యువతిపై టీడీపీ నాయకుడు లైంగికదాడి | A TDP leader molestation on a girl | Sakshi
Sakshi News home page

యువతిపై టీడీపీ నాయకుడు లైంగికదాడి

Published Wed, Aug 30 2023 3:41 AM | Last Updated on Wed, Aug 30 2023 3:41 AM

A TDP leader molestation on a girl - Sakshi

రాయదుర్గం: కుమార్తె వయసు కలిగిన ఓ యువతిపై టీడీపీ నాయకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఎవరూ లేని సమయంలో యువతి ఇంట్లోకి చొరబడి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసి అతనికి బాధిత యువతి బంధువులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌ మండలం హులికల్లులో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాల మేరకు... హులికల్లు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుకు ప్రధాన అనుచరుడైన బోయ సోమశేఖర్‌ (45) వరుసకు కోడలైన 20 ఏళ్ల యువతిపై ఎప్పటినుంచో కన్నేశాడు.

అమ్మాయిని ఎలాగైనా లోబర్చుకోవాలని కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఏదో ఒక కారణంతో తరచూ ఆమె ఇంటి వద్దకు వెళ్లి గంటల తరబడి కాలక్షేపం చేసేవాడు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆ యువతి తల్లిదండ్రులు బయటకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే అదనుగా భావించిన సోమశేఖర్‌ ఆమె ఇంట్లోకి చొరబడి అస్యభకరంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటిస్తున్నప్పటికీ బలవంతంగా లైంగికదాడి చేశాడు. అనంతరం చెప్పులు అక్కడే వదిలి పారిపోయాడు. యువతి ఇంట్లోనే ఏడుస్తూ కూర్చుంది.

కొద్దిసేపటి తర్వాత యువతి తండ్రి ఇంటికి రావడంతో జరిగిన దారుణం గురించి తెలియజేసి కన్నీటిపర్యంతమైంది. అదే సమయంలో చెప్పుల కోసం తిరిగి యువతి ఇంటి వద్దకు వచ్చిన సోమశేఖర్‌ను గుర్తించిన బాధితురాలి తండ్రి, బంధువులు చితకబాదారు. అనంతరం తన తల్లిదండ్రులతో కలిసి బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన రూరల్‌ సీఐ యుగంధర్‌ మంగళవారం నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 376 కింద (రేప్‌) కేసు నమోదుచేసి అరెస్ట్‌ చేశారు. నిందితుడు సోమశేఖర్‌ను కళ్యాణదుర్గం జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా, రిమాండ్‌ విధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement