
సాక్షి, అమరావతి : యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రులు, అధికారులతో సమీక్షలు, వీడియో కాన్ఫరెన్సో్‌లు నిర్వహించురాదని ఈసీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎన్నికల కోడ్ నిబంధనలను సీఈవో గోపాలకృష్ణ ద్వివేది మరోసారి గుర్తు చేశారు. చంద్రబాబు సమీక్షలపై పలువురు మీడియా ప్రతినిధులు సీఈవోను సంప్రదించగా, ఎన్నికల కోడ్ చూస్తే మీకే తెలుస్తుందని ఆయన సమాధానం ఇచ్చారు.
చదవండి....(జూన్ 8 వరకూ నేనే ముఖ్యమంత్రి)
కాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వ్యవహారాలపై సమీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన పోలవరం, సీఆర్‌డీఏపై సమీక్ష జరిపారు. అయితే సమీక్షలు చేయడం కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని ఈసీ వర్గాలు స్పష్టం చేయడంతో ముఖ్యమంత్రి హోంశాఖపై సమీక్షను రద్దు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment