TDP Leader Sexually Assaults Married Woman - Sakshi
Sakshi News home page

వివాహితపై టీడీపీ నేత లైంగిక వేధింపులు 

Aug 3 2023 4:09 AM | Updated on Aug 3 2023 11:39 AM

TDP leader sexually assaults married woman - Sakshi

అనంతపురంశ్రీకంఠంసర్కిల్‌:  అనంతపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి ప్రధాన అనుచరుడు, ఆ పార్టీ క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ మార్కెట్‌ మహేష్‌ ఓ వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వన్‌టౌన్‌ సీఐ రెడ్డెప్ప తెలిపిన  వివరాలిలా ఉన్నాయి. అనంతపురం వేణుగోపాల్‌నగర్‌కు చెందిన ఓ యువతి ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది.

ఆమెకు తన భర్త ద్వారా అంబార్‌ గేరి వాసి.. ప్రస్తుతం భవానీనగర్‌లో ఉంటున్న టీడీపీ క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ మార్కెట్‌ మహేష్‌ ఏడాది క్రితం పరిచయమయ్యాడు. అప్పటినుంచి అవకాశం దొరికిన ప్రతిసారి లైంగిక వేధింపులకు గురిచేయసాగాడు. ఈ ఏడాది జూలై 27న ఆ యువతి భర్త మిత్రులంతా కలసి గోవా టూర్‌ ప్లాన్‌ చేశారు. భర్తకు వేరే పని పడడంతో యువతిని టూర్‌కు పంపాడు.

అక్కడ ఆమె సోదరుడి వరుసైన వ్యక్తితో కలసి తీసుకున్న వీడియోలు, ఫొటోలను ఎవరి ద్వారానో తెప్పించుకున్నాడు. తన కోరిక తీర్చకపోతే వాటిని యువతి భర్తతో పాటు అందరికీ పంపుతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు బుధవారం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు టీడీపీ నాయకుడు మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా మహేష్  ను రక్షించేందుకు బడా టీడీపీ నేతలు రంగంలోకి దిగినట్లు తెలిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement