తిరుపతి: ఉన్నతాధికారుల వేధింపులు.. సీఐ మిస్సింగ్‌! | Officials Harassment Tirupati East CI Case Details, CI Missing Causing A Stir | Sakshi
Sakshi News home page

తిరుపతి: ఉన్నతాధికారుల వేధింపులు.. సీఐ మిస్సింగ్‌!

Published Wed, Sep 25 2024 10:43 AM | Last Updated on Wed, Sep 25 2024 12:30 PM

Officials Harassment Tirupati East CI Case Details

తిరుపతి, సాక్షి: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక.. ఉద్యోగులకు వేధింపులు అధికమయ్యాయి. ఈ నేపథ్యంతోనే.. జిల్లాలో ఓ సీఐ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. తిరుపతి ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి కనిపించకుండా పోవడంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

గత కొన్నిరోజులుగా ఉన్నతాధికారుల నుంచి ఆయన వేధింపులు ఎదుర్కొంటున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటికి రాలేదని వాళ్లు అంటున్నారు. తన భర్తకు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వస్తోందని, ఆయనకు ఏమైనా జరిగితే అధికారులదే బాధ్యత అని మహేశ్వర్‌రెడ్డి భార్య అంటోంది. ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తక ముందే.. ఆయన ఆచూకీ కనిపెట్టే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement