Rajasthan Elections 2023: రాజస్థాన్‌లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ శనివారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కి లేఖ రాసింది.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల రోజున ప్రియాంక గాంధీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్) లో చేసిన పోస్ట్‌తో ఎన్నికల మార్గదర్శకాలను ఉల్లంఘించారని పార్టీ ఆరోపించింది. దీనికి ముందు కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీపైన కూడా బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని కోరింది.
కాగా ప్రియాంక గాంధీపై ఈసీకి చేసిన ఫిర్యాదులో ఆమె తన ‘ఎక్స్’ ఖాతాలో చేసిన పోస్టు రాజస్థాన్ పోలింగ్ రోజున ఓటర్లను ఉచితాలతో ప్రలోభపెట్టే ఉద్దేశపూర్వక చర్య అని బీజేపీ పేర్కొంది. ప్రియాంక గాంధీ పదవిని తొలగించి, ఆమె ఖాతాను సస్పెండ్ చేసేలా ఆదేశించాలని, క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా రాజస్థాన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌కు సూచించాలని విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment