సోమిశెట్టి.. నోరు అదుపులో ఉంచుకో | ysrcp leaders takes on somisetty venkateswarlu | Sakshi
Sakshi News home page

సోమిశెట్టి.. నోరు అదుపులో ఉంచుకో

Published Sat, Jul 2 2016 9:51 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

ysrcp leaders takes on somisetty venkateswarlu

వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి లేదు
విలేకరుల సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల మండిపాటు
 
బనగానపల్లె: ప్రజల మనిషిగా పేరు గాంచిన వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి టీడీపీకి చెందిన సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు ఎక్కడదంటూ  ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డితో పాటు మరికొందరు నాయకులు మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సీపీ బనగానపల్లె నియోజకవర్గ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహం వద్ద పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు సోమిశెట్టిపై ధ్వజమెత్తారు.

మాట్లాడేటప్పుడు స్థాయిని గుర్తించాలని సూచించారు. అమరావతి నిర్మాణంలో పాల్పడుతున్న అవినీతితో సీఎం చంద్రబాబు,లోకేష్  త్వరలో జైలుకెళ్తారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్న విషయాన్ని సోమిశెట్టి తెలుసుకోవాలన్నారు.  విలేకర్ల సమావేశంలో పార్టీ జిల్లా డాక్టర్ల విభాగం అధ్యక్షులు డాక్టర్ మహ్మద్ హుసేన్, బీసీ సెల్ జిల్లా నాయకులు పాపన్న, కార్యవర్గ సభ్యులు మురళీమోహన్‌రెడ్డి, కంబగిరి స్వామి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement