ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో నాటకీయ పరిణామాలు | Satyavedu TDP Suspended MLA Koneti Adimulam Case Details | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో నాటకీయ పరిణామాలు

Published Thu, Sep 12 2024 9:50 AM | Last Updated on Thu, Sep 12 2024 10:33 AM

Satyavedu TDP Suspended MLA Koneti Adimulam Case Details

తిరుపతి,సాక్షి: సత్యవేడు టీడీపీ సస్పెండెడ్‌ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక ఆరోపణల కేసులో హైడ్రామా నడుస్తోంది. మొక్కుబడిగా ఆయన్ని టీడీపీ నుంచి సస్పెండ్‌ చేయగా.. విమర్శల నేపథ్యంలో కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే..  వేధింపులు వెలుగులోకి రాగానే చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన.. తాజా డిశార్జి అయ్యి ఇంటికి చేరుకున్నారు. కోర్టులో ఆయన క్వాష్‌ పిటిషన్‌ విచారణకు రానున్న నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. 

ఎమ్మెల్యే ఆదిమూలం చెన్నై నుంచి పుత్తూరులో తన నివాసానికి చేరుకున్నారు. అయితే.. ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేశారు. ఆయన కుటుంబ సభ్యుల్ని తప్ప ఎవరిని లోపలికి అనుమతించటం లేదు. మీడియాతో మాట్లాడేందుకు ఆయన నిరాకరిస్తున్నట్లు సమాచారం. 

మరోవైపు.. తిరుపతి మెటర్నరీ హాస్పిటల్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఇంకా రెండు రోజులు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని సూచించారు. వైద్య పరీక్ష జరిగిన నేపధ్యంలో వచ్చే రిపోర్టు ఆధారంగా ఎమ్మెల్యేను  తిరుపతి ఈస్ట్ పోలీసులు విచారించే అవకాశం ఉంది. 

హోటల్‌ సీసీటీవీ ఫుటేజ్‌లో..
మరోవైపు.. బాధితురాలి ఆరోపణల మేరకు తిరుపతి భీమా ప్యారడైజ్‌లో ఎమ్మెల్యే గడిపిన 109, 105 రూములు సీజ్, సీసీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని అశ్లీల వీడియోను ఫారెన్సీక్ ల్యాబ్‌కు పంపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో శాసనసభ స్పీకర్ అనుమతి తీసుకొని ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకొని  పోలీసులు విచారించనున్నారు.

ఇరువైపులా మహిళా అడ్వొకేట్లే
ఎమ్మెల్యే ఆదిమూలం అత్యాచారం కేసుకు సంబంధించి తిరుపతి ఇంటెలిజెన్స్ డీఎస్పీ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. అయితే.. పోలీసులు నమోదు చేసిన కేసుపై ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని మంగళవారం క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు జరపకుండానే పోలీసులు కేసు నమోదు చేశారని పిటిషన్‌ ప్రస్తావించారు. ఆదిమూలం పిటిషన్‌ నేడు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆదిమూలం తరపున అడ్వకేట్ శేషకుమారీ,  పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రభుత్వం తరపున న్యాయవాది ఏ వరలక్ష్మి వాదించనున్నారు. ఈ కేసులో ఇద్దరు మహిళా అడ్వకేట్ వాదనలు వినిపించనుండటం విశేషం.

ఇదీ చదవండి: ఆదిమూలం రాసలీలలు.. ఫిర్యాదును లోకేష్‌ సైతం పట్టించుకోలేదా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement