katasani rami reddy
-
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరుల ఉన్మాదంపై YSRCP కాటసాని రామిరెడ్డి ఫైర్
-
సంపద సృష్టించడం అంటే ప్రజలను చంపడమా చంద్రబాబు..
-
కక్ష సాధింపుపై కాకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టండి
-
సీఎం జగన్ నమ్మకాన్ని వమ్ము చేయను
-
కొలిమిగుండ్ల మండలంలో టీడీపీకి భారీ షాక్
-
‘టీడీపీ ఆఫీసులోనే అత్యాచారం దారుణం’
సాక్షి, కర్నూలు : జిల్లాలోని అవుకు మండల కేంద్రంలో టీడీపీ కార్యకర్తలు బాలుడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంపై వైఎసార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడిపై అమానవీయ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ కార్యాలయంలోనే ఇలాంటి ఘటన జరడగం దారుణమని మండిపడ్డారు. బాలుడిని డిన్నర్ పేరుతో పిలిచి నలుగురు యువకులు సామూహిక అత్యాచారం జరపడం వారి క్రూరత్వానికి నిదర్శనమన్నారు. నిందితుల తల్లిదండ్రులు కూడా వారు చేసిన పనిని క్షమించరని చెప్పారు. బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. బాలుడిపై కిరాతకంగా అత్యాచారానికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. గతంలో కూడా నిందితులు పలువురిపై వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. అప్పట్లో నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. టీడీపీ నేతలు వెనకేసుకొచ్చారని చెప్పారు. తప్పుచేసిన వారిపై కేసులు పెట్టకుండా పోలీసులను అడ్డుకున్నారని విమర్శించారు. కాగా, అవుకులోని టీడీపీ కార్యాలయంలో నలుగురు టీడీపీ కార్యకర్తలు 14 ఏళ్ల బాలుడిపై సాముహిక అతఅత్యాచారం చేశారు. అయితే బాలుడికి రక్తస్రావమై అస్వస్థతకు గురికావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలుడిని చిత్రహింసలు పెట్టిన టీడీపీ కార్యకర్తలు బుల్లెట్ రాజు, ప్రేమ్ కుమార్, రాజుతో పాటు మరొకరని గుర్తించారు. వీరిపై సెక్షన్ 377 కింద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి : దారుణం.. బాలుడిపై సామూహిక అత్యాచారం -
ఆ పత్రికది విష ప్రచారం
సాక్షి, కడప(బనగానపల్లె) : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమర్థ పాలనపై ఆంధ్రజ్యోతి పత్రిక విష ప్రచారం చేస్తోందని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. ఆ పత్రిక ఎండీ రాధాకృష్ణ కడుపు మంటతో ప్రభుత్వంపై తప్పుడు కథనాలు ప్రచురిస్తే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. పట్టణంలోని స్వగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగు నెలల్లో రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. పారదర్శక పాలనలో భాగంగా గ్రామ వలంటీర్ల నియామకంతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.35 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామన్నారు. గత ఐదేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగం భర్తీ చేయకపోగా ఉన్న ఉద్యోగులను తొలగించినది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయని తప్పుడు కథనాలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. చంద్రబాబు కళ్లతో ప్రపంచాన్ని చూస్తున్నారని విమర్శించారు. గతంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయగా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇతర రాష్ట్రాల్లోని 150 సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రిలోనూ పేదలు వైద్యం పొందేలా చర్యలు తీసుకున్నారన్నారు. అక్టోబర్ 15 నుంచి వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి రూ. 12,500 ప్రకారం బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుందన్నారు. ప్రజాసంకల్ప యాత్ర లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీల మేరకు నాయీ బ్రాహ్మణు లు, టైలర్లు, రజకులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో రూ .10 వేలు ఆర్థికసాయం అందుతుందన్నారు. ఉగాది రోజున అర్హులైన 25 లక్షల మంది పేదలకు ఇళ్లస్థలాల పట్టాల పంపిణీకి శరవేగంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలను అందించే ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు. -
టీడీపీ నేతల కోడ్ ఉల్లంఘన
సాక్షి, కర్నూలు: ఓటమి బయంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల కోడ్‌ను అడుగడుగునా ఉల్లంఘిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నా కూడా పట్టించుకొవడం లేదు. శుక్రవారం జిల్లాలోని బనగానపల్లె నియోజకర్గంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ టీడీపీ నేతలు. సుమారు రూ. 2 లక్షల 33 వేల మందికి పోస్టల్ ద్వారా కరపత్రాలు పంపిణి చేస్తున్నారు. పోస్టు ఆఫీస్ ముద్ర లేకుండా గ్రామాల్లో కరపత్రాలు పంపిణి చేస్తున్న పోస్టుమ్యాన్లు. కేవలం రూ. 5 స్టాంప్ అంటించి పోస్ట్ ముద్ర లేకుండా పంపిణీ చేసిన పోస్ట్ అధికారులు. దీనిపై బనగానపల్లె వెస్సార్సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
చంద్రబాబు మోసాస్ని ప్రజలు గ్రహించారు
-
టీడీపీని బంగాళాఖాతంలో కలిపేద్దాం : మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
సాక్షి, బనగానపల్లె: రాష్ట్రంలో 58 నెలల పాటు అరాచక, అవినీతి పాలన సాగించిన టీడీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. రాష్ట్ర సివిల్‌సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చల్లా రామక్రిష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరిన సందర్భంగా బనగానపల్లెలో ఆయనకు స్వాగతం పలుకుతూ భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో టీడీపీ అరాచకాలు మితిమీరి పోయాయన్నారు. ప్రజలతోపాటు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి తప్పులు చేయనప్పటికీ టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. ఇంకా వారి ఆరాచకాలను భరించే స్థితిలో ప్రజలేరన్నారు. సీఎం చంద్రబాబు వయసు మీద పడుతుండటంతో ప్రత్యేక హోదా విషయంలో ఒక సారి హోదా కావాలంటారు, మరోసారి ప్రత్యేక ప్యాకేజీ ముద్దంటూ మతిభ్రమించినట్లుగా మాట్లాడుతున్నారని కాటసాని ఆరోపించారు. తమ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చల్లా రామక్రిష్ణారెడ్డి పెద్దన్నలా, పెద్ద దిక్కులా ఉంటారన్నారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో ప్రజలందరీ ఆశీస్సులతో అత్యధిక మెజార్టీతో గెలుపొందడం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. జగనన్న రాజ్యం రావడానికి ఎన్నో రోజులు లేవని, త్వరలోనే టీడీపీ నాయకులు వడ్డీతో సహా వారు మూల్యం చెల్లించుకుంటారన్నారు. నియోజకవర్గంలో రామరాజ్యం : చల్లా, కాటసానిల కలయికతో నియోజకవర్గంలో రామరాజ్యం నెలకొంటుందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి చెప్పారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో కాటసాని రామిరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం తథ్యమని ఎర్రబోతుల అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు ఎర్రబోతుల తనయుడు ఉదయభాస్కర్‌రెడ్డి, కాటసాని ప్రసాద్‌రెడ్డి, కోడూరు రామచంద్రారెడ్డి, సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, అంబటి గురివిరెడ్డి, ఇటిక్యాల బాలిరెడ్డి, రామాంజనేయులు, పులి ప్రకాష్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, బెడదల చంద్రశేఖర్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, మనోహర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, బండి బ్రహ్మనందారెడ్డి, కాటసాని రామక్రిష్ణారెడ్డి, అశోక్‌కుమార్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, తులసిరెడ్డి, పెద్ద వెంకటరెడ్డి, నారాయణ, నారాయణరెడ్డి, కుమార్‌రెడ్డి, సురేంద్రబాబు, రమణ, చీకటి చిన్న ఈశ్వరయ్య, చాంద్‌బాష, హరి, వెంకటరామిరెడ్డి, చిన్న రామక్రిష్ణారెడ్డి, అల్లె సురేష్‌రెడ్డి, గాలి వీరారెడ్డి, మధు, రవికుమార్‌రెడ్డి, అమరనాధరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, అల్లి హుస్సేన్, కిశోర్, మధుగౌడ్, ఫిరోజ్, చైనామాబు, రోబో, కంబగిరి, గౌండా నాగరాజు, హుస్సేన్‌షా, దేవుడు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలి బనగానపల్లె: బనగానపల్లె నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగియుండాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నియోజకవర్గ కోరారు. ఓటర్లకు తెలియకుండానే కొందరి ఓట్లు ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నందున ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు ఉందో లేదో ముందుగా తెలుసుకోవాలన్నారు. ఓటు హక్కు లేనివారు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఈ నెల 15లోపు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కాటసాని చెప్పారు. ఓటర్ల జాబితాలో ఓటు ఉందో లేదో తెలుసుకోవడంలో అజాగ్రత్త వహించవద్దన్నారు. -
వాటర్ ప్లాంట్ నిర్మాణంలో అధికారుల ‘పచ్చ’పాతం
సాక్షి, సంజామల(కర్నూల్): మండలంలోని బొందలదిన్నె గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. అధికార పార్టీ నేతలకు వత్తాసు పాలుకుతూ అధికారులు వ్యవహరిస్తున్న తీరు గ్రామంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేలా ఉంది. వివరాలు.. గ్రామంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు ఆరునెలల క్రితం వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. అయితే దాన్ని జీర్ణించుకోలేని అధికారపార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్లాంట్ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. మంచి పనిని స్వాగతించాల్సింది పోయి ప్రతిపక్ష పార్టీ నేతకు మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ స్థలంలో కడుతున్న ప్లాంట్‌ను అడ్డుకున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే ప్రభుత్వ స్థలంలో ప్రజలకు ఉపయోగపడే పనిని అడ్డుకున్న టీడీపీ నేతలు, అధికారులు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పట్టా స్థలంలో దౌర్జన్యంగా ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి సొంత నిధులతో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి పూనుకున్నారు. పట్టా స్థలంలో టీడీపీ నాయకులు దౌర్జన్యంగా నిర్మిస్తున్న వాటర్ ప్లాంట్ బాధితులు తమ స్థలంలో ప్లాంట్ కట్టొద్దని మొత్తుకున్నా పోలీసుల అండతో అక్రమంగా ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే చివరికి బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ప్లాంట్ నిర్మాణ పనులను ఆపేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. సంబందిత అధికారులకు కోర్టు ఉత్వర్వుల కాపీలు కూడా అందాయి. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో అధికారపార్టీ నేతలు, అధికారుల తీరుతో రెండు వర్గాల మధ్య గొడవలకు దారి తీసే పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు ప్యాక్షన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన గ్రామంలో గత పదిహేనేళ్లుగా ప్యాక్షన్ తగ్గుముఖం పట్టి గ్రామ ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు మినరల్ వాటర్ ప్లాంట్ రూపంలో అధికార పార్టీ చేస్తున్న ఆగడాలతో గ్రామంలో ప్రశాంతతకు భంగం కలిగేలా మారింది. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకొని గ్రామంలో ప్రశాంతతకు భంగం కలిగించకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. మా స్థలంలో నిర్మిస్తున్నారు గ్రామంలోని సర్వే నంబర్ 83లో మాకు 2.8 సెంట్ల స్థలం ఉంది. ఈ స్థలానికి సంబంధించిన రిజిస్టర్ డ్యాకుమెంట్లు కూడా ఉన్నాయి. అధికార పార్టీ నేతలు నా స్థలంలో దౌర్జన్యంగా వాటర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టడంతో నేను హైకోర్టును ఆశ్రయించాను. కోర్టు తీర్పు నాకు అనుకూలంగా వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదు. – రమణారెడ్డి, బొందలదిన్నె ‘అధికార’ అండతో దౌర్జన్యం అధికారం ఉంది కదా అని టీడీపీ నాయకులు దౌర్యన్యానికి పాల్పడుతుండగా అధికారలు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో చిచ్చుపెట్టాలని చూడటం తగదు. గ్రామంలో గొడవలు జరిగితే అధికారులదే బాధ్యత. – వెంకటస్వామి, బొందలదిన్నె -
సింగపూర్‌లో వైఎస్సార్సీపీ ఆత్మీయ సమావేశం
సింగపూర్ : సింగపూర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బనగానపల్లె మాజీ శాసన సభ్యులు కాటసాని రామి రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కర్నూలు జిల్లా సహకార బ్యాంక్ మాజీ ఛైర్మన్ గుండం సూర్య ప్రకాష్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువత కార్యదర్శి పోచ శీల రెడ్డిలు పాల్గొన్నారు. కాటసాని రామి రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక యుద్ధం లాంటిదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలన్నా..పేదల జీవితాల్లో అలనాటి 'రాజన్న' పాలన వెలుగులు చూడాలన్నా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల వేల సింగపూర్‌లో ఉండే ఎన్నారై కార్యకర్తలు చేయవలసిన కార్యక్రమాల మీద విధి విధానాలను వివరించారు. సింగపూర్ లో పార్టీ ఎన్నారై శాఖ చేస్తున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఎన్నికల సమయంలో కచ్చితంగా తమ సొంత స్థలాలకి వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఎంత ఆవశ్యకమో ప్రజలకు ఎలా వివరించాలో చెప్పారు. ఇలాంటి సమావేశం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు నివసిస్తున్న ప్రతి దేశంలో జరగాలని, అక్కడ నివసించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు సింగపూర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై శాఖను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపు సూచించారు. జై జగనన్న..జోహార్ రాజన్న.. జిందాబాద్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నినాదాలతో సమావేశంలో అభిమానులు హోరెత్తించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై సింగపూర్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు..ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న తెలుగు వారందరికీ సింగపూర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై విభాగం అభినందనలు తెలిపింది. -
అవినీతిలో చంద్రబాబే టాప్
సంజామల: దేశవ్యాప్తంగా అవినీతి ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు అగ్రస్థానంలో ఉన్నారని, సిగ్గుమాలిన సీఎంగా పేరు తెచ్చుకున్నారని వైఎస్సార్సీపీ బనగానపల్లె నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. సంజామల మండల బూత్ కమిటీల సమావేశాన్ని ఆదివారం కోవెలకుంట్ల వీఆర్, ఎన్ఆర్ పంక్షన్ హాలులో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ అధికారం అండగా టీడీపీ నాయకులు సంపాదనలో పోటీపడుతున్నారని ఆరోపించారు. ప్రారంభంలో పార్టీ కార్యకర్తలకు పూలు, పత్తెర ఇచ్చినట్లుగా పనులు కట్టబెట్టిన ఎమ్మెల్యే ఇప్పుడు తానే చేసుకుంటుండటంతో సొంత పార్టీలోనే అసంతృప్తి నెలకొందన్నారు. ఇదే సమయంలో పనులు ఇస్తామని వైఎస్సార్సీపీ నాయకులను కూడా ప్రలోభాలకు గురిచేస్తున్నారన్నారు. సొంత పార్టీ కార్యకర్తలకే న్యాయం చేయలేని ఎమ్మెల్యే ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. సంజామల మండలం పాలేరువాగు ముంపుతో ఏటా పొలాలు నీట మునుగుతున్నా నీరు– చెట్టు కింద తూతూ మంత్రంగా పనులు చేపట్టి డబ్బులు దండుకుంటున్నారే తప్ప సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టలేదన్నారు. ప్రతి గ్రామంలో ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని, దొంగఓట్లుంటే తొలగించేందుకు సిఫారసు చేయాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన కాటసాని.. మాట తప్పితే రాజకీయాల నుంచి తప్పుకుంటామని ప్రకటించారు. గ్రూప్–1 రిటైర్డ్ అధికారి నరసింహం మాట్లాడుతూ వైఎస్సార్ కలలు గన్న గ్రామీణ స్వరాజ్యం రావాలంటే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. తండ్రి ఆశయ సాధన కోసం పోరాడుతున్న జగన్మోహన్రెడ్డికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. భవిష్యత్తు వైఎస్సార్‌సీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుండం వెంకట సూర్యప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ నేతలు పోలీసులు, అధికారులపై ఒత్తిడి తెచ్చి సంక్షేమ ఫలాలు పేదలను కాదని సొంతపార్టీ కార్యకర్తలకు అందేలా చేస్తున్నారని దుయ్యబట్టారు. ముక్కమల్ల సర్పంచ్ పోచా వెంకటరామిరెడ్డి, సీనియర్ డాక్టర్ రామిరెడ్డి, ఎంపీపీ గౌరుగారి ఓబుళరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు చిన్నబాబు, నాయకులు గాధంశెట్టి రమణయ్య, రెడ్డిపల్లె సూర్యనారాయణరెడ్డి, నరసింహారెడ్డి, కానాల వీరశేఖర్‌రెడ్డి, బత్తుల రామచంద్రారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే కాటసానికి పుత్రశోకం
సాక్షి, బనగానపల్లె : వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి పుత్రశోకం కలిగింది. పెద్దకుమారుడు నాగార్జునరెడ్డి(26) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. కాటసాని రామిరెడ్డి, జయమ్మ దంపతులకు కుమార్తెలు ప్రతిభ, ప్రణతి, కుమారులు నాగార్జునరెడ్డి, ఓబుళరెడ్డి ఉన్నారు. కుమార్తెలద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి భార్యే ప్రతిభ. నాగార్జునరెడ్డి బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్, బెంగళూరులో రియల్ఎస్టేట్ వ్యాపారం నిర్వహించేవాడు. గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బనగానపల్లెకు వచ్చాడు. రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఆప్యాయంగా మాట్లాడి నిద్రకు ఉపక్రమించాడు. అయితే ఉదయం 10 గంటలైనా గది నుంచి బయటకురాకపోవడంతో కుటుంబ సభ్యులు గది వద్దకు వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు. కన్నీటి పర్యంతమైన కాటసాని దంపతులు పెద్దకుమారుడు కళ్లముందే విగతజీవిగా పడి ఉండడంతో కాటసాని రామిరెడ్డి దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. కుమారుడి మృతదేహాన్ని చూసి వారు విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పాణ్యం మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని చంద్రశేఖర్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, తిరుపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు ఇంటి వద్దకు చేరుకొని కాటసాని దంపతులను ఓదార్చారు. విషయం తెలిసిన క్షణాల్లోనే కాటసాని నివాసం జనసంద్రమైంది. ప్రముఖుల నివాళి.. కాటసాని నాగార్జునరెడ్డి మృతదేహానికి రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మనందరెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, వైఎస్సార్సీపీ పత్తికొండ ఇన్చార్జ్ కంగాటి శ్రీదేవి, కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, సీఈసీ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి, ఆళ్లగడ్డ నేత గంగుల నాని, ఎర్రబోతుల వెంకటరెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసార«థిరెడ్డి, నంద్యాల టీడీపీ నాయకులు శ్రీధర్‌రెడ్డి, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. దహన సంస్కారాలు: పట్టణ శివారులోని అవుకు రోడ్డులో ఉన్న కాటసాని సొంత స్థలంలో నాగార్జునరెడ్డికి సాయంత్రం దహన సంస్కారాలు నిర్వహించారు. అశేష జనవాహిని మధ్య అంతిమయాత్ర సాగింది. వర్షం వస్తున్నా లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
సోమిశెట్టి.. నోరు అదుపులో ఉంచుకో
వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి లేదు విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకుల మండిపాటు బనగానపల్లె: ప్రజల మనిషిగా పేరు గాంచిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి టీడీపీకి చెందిన సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు ఎక్కడదంటూ ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డితో పాటు మరికొందరు నాయకులు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ బనగానపల్లె నియోజకవర్గ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహం వద్ద పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు సోమిశెట్టిపై ధ్వజమెత్తారు. మాట్లాడేటప్పుడు స్థాయిని గుర్తించాలని సూచించారు. అమరావతి నిర్మాణంలో పాల్పడుతున్న అవినీతితో సీఎం చంద్రబాబు,లోకేష్ త్వరలో జైలుకెళ్తారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్న విషయాన్ని సోమిశెట్టి తెలుసుకోవాలన్నారు. విలేకర్ల సమావేశంలో పార్టీ జిల్లా డాక్టర్ల విభాగం అధ్యక్షులు డాక్టర్ మహ్మద్ హుసేన్, బీసీ సెల్ జిల్లా నాయకులు పాపన్న, కార్యవర్గ సభ్యులు మురళీమోహన్‌రెడ్డి, కంబగిరి స్వామి పాల్గొన్నారు. -
మునిసిపల్ కార్యాలయం ఎదుట కాటసాని ధర్నా
కర్నూలు జిల్లా బనగానపల్లెలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నివాసాలను కూల్చివేయాలంటూ టీడీపీ నేతలు మునిసిపల్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దాంతో మునిసిపల్ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నివాసాలు కూల్చివేసేందుకు రంగం సిద్దం చేశారు. ఆ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బనగానపల్లె మునిసిపల్ కార్యాలయానికి చేరుకుని.... తమ పార్టీ కార్యకర్తల నివాసాలు కూల్చివేయాలన్న ఆలోచన విరమించుకోవాలని సూచించారు. అందుకు మునిసిపల్ అధికారులు ససేమిరా అనడంతో కాటసాని రామిరెడ్డి మునిసిపల్ కార్యాలయం ఎదుటు ఆందోళనకు దిగారు. ఆందోళనలో వైఎస్ఆర్ సీపీ కాంగ్రెస్ కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరైయ్యారు. -
వైఎస్సార్సీపీలోకి ఎమ్మెల్యే కాటసాని
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రామిరెడ్డితో పాటు సెంట్రల్ బ్యాంక్ డెరైక్టర్ పీఆర్ మురళీమోహన్‌రెడ్డి, ఎస్.రాంమోహన్‌రెడ్డి, పి.శీలారెడ్డి తదితరులు పార్టీలో చేరారు. అనంతరం రామిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రజల మనోభావాల మేరకు తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి అండగా ఉండే ఏకైక నాయకుడు జగన్మోహన్రెడ్డి మాత్రమేనని ప్రజలు భావిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు సీమాంధ్ర ప్రాంతానికి చేసిన ద్రోహంతో ఎన్నికల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. -
వైయస్ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరిన రామిరెడ్డి
-
కాంగ్రెస్‌కు సమైక్య సెగ
-
కాంగ్రెస్‌కు కాటసాని రాంరెడ్డి రాజీనామా
-
కాంగ్రెస్ పార్టీకి కాటసాని రాజీనామా
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సోమవారం కర్నూలులో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ ఆదివారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా కాటసాని రామిరెడ్డి సోమవారం కర్నూలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా... ఇరు ప్రాంతాల సమన్యాయం కోసం వైఎస్ జగన్ ఒక్కరే దీక్ష చేపట్టారని కాటసాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకే ఆయనకు మద్దతుగా ఈ దీక్ష చేపట్టినట్లు తెలిపారు. త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. జగన్ చేపట్టిన దీక్షకు అందరు మద్దతు తెలపాని సీమాంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చిరంజీవి కేంద్రమంత్రి పదవి రాక ముందు ఒకలా, వచ్చిన తర్వాత మరోలా మాట్లాడుతున్నారని కాటసాని రామిరెడ్డి ఆరోపించారు.