సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఒకే ఇంట్లో ఆరుగురు హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రశాంత్‌తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కామారెడ్డి ఎస్‌పీ సింధు శర్మ తెలిపారు. ఆమె మంగళవారం కేసు సంబంధించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. ఒక్కొక్కరినీ ఒక్కో ప్రాంతానికి తీసకువెళ్లి హత్య చేశారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్‌లలో కేసు నమోదైనట్లు తెలిపారు.
ప్రశాంత్‌తో పాటు గుగులోతు విష్ణు, బానోతు వంశీ, వడ్డమ్మ, మరో మైనర్ బాలుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నవంబర్ 29 రోజు ప్రసాద్‌ను రాళ్లతో కొట్టి చంపి పూడ్చిపెట్టారని నిందితులను విచారిస్తే తెలిసిందన్నారు. ఈ హత్యలు చేయడానికి వాడిన టాటా ఆల్ట్రోజ్ కారు, భూమి పత్రాలు, రూ.30 వేలు, ఐదు సెల్ ఫోన్లు దొరికినట్లు చెప్పారు. ఆ ఫొన్లు కూడా మృతి చెందినవారివిగా గుర్తించామని అన్నారు.
వారి ప్రణాళిక ప్రకారం ప్రసాద్ వాళ్ల అమ్మను కూడా హత్య చేయాలనుకున్నారని తెలిపారు. ఈ ఆరుగురి హత్యల్లో నిందితుడు ప్రశాంత్ తల్లి పాత్ర కూడా ఉన్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. పలు అనుమానాల ఆధారంగా ఇది కేవలం ప్రథమిక విచారణ అన్నారు. ఈ కేసులో అన్నివైపుల నుంచి లోతుగా తదుపరి దర్యాప్తు కొనస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment