case details
-
సజ్జల భార్గవ్ కేసు వివరాలేవీ?
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు, ఆయన సతీమణిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేలా ప్రోత్సహించారని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్చార్జి సజ్జల భార్గవ్ రెడ్డిపై నమోదు చేసిన కేసు పూర్తి వివరాలను తమ ముందుంచాలని కృష్ణా జిల్లా గుడివాడ రెండో పట్టణ పోలీసులను హైకోర్టు మంగళవారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సజ్జల భార్గవ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.మొసాద్ ఏజెంట్లలా మోహరించి ఉన్నారు..ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని భార్గవ్ తరఫు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్‌ను కోరారు. అంత అత్యవసరం ఏముందని న్యాయమూర్తి ప్రశ్నించగా.. భార్గవ్ కోసం పోలీసులు మొసాద్ ఏజెంట్ల మాదిరిగా మోహరించారని తెలిపారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన వ్యవహారమని చెప్పారు. దీంతో న్యాయమూర్తి విచారణ జరిపారు.ఎప్పుడో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పోస్టులు పెట్టారంటూ ఇప్పుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారని పొన్నవోలు తెలిపారు. సహ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా భార్గవ్‌ని నిందితుడిగా చేర్చారని తెలిపారు. జూలై 1కి ముందు పెట్టిన పోస్టులపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్ కింద కేసులు పెట్టారని, వాస్తవానికి అప్పటికి ఈ చట్టాలేవీ అమల్లోకి రాలేదని తెలిపారు. ఐపీసీ, సీఆర్పీసీ కింద మాత్రమే కేసులు పెట్టాలన్నారు. భార్గవ్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, అందువల్ల అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. ఇదే వ్యవహారంలో మరో నిందితుడు సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను కూడా న్యాయమూర్తి 14కి వాయిదా వేశారు.అర్జున్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఓ. మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు.కాగా ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ కోరుతూ భార్గవ్‌రెడ్డి హైకోర్టులో మంగళవారం పిటిషన్లు దాఖలు చేశారు. -
తిరుపతి: ఉన్నతాధికారుల వేధింపులు.. సీఐ మిస్సింగ్!
తిరుపతి, సాక్షి: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక.. ఉద్యోగులకు వేధింపులు అధికమయ్యాయి. ఈ నేపథ్యంతోనే.. జిల్లాలో ఓ సీఐ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. తిరుపతి ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి కనిపించకుండా పోవడంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్నిరోజులుగా ఉన్నతాధికారుల నుంచి ఆయన వేధింపులు ఎదుర్కొంటున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటికి రాలేదని వాళ్లు అంటున్నారు. తన భర్తకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తోందని, ఆయనకు ఏమైనా జరిగితే అధికారులదే బాధ్యత అని మహేశ్వర్‌రెడ్డి భార్య అంటోంది. ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తక ముందే.. ఆయన ఆచూకీ కనిపెట్టే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. -
ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో నాటకీయ పరిణామాలు
తిరుపతి,సాక్షి: సత్యవేడు టీడీపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక ఆరోపణల కేసులో హైడ్రామా నడుస్తోంది. మొక్కుబడిగా ఆయన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయగా.. విమర్శల నేపథ్యంలో కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే.. వేధింపులు వెలుగులోకి రాగానే చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన.. తాజా డిశార్జి అయ్యి ఇంటికి చేరుకున్నారు. కోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఎమ్మెల్యే ఆదిమూలం చెన్నై నుంచి పుత్తూరులో తన నివాసానికి చేరుకున్నారు. అయితే.. ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేశారు. ఆయన కుటుంబ సభ్యుల్ని తప్ప ఎవరిని లోపలికి అనుమతించటం లేదు. మీడియాతో మాట్లాడేందుకు ఆయన నిరాకరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. తిరుపతి మెటర్నరీ హాస్పిటల్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఇంకా రెండు రోజులు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని సూచించారు. వైద్య పరీక్ష జరిగిన నేపధ్యంలో వచ్చే రిపోర్టు ఆధారంగా ఎమ్మెల్యేను తిరుపతి ఈస్ట్ పోలీసులు విచారించే అవకాశం ఉంది. హోటల్ సీసీటీవీ ఫుటేజ్‌లో..మరోవైపు.. బాధితురాలి ఆరోపణల మేరకు తిరుపతి భీమా ప్యారడైజ్‌లో ఎమ్మెల్యే గడిపిన 109, 105 రూములు సీజ్, సీసీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని అశ్లీల వీడియోను ఫారెన్సీక్ ల్యాబ్‌కు పంపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో శాసనసభ స్పీకర్ అనుమతి తీసుకొని ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించనున్నారు.ఇరువైపులా మహిళా అడ్వొకేట్లేఎమ్మెల్యే ఆదిమూలం అత్యాచారం కేసుకు సంబంధించి తిరుపతి ఇంటెలిజెన్స్ డీఎస్పీ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. అయితే.. పోలీసులు నమోదు చేసిన కేసుపై ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని మంగళవారం క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు జరపకుండానే పోలీసులు కేసు నమోదు చేశారని పిటిషన్ ప్రస్తావించారు. ఆదిమూలం పిటిషన్ నేడు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆదిమూలం తరపున అడ్వకేట్ శేషకుమారీ, పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రభుత్వం తరపున న్యాయవాది ఏ వరలక్ష్మి వాదించనున్నారు. ఈ కేసులో ఇద్దరు మహిళా అడ్వకేట్ వాదనలు వినిపించనుండటం విశేషం.ఇదీ చదవండి: ఆదిమూలం రాసలీలలు.. ఫిర్యాదును లోకేష్ సైతం పట్టించుకోలేదా? -
‘ప్రసాద్ తల్లిని కూడా హత్య చేయాలనుకున్నారు’
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఒకే ఇంట్లో ఆరుగురు హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రశాంత్‌తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ తెలిపారు. ఆమె మంగళవారం కేసు సంబంధించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. ఒక్కొక్కరినీ ఒక్కో ప్రాంతానికి తీసకువెళ్లి హత్య చేశారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లలో కేసు నమోదైనట్లు తెలిపారు. ప్రశాంత్‌తో పాటు గుగులోతు విష్ణు, బానోతు వంశీ, వడ్డమ్మ, మరో మైనర్ బాలుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నవంబర్ 29 రోజు ప్రసాద్‌ను రాళ్లతో కొట్టి చంపి పూడ్చిపెట్టారని నిందితులను విచారిస్తే తెలిసిందన్నారు. ఈ హత్యలు చేయడానికి వాడిన టాటా ఆల్ట్రోజ్ కారు, భూమి పత్రాలు, రూ.30 వేలు, ఐదు సెల్ ఫోన్లు దొరికినట్లు చెప్పారు. ఆ ఫొన్లు కూడా మృతి చెందినవారివిగా గుర్తించామని అన్నారు. వారి ప్రణాళిక ప్రకారం ప్రసాద్ వాళ్ల అమ్మను కూడా హత్య చేయాలనుకున్నారని తెలిపారు. ఈ ఆరుగురి హత్యల్లో నిందితుడు ప్రశాంత్ తల్లి పాత్ర కూడా ఉన్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. పలు అనుమానాల ఆధారంగా ఇది కేవలం ప్రథమిక విచారణ అన్నారు. ఈ కేసులో అన్నివైపుల నుంచి లోతుగా తదుపరి దర్యాప్తు కొనస్తామని తెలిపారు. చదవండి: ఇంటిపై కన్నేసి ఇంటిల్లిపాదినీ బలిగొన్న స్నేహితుడు -
మౌఖిక ఆదేశాలొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కేసుల విచారణ సందర్భాల్లో న్యాయమూర్తులు.. మౌఖిక ఆదేశాలు ఇచ్చే సంస్కృతికి చరమగీతం పాడాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సూచనచేసింది. ధర్మాసనాల అభిప్రాయాలు కేవలం తీర్పులు, ఉత్తర్వుల ద్వారా వ్యక్తంకావాలని, అప్పుడే జ్యుడీషియల్ రికార్డుల్లో ఆ అభిప్రాయాలు నమోదవుతాయని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. మౌఖిక ఆదేశాలు లెక్కలు మిక్కిలి పెరిగితే న్యాయవ్యవస్థ జవాబుదారీ తనంలోని మూలసూత్రాన్ని కోల్పోతామని, ఇలాంటి పద్ధతి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాల సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం వ్యాఖ్యానించింది. చీటింగ్, నమ్మకద్రోహం చేశానంటూ తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ గుజరాత్‌కు చెందిన సలీమ్‌భాయ్ హమీద్‌భాయ్ మీనన్ గుజరాత్ హైకోర్టును గతంలో ఆశ్రయించారు. ఈ విషయం హైకోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో, చీటింగ్ కేసులో అరెస్ట్ చేయకూడదంటూ గుజరాత్ హైకోర్టు మౌఖిక ఆదేశాలిచ్చింది. రాష్ట్ర హైకోర్టు మౌఖిక ఆదేశాలివ్వడాన్ని తప్పుబడుతూ సుప్రీం బెంచ్ ఈ సూచనలు చేసింది. ‘రాతపూర్వక ఆదేశాలు మాత్రమే కార్యశీలకమైనవి. అరెస్ట్ చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఇచ్చిన మౌఖిక ఆదేశాలు జ్యుడీషియల్ రికార్డులో భాగం కాబోవు. ఈ పద్ధతిని త్యజించండి. ధర్మాసనం తమ అభిప్రాయాలను తీర్పులు, ఉత్తర్వుల ద్వారానే వ్యక్తపరచాలి. మౌఖిక ఆదేశాలపై న్యాయవ్యవస్థలో విస్తృత చర్చ జరగాల్సి ఉంది’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. మౌఖిక ఆదేశాలతో అరెస్ట్‌ను అడ్డుకోవడం సక్రమ పద్ధతికాదని జడ్జీలు అన్నారు. ‘కేసులోని ఇరు పక్షాలు కోర్టు బయట సెటిల్ చేసుకునే అవకాశం కల్పించేందుకు నిందితుడి తరఫు లాయర్లకు మౌఖిక ఆదేశాలు ఇవ్వవచ్చు. అరెస్ట్ నుంచి నిందితుడికి తాత్కాలిక రక్షణగా ఆ ఆదేశాలు ఉపయోగపడాలంటే జడ్జీలు ఉత్తర్వులు ఇవ్వడం తప్పనిసరి. హైకోర్టు నుంచి సంబంధిత ఉత్వర్వు అందకుంటే అరెస్ట్‌ను పోలీసు అధికారి సైతం ఆపలేడు. అయినా, తీర్పు అనేది నిందితులు, బాధితుల వ్యక్తిగత విషయం కాదు. దేశంలో శాంతిభద్రతలతో ముడిపడిన అంశం. ఎవరి నడతపైనైనా అభిప్రాయాలు వ్యక్తంచేసే జడ్జీలు, ప్రభుత్వాధికారులు తమ నడవడికనూ ఒకసారి ఆత్మశోధన చేసుకోవాలి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆశారాంకు జైల్లోనే చికిత్స లైంగిక వేధింపుల కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురు ఆశారాం బాపూకి జైల్లోనే ఆయుర్వేద చికిత్స అందిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద చికిత్స తీసుకోవడం కోసం రెండు నెలలు శిక్షను సస్పెండ్ చేయాలని కోరుతూ ఆశారాం బాపూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. అతను చేసిన నేరం సాధారణమైనది కాదని, శిక్షను సస్పెండ్ చేయడం కుదరదని తేల్చి చెప్పింది. ఆశారాం బాపూకి అవసరమైన చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం దృష్టికి తెచ్చింది. దీనిపై జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వి రామసుబ్రమణియన్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన సుప్రీం బెంచ్ స్పందించింది. ‘‘ఆశారాం బాపూ చేసిన నేరం సాధారణమైనది కాదు. జైల్లోనే మీకు కావల్సిన చికిత్స లభిస్తుంది. అంతేకానీ శిక్షను కొంతకాలమైనా సస్సెండ్ చేయడం కుదరదు’’ అని చెప్పింది. ఆశారాం బాపూ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ ఆర్ బసంత్ వాదిస్తూ అనారోగ్య సమస్యలన్నింటీకి సంపూర్ణమైన చికిత్స అందించడానికి రెండు నెలల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరినప్పటికీ అందుకు సుప్రీం నిరాకరించింది. -
కేసీఆర్ ఎన్నికను రద్దు చేయండి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్ (ఈపీ)ను హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. ప్రతివాదులుగా ఉన్న కేసీఆర్‌తో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, ఇతర అభ్యర్థులకు, గజ్వేల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ ఉత్తర్వు లు జారీ చేశారు. గజ్వేల్ నుంచి పోటీ చేసిన కేసీఆర్ తన ఎన్నికల అఫిడవిట్లో అనేక వాస్తవాలను దాచారని, కేసుల వివరాలన్నీ పొందుపర్చలేదని, అందువల్ల ఆయన ఎన్నిక రద్దు చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా మామిడ్యాలకు చెందిన టి.శ్రీనివాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ విచారణ జరిపా రు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రజా ప్రాతి నిథ్య చట్టంలోని నిబంధనలకు లోబడి కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయలేదని పేర్కొన్నారు. కేసీఆర్‌పై మొత్తం 64 కేసులుంటే, 2 కేసుల గురించే అఫిడవిట్ లో ప్రస్తావించారని తెలిపారు. ఆ తర్వాత కేసుల సం ఖ్యను సవరించి, ఆ వివరాలను ఎన్నికల వెబ్సైట్లో ఉంచారన్నారు. కేసుల వివరాల గురించి పేర్కొనలేదన్నారు. ఆదాయ వివరాలను సక్రమంగా చెప్పలేదన్నారు. హిందూ అవిభాజ్య కుటుంబం ఆదాయాన్ని రూ.5.4 లక్షలుగా పేర్కొన్నారని, అలాగే వ్యవసాయ ఆదాయం రూ.91.52 లక్షల గురించి చెప్పనే లేదన్నారు. ఆదాయపు పన్ను వివరాలను కూడా బహిర్గతం చేయలేదన్నారు. ఇవన్నీ కూడా ఓటర్లను తప్పుదారి పట్టించడమే అవుతుందని, అందువల్ల కేసీఆర్ ఎన్నికను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కేసీఆర్‌తో పాటు ఇతరులకు నోటీసులు జారీ చేశారు. -
12 మంది ఎమ్మెల్యేల అరెస్టు.. ఎవరిపై ఏ కేసులు
ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు మొత్తం 12 మంది ఎమ్మెల్యేలపై రకరకాల కేసులు నమోదయ్యాయి. తమవాళ్ల మీద తప్పుడు కేసులు పెడుతున్నారని, కావాలనే వేధిస్తున్నారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. చివరకు ప్రధానమంత్రి మోదీ తనను చంపిస్తారేమో అని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కానీ.. ఈ కేసుల వివరాలన్నీ చూస్తే ఇందులో ఎమ్మెల్యేల సొంత భార్యలు పెట్టిన గృహహింస కేసులు కూడా ఉన్నాయి. వాటిని కూడా తప్పుడు ఫిర్యాదులే అంటారో.. ఏమో కేజ్రీవాలే తేల్చుకోవాలి. ఏయే ఎమ్మెల్యేలు ఏ సందర్భంలో అరెస్టయ్యారో, ఎవరి మీద ఎలాంటి కేసులు ఉన్నాయో ఒక్కసారి చూద్దాం.. 1) శరద్ చౌహాన్ ఆప్ మహిళా కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న కేసులో సంబంధం ఉందని శరద్ చౌహాన్‌ను జూలై 31న అరెస్టు చేశారు. 2) అమానతుల్లా ఖాన్ ఓ మహిళను అత్యాచారం చేసి చంపేస్తానని బెదిరించినందుకు అమానతుల్లా ఖాన్‌ను జూలై 24న అరెస్టు చేసి, తర్వాత బెయిల్ మీద విడుదల చేశారు. 3) రాజేష్ రిషి రాజేష్ తనను వేధిస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసినందుకు ఆమెను బెదిరించి డబ్బు తీసుకోవడం, ఆత్మహత్యకు ప్రేరేపించడం అనే నేరాల కింద ఈయనపై కేసు పెట్టారు. 4) నరేష్ యాదవ్ మాలెర్కొట్టా పట్టణంలో మతపరమైన విశ్వాసాలను రెచ్చగొట్టిన ఘటనతో సంబంధం ఉందని యాదవ్‌ను జూలై 24న అరెస్టు చేశారు. 5) ప్రకాష్ జర్వాల్ ఓ మహిళపై దాడిచేసి, ఆమెను లైంగికంగా వేధించిన కేసులో జూన్ మొదటివారంలో ఈయనపై కేసు పెట్టారు. 6) సోమనాథ్ భారతి తనను తీవ్రంగా వేధిస్తున్నాడంటూ భార్య గృహహింస చట్టం కింద ఫిర్యాదుచేయడంతో 2015 సెప్టెంబర్‌లో సోమనాథ్ భారతిని అరెస్టు చేశారు. ఓ మహిళపై దాడి చేయడానికి తన అనుచరులను ప్రేరేపించినందుకు జూలై నెలలో మరోసారి ఈయనపై కేసు పెట్టారు. 7) మనోజ్ కుమార్ భార్య గృహహింస చట్టం కింద ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ మహిళా కమిషన్ ఈయనను విచారణకు పిలిచింది. అలాగే, భూకుంభకోణం కేసు కూడా ఈయనపై నమోదైంది. 8) దినేష్ మోహనియా మహిళతో అసభ్యంగా ప్రవర్తించినందుకు, 60 ఏళ్ల వృద్ధురాలిని చెంపమీద కొట్టినందుకు ఈయనను జూన్‌లో అరెస్టుచేశారు. తర్వాత బెయిల్ మీద విడుదల చేశారు. 9) మహీందర్ యాదవ్ ఓ నిరసన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వోద్యోగిపై దాడి చేసినందుకు ఈయనను 2016 జనవరిలో అరెస్టుచేసి, బెయిల్ మీద విడుదల చేశారు. 10) అఖిలేష్ త్రిపాఠీ 2013 నాటి దాడి చేయడం, నేరపూరితంగా భయపెట్టడం కేసులో ఈయనను 2015 నవంబర్‌లో అరెస్టు చేశారు. 11) సురీందర్ సింగ్ ఎన్డీఎంసీ కార్మికుడిపై దాడి చేసిన కేసులో ఈయనను 2015 ఆగస్టులో అరెస్టు చేశారు. 12) జితేందర్ సింగ్ తోమర్ నకిలీ డిగ్రీలు సమర్పించినందుకు 2015 జూన్‌లో అరెస్టు చేసి, బెయిల్ మీద విడుదల చేశారు.