
సాక్షి, కర్నూలు: ఓటమి బయంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల కోడ్‌ను అడుగడుగునా ఉల్లంఘిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నా కూడా పట్టించుకొవడం లేదు. శుక్రవారం జిల్లాలోని బనగానపల్లె నియోజకర్గంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ టీడీపీ నేతలు. సుమారు రూ. 2 లక్షల 33 వేల మందికి పోస్టల్ ద్వారా కరపత్రాలు పంపిణి చేస్తున్నారు.
పోస్టు ఆఫీస్ ముద్ర లేకుండా గ్రామాల్లో కరపత్రాలు పంపిణి చేస్తున్న పోస్టుమ్యాన్లు. కేవలం రూ. 5 స్టాంప్ అంటించి పోస్ట్ ముద్ర లేకుండా పంపిణీ చేసిన పోస్ట్ అధికారులు. దీనిపై బనగానపల్లె వెస్సార్‌సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.