్లో ఓటరు స్లిప్‌తో పాటు టీడీపీ మేనిఫెస్టో పంపిణీ చేశారు. బంగారుమెట్ట మీద దుర్గాలమ్మ ఆలయం వద్ద సూపర్ సిక్స్ ఫ్లెక్సీ పెట్టి ప్రచారం చేశారు. పెద»ొడ్డేపల్లిలో మున్సిపల్ వైస్ చైర్మన్ తమరాన అప్పలనాయుడు నిలదీయడంతో పోలీసులు స్లిప్పులు స్వా«దీనం చేసుకున్నారు. రామారావుపేటలో మున్సిపల్ వైస్‌చైర్మన్ కోనేటి రామకృష్ణ, వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకుని ఫిర్యాదు చేశారు. డీఎస్పీ మోహన్ స్వయంగా వచ్చి స్లిప్పులు స్వా«దీనం చేసుకుని టీడీపీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఈ అరాచకాలను అడ్డుకుని, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయింది.
పార్టీ కండువాతో ఓటింగ్‌కు పంచకర్ల
పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ కూడా నిబంధనల ఉల్లంఘనలో తానేమీ తక్కువ కాదని నిరూపించుకున్నారు. సుజాతనగర్ డీఏవీ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటేసేందుకు ఉదయం 10 గంటల సమయంలో ఆయన వచ్చారు. పార్టీ కండువాతో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన అతన్ని అధికారులు ఏ మాత్రం అడ్డుకోకపోవపోడం గమనార్హం.
ఓటర్ల చైతన్యం.. అధికారిపై చర్యలు
ఓటర్లలో చైతన్యం పెరిగింది. వక్రబుద్ధితో వ్యవహరిస్తున్న ఎన్నికల అధికారికి బుద్ధి చెప్పేలా చేశారు. సోమవారం ఉదయం పాయకరావుపేట నియోజకవర్గం, నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు పోలింగ్ బూత్‌లో కళ్లు సరిగా కనిపించని వృద్ధుల ఓట్లను అక్కడి పోలింగ్ అధికారి టీడీపీకి వేయించాడు. ప్రశ్నించిన ఏజెంట్‌పై దురుసుగా ప్రవర్తించాడు. దేవరాపల్లి మండలం ఎ.కొత్తపల్లిలోని పోలింగ్ బూత్ నెం.173లో వృద్ధురాలు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరగా, పోలింగ్ అధికారి కమలం పువ్వు గుర్తుకు ఓటేశారు. దీన్ని గుర్తించిన 70 ఏళ్ల వృద్ధురాలు నిలదీయడంతో ఏజెంట్లు ప్రశ్నించారు. విషయం ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు కు తెలియడంతో ఆయన అక్కడికి చేరుకుని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని విధుల నుంచి తొలగించి వేరే వారిని నియమించారు.
టీడీపీ కండువాతో గంటా హల్‌చల్
తగరపువలస: భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పోలింగ్ రోజున కూడా ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారు. ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌తో కలిసి సోమవారం టీడీపీ కండువా వేసుకుని ఆనందపురం మండలంలోని పలు పోలింగ్ బూత్‌ల్లో ప్రచారం చేశారు. ఎన్నికల నియమావళిని అనుసరించి పోలింగ్ బూత్ చుట్టుపక్కల ఇళ్లపై వైఎస్సార్ సీపీ జెండాలు తొలగించిన ఎన్నికల సిబ్బంది.. గంటా పచ్చ కుండువాతో పోలింగ్ బూత్‌ల్లోకి ప్రవేశించినా అడ్డు చెప్పలేదు. పైగా బూత్‌ల్లో, బయట ప్రచారం నిర్వహించిన గంటా సైకిల్‌కు ఓటు వేయాలని అభ్యరి్థంచారు. దీనికి తోడు గుంపుగా బూత్‌ల్లో ప్రవేశించినా.. పోలింగ్ సిబ్బంది గానీ, పోలీసులు గానీ అడ్డుకోలేదు. గంటాతో పాటు అతనికి సహకరించిన పోలీసులు, పోలింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
రెడ్డిపల్లి పోలింగ్ స్టేషన్‌లో..
పద్మనాభం: రెడ్డిపల్లి పోలింగ్ స్టేషన్ వద్ద సోమవారం భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పసుపు కండువాతో హల్‌చల్ చేశారు. తన అనుచరులతో కలిసి గంటా పోలింగ్ స్టేషన్‌లోకి వెళుతుండగా.. వైఎస్సార్ సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కండువాతో వెళ్లడానికి వీల్లేదని వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. సుమారు 20 నిమిషాల పాటు గంటా శ్రీనివాసరావు లోపలికి వెళ్లకుండా గేటు వద్ద ఉండిపోయారు. చివరకు గంటా కండువా తీసి ఒక్కరే పోలింగ్ స్టేషన్‌లోకి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment