code violation
-
కోనసీమలో ‘కోడ్’ ఉల్లంఘన
సాక్షి, అంబేద్కర్ జిల్లా: కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతోంది. సమయం దాటిన తర్వాత కూడా మద్యం విక్రయాలు కొనసాగుతున్నా.. ఎక్సైజ్‌శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 5వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు వైన్ షాపులు మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ వైన్ షాపులు యథేచ్ఛగా వైన్ షాపులు కొనసాగుతున్నాయి. -
ప్రజాస్వామ్యానికి పచ్చ బ్యాచ్ తూట్లు
ఓటమి భయం కూటమి నేతల కుతంత్రాలకు తెరతీసింది. బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు అడుగడుగునా ఎన్నికల కోడ్‌ను అతిక్రమించారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ ధన, అనుచర బలంతో పేట్రేగిపోయారు. డబ్బులు వెదజల్లి సీటు దక్కించుకున్న కూటమి ఎంపీ అభ్యర్థి రమేష్ గత నెల రోజుల నుంచీ చేస్తున్న అరాచకాలను పోలింగ్ రోజైన సోమవారం మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. పోలింగ్ ప్రారంభానికి ముందే మొదలైన ఈ దారుణాలను పోలింగ్ పూర్తయ్యే వరకూ కొనసాగించారు. పోలీసులు, అధికారులు కూడా భయపడ్డ పరిస్థితి. సాక్షి, అనకాపల్లి: ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికల్ని కూటమి నేతలు తమ అరాచకాలతో పలు చోట్ల ఓటర్లను భయాందోళనకు గురిచేశారు. పోలింగ్ బూత్‌ల వద్ద క్యూలో ఉన్న ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయతి్నంచారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా తన అనుచరులతో పోలింగ్ బూత్‌ల్లోకి నేరుగా సెల్ఫోన్లతో ప్రవేశించిచారు. టీడీపీ ఏజెంట్లతో ఫోటోలు దిగారు. జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారులపై దూషణలకు పాల్పడ్డారు. పార్టీ కండువాలతో పోలింగ్ బూత్‌ల్లో ప్రవేశించి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ ఓట్లు వేశారు. ఓటర్ స్లిప్‌లతో పాటు టీడీపీ మేనిఫెస్టో పంపిణీ చేస్తూ అడుగడుగునా నిబంధనలకు తూట్లు పొడిచారు. సీఎం రమేష్ ఓవరాక్షన్ బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే కాకుండా పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల ప్రచార కేంద్రంగా మార్చేశారు. మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం కాశీపురం ప్రభుత్వ హైసూ్కల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆయన వెళ్లారు. క్యూ లైన్లో ఉన్న ఓటర్లను కలిసి బీజేపీకి ఓటేయాలంటూ ప్రలోభాలకు గురిచేశారు. పోలింగ్ బూత్‌లో ఉన్న టీడీపీ ఏజెంట్లతో ఫొటో షూట్‌కు దిగారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓటింగ్ ప్రక్రియకు ఆటంకం కల్గిస్తున్న ఆయన్ని లోపలికి రానించడంతోపాటు, ఎన్నికల సిబ్బంది సకల గౌరవ మర్యాదలు చేయడం, వంగి వంగి నమస్కారాలు పెట్టడం గమనార్హం. అనంతరం దేవరాపల్లి హైసూ్కల్ పోలింగ్ బూత్ వద్ద కూడా ఇదే విధంగా ఆయన వ్యవహరించారు. వారి అనుచరులతో పోలింగ్ బూత్‌లోకి చొరబడి ఓటింగ్ ప్రక్రియకు ఆటకం కలిగించారు.బూతుల అయ్యన్న ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో ప్రజల ఛీత్కాలు ఎదుర్కొనే మాజీ మంత్రి, టీడీపీ నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యన్నపాత్రుడు పోలింగ్ రోజూ తన నోటి దురుసును ప్రదర్శించారు. నర్సీపట్నం టౌన్ గరŠల్స్ హైసూ్కల్ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారులను బండ బూతులు తిడుతూ రెచ్చిపోయారు. రాయడానికి వీళ్లేని తిట్లందుకున్నారు. దీంతో అధికారులు నివ్వెరపోయారు. ఆ బూతులు విని ఓటర్లు అయ్యన్నను అసహ్యించుకున్నారు. ఓటేసేందుకు లైన్లలో నిరీక్షిస్తున్న మహిళల ముందే ఈయన ఈ బూతుల్ని అందుకున్నారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రవి పట్టన్‌శెట్టి, రిటర్నింగ్ అధికారి హెచ్వీ జయరాంలను దూషించి మాట్లాడాడు. ఓటరు స్లిప్పుల పేరిట మేనిఫెస్టో కాపీలు ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలో టీడీపీ నేతలు మరింతగా దిగజారారు. ఓటర్ స్లిప్‌లతో పాటు టీడీపీ మేనిఫెస్టోను పంపిణీ చేశారు. భీమిలి నియోజకవర్గంలో మూలకుద్దు, మధురవాడ, సంతపేట అంబేడ్కర్ హైసూ్కల్, పెద»ొడ్డేపల్లి ఆర్సీఎం స్కూల్, రామారావుపేట, శివపురం తదితర ప్రాంతాల్లో ఓటరు స్లిప్‌తో పాటు టీడీపీ మేనిఫెస్టో పంపిణీ చేశారు. బంగారుమెట్ట మీద దుర్గాలమ్మ ఆలయం వద్ద సూపర్ సిక్స్ ఫ్లెక్సీ పెట్టి ప్రచారం చేశారు. పెద»ొడ్డేపల్లిలో మున్సిపల్ వైస్ చైర్మన్ తమరాన అప్పలనాయుడు నిలదీయడంతో పోలీసులు స్లిప్పులు స్వా«దీనం చేసుకున్నారు. రామారావుపేటలో మున్సిపల్ వైస్‌చైర్మన్ కోనేటి రామకృష్ణ, వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకుని ఫిర్యాదు చేశారు. డీఎస్పీ మోహన్ స్వయంగా వచ్చి స్లిప్పులు స్వా«దీనం చేసుకుని టీడీపీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ శ్రేణులు ఈ అరాచకాలను అడ్డుకుని, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయింది.పార్టీ కండువాతో ఓటింగ్‌కు పంచకర్ల పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ కూడా నిబంధనల ఉల్లంఘనలో తానేమీ తక్కువ కాదని నిరూపించుకున్నారు. సుజాతనగర్ డీఏవీ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటేసేందుకు ఉదయం 10 గంటల సమయంలో ఆయన వచ్చారు. పార్టీ కండువాతో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన అతన్ని అధికారులు ఏ మాత్రం అడ్డుకోకపోవపోడం గమనార్హం.ఓటర్ల చైతన్యం.. అధికారిపై చర్యలు ఓటర్లలో చైతన్యం పెరిగింది. వక్రబుద్ధితో వ్యవహరిస్తున్న ఎన్నికల అధికారికి బుద్ధి చెప్పేలా చేశారు. సోమవారం ఉదయం పాయకరావుపేట నియోజకవర్గం, నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు పోలింగ్ బూత్‌లో కళ్లు సరిగా కనిపించని వృద్ధుల ఓట్లను అక్కడి పోలింగ్ అధికారి టీడీపీకి వేయించాడు. ప్రశ్నించిన ఏజెంట్‌పై దురుసుగా ప్రవర్తించాడు. దేవరాపల్లి మండలం ఎ.కొత్తపల్లిలోని పోలింగ్ బూత్ నెం.173లో వృద్ధురాలు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరగా, పోలింగ్ అధికారి కమలం పువ్వు గుర్తుకు ఓటేశారు. దీన్ని గుర్తించిన 70 ఏళ్ల వృద్ధురాలు నిలదీయడంతో ఏజెంట్లు ప్రశ్నించారు. విషయం ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు కు తెలియడంతో ఆయన అక్కడికి చేరుకుని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని విధుల నుంచి తొలగించి వేరే వారిని నియమించారు.టీడీపీ కండువాతో గంటా హల్చల్తగరపువలస: భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పోలింగ్ రోజున కూడా ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారు. ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌తో కలిసి సోమవారం టీడీపీ కండువా వేసుకుని ఆనందపురం మండలంలోని పలు పోలింగ్ బూత్‌ల్లో ప్రచారం చేశారు. ఎన్నికల నియమావళిని అనుసరించి పోలింగ్ బూత్ చుట్టుపక్కల ఇళ్లపై వైఎస్సార్ సీపీ జెండాలు తొలగించిన ఎన్నికల సిబ్బంది.. గంటా పచ్చ కుండువాతో పోలింగ్ బూత్‌ల్లోకి ప్రవేశించినా అడ్డు చెప్పలేదు. పైగా బూత్‌ల్లో, బయట ప్రచారం నిర్వహించిన గంటా సైకిల్‌కు ఓటు వేయాలని అభ్యరి్థంచారు. దీనికి తోడు గుంపుగా బూత్‌ల్లో ప్రవేశించినా.. పోలింగ్ సిబ్బంది గానీ, పోలీసులు గానీ అడ్డుకోలేదు. గంటాతో పాటు అతనికి సహకరించిన పోలీసులు, పోలింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రెడ్డిపల్లి పోలింగ్ స్టేషన్లో..పద్మనాభం: రెడ్డిపల్లి పోలింగ్ స్టేషన్ వద్ద సోమవారం భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పసుపు కండువాతో హల్చల్ చేశారు. తన అనుచరులతో కలిసి గంటా పోలింగ్ స్టేషన్లోకి వెళుతుండగా.. వైఎస్సార్ సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కండువాతో వెళ్లడానికి వీల్లేదని వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. సుమారు 20 నిమిషాల పాటు గంటా శ్రీనివాసరావు లోపలికి వెళ్లకుండా గేటు వద్ద ఉండిపోయారు. చివరకు గంటా కండువా తీసి ఒక్కరే పోలింగ్ స్టేషన్లోకి వెళ్లారు. -
అమిత్‌షాపై కోడ్ ఉల్లంఘన కేసు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. ఈసీ ఆదేశాలతో మొఘల్‌పురా పీఎస్‌లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదుతో ఈసీ చర్యలు తీసుకుంది. విచారణ చేసి చర్యలతో పాటు రిపోర్టు ఇవ్వాలని హైదరాబాద్ సీపీకి ఈసీ ఆదేశించింది. ఏ3గా అమిత్‌షా పేరును హైదరాబాద్ పోలీసులు చేర్చారు. అమిత్ షా రోడ్ షోలో చిన్న పిల్లలను ప్రచారంలో ఉంచడంపై కాంగ్రెస్ ఫిర్యాదు చేయగా, సీఈవో వికాస్ రాజ్ స్పందించారు. -
‘పచ్చ’నోట్ల సానుభూతి!
కల్లూరు/గూడూరు రూరల్: ఎన్నికల వేళ టీడీపీ నేతలు యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. చీరలు పంపిణీ చేస్తున్నారు.. నిర్ణీత సమయానికి మించి ప్రచారం కొనసాగిస్తున్నారు.. తాజాగా గడ్డివాములు దగ్ఢం కాగా, డబ్బు ముట్టజెప్పి కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరించారు. వివరాల్లోకి వెళితే.. కె.నాగలాపురం పోలీసుస్టేషన్ పరిధిలోని పర్లలో మంగళవారం ఐదు గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన మంగలి నాగసుంకన్న, అశోక్‌కుమార్‌రెడ్డి, కుర్వ అయ్యన్న, కుర్వ సోమన్నకు చెందిన నాలుగు గడ్డివాములు ప్రమాదవశాత్తూ అంటుకున్నాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే ఆలోపే గడ్డివాములు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న నంద్యాల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి బాబాయి బైరెడ్డి విష్ణువర్దన్‌రెడ్డి బాధితులను ఓదార్చే ముసుగులో గ్రామానికి చేరుకున్నారు. కోడ్ అమలులో ఉండగా ఎలాంటి డబ్బు పంపిణీ చేపట్టరాదనే విషయాన్ని పక్కనపెట్టి ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున పంపిణీ చేశారు. అదేవిధంగా టీడీపీ పాణ్యం అభ్యర్థి గౌరు చరితారెడ్డి భర్త గౌరు వెంకటరెడ్డి కూడా బాధితులకు ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున అందించారు. ఎన్నికల వేళ రాజకీయ పార్టీల నేతలు ఓటర్లకు డబ్బు పంపిణీ చేయడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. అందుకు విరుద్ధంగా టీడీపీ నేతలు వ్యవహరించడం గమనార్హం. -
మంగళగిరిలో టీడీపీ ‘కోడ్’ ఉల్లంఘన
మంగళగిరి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఆ పార్టీ కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఓటర్లకు తాయిలాల రూపంలో బల్ల రిక్షాలు, తోపుడు బండ్లు, కుట్టుమిషన్లను పంపిణీ చేస్తోంది. ఈ పంపిణీ తతంగంపై అధికారులకు అనుమానం రాకుండా టీడీపీ నాయకులు వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నారు. తయారు చేయించిన బల్ల రిక్షాలు, తోపుడు బండ్లను ఏదో ఒక ప్రాంతంలో ఉంచుతారు. ఆ ప్రాంతాన్ని ఓటర్లకు చెప్పి అక్కడకు వెళ్లి వాటిని తీసుకెళ్లాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో పలువురు ఓటర్లు బండ్లు ఉన్న ప్రాంతానికి వెళ్లి వాటిని తీసుకెళుతున్నారు. కుట్టుమిషన్లను టీడీపీ కార్యకర్తలే బైక్‌లపై పెట్టుకుని ఓటర్ల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేస్తుండటం విశేషం. ఎన్నికల అధికారులు మరింత నిఘా పెంచి టీడీపీ ప్రలోభాలపర్వాన్ని అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ప్రియాంక గాంధీపైనా చర్యలు తీసుకోండి..
Rajasthan Elections 2023: రాజస్థాన్‌లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ శనివారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కి లేఖ రాసింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల రోజున ప్రియాంక గాంధీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్) లో చేసిన పోస్ట్‌తో ఎన్నికల మార్గదర్శకాలను ఉల్లంఘించారని పార్టీ ఆరోపించింది. దీనికి ముందు కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీపైన కూడా బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా ప్రియాంక గాంధీపై ఈసీకి చేసిన ఫిర్యాదులో ఆమె తన ‘ఎక్స్’ ఖాతాలో చేసిన పోస్టు రాజస్థాన్ పోలింగ్ రోజున ఓటర్లను ఉచితాలతో ప్రలోభపెట్టే ఉద్దేశపూర్వక చర్య అని బీజేపీ పేర్కొంది. ప్రియాంక గాంధీ పదవిని తొలగించి, ఆమె ఖాతాను సస్పెండ్ చేసేలా ఆదేశించాలని, క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా రాజస్థాన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌కు సూచించాలని విజ్ఞప్తి చేసింది. -
ఇన్వెస్ట్మెంట్ సలహాదారులకు సెబీ చెక్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్లు(ఐఏలు), రీసెర్చ్ ఎనలిస్టు(ఆర్ఏ)లకు ప్రకటనల కోడ్ ను జారీ చేసింది. దీంతో ఇకపై తమ ప్రకటనల్లో.. నంబర్ వన్, టాప్ సలహాదారులు, టాప్ రీసెర్చ్ విశ్లేషకులు, లీడింగ్ సంస్థ వంటి అత్యుక్తులను వినియోగించేందుకు వీలుండదు. తమ ప్రకటనల్లో ఇకపై ఇలాంటి పదాలను నిషేధిస్తూ సెబీ అడ్వర్టయిజ్మెంట్ కోడ్‌ను విడుదల చేసింది. అంతేకాకుండా క్లిష్టమైన భాషను సైతం వాడేందుకు అనుమతించరు. అయితే ఏదైనా అవార్డులవంటివి పొంది తే వీటి వివరాలు పొందుపరచేందుకు అవకాశముంటుంది. ఇందుకు సర్క్యులర్‌ను జారీ చేసింది. మే 1నుంచి అమలుకానున్న తాజా నిబంధనల ద్వారా ఐఏ, ఆర్ఏల నిబంధనలు మరింత పటిష్టంకానున్నాయి. అనుభవం, అవగాహనలేని ఇన్వెస్టర్ల ను తప్పుదారి పట్టించే అంచనాలు, స్టేట్మెంట్లు వంటివి ప్రకటనల్లో వినియోగించకూడదు. ఇదేవిధంగా రాబడి(రిటర్న్) హామీలను ఇవ్వడానికి వీ లుండదు. ఐఏలు, ఆర్ఏల గత పనితీరును సైతం ప్రస్తావించేందుకు అనుమతించరు. సెబీ లోగోను వినియోగించరాదు. ఐఏ లేదా ఆర్ఏ జారీ చేసే ప్రకటనల్లో వాళ్ల పేర్లు, లోగో, కార్యాలయ చిరునామా, రిజిస్ట్రేషన్ సంఖ్యలు వెల్లడించవలసి ఉంటుంది. సెక్యూరిటీల మార్కెట్లో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. పెట్టుబడులు చేపట్టే ముందు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించండి అంటూ ప్రా మాణిక హెచ్చరికను జారీ చేయవలసి ఉంటుంది. -
సుదర్శన్ టీవీకి షోకాజ్ నోటీసు
న్యూఢిల్లీ: కేబుల్ టీవీ చట్టంలోని ప్రోగ్రాం కోడ్‌ను ఉల్లంఘించిన సుదర్శన్ టీవీకి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సదరు టీవీలో ప్రసారమయ్యే ‘బిందాస్ బోల్’అనే కార్యక్రమంలోని కొన్ని అంశాలు కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. షోకాజ్ నోటీసుపై ప్రభుత్వం తీసుకునే చర్యలు తమ ఉత్తర్వులకు లోబడి ఉండాలని కోర్టు పేర్కొంది. తమకు నోటీసు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ సుదర్శన్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై కోర్టు విచారణ చేపట్టింది. కేంద్రప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్(రెగ్యులేషన్) చట్టం-1995లో సెక్షన్ 20-సబ్ సెక్షన్ (3) కింద సుదర్శన్ టీవీకి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. దీనిపై టీవీ యాజమాన్యం 28వ తేదీలోగా స్పందించాలని, లేదంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. ప్రభుత్వ యంత్రాంగంలోకి ముస్లింలు అక్రమంగా చొరబడుతున్నారంటూ సుదర్శన్ టీవీ ఇటీవల ప్రసారం చేసిన కార్యక్రమం తీవ్ర వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. -
దగాకోడ్ రాజ్యం..!
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఎన్నికల కోడ్ రావడంతో గత మార్చి నుంచి జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణ, కోడ్ అమలు ఎన్నికల అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూములకు తరలించడం, వాటికి పటిష్ట భద్రత కల్పించడం వంటి పనుల్లో బిజీగా ఉంది. ఎన్నికలు ముగిసినా ఇప్పటికీ కోడ్ అమలులో ఉండడం ఒక పక్క ఓట్ల లెక్కింపు, సిబ్బందికి శిక్షణ తదితర పనులలో నిమగ్నమైంది. ఈ సమయాన్ని ఆక్రమణదారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. సందట్లో సడేమియాలా కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని అనుకున్నారో ఏమో.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆక్రమణలు చేసి అక్రమ కట్టడాలను నిర్మించేస్తున్నారు. వీటిపై స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా వాటిని పట్టించుకునేంత తీరుబడి అధికారులకు లేకపోవడంతో అక్రమార్కుల ఆటలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. తాపీ మేస్త్రి కాలనీలో.. స్థానిక 29వ డివిజన్ తాపీమేస్త్రీ కాలనీలో గతంలో పాలకేంద్రం ఉద్యోగులు సొసైటీగా ఏర్పడి వారు ఇళ్ళ స్థలాల కోసం ప్లాట్లు వేసుకున్నారు. దానికి సంబంధించి నిబంధనల ప్రకారం పార్కు, వాటర్ ట్యాంకులకు కొంత స్థలాన్ని కేటాయించారు. కాలక్రమంలో పార్కు, వాటర్ ట్యాంక్‌ల కోసం విడిచిపెట్టిన స్థలాన్ని కొంతమంది స్వార్థపరులు అమ్మేసుకున్నారు. దీనిపై అక్కడి స్థానికులు కోర్టులో వ్యాజ్యం కూడా వేశారు. ప్రస్తుతం ఆ స్థలానికి సంబంధించిన వివాదం కోర్టు పరిధిలో ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా దీనిలో ఇటీవల ఒక వ్యక్తి నిర్మాణం ప్రారంభించాడు. ఆ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించాడు. దీంతో తాపీమేస్త్రి కాలనీలో ఉన్న 300 గృహాలకు దారులు మూసుకుపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణం వల్ల రోడ్డు కుచించుకుపోయి అటువైపు వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితి వస్తుందని, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా కనీసం ఫైర్ ఇంజిన్ కూడా వచ్చే అవకాశం ఉండదని పేర్కొంటూ 29వ డివిజన్ కార్పొరేటర్ ఆడారి అరుణ, స్థానిక నాయకుడు వేగి చిన్న ప్రసాద్ ఇటీవలనగర కమిషనర్‌కు వినతిపత్రం అందచేసి ఈ అక్రమ నిర్మాణాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ అధికారులు ఇప్పటి వరకూ ఈ విషయంపై స్పందించలేదు. డగ్లస్ స్కూల్ రోడ్డులో.. స్థానిక మంచినీళ్లతోట డగ్లస్ స్కూల్ రోడ్డులో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులైన ఇద్దరు అన్నదమ్ములు తమ్మిలేరు ఏటిగట్టును ఆనుకుని ఒకేసారి నాలుగు ఇళ్ళు నిర్మిస్తున్నారు. దీనిలో భాగంగా రెండు ఇళ్ళు ఏకంగా తమ్మిలేరు గట్టు దాటి లోపలకు ఆక్రమించి నిర్మించేస్తుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా తమ్మిలేరును ఆక్రమించి నిర్మాణం చేయడంవల్ల రానున్న వర్షాకాలంలో తమ్మిలేరు పొంగితే నీటిప్రవాహానికి ఆటంకం ఏర్పడి వరద నీరు నగరంలోకి చేరే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవడం లేదు తాపీమేస్త్రీ కాలనీలో 300 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ 300 గృహాలకు వెళ్ళడానికి ప్రధాన రహదారికి ఆనుకునే అక్రమ నిర్మాణం జరుగుతోంది. దీనిని నిలువరించాలని గతంలోనే నగరపాలక సంస్థ కమిషనర్‌కు వినతిపత్రం అందచేశాం. ఇప్పటి వరకూ అధికారులు చర్యలు తీసుకోలేదు. పైగా ఈ అక్రమ నిర్మాణం జరిగిన స్థలం కోర్టు పరిధిలో ఉండగా సదరు వ్యక్తి కోర్టు ధిక్కారాన్కి పాల్పడినట్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం.– వేగి చిన్న ప్రసాద్, స్థానికుడు నగరానికే ప్రమాదం.. తమ్మిలేరు ఏటిగట్టు నానాటికీ ఆక్రమణదారుల చేతుల్లో చిక్కిపోతోంది. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఏరును ఆక్రమించి గట్టుదాటి లోపలకు గృహాలు నిర్మించేసుకుంటున్నారు. ప్రతి వర్షాకాలంలో తమ్మిలేరు పొంగుతుందేమోనని నగర ప్రజలు భయపడుతూనే కాలం గడుపుతుంటారు. పైన భారీ వర్షాలు కురిస్తే ఆ నీరు తమ్మిలేరులోకే వచ్చి నీరు ప్రవహించే దారిలేక నగరంలోకి వరద నీరు వచ్చే ప్రమాదం ఉంది. దీనిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. – చింతా చంద్ర శేఖర్, మంచినీళ్ళ తోట -
సబ్బం ప్రలోభాలు నిజమే
సాక్షి, విశాఖపట్నం : ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ ఓట్ల కోసం భీమిలి టీడీపీ అభ్యర్థి సబ్బంహరి వారితో సామూహికంగా టెలికాన్ఫరెన్సులు నిర్వహించి ప్రలోభాలకు గురి చేయడం వాస్తవమేనని.. అది ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని అధికారులు నిర్థారించారు. ఆ మేరకు జిల్లా ఎన్నికల అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. ఎన్నికల ప్రచారం, పోలింగ్ ముగిసిన తర్వాత ఎవరూ ప్రచారం చేయకూడదు. పైగా ఒకేసారి పెద్ద సంఖ్యలో ఉ ద్యోగులను కలవడం గానీ.. మాట్లాడడం గానీ చే యకూడదని ఎన్నికల ప్రవర్తనా నియమావళి స్ప ష్టం చేస్తోంది. దీన్ని భీమిలి టీడీపీ అభ్యర్థి సబ్బం యథేచ్ఛగా ఉల్లంఘించారు. బయట వ్యక్తులకు ఇవ్వకూడని పోస్టల్ ఓటర్ల జాబితాతోపాటు వారి ఫొన్ నెంబర్లు కూడా సంపాదించి.. దాదాపు నా లుగు రోజులపాటు టెలికాన్ఫరెన్స్ద్వారా 500 మంది చొప్పున భీమిలి నియోజకవర్గానికి చెం దిన ఉద్యోగులతో ఒకేసారి సబ్బం హరి మాట్లాడి పోస్టల్ ఓట్లు తనకే వేయాలని ప్రలోభాలకు గురి చేశారు. దీనికి సంబంధించి ఆడియో టేపులోని ఆయన మాటలతో సహా ‘సబ్బం.. ప్రలోభాల పబ్బం’ శీర్షకతో ఇచ్చిన కథనం ద్వారా సాక్షి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. విచారణ.. నిర్థారణ ఎన్నికల నియమావళికి విరుద్దంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయనున్న ఉద్యోగుల వివరాలు సబ్బం హరికి చేరడం.. ఇందుకు కలెక్టరేట్లోని సంబంధిత విభాగాధికారులు కొందరు సహకరించినట్లు ఆరోపణలు రావడం తీవ్ర దుమారం రేపాయి. దీనిపై తీవ్రంగా స్పందించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కాటంనేని భాస్కర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. డీఆర్వో గున్నయ్యను విచారణాధికారిగా నియమించారు. పోస్టల్ బ్యాలెట్ల కోసం అధికార పార్టీ నేతలు పాల్పడుతున్న ప్రలోభాల పరంపరపై వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. సామూహికంగా ఉద్యోగులతో ఫోన్లో మాట్లాడి ప్రలోభాలకు గురిచేస్తున్నట్లున్న ఆడియో టేపులను కూడా ఈసీకి అందజేశారు. దీనిపై ఈసీ కూడా సీరియస్ అయ్యింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్లు కలిగి ఉన్న ఉద్యోగుల డేటాతోపాటు ఫోన్ నెంబర్లు ఎలా బయటకు వెళ్లాయన్న దానిపై కలెక్టరేట్‌తో పాటు భీమిలి తహసీల్దార్ కార్యాలయంలోనూ డీఆర్వో గున్నయ్య విచారణ జరిపారు. ఈ సమాచరం కలెక్టరేట్ నుంచి వెళ్లిందా? భీమిలి తహసీల్దార్ కార్యాలయం నుంచి వెళ్లిందా? ఆరా తీస్తున్నారు. ఎవరి ద్వారా ఆ డేటా టీడీపీ అభ్యర్థికి చేరిందన్న దానిపై విచారణ జరుపుతున్న ఆయన.. ఆ అధికారులెవరో తేలిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ ఈసీకి తుది నివేదిక సమర్పించనున్నారు. మరో వైపు ఎన్నికల ప్రచారం, పోలింగ్ ముగిసిన తర్వాత ప్రచారం చేయడం, మూకుమ్మడిగా ఒకేసారి ఉద్యోగులందరితో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడి ఓట్లు అభ్యర్థించడాన్ని సీరియస్‌గానే పరిగణిస్తున్నారు. అందుకు బాధ్యుడైన టీడీపీ అభ్యర్థి సబ్బం హరిపై కూడా కేసు నమోదుకు ఈసీకి నివేదించినట్టుగా చెబుతున్నారు. దక్షిణ నియోజకవర్గ ఆర్వో, ఏఆర్వో సస్పెన్షన్? ఎన్నికల విధి నిర్వహణలో అలసత్వం వహించారన్న కారణంతో ఇద్దరు అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన రిటర్నింగ్ అధికారి శ్రీనివాసమూర్తి, అసిస్టెంట్ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఏఆర్ఓ) కిరణ్‌లను సస్పెండ్ చేసినట్లు సమాచారం. -
చంద్రబాబు తీరుపై ఎన్నికల కమిషన్ అభ్యంతరం
-
చంద్రబాబు తీరుపై ఈసీ అభ్యంతరం
సాక్షి, అమరావతి : యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రులు, అధికారులతో సమీక్షలు, వీడియో కాన్ఫరెన్సో్లు నిర్వహించురాదని ఈసీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎన్నికల కోడ్ నిబంధనలను సీఈవో గోపాలకృష్ణ ద్వివేది మరోసారి గుర్తు చేశారు. చంద్రబాబు సమీక్షలపై పలువురు మీడియా ప్రతినిధులు సీఈవోను సంప్రదించగా, ఎన్నికల కోడ్ చూస్తే మీకే తెలుస్తుందని ఆయన సమాధానం ఇచ్చారు. చదవండి....(జూన్ 8 వరకూ నేనే ముఖ్యమంత్రి) కాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వ్యవహారాలపై సమీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన పోలవరం, సీఆర్డీఏపై సమీక్ష జరిపారు. అయితే సమీక్షలు చేయడం కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని ఈసీ వర్గాలు స్పష్టం చేయడంతో ముఖ్యమంత్రి హోంశాఖపై సమీక్షను రద్దు చేసుకున్నారు. -
గంట శ్రీనివాస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన
-
‘పసుపు– కుంకుమ’ పేరుతో టీడీపీ ప్రచారం
గుడిపాల చిత్తూరు జిల్లా: ‘డ్వాక్రా మహిళలకు రూ. 20 వేల పసుపు కుంకుమ ద్వారా డబ్బులు ఇస్తున్నాను. మీరంతా నన్ను ఆదరించాలి.’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డ్వాక్రా మహిళల ఇళ్లకు పోస్టుల ద్వారా లెటర్లు పంపిస్తున్నారు. చిత్తూరు జిల్లా గుడిపాలలో 831 డ్వాక్రా గ్రూపులకు గాను 8,100 మంది సభ్యులు ఉన్నారు. వీరందరికీ కుప్పలుతెప్పలుగా పోస్టుల ద్వారా కార్డులు అందుతున్నాయి. దీనిపై ఎన్నికల సంఘం అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చీరలు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు గుంటూరు జిల్లా బాపట్లలో చీరలు పంపిణీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను శుక్రవారం రాత్రి ప్రత్యేక ఫోర్స్ బృందం అదుపులోకి తీసుకుంది. బాపట్లలోని కన్యకా పరమేశ్వడరి కాంప్లెక్స్‌లోని ముకుందం ఫ్యాషన్స్‌లో కొంతమంది డ్వాక్రా మహిళలకు స్లిప్పులు ఇచ్చి చీరలు పంపిణీ చేస్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజిటింగ్ కార్డు వెనక షాపు పేరును స్టాంపుతో ముద్ర వేసి షాపులకు పంపుతున్నారు. ఈ విధంగా పట్టణంలోని ముకుందం షాపుతో పాటు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఓ షాపు, స్టేట్ బ్యాంకు ఎదురు మరో షాపులో పోలీసులు దాడులు నిర్వహించారు. చీరలను స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఈ వ్యవహారంలో మున్సిపాలిటీలోని ఒకరిద్దరి ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిపై కూడా చర్యలు తీసుకుంటామని ప్రత్యేక ఫోర్స్ అధికారులు తెలిపారు. -
ఈ నోట్లు మీకు.. మీ ఓట్లు నాకు
విశాఖసిటీ: పనితీరే ప్రజాప్రతినిధి నిబద్ధతకు గీటురాయి.. చేసిన సేవలే ప్రతిఫలాన్నిస్తాయి.. వాటినే గుర్తు చేస్తూ ఓట్లు అభ్యర్థించాలి. కానీ ఆయనగారికి ఈ అర్హతలేవీ మచ్చుకైనా లేదుమరి.. అందుకే ఆ అభ్యర్థి బరితెగించారు. ఆయనే నేరుగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. అదీ.. ప్రచారంలోనే అందరి సమక్షంలోనే నిబంధనలకు నీళ్లొదిలి.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ నోట్లు పంచిపెట్టారు. ఆయన మరెవరో కాదు.. నిత్యం వివాదాలు, దందాల్లో మునిగితేలే దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రస్తుత తెలుగుదేశం అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్. ఐదేళ్ల పదవీకాలమంతా దందాల్లో మునిగితేలుతూ, ప్రజాలను గాలికొదిలేసిన ఆయన.. ఎన్నికల్లో ఓట్ల కోసం నోట్ల పంపిణీకి తెగబడ్డారు. తిరిగిన ప్రతి చోటా.. ప్రచారానికి వెళ్లే ప్రతి గడపలోనూ ప్రజల చేతిలో నోట్లు పెడుతూ.. ఓటు తనకే వెయ్యాలంటూ నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తున్నారు. దక్షిణ నియోజకవర్గంలోని నేరెళ్ల కోనేరు ప్రాంతంలో వాసుపల్లి బుధవారం ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లడం.. ఓటు అడగడం.. జేబులోని నోట్లు తీసి వారి ఆ ఇంటివారి చేతిలో పెట్టడం.. ఇలా ఆ ప్రాంతంలో డబ్బులు వెదజల్లి ఓటర్లను ప్రత్యక్షంగా ప్రలోభాలకు గురిచేస్తున్న వాసుపల్లి తీరును చూసి స్థానికులు విస్మయానికి గురయ్యారు. ఒక్కొక్కరి చేతిలో నాలుగు నుంచి పది వరకు రూ.500 నోట్లు పెట్టారు. వాసుపల్లి బరితెగింపుపై ఎన్నికల అధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. -
నన్నేం చేయలేరు!
సాక్షి, గుంటూరు: సత్తెనపల్లిలో పైలేరియా విభాగంలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మాచేటి రవిచంద్రకుమార్ ఓ ప్రభుత్వ ఉద్యోగి.. అయినప్పటికీ పచ్చకండువా వేసుకుని ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నాడు. టీడీపీ ప్రచార కార్యక్రమాలతోపాటు, గతంలో నిరసన కార్యక్రమాల్లోనూ ఆయన హల్చల్ చేశారు. ఎన్నికల కోడ్ తనకు వర్తించదన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంది. స్పీకర్ కోడెల వెంట ప్రచారంలో పాల్గొంటూ ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాడు.అతను బుధవారం కూడా కోడెల వెంట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ఎన్నికల కోడ్ తనకు వర్తించదని.. అధికారులు తన జోలికి రాలేరనే స్థాయిలో ఆయన వ్యవహార శైలి ఉంది. -
బరి తెగించిన టీజీ భరత్
కర్నూలు(టౌన్): ఓటమి భయంతో అధికార పార్టీ నేతలు బరి తెగిస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యాన్ని ఆపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారు. బహిరంగంగానే ప్రలోభాలకు ఒడిగట్టారు. కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ మరింత బరి తెగించారు. ఓటర్లను తీవ్రస్థాయిలో ప్రలోభాలకు గురిచేస్తున్నారు. వారం రోజులుగా తన హోటల్ కేంద్రంగా ప్రలోభపర్వం కొనసాగిస్తున్నప్పటికీ అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. వాస్తవానికి భరత్‌కు చివరి నిమిషంలో టికెట్ ఖరారైంది. అప్పటికే వైఎస్సార్సీపీ అభ్యర్థి హఫీజ్‌ఖాన్ కర్నూలు అసెంబ్లీ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. అన్ని వర్గాలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఒక్కసారి అవకాశం కల్పిస్తే నగరాన్ని అన్నివిధాల అభివృద్ధి చేస్తానంటూ హఫీజ్‌ఖాన్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దీంతో కంగుతిన్న భరత్ ప్రలోభాలకు తెరతీశారు. తక్కువ సమయంలో ఓటర్లను కలవడం సాధ్యం కాదన్న ఉద్దేశంతో తాయిలాలు ఎర వేస్తున్నట్లు తెలుస్తోంది. మౌర్య ఇన్‌లో డబ్బుల పంపిణీ జోరుగా చేపడుతున్నట్లు స్వయాన టీడీపీ నాయకులే చెబుతున్నారు. ప్రతి రోజు హోటల్లో మహిళా గ్రూపులతో సమావేశాలు నిర్వహించడం, భోజనాలు ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. రంగంలోకి ఆల్కలీస్ సిబ్బంది ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో భాగంగా టీజీ వెంకటేష్ అల్కలీస్ పరిశ్రమలకు చెందిన సిబ్బందిని కూడా రంగంలోకి దింపారు. మంగళవారం సాయంత్రం వారు కర్నూలు శ్రీరామ నగర్‌లోని పలు కాలనీలలో పర్యటిస్తూ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు యత్నించారు. కాలనీల్లో తమకు తెలిసిన వారి నుంచి ఓటరు కార్డు నకలు, బ్యాంకు అకౌంట్ పాస్ పుస్తకం జిరాక్స్ ప్రతులను సేకరించారు. ముందస్తుగా మాట్లాడుకున్న వారికి నేరుగా అకౌంట్లో డబ్బులు జమచేస్తామని హామీ ఇస్తున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో అక్కడికి ‘సాక్షి’ బృందం చేరుకుంది. దీంతో అల్కలీస్ సిబ్బంది మెల్లగా జారుకున్నారు. టీజీవీ కళాక్షేత్రంలోనూ కళాకారులతో గెట్–టు–గెదర్ పేరుతో డబ్బుల పంపిణీ జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
అన్నదానం కాదు..
సాక్షి, శ్రీకాకుళం : ఈ ఫొటోలో మీకు కన్పించేంది అన్నదాన కార్యక్రమమో.. శుభకార్యంలో ఏర్పాటు చేసిన భోజనాలు అనుకుంటే మనం పొరపడినట్లే. ఎన్నికలు సమీపించడంతో ప్రభుత్వం పలుచోట్ల అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. అయితే అక్కడ ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. శ్రీకాకుళం జిల్లాలోని పొందూరులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ పరిస్థితి ఇలా ఉంది. దీంతో తినడానికి వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. -
నంబర్ ప్లేట్ లేకపోయినా..
చిత్తూరు, తిరుపతి మంగళం: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మాత్రం యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచార రథాలకు వాహన నంబర్ సహా అధికారుల నుంచి అనుమతులు పొందాలి. తిరుపతి రూరల్ మండలం శెట్టిపల్లి పంచాయతీ మంగళంలో గురువారం పులివర్తి నాని ఎన్నికల ప్రచారంలో భాగంగా నంబర్ ప్లేట్ లేని వాహనంతో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఏపీ03వీజెడ్టీఆర్ 9527 ఇసుజు వాహనానికి రిటర్నింగ్ అధికారి జారీ చేసిన పాస్ ఉన్నప్పటికీ నంబర్ ప్లేట్ లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో లెక్కలేనన్ని వాహనాలను అనుమతులు లేకుండా ప్రచారం కోసం వినియోగిస్తున్నారని అంతర్గత సమాచారం. -
టీడీపీ నేతల కోడ్ ఉల్లంఘన
సాక్షి, కర్నూలు: ఓటమి బయంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల కోడ్‌ను అడుగడుగునా ఉల్లంఘిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నా కూడా పట్టించుకొవడం లేదు. శుక్రవారం జిల్లాలోని బనగానపల్లె నియోజకర్గంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ టీడీపీ నేతలు. సుమారు రూ. 2 లక్షల 33 వేల మందికి పోస్టల్ ద్వారా కరపత్రాలు పంపిణి చేస్తున్నారు. పోస్టు ఆఫీస్ ముద్ర లేకుండా గ్రామాల్లో కరపత్రాలు పంపిణి చేస్తున్న పోస్టుమ్యాన్లు. కేవలం రూ. 5 స్టాంప్ అంటించి పోస్ట్ ముద్ర లేకుండా పంపిణీ చేసిన పోస్ట్ అధికారులు. దీనిపై బనగానపల్లె వెస్సార్సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
అడుగడుగునా కోడ్ ఉల్లంఘన
సాక్షి, గుంటూరు : మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అడుగడుగునా కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నా ఎన్నికల అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు లోకేష్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. రేవేంద్రపాడు బ్రిడ్జి నుంచి గ్రామంలోకి వచ్చే రహదారిలో స్వాగత ద్వారం నుంచి బకింగ్‌హామ్ కెనాల్ ఒడ్డున దారి పొడవునా బ్యానర్లు ఏర్పాటు చేశారు. లోకేష్ ఆ గ్రామంలో పర్యటిస్తున్నంతసేపు ఆ ఫ్లెక్సీలను అలాగే ఉంచారు. ఆయన వాహనాలు బయలుదేరగానే స్వాగత ద్వారానికి కట్టిన ఫ్లెక్సీని చించి పారేశారు. పత్తా లేని ఎన్నికల అధికారులు ప్రతి రోజు నారా లోకేష్ కార్యక్రమం ఎక్కడ జరిగినా టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లోకేష్ ఎన్నికల ప్రచారంలో జనాలు కనిపించకపోయినా బ్యానర్లు, కార్లు 40 నుంచి 50 వరకు ఉండటం విశేషం. రేవేంద్రపాడులో చర్చిలోకి వెళ్లిన నారా లోకేష్ పాస్టర్ ప్రత్యేక ప్రార్థనల అనంతరం అక్కడ ఉన్న ఓటర్లకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతుండగా వెనుక ఉన్న కార్యకర్తలు మాత్రం సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని కోరడం గమనార్హం. ఇంత జరుగుతున్నా ఎన్నికల అధికారులు మాత్రం కన్నెత్తి చూడలేదు. ఇప్పటికైన అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం నియామవళిని తూచా తప్పకుండా పాటించాలని ప్రతిపక్షనేతలు కోరుతున్నారు. -
గుంటూరు జిల్లాలో యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన
గుంటూరు: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఇవేమీ తమకు వర్తించవన్నట్లుగా జిల్లాలో టీడీపీ అభ్యర్థులు వ్యవహరిస్తున్నారు. యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతూ ఇష్టానుసారంగా పంపిణీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి కోడెల శివ ప్రసాదరావు 19 వ వార్డులో ప్రచారం చేపట్టారు. సమీపంలోని చర్చిలో స్థానికులను సమావేశపరిచారు. ఇంటి స్థలాలకు సంబంధించి వారికి టోకెన్లు పంపిణీ చేశారు. అనంతరం ఎన్ఎస్పీ అతిథి గృహం పక్కనే ఉన్న రహదారి మరమ్మతుల విషయాన్ని స్థానికులు కోడెల దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే పొక్లెయిన్‌ను పిలిపించి మరమ్మతులు చేపట్టారు. రహదారిపై డస్ట్ వేసేందుకు యుద్ధప్రాతిపదికన డస్ట్‌ను సిద్ధం చేశారు. మీరు అడిగిన పనులు చేస్తున్నాను. మీ ఓటు నాకే వేయాలంటూ ప్రచారం చేసి కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. గురజాలలో ఆదివారం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు సమావేశం ముగిసిన అనంతరం నేరుగా నాయకులతో కలసి మండల పరిషత్ కార్యాలయంలో సమావేశమయ్యారు. అక్కడ పార్టీ నాయకులతో రహస్యంగా సమావేశం నిర్వహించి కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. -
బడికొస్తాం.. బరితెగిస్తాం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అరాచక పాలనతో తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న అధికార తెలుగుదేశం పార్టీ అడ్డదారులు తొక్కుతోంది. ఇందుకోసం తమ కనుసన్నల్లో పనిచేసే కొందరు అధికారులను యథేచ్ఛగా వాడుకుంటోంది. ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోంది. ఫలితంగా జిల్లాలో ఎన్నికల నిబంధనావళి అమలు ప్రశ్నార్థకంగా మారింది. కొందరు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ సేవలో తరిస్తుండగా.. వారిని అడ్డం పెట్టుకొని ఆ పార్టీ నేతలు ఎక్కడికక్కడ కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు. కోడ్ కొండెక్కడానికి సూత్రధారులు, పాత్రధారులుగా ఉన్న అధికారులే.. దీనిపై ఫిర్యాదులు అందాక తమకేమీ తెలియదన్నట్టుగా హడావుడి చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇదే తంతు నడుస్తోంది. ఉల్లంఘన జరుగుతోందిలా.. చాలాచోట్ల ఆదరణ యూనిట్లు లోపాయికారీగా పంపిణీ చేస్తున్నారు. ఇటీవల తుని, కాకినాడలో ఈ వ్యవహారం మీడియా కంట పడింది. అయినా రహస్యంగా యూనిట్ల పంపిణీ నడుస్తునే ఉంది మరోవైపు ‘బడికొస్తా’ పథకం కింద విద్యార్థినులకు విద్యా సంవత్సరం ఆరంభంలో ఇవ్వాల్సిన సైకిళ్ల పంపిణీని ఇప్పుడు ఎన్నికల వేళ చేపడుతున్నారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా ఉన్నత పాఠశాలల్లో ఈ సైకిళ్లను అందుబాటులోకి తెచ్చి ఉంచారు. కొన్నిచోట్ల రహస్యంగా పంపిణీ చేయగా, మరికొన్ని పంపిణీకి సిద్ధం చేశారు. విశేషమేమిటంటే పాఠశాలల ఆవరణల్లోనే సైకిళ్లు బిగిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఇటువంటి వ్యవహారాలకు స్వస్తి చెప్పాలి. కానీ, అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్లతో లోపాయికారీగా పంపిణీ చేసేందుకు అందుబాటులో ఉంచుతున్నారు. అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చంద్రబాబు ఫొటోలతో ఉన్న దాదాపు 100 సైకిళ్లను విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పినిపే విశ్వరూప్ అక్కడి ఆర్డీవోకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. దీంతోపాటు మిగతాచోట్ల కూడా ఈ వ్యవహారం బయటపడింది. అమలాపురం రూరల్ బండారులంకలో సైకిళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. గోకవరం మండలం కామరాజుపేట జెడ్పీ హైస్కూల్లో ‘బడికొస్తా’ సైకిళ్లను వ్యాన్‌లో ఆయా పాఠశాలలకు తరలిస్తుండగా నిలిపివేశారు. పెద్దాపురం లూథరన్ హైస్కూల్లో పంపిణీకి సిద్ధంగా ఉన్న ‘బడికొస్తా’ సైకిళ్లను వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డుకున్నారు. రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. రామచంద్రపురంలో వివిధ పాఠశాలల్లో పంపిణీకి సిద్ధంగా ఉన్న సైకిళ్లను డీఈవో ఆదేశాల మేరకు పంపిణీ చేయకుండా నిలిపివేశారు. రావులపాలెం మండలం ఈతకోట ఉన్నత పాఠశాలలో కూడా పంపిణీకి సుమారు 200 సైకిళ్లను సిద్ధంగా ఉంచారు. పెదపూడి మండలంలో 550 సైకిళ్లను పంపిణీకి సిద్ధం చేశారు. అడ్డతీగల మండలంలోని అడ్డతీగల, ఎల్లవరం, రాయపల్లి, గొంటువానిపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న 300 మంది ఎనిమిది, తొమ్మిదో తరగతుల విద్యార్థినులకు పంపిణీ చేసే నిమిత్త సైకిళ్ల విడిభాగాలను తీసుకొచ్చి అడ్డతీగల జెడ్పీ ఉన్నత పాఠశాలలోని 105 నంబర్ పోలింగ్ బూత్ గదిలో ఉంచారు. ఎవరైనా అడిగితే ఎన్నికల కోడ్ కారణంగా పంపిణీని నిలిపివేశామని చెబుతున్నారు. అడగనిచోట గుట్టు చప్పుడు కాకుండా పంపిణీ చేసేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆ సైకిళ్లు బయటకు రాకుండా భద్రపరచాలి. అలాకాకుండా పాఠశాలల్లో ఎక్కడిక్కడ బిగించి, అందుబాటులో ఉంచుతున్నారంటే ఏమనాలో అధికారులే చెప్పాలని పలువురు అంటున్నారు. ఈ రోజు కాకపోయినా రేపైనా వీటిని పంపిణీ చేసేస్తారన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా పంపిణీకి సిద్ధంగా ఉన్న సైకిళ్ల వెనక ఓ విద్యాశాఖాధికారి ఆదేశాలున్నట్టు తెలుస్తోంది. జిల్లా ఉన్నతాధికారి లోపాయికారీగా ఇచ్చిన ఆదేశాల మేరకే ఒక విద్యాశాఖాధికారి పథకం ప్రకారం ఈ సైకిళ్లను పాఠశాలల్లో అందుబాటులో ఉంచినట్టు తెలిసింది. వ్యవహారం మీడియా కంట పడడంతో వెంటనే పంపిణీని నిలిపివేయాలని యుద్ధ ప్రాతిపదికన ఆదేశాలిచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. -
దేవినేని ఉమ అసలు బండారం బట్టబయలు..
-
దేవినేని ఉమ బండారం బట్టబయలు..
సాక్షి, మైలవరం : నిత్యం నీతులు చెప్పే ఏపీ నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమా అసలు బండారం బట్టబయలు అయిందని వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వసంత కృష్ణప్రసాద్ విమర్శించారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ...ఎన్నికలు సమీపిస్తుండగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా పేదలను మభ్యపెట్టేందుకు తోపుడు బళ్లు పంపిణీ చేస్తూ అడ్డంగా దొరికిపోయారన్నారు. అర్థరాత్రి సమయంలో లారీల్లో తోపుడు బళ్లు తీసుకొచ్చి పంపిణీ చేస్తుండగా వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశ్నించారని వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. సమాధానం చెప్పలేక టీడీపీ నాయకులు జారుకున్నారని ఆయన పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న దేవినేని ఉమ చేసేవి మాత్రం పనికిమాలిన పనులు...చెప్పేవి శ్రీరంగనీతులు అని ఎద్దేవా చేశారు. కాగా ఎన్నికల కోడ్‌ను లెక్క చేయకుండా టీడీపీ నేతలు అర్థరాత్రి తోపుడు బండ్లు పంపిణీ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. టీడీపీ మంత్రి దేవినేని ఉమ అండతో టీడీపీ నేతలు ఆదివారం అర్థరాత్రి ఇబ్రహీంపట్నంలోని కొండపల్లిలో టీడీపీ వార్డ్ మెంబర్ మల్లెంపూడి శ్రీను ఆధ్వర్యంలో తోపుడు బండ్ల పంపిణీ చేశారు. గత వారం వైఎస్సార్సీపీ నాయకుడు బొమ్మసాని చలపతి రావు ఇంట్లో ఎన్నికల కోడ్ కంటే ముందే కొనుగోలు చేసిన క్రికెట్, వాలీబాల్ కిట్లను పోలీసులు సోదాలు నిర్వహించి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అయితే సాక్షాత్తూ మంత్రి అండతో కోడ్ ఉల్లంఘించి, తోపుడు బళ్లు పంపిణీచేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. -
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన దేవినేని ఉమా
-
మంత్రి అండతో టీడీపీ నేతల కోడ్ ఉల్లంఘన
సాక్షి, కృష్ణా: ఎన్నికల కోడ్‌ను లెక్క చేయకుండా టీడీపీ నేతలు అర్థరాత్రి తోపుడు బండ్లు పంపిణీ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. టీడీపీ మంత్రి దేవినేని ఉమ అండతో టీడీపీ నేతలు ఆదివారం అర్థరాత్రి ఇబ్రహీంపట్నంలోని కొండపల్లి గ్రామంలో టీడీపీ వార్డ్ మెంబర్ మల్లెంపూడి శ్రీను ఆధ్వర్యంలో తోపుడు బండ్ల పంపిణీ చేశారు. గత వారం వైఎస్సార్సీపీ నాయకుడు బొమ్మసాని చలపతి రావు ఇంట్లో ఎన్నికల కోడ్ కంటే ముందే కొనుగోలు చేసిన క్రికెట్, వాలీబాల్ కిట్ లను పోలీసులు సోదాలు నిర్వహించి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలు మాత్రం మంత్రి అండ అర్థరాత్రి తోపుడు బండ్లును పంపిణీ చేయడంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఇంత చేస్తున్నా పోలీసులు పట్టించుకొవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకొవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
నిబంధనలను అతిక్రమించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికల్లో ఒంటరి పోటీ ద్వారా తమ పార్టీ సామర్థ్యం బయట పడిందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణలో 119 స్థానాలకుగాను 118 స్థానాల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారని, ప్రజాస్వామ్యంలో తాము ఈ ప్రయత్నం చేయడమే గెలుపుగా భావిస్తున్నామన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత 20 రోజుల్లో కేంద్రంలో తాము ఏం చేస్తున్నామన్నది ప్రజలకు స్పష్టంగా చెప్పగలిగామన్నారు. ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చినా శిరసావహిస్తామని, ఎన్ని సీట్లిచ్చిన బాధ్యతగా పనిచేస్తామని పేర్కొన్నారు. చింతమడకలో సీఎం కేసీఆర్ ఓటువేసిన తర్వాత టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి కోడ్ ఉల్లంఘించారన్నారు. ఎన్నికల బూత్ దగ్గర నిలబడి తమ ప్రభుత్వానికి వ్యతిరేకత లేదని, పవనాలు తమవైపే వీస్తున్నాయని చెప్పడం నిబంధనలను అతిక్రమించడమేనని పేర్కొన్నారు. ఆపద్ధర్మ సీఎం ఇలా చేయడం ఘోరమని, ఆయన వైఖరిని ఖండిస్తున్నామన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, ఆయన అభ్యర్థిత్వాన్ని కొట్టివేయాలని, అనర్హుడిగా ప్రకటించాలని కోరినట్లు వెల్లడించారు. కల్వకుర్తిలో జరిగిన దాడిలో తమ పార్టీకి సంబంధం లేదని, అది కాంగ్రెస్ పార్టీ చేసిన సింపతి డ్రామా అని పేర్కొన్నారు. దాడిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘తలసానిపై కేసు నమోదు చేయాలి’
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బన్సిలాల్‌లో ఉన్న జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో గత నెల 30న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. తలసానిపై తక్షణమే కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీ విచ్చలవిడిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి సోమవారం ఈ–మెయిల్ ద్వారా ఆయన ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించే హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఆయన కోరారు. -
కోడ్ ఉల్లంఘిస్తే కొట్లాటే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ ఉల్లంఘనల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అధికార పార్టీ ఎక్కడ దుర్వినియోగానికి పాల్పడ్డా ఎదురించాలని సూచించింది. డబ్బు పంపిణీ నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రకటనల వరకు అన్ని అంశాలపై దృష్టి పెట్టాలని, ఎక్కడ ఉల్లంఘనలు జరిగినా పార్టీతో పాటు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లే బాధ్యత స్థానిక నాయకత్వానిదేనని తెలిపింది. సోమవారం గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా అధ్యక్షతన టీపీసీసీ ముఖ్య నేతల అత్యవసర సమావేశం జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ మల్లుభట్టి విక్రమార్క, మేనిఫెస్టో కమిటీ కో చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, రేవంత్‌రెడ్డి, ఎంపీ నంది ఎల్లయ్య, మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్, పార్టీ ముఖ్య నేతలు గీతారెడ్డి, కోదండరెడ్డి, పద్మావతిరెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్, గూడూరు నారాయణరెడ్డి, ఆకుల లలిత, సునీతాలక్ష్మారెడ్డి, బండా కార్తీకరెడ్డి, నేరెళ్ల శారద తదితరులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికలకు పార్టీ సిద్ధం కావాల్సిన తీరు, ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాల అమలుపై నేతలు చర్చించారు. అనంతరం కుంతియా, ఉత్తమ్‌లు మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు యథేచ్ఛగా పాల్పడుతున్నారని, ఈ ఉల్లంఘనలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని చెప్పారు. ముఖ్యంగా రైతుబంధు, బతుకమ్మ చీరల పంపిణీ విషయంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు లేకుండా చూసుకోవాలని సూచించారు. పైసల పంపిణీని సహించొద్దు.. టీఆర్ఎస్ అభ్యర్థులకు కోట్ల రూపాయలున్నాయని, పైసల పంపిణీ ఎక్కడ జరిగినా అడ్డుకోవాలని కుంతియా, ఉత్తమ్ చెప్పారు. అలాగే రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రకటనల మీద కూడా ఓ కన్నేసి ఉంచాలని సూచించారు. ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో ఐదుగురు క్రియాశీల కార్యకర్తలను సిద్ధం చేయాలని, ఏఐసీసీ ఇచ్చిన పార్టీ కార్యాచరణను అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 2 నుంచి జన సంపర్క్ అభియాన్ పేరుతో నిర్వహిస్తోన్న ఇంటింటికీ ప్రచారాన్ని సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఆ ప్రాంతాల్లో అభ్యర్థులను ప్రకటించండి.. టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు కావడంతో వారంతా ప్రజల్లోకి వెళ్తున్నారని.. విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసి ప్రజలను తమ వైపు తిప్పుకుంటున్నారని సమావేశంలో ఓ సీనియర్ మహిళా నాయకురాలు అభిప్రాయపడ్డారు. ఇబ్బందులు లేని నియోజకవర్గాల్లోనైనా పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తే వారి పని వారు చూసుకుంటారని చెప్పారు. వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన కుంతియా ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని, త్వరలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పినట్టు సమాచారం. అలాగే తమకే టికెట్ కావాలని కోరుతూ జనాల్ని తీసుకుని ఎవరూ గాంధీభవన్‌కు రావొద్దని కూడా ఆయన సూచించారు. ‘అభ్యర్థుల విషయంలో ఇప్పటికే ఓ దశ పూర్తయింది. షార్ట్‌లిస్ట్ అయిన ఆశావహులపై పార్టీ సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే ఆధారంగా పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తుంది’అని కుంతియా స్పష్టం చేశారు. ‘ఆ ప్రకటనలు కోడ్ ఉల్లంఘనే’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం లో ఆపద్ధర్మ ముఖ్యమం త్రి, మంత్రులు, టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. అధికార పార్టీ రాష్ట్రాన్ని సొంత ఎస్టేట్‌గా వాడుకుంటోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు బలంరాంనాయక్, అం జన్కుమార్ యాదవ్, కోదండరెడ్డి, వినయ్‌లతో కలసి సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి రజత్ కుమార్‌ను కలసి అధికార పార్టీపై ఫిర్యాదు చేశారు. ఈ నెల 6న శాసనసభ రద్దయిన మరుక్షణమే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింద న్నారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి ప్రచారం కల్పించే హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, ఆర్టీసీ బస్సులపై ప్రచార ప్రకటనలను కొనసాగించడం కోడ్ ఉల్లంఘనేనని తప్పుబట్టా రు. తక్షణమే వాటిని తొలగించాలన్నారు. తనకు ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేస్తే రూ.5 లక్షలు ఇస్తామని డ్వాక్రా మహిళలను ప్రలోభాలకు గురిచేసిన తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. -
నిబంధనలను ఉల్లంఘించారు
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ మహేష్ గిరి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, ఆగ్నేయ ఢిల్లీలో రెండు పాఠశాలల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నగర పరిధిలోని మెహ్రోలి, కృష్ణానగర్, తుగ్లకాబాద్ శాసనసభ నియోజక వర్గాలకు ఎన్నికల కమిషన్ ఇటీవల ఎన్నికల తేదీలను ప్రకటించిందని, ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళి ఈ మూడు నియోజకవర్గాల్లో అమల్లో ఉందని, అయినప్పటికీ బీజేపీ ఎంపీ మహేశ్... మద్నాపూర్ ఖాదర్ ప్రాంతంలో రెండు పాఠశాలల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారన్నారు. ఇలా చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ తగు చర్యలు తీసుకోకపోతే తమ పార్టీ ఆందోళనా కార్యక్రమాలను చేపడుతుందని ఆయన హెచ్చరించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో శంకుస్థాపనలు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. 48 గంటల్లోగా బీజేపీ ఎంపీపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
నేటితో ప్రచారం బంద్
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తెరపడనుంది. పురపాలక ఎన్నికలకు 48 గంటల ముందే ప్రచారం నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలో అభ్యర్థులు, పార్టీల నేతలు ప్రచారం నిర్వహిస్తే కోడ్ ఉల్లంఘన కిందకు రానుంది. జిల్లాలో కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో, సత్తుపల్లి, మధిర నగర పంచాయతీలలో ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగి తేలాయి. ఆయా ప్రాంతాల్లో ముఖ్య నేతలు తిష్టవేసి ప్రచారం చేస్తూ అభ్యర్థుల విజయం కోసం ఎత్తులు వేశారు. ఓటర్లను లోబరుచుకునేందుకు తాయిలాలు సైతం అందజేశారు. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో ఆయా పార్టీల నాయకులు ప్రచా రం నిర్వహించారు. నేటి సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుండడంతో అభ్యర్థులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. తమ పార్టీలకు చెంది న జిల్లా స్థాయి నేతలతో ఆయా పార్టీల నాయకులతో లోపాయికారి ఒప్పందాలు చేసే పనిలో ఉన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఓటర్లను ప్రత్యక్షంగా కలిసే సమ యం ఉండదనే ఆత్రుతతో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ నాటి నుంచి ఆయా పార్టీల అభ్యర్థులు వివిధ రూపాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయా పార్టీల రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నేతలు తమ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ పాదయాత్రలు, రోడ్‌షోలు నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ వారి వృత్తి పనుల్లో సహాయ పడుతూ ప్రచారం నిర్వహించారు. భారీ బందో బస్తు: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగనుండడంతో జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. జిల్లాలోని కొత్తగూడెం మున్సిపాలిటీలో అన్ని వార్డులు సమస్యాత్మకం కావడం తో పోలీసులు అక్కడ ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే మధిర నగర పంచాయతీలో కూడా సమస్యాత్మక వార్డులు ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీ య సంఘటనలు తలెత్తకుండా ఎస్పీరంగనాథ్ పర్యవేక్షణలో ఏడుగురు డీఎస్పీలు, 36మంది సీఐ లు, 123మంది ఎస్సైలు, 319మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 1812 కానిస్టేబుళ్లు, 442 హోం గార్డులు, 43మంది మహిళా కానిస్టేబుళ్లు, 99 మంది మహిళా హోంగార్డులు, నాలుగు కంపెనీల పారామిలటరీ బలగాలు రంగలోకి దిగనున్నాయి. -
ఈసీ కొరడా
సాక్షి, చెన్నై: నగరా మోగడంతో ఈసీ కొరడా ఝుళిపించింది. ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని తన పరిధిలోకి తీసుకుంది. ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయించడంతోపాటుగా, కోడ్ ఉల్లంఘించే వారిపై కొరడా ఝుళిపించే విధంగా ఆదేశాలు వెలువడ్డాయి. జిల్లాల్లో ఎన్నికల సమీక్షలు గురువారం నుంచి ఆరంభం అయ్యాయి. అభ్యర్థుల ఖర్చులు, తాయిలాల పంపిణీపై డేగ కళ్లతో నిఘా వేయడానికి ప్రత్యేక స్క్వాడ్లు రంగంలోకి దిగాయి. మదురైలో తొలిరోజే లెక్కలోకి రాని నగదు రూ.కోటి పట్టుబడింది. పుదుచ్చేరితో పాటుగా రాష్ట్రంలోని 40 స్థానాలకు ఏప్రిల్ 24న ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ నగారా మోగించిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరు నుంచి నామినేషన్ల పర్వం ఆరంభం కానుంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికార యంత్రాంగం బాధ్యతలను ఎన్నికల కమిషన్ తన పరిధిలోకి తీసుకుంది. ప్రభుత్వం కొత్త పథకాలకు బ్రేక్ వేయడంతోపాటుగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధం అయింది. గురువారం నుంచి ఎన్నికల విధులపై రాష్ర్ట ఎన్నికల యంత్రాంగం పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. సమీక్షలు: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ ఆదేశాలతో అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం సమీక్షలు ఆరంభం అయ్యాయి. రాజకీయ పక్షాలతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్సీలు, ఎన్నికల అధికారులతో సమావేశాలు జరిగాయి. ఇందులో ఎన్నికల కోడ్, అనుసరించాల్సిన విధానాలు, రాజకీయ పార్టీలు వ్యవహరించాల్సిన నిబంధనలు తదితర అంశాలను వివరించారు. ఓటర్లకు తాయిలాలు, బట్వాడా, నగదు పంపిణీ అడ్డుకట్ట లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. మద్యం విక్రయాలపై నిఘా పెంచేందుకు చర్యలు చేపట్టారు. టాస్మాక్ మద్యం దుకాణాల్లో శుక్రవారం నుంచి సాగే వ్యాపార లెక్కలపై నిఘా ఉంచనున్నారు. పెద్ద ఎత్తున స్టాక్లను ఎవరెవ్వరు కొనగోలు చేయనున్నారో వివరాల సేకరణ, అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో జన సమీకరణలు, ఖర్చులపై పర్యవేక్షణకు ప్రత్యేక స్క్వాడ్లను రంగంలోకి దించారు. జిల్లాకు ముగ్గురు చొప్పున అధికారుల నేతృత్వంలో ఈ బృందాలు డేగకళ్లతో నిఘా ఉంచనున్నాయి. తనిఖీలు ముమ్మరం: నియోజకవర్గాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పే రీతిలో భద్రతా చర్యలకు ఆదేశాలు వెలువడ్డాయి. కోడ్ ఉల్లంఘించి ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు, కటౌట్లు తొలగించే బాధ్యతలను పోలీసులకు అప్పగించారు. నియోజకవర్గాల్లో, సమస్యాత్మక కేంద్రాల్లో భద్రతతోపాటుగా తనిఖీల ముమ్మరానికి చర్యలు చేపట్టారు. అన్ని జిల్లా, నగర, డివిజన్ కేంద్రాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు అయ్యాయి. తనిఖీలు వేగవంతం అయ్యాయి. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, తాయిలాల పంపిణీ వంటి వ్యవహారాలను తమకు ఫిర్యాదుల రూపంలో తెలియజేయాలని రాష్ర్ట ఎన్నికల యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాట్లు చేశారు. 18004257012 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదులు చేయొచ్చని ప్రకటించారు. రూ. కోటి పట్టి వేత: కోడ్ అమల్లోకి రావడంతో మదురైలో తనిఖీలు ముమ్మరం చేశారు. తిరుమంగళం, వాడి పట్టి, పెరుంగుడి, ఉన్నాచ్చికులం, ఒండియూర్, కప్పలూరుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో తనిఖీల్లో రూ.కోటి లెక్కలోకి రాని నగదు పట్టుబడింది. కప్పలూరు వద్ద కాన్వాయ్ రూపంలో వచ్చిన 12 వాహనాల్లో 40 లక్షల రూపాయలు పట్టుబడగా, ఆ వాహనాలను సీజ్ చేశారు. కళ్లపట్టి వద్ద రూ.ఏడు లక్షలు పట్టుబడింది. తాను వ్యాపార రీత్యా శివకాశికి వెళ్తోన్నట్టు కోయంబత్తూరు చెందిన ఓ పారిశ్రామిక వేత్త అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే, అందుకు తగ్గ ఆధారాలు సమర్పించక పోవడంతో ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒక్క రోజు తనిఖీల్లో రూ. కోటి నగదు పట్టుబడినట్టు ఆ జిల్లా పోలీసు యంత్రాంగం ప్రకటించింది. ఈ నగదును జిల్లా ఎన్నికల అధికారులకు అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మకం: రాష్ట్ర రాజధాని నగరంలో చెన్నైలో 258 కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించామని ఎన్నికల అధికారి, కమిషనర్ విక్రమ్ కపూర్ పేర్కొన్నారు. చెన్నైలో 36,36,199 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. వీరిలో పురుషులు 18,13076 మంది, స్త్రీలు 18 లక్షల 22 వేల 461 మంది, ఇతరులు 662 మంది ఉన్నారని తెలిపారు. మహానగరంలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, ఇక్కడ 3,338 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశామన్నారు. ఇందులో 258 కేంద్రాలు అత్యంత సమస్యాత్మకంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇందులో ఉత్తర చెన్నైలో 45, దక్షిణ చెన్నైలో 82, సెంట్రల్ చెన్నైలో 122 ఉన్నాయని వివరించారు. రిప్పన్ బిల్డింగ్‌లో చెన్నై ఎన్నికల అధికారి కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో ఎన్నికలను ప్రశాంత పూరిత వాతావరణంలో దిగ్విజయవంతం చేయడానికి అధికారులతో సమీక్షించామని, అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.