![YSRCP Demands Strict Action Against TDP Activists Who Molested Boy In Kurnool TDP Office - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/30/111.jpg.webp?itok=LVU9rGU8)
సాక్షి, కర్నూలు : జిల్లాలోని అవుకు మండల కేంద్రంలో టీడీపీ కార్యకర్తలు బాలుడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంపై వైఎసార్‌సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడిపై అమానవీయ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ కార్యాలయంలోనే ఇలాంటి ఘటన జరడగం దారుణమని మండిపడ్డారు. బాలుడిని డిన్నర్ పేరుతో పిలిచి నలుగురు యువకులు సామూహిక అత్యాచారం జరపడం వారి క్రూరత్వానికి నిదర్శనమన్నారు. నిందితుల తల్లిదండ్రులు కూడా వారు చేసిన పనిని క్షమించరని చెప్పారు.
బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. బాలుడిపై కిరాతకంగా అత్యాచారానికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. గతంలో కూడా నిందితులు పలువురిపై వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. అప్పట్లో నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. టీడీపీ నేతలు వెనకేసుకొచ్చారని చెప్పారు. తప్పుచేసిన వారిపై కేసులు పెట్టకుండా పోలీసులను అడ్డుకున్నారని విమర్శించారు.
కాగా, అవుకులోని టీడీపీ కార్యాలయంలో నలుగురు టీడీపీ కార్యకర్తలు 14 ఏళ్ల బాలుడిపై సాముహిక అతఅత్యాచారం చేశారు. అయితే బాలుడికి రక్తస్రావమై అస్వస్థతకు గురికావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలుడిని చిత్రహింసలు పెట్టిన టీడీపీ కార్యకర్తలు బుల్లెట్ రాజు, ప్రేమ్ కుమార్, రాజుతో పాటు మరొకరని గుర్తించారు. వీరిపై సెక్షన్ 377 కింద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
చదవండి : దారుణం.. బాలుడిపై సామూహిక అత్యాచారం
Comments
Please login to add a commentAdd a comment