Challa madhusudhan reddy
-
నైపుణ్య శిక్షణను పంచుకునేందుకు ‘క్యాట్స్’ ఆసక్తి : ఏపీఎస్ఎస్డీసీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న స్కిల్ కాలేజీలకు నైపుణ్య శిక్షణ విధానాన్ని అందించేందుకు అమెరికాలోని నార్త్ కొరోలినాలోని కెరీర్ అకాడమీ అండ్ టెక్నికల్ స్కూల్(క్యాట్స్) ఆసక్తి కనబరిచింది. అమెరికా పర్యటనలో భాగంగా క్యాట్స్ కేంద్రాన్ని ఏపీ నైపుణ్యాభివృద్థి సంస్థ(ఏపీఎస్ఎస్డీసీ) ప్రభుత్వ సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డి సందర్శించారు. అక్కడ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పరిశీలించారు. ఆటోమోటివ్ టెక్, వెల్డింగ్, అత్యవసర వైద్య చికిత్స, అగ్ని మాపక అకాడమీ, నర్సింగ్, క్యూలినరీ ఆర్ట్స్, ఫిల్మ్ మేకింగ్, యానిమేషన్ వంటి విభాగాల్లో శిక్షణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాట్స్ ప్రిన్సిపాల్ లర్రీ ఈ రోగర్స్, ప్రోగ్రామ్ క్యాంప్స్ డైరెక్టర్ డెబ్రాలెస్టర్, ఇతర టెక్నికల్ సిబ్బందిని కలిశారు. అక్కడ అమలు చేస్తున్న నైపుణ్య శిక్షణ విధానాన్ని మనతో పంచుకునేందుకు ఆసక్తి కనబరిచారని ఏపీఎస్ఎస్డీసీ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. (క్లిక్: విద్యార్థులకు గుడ్ న్యూస్.. 25న హెచ్‌సీఎల్ ‘వాక్ ఇన్ డ్రైవ్’) -
‘నైపుణ్యం’లో ఏపీ ముందంజ
ఆరిలోవ (విశాఖ తూర్పు): రాష్ట్ర యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, అందువల్లే స్కిల్ డెవలప్మెంట్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) అడ్వయిజర్ చల్లా మధుసూదనరెడ్డి అన్నారు. నేషనల్ æస్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖలో ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకు జరగనున్న దక్షిణ భారత రాష్ట్రాల నైపుణ్య పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ను స్కిల్ డెవెలప్మెంట్ అధికారులతో కలసి ఆయన మంగళవారం ఆవిష్కరించారు. విశాఖలోని ఓ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కృషితో రాష్ట్రంలో సౌత్ జోన్ స్కిల్ పోటీలు నిర్వహించడానికి అవకాశం కలిగిందన్నారు. ఐదు దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఇక్కడ ఆతిథ్యమిచ్చి, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు, అక్కడ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు 2022లో చైనాలో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవుతారన్నారు. ఏపీఎస్ఎస్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ బంగార్రాజు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి 450 మంది విద్యార్థులు విశాఖ చేరుకున్నారన్నారు. వారికి 52 విభాగాలలో పోటీలు నిర్వహించడానికి నగరంలో 11 చోట్ల వేదికలు సిద్ధం చేశామన్నారు. వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. -
ఏపీ: నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ సలహాదారుగా మధుసూదన్ రెడ్డి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణా శాఖ సలహాదారుగా చల్లా మధుసూదన్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. గత రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్ఎస్డిసి) చైర్మన్‌గా చల్లా మధుసూదన్ రెడ్డి ఉన్నారు. చల్లా మధుసూదన్ రెడ్డి బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం అమెరికా వెళ్లి పదేళ్లపాటు ఉద్యోగం చేసి 2010లో రాష్ట్రానికి తిరిగి వచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకై ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్శితులయ్యారు. పార్టీ పెట్టిన మొదటి రోజునుంచే వైఎస్ జగన్ అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. ఆతర్వాత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ ఐటీ విభాగం కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టి.. వివిధ రంగాల్లో పనిచేస్తున్న విద్యాధికులను, వైఎస్ జగన్ అభిమానులను సమీకరించి.. వారందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో చల్లా మధుసూదన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. -
యువత భవిత మార్చేలా శిక్షణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్కిల్ కాలేజీల్లో యువత ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో నైపుణ్య శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నామని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము తెలిపారు. ఇటువంటి సంస్థల్లో శిక్షణ పొందే యువతకు ఉపాధి అవకాశాలు సులభంగా లభిస్తాయని చెప్పారు. గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ)తో నాలుగు జాతీయ, అంతర్జాతీయ సంస్ధలు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకున్నాయి. వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో అనంతరాముతోపాటు నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ మధుసూదనరెడ్డి, ఎండీ అర్జా శ్రీకాంత్ ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మధుసూదనరెడ్డి మాట్లాడుతూ నైపుణ్య శిక్షణ, ఎంట్రప్రెన్యూర్షిప్ విభాగాల్లో రాష్ట్రాన్ని ఉన్నతస్థాయికి తీసుకువెళ్లాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారని, ఇందులో భాగంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ కాలేజీల్లో భాగస్వామ్యం అయ్యేందుకు ఇప్పటివరకు 13 సంస్థలు ముందుకొచ్చినట్టు తెలిపారు. అర్జా శ్రీకాంత్ మాట్లాడుతూ తాజాగా ఐబీఎం, భారత పర్యాటకాభివృద్ధి సంస్థ, సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్ (ఎస్పీఐ), ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీలు స్కిల్ కాలేజీల్లో భాగస్వామ్యం అయ్యాయని వివరించారు. అర్జా శ్రీకాంత్, ఐబీఎం ఇండియా డైరెక్టర్ జగదీశభట్, ఎస్పీఐ డైరెక్టర్ జార్జినా ఫువా, ఐటీడీసీ ఎండీ జి.కమలవర్థన్ రావు, ఎల్వీ ప్రసాద్ అకాడమీ డైరెక్టర్ ఎ.సాయిప్రసాద్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. (చదవండి: న్యాయవాదితో రాజీనామా చేయిస్తే పచ్చరంగు మారుతుందా? ) మొత్తం 13 ఒప్పందాలు మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఇప్పటికే 3 విడతలుగా 9 సంస్థలతో యువత భవిత మార్చే దిశగా ఎంవోయూలు కుదుర్చుకుంది. తాజాగా 4 ఎంవోయూలతో మొత్తం 13 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్టయింది. ఐబీఎం ఇండియా ఈ సంస్థ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, కోడింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చెయిన్, డేటా సైన్స్ – అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటం కంప్యూటింగ్, బిగ్ డేటా, ఫుల్ స్టాక్ తదితర కోర్సులు, ఇతర కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తుంది. ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ విశాఖపట్నంలో మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేసేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చింది. డిజిటల్ ఫొటోగ్రఫీ, ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్ అండ్ డిజిటల్ రిస్టోరేషన్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తదితర కోర్సులతో పాటు నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్‌లో శిక్షణ ఇస్తుంది. సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్ అడ్వాన్స్ మాన్యుఫాక్చరింగ్, ఫుడ్ ఇన్నోవేషన్ – ఫుడ్ ప్రాసెసింగ్, ఎంట్రప్రెన్యూర్షిప్ విభాగాల్లో అంతర్జాతీయ స్థాయి పరిశ్రమల నేతృత్వంలోని కోర్సులను నైపుణ్య కళాశాలల్లో అందించడానికి అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు, నిర్వహణకు ఈ సంస్థ ముందుకు వచ్చింది. పరిశ్రమల్లో పనిచేయడానికి అవసరమైన విధంగా ల్యాబ్‌లు, కోర్సులను అభివృద్ధి చేయడం, ట్రైనర్లకు శిక్షణ ఇవ్వడం, ప్రతిపాదిత కోర్సుల్లో ఎస్ఎస్డీసీతో కలసి సర్టిఫికేషన్, అక్రిడిటేషన్ ఇవ్వడంతో పాటు టీచింగ్, లెర్నింగ్ మాడ్యూల్స్ ఫ్రేమ్‌వర్క్‌ను మరింత అభివృద్ధి చేయనుంది. ఐటీడీసీ: ఆతిథ్య రంగంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయబోయే సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు అవసరమైన సహాయ సహకారాలను భారత పర్యాటకాభివృద్ధి సంస్థ అందజేస్తుంది. కోర్సులు, పాఠ్యాంశాలు, అధ్యయన అంశాలను ఐటీడీసీ రూపొందిస్తుంది. గతంలో కుదిరిన ఒప్పందాలు సెప్టెంబర్ 16 ► పాఠ్యాంశాల రూపకల్పనతో పాటు విశాఖలోని లాజిస్టిక్స్ సెక్టార్లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను టెక్ మహీంద్రా ఫౌండేషన్ ఏర్పాటు చేయనుంది. ► లైఫ్ సైన్సెస్ డొమైన్లో బయోకాన్ లిమిటెడ్ నైపుణ్య భాగస్వామి (నాలెడ్జ్ పార్ట్నర్)గా వ్యవహరించనుంది. ► విద్యుత్ రంగానికి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు, ఆటోమేషన్ అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్ సెక్టార్లో స్కిల్ సెంటర్ల ఏర్పాటుకు స్నైడర్ ఎలక్ట్రిక్ అంగీకారం. సెప్టెంబర్ 25 ► ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో దాల్మియా భారత్ ఫౌండేషన్ నిర్మాణ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయనుంది. ► నైపుణ్యాభివృద్ధి కోర్సుల సిలబస్, శిక్షణ, సర్టిఫికేషన్ కోసం ఎన్ఎస్ఈ అకాడమీ లిమిటెడ్‌తో ఒప్పందం. ► నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో మరో ఒప్పందం. అక్టోబర్ 22 ► డెల్ టెక్నాలజీస్ విశాఖ ఐటీ సెక్టార్లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయడంతో పాటు, స్కిల్ కాలేజీల్లో శిక్షణ ఇస్తుంది. ► ఆటోమోటివ్ విభాగంలో శిక్షణకు జేబీఎం గ్రూప్‌తో ఒప్పందం. ► లాజిస్టిక్స్ విభాగంలో సీఐఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్ శిక్షణ ఇస్తుంది. ( ఎక్కడనుంచైనా ఇసుక తెచ్చుకోవచ్చు ) -
పచ్చకార్యకర్తల పైశాచికం
-
‘టీడీపీ ఆఫీసులోనే అత్యాచారం దారుణం’
సాక్షి, కర్నూలు : జిల్లాలోని అవుకు మండల కేంద్రంలో టీడీపీ కార్యకర్తలు బాలుడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంపై వైఎసార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడిపై అమానవీయ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ కార్యాలయంలోనే ఇలాంటి ఘటన జరడగం దారుణమని మండిపడ్డారు. బాలుడిని డిన్నర్ పేరుతో పిలిచి నలుగురు యువకులు సామూహిక అత్యాచారం జరపడం వారి క్రూరత్వానికి నిదర్శనమన్నారు. నిందితుల తల్లిదండ్రులు కూడా వారు చేసిన పనిని క్షమించరని చెప్పారు. బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. బాలుడిపై కిరాతకంగా అత్యాచారానికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. గతంలో కూడా నిందితులు పలువురిపై వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. అప్పట్లో నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. టీడీపీ నేతలు వెనకేసుకొచ్చారని చెప్పారు. తప్పుచేసిన వారిపై కేసులు పెట్టకుండా పోలీసులను అడ్డుకున్నారని విమర్శించారు. కాగా, అవుకులోని టీడీపీ కార్యాలయంలో నలుగురు టీడీపీ కార్యకర్తలు 14 ఏళ్ల బాలుడిపై సాముహిక అతఅత్యాచారం చేశారు. అయితే బాలుడికి రక్తస్రావమై అస్వస్థతకు గురికావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలుడిని చిత్రహింసలు పెట్టిన టీడీపీ కార్యకర్తలు బుల్లెట్ రాజు, ప్రేమ్ కుమార్, రాజుతో పాటు మరొకరని గుర్తించారు. వీరిపై సెక్షన్ 377 కింద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి : దారుణం.. బాలుడిపై సామూహిక అత్యాచారం -
నైపుణ్య శిక్షణలో ఏపీ టాప్..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ పనిచేస్తోందని ఆ సంస్థ చైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో అసోచామ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కిల్ ఇండియా సమిట్ అండ్ అవార్డ్స్.. అత్యత్తుమ నైపుణ్య శిక్షణ ఇస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచి బంగారు పథకం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు శుక్రవారం తాడేపల్లిలోని ఏపీఎస్ఎస్డీసీ కార్యాలయంలో మధుసూదన్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ అనంతరాము, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే యువతకు స్థానికంగా ఉండే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు కల్పించేలా చట్టం చేశారని గుర్తుచేశారు. అందుకు అనుగుణంగానే నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం కోసం స్కిల్ యూనివర్సిటీతో పాటు ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఒక మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని తెలిపారు. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి నుంచి ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో అనేక రకాల నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉండడంతో ఇటీవలే యూకే నేషనల్ హెల్త్ సిస్టమ్స్, హెల్త్ ఎడ్యుకేషన్ ఇంగ్లండ్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నామన్నారు. ఇలాంటి అనేక నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు అమలు చేయడం వల్లే అసోచామ్ సంస్థ దేశంలోనే అత్యుత్తమ నైపుణ్య శిక్షణ ఇస్తున్న రాష్ట్రాల్లో ఏపీకి మొదటి స్థానం ఇచ్చి బంగారు పతాకాన్ని ఇచ్చిందన్నారు. ఈ అవార్డు తమపై మరింత బాధ్యతను పెంచిందని.. రాబోయే రోజుల్లో యవతకు నైపుణ్య శిక్షణతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన చెప్పారు. అనంతరాము మాట్లాడుతూ.. దేశంలో అత్యత్తుమ నైపుణ్య శిక్షణ ఇస్తున్న రాష్ట్రాల్లో ఏపీని నెంబర్‌వన్ గా అసోచామ్ సంస్థ గుర్తించి బంగారు పతకాన్ని ప్రధానం చేయడం ఆనందంగా ఉందన్నారు. యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగాల కల్పనపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని.. ఇందుకోసం విద్యావిధానంలో అనేక మార్పులు తీసుకువస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణా కార్యక్రమాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి నైపుణ్యాభివృద్ధి, శిక్షణా శాఖను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.స్థానికంగా యువతకు 75శాతం ఉద్యోగాలు కల్పించడం కోసం అవసరమైన విధంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ యూనివర్సిటీ, 25 మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. చదువుతోపాటు పరిశ్రమల్లో పనిచేయడానికి అవసరమైన ప్రాక్టికల్ శిక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని.. ఇందులో పరిశ్రమలు కూడా భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసకుంటామన్నారు. అర్జా శ్రీకాంత్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో ఈ 6 నెలల కాలంలో ఏపీఎస్ఎస్డీసీ శిక్షణా కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. శిక్షణతోపాటు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా జరిపిన సర్వేలో 7 ఇండస్ట్రియల్ జోన్లను గుర్తించామని.. ఆ ప్రాంతాల్లోని పరిశ్రమల్లో ఉండే ఉద్యోగాలకు అనుగుణంగా శిక్షణా కార్యక్రమాలు అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ దిశగా ఇప్పటికే పరిశ్రమలశాఖ, విద్యాశాఖ, ఆర్థికశాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారని చెప్పారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలైన పీఎంకేవీవై, ఈసీడీఎం, బ్యాంబు మిషన్, కోయిర్ బోర్డు, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్.ఎఫ్.డి.బి) పథకాలను అమలు చేస్తూ నిధులను సమకూర్చుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 525 డిగ్రీ కాలేజీల్లో ఎంప్లాయిబిలిటీ స్కిల్స్ సెంటర్లు (ఈ.ఎస్.సి)లను ఏర్పాటు చేసి పైథాన్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. నాన్ టెక్నికల్ విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు సాఫ్ట్వేర్ సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయన్నారు. గత వారం రోజుల్లో విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇన్ఫోసిస్ సంస్థ నిర్వహించిన అర్హత పరీక్ష, ఇంటర్వ్యూల్లో ఏపీఎస్ఎస్డీసీ ద్వారా శిక్షణ పొందిన 662 మంది ఉద్యోగాలు సాధించారని.. గుంటూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోనూ త్వరలో ఇన్ఫోసిస్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబోతున్నామని అర్జా శ్రీకాంత్ తెలిపారు. ఇంకా ఈ మీడియా సమావేశం ఏపీఎస్ఎస్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు హనుమ నాయక్, బి. నాగేశ్వరరావు, సీజీఎం టెక్నికల్ రవి గుజ్జుల, సీజీఎం కార్పొరేట్ కనెక్ట్ సత్యప్రభ, కంపెనీ సెక్రెటరీ పవన్ కుమార్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ ప్రతాప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘రాష్ట్రానికి గోల్డ్ మెడల్ రావడం సంతోషకరం’
సాక్షి, తాడేపల్లి : దేశంలో అత్యున్నత నైపుణ్యం ఇస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూధన్‌రెడ్డి వెల్లడించారు. బెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ స్టేట్స్ అవార్డ్స్‌లో మన రాష్ట్రానికి గోల్డ్ మెడల్ రావడం సంతోషకరమని పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడిన ఆయన నైపుణ్యాభివృద్ధిలో ఉత్తమ విధానాలు అవలంబిస్తున్న రాష్ట్రాలకు అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈ అవార్డును ప్రదానం చేసిందని తెలిపారు. వృత్తి నైపుణ్య శిక్షణలో ఆరు నెలల్లోనే వేలాది మందికి శిక్షణనిచ్చామని వివరించారు. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయానికి అనుగుణంగా యువతకు శిక్షణనిస్తున్నామని తెలియజేశారు. -
31 ఇంజనీరింగ్ కాలేజీలలో అడ్వాన్స్ రోబో టెక్నాలజీ..
సాక్షి, విజయవాడ : రొబొటిక్, మెకట్రానిక్స్ విభాగాల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు హైఎండ్ శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా ఎపీఎస్ఎస్డీసీ– జర్మనీకి చెందిన యూరోపియన్ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్‌తో ఒప్పందం చేసుకుని కలిసి పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా రొబోటిక్ విభాగంలో జర్మన్ సంస్థతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. గురువారం విజయవాడలోని గేట్‌వే హోటల్లో ఎపీఎస్ఎస్డీసీ– యూరోపియన్ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండో విడత 20 ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్వాన్స్డ్ రోబోటిక్ కంట్రోల్ ల్యాబ్‌లను ఆన్లైన్ ద్వారా చైర్మన్ చల్లా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఒప్పందం ప్రకారం మొదటి విడతలో భాగంగా ఇప్పటికే 11 ఇంగిరినీరింగ్ కాలేజీల్లో అడ్వాన్సుడ్ రోబోటిక్స్ లాబ్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల్లో 788 మంది విద్యార్థులు ఏఆర్సీ 1.0 లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. రెండవ విడత 20 ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్వాన్స్డ్ రోబోటిక్ కంట్రోల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి 800 మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇండస్ట్రీ 4.0కు ఆనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఏపీలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు రోబోటిక్స్ విభాగంలో నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాజెసింగ్ రంగంలో జర్మనీకి సంబంధించిన టెక్నాలజీని పరిశ్రమలకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఏపీఎస్ఎస్డీసీ ఎండి, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ మాట్లాడుతూ రొబొటిక్స్, ఆటోమేషన్, మెకట్రానిక్స్ విభాగాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశ్రమల్లో పనిచేయడానికి అవసరమైన విధంగా శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిందన్నారు. కేవలం డిగ్రీతో ఉద్యోగం రాదని, దానితోపాటే అదనపు నైపుణ్యాలు ఉన్నపుడే ఉద్యోగాలు వస్తాయన్నారు. అందువల్లే టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యార్థులకు ఎపిఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో మార్కెట్లో డిమాండ్ ఉన్న సర్టిఫికేషన్ కోర్సుల్లో శిక్షణ మస్తున్నామన్నారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికేషన్, ప్రశంసా పత్రాలను చైర్మన్ చల్లా అందజేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్ లీడర్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సెంటర్ ఫర్ మెకట్రానిక్స్(ఈసీఎం) ప్రెసిడెంట్ వీవీఎన్ రాజు, యూరోపియన్ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్ ఎండీ (జర్మనీ) టిల్ క్వార్డ్ ఫ్లిగ్ తదితరులు పాల్గొన్నారు. -
యువత భవితకు భరోసా
సాక్షి, అమరావతి: ఉన్నత చదువులు చదివినా తగిన నైపుణ్యాలు లేకపోతే ఉద్యోగాలు సాధించడం కష్టం. యువత విద్యార్హతలకు తగిన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించడానికి ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) అడుగులు ముందుకేస్తోంది. ఇప్పటికే వేల మందికి పలు అంశాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి చూపింది. ఇప్పటివరకు ట్రైనింగ్ పార్టనర్స్ ద్వారా శిక్షణ ఇప్పించగా ఇక నుంచి నేరుగా శిక్షణ అందించనుంది. రాష్ట్రంలో 13 జిల్లాల్లోని 25 పార్లమెంట్ స్థానాల పరిధిలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. నైపుణ్యం ద్వారానే ఉన్నతోద్యోగాలు నైపుణ్య శిక్షణ ద్వారా ఉన్నతోద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికే పలు కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వాలతో ట్రైనింగ్‌తోపాటు ఉద్యోగావకాశాలు కల్పించే విషయమై ఎంవోయూలు చేసుకున్నాం. విదేశీ హైకమిషనర్లు, డిప్యూటీ హైకమిషనర్లు ముందుకు వస్తున్నారు. వారితో చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాం. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసే శిక్షణ కేంద్రాలను త్వరలోనే ప్రారంభిస్తాం. ప్రభుత్వ ఆమోదానికి కేంద్రాల వివరాలు పంపించాం. – చల్లా మధుసూదన్‌రెడ్డి, చైర్మన్, ఏపీఎస్ఎస్డీసీ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఇలా.. ► ఏపీఎస్ఎస్డీసీ ప్రతి జిల్లాకు మూడు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ►13 జిల్లాల్లో 39 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సుముఖంగా ఉన్నారు. ప్రధానంగా ప్రభుత్వ కళాశాల్లలో ఈ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించారు. ► నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో అకౌంట్స్, ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ ఇన్‌స్రూ?న్స్, క్యాపిటల్ గూడ్స్, కెమికల్ అండ్ పెట్రో కెమికల్, కన్స్ట్రక్షన్, డొమెస్టిక్ వర్క్స్, ఎలక్ట్రికల్స్ ఇలా మొత్తం 51 రకాల స్కిల్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. ► ఇంజనీరింగ్ విభాగాల్లో మరింత తెలుసుకునే విధంగా శిక్షణ, వివిధ రకాల వర్క్‌షాపులు ఉంటాయి. ►శిక్షణ అనంతరం ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. ►ఇప్పటికే పలు కాలేజీల్లో ఏర్పాటు కానున్న కేంద్రాల్లో కంప్యూటర్లు, ఇతర పరికరాలు ఉన్నాయి. వీటితోపాటు మరిన్ని పరికరాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ►కేంద్రాల్లో ఒక కోర్సు పూర్తి కాగానే మరో కోర్సులో విద్యార్థులను చేర్చుకుంటారు. ►మంచి ఫ్యాకల్టీ ద్వారా నిరంతరం శిక్షణ అందిస్తారు. -
ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్‌గా చల్లా మధుసూదన్ రెడ్డి
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ (ఏపీఎస్ఎస్డీసీ) చైర్మన్‌గా చల్లా మధుసూదన్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈయన రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఐటీ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి చల్లా మధుసూదన్ రెడ్డి పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు .ఈ కార్యక్రమానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, జయరామ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారం, ఎమ్మెల్యేలు రక్షణ నిధి, కిలారి రోషయ్య హజరయ్యారు. -
ఏపీ ఎస్ఎస్డీసీ ఛైర్మన్‌గా చల్లా మధుసూధన్
సాక్షి, అమరావతి : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా వైఎస్సార్ సీపీ నేత చల్లా మధుసూదన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి చల్లా మధుసూదన్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బూత్ లెవెల్ ట్రైనింగ్, కన్వీనర్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా నిర్వహించి ప్రతిష్టాత్మకమైన పార్టీ విజయానికి కృషి చేశారు. పార్టీలో ఐటీ వింగ్ ప్రెసిడెంట్‌గా, రాష్ట్ర కార్యదర్శిగా పార్టీకి ఎనలేని సేవ చేశారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో విస్తృతంగా పనిచేస్తూ, సమాజ అభివృద్ధిపై పరిపూర్ణమైన అవగాహన కలిగివున్న వ్యక్తిగా చల్లా మధుసూదన్ రెడ్డిని ఈ పదవిలో నియమించడం జరిగింది. -
‘అన్న కోసం’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన వైఎస్ జగన్
సాక్షి, విజయనగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘అన్న కోసం’ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న జననేత మంగళవారం ఈ వెబ్‌సైట్‌ను అవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి ప్రచారం కోసం ఈ వెబ్సైట్ ఉపయోగపడుతోందన్నారు. రాష్ట్రం నుంచే కాకుండా.. దేశ విదేశాల నుంచి వైఎస్సార్ సీపీ ఉన్నతి కోసం పనిచేస్తామని చాలా మంది ముందుకొస్తున్నట్టు తెలిపారు. పార్టీ కోసం పనిచేసేందుకు ముందుకొచ్చే వారి సంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో వారందరి కోసం ఈ వెబ్‌సైట్‌కు రూపకల్పన చేసినట్టు ఆయన వెల్లడించారు. వైఎస్సార్ సీపీ అభిమానులు ఈ వెబ్సైట్లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా చల్లా మధుసూదన్‌రెడ్డి
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా చల్లా మధుసూదన్‌రెడ్డి నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు చల్లా మధుసూదన్‌రెడ్డిని ఈ పదవిలో నియమించినట్టు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. -
ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
హైదరాబాద్: వైఎస్సార్సీపీ నేతలు చల్లా మధుసూధన్‌రెడ్డి, ఉమా మల్లేశ్వరరావులు శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కలిశారు. రాష్ట్రంలో నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులపై ఆయనతో చర్చించారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం భారీ అక్రమాలకు పాల్పడుతోందని భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం భారీ అవినీతికి పాల్పడుతోందని తెలిపారు. ఇందుకోసం భారీ స్థాయిలో కొత్త ఓట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. జనవరి 1నుంచి జులై 28 వరకూ సుమారు 16వేల కొత్త ఓట్ల కోసం తెలుగుదేశం నేతలు నకిలీ దరఖాస్తు చేశారని ఫిర్యాదు చేశారు. దరఖాస్తులన్నీ ఒకే ఐపీ అడ్రస్ నుంచి జరిగాయని తెలిపారు. వీటన్నింటినీ వెరిఫికేషన్ జరిపించాలని, అర్హులకు మాత్రమే కొత్త ఓటరుకార్డులు జారీ చేయాలని కోరారు. -
వైఎస్సార్ సీపీకి మద్దతుగా ఐటీ నిపుణుల ప్రచారం
సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రచారం చేసేందుకు పార్టీ ఐటీ విభాగం సభ్యులు ఈనెల 12 నుంచి చిత్తూరు జిల్లా పీలేరు నుంచి ప్రారభించనున్నారు. మొదటి విడుతలో భాగంగా చిత్తూరు జిల్లాతో పాటు నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలో ప్రచారం చేపడుతున్నట్లు ఐటీ విభాగం రాష్ట్ర కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
వైఎస్సార్సీపీ ఐటీ కమిటీ నియామకం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర కమిటీలో 20 మంది సభ్యులను నియమించినట్లు రాష్ట్ర కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి బుధవారం తెలిపారు. సవాల దేవదత్ (కృష్ణా), ఆర్. వీరభద్రరావు, పుట్టా శివశంకర్, శివ పోతుల, ముండ్ల చంద్రశేఖర్, నారు ఉమా మహేశ్వరరెడ్డి(వైఎస్సార్), కూరపాటి బ్రహ్మానందరెడ్డి(ప్రకాశం), మహేష్ జీను (తూర్పు గోదావరి), తియ్యగూర చంద్రశేఖర్, ఎం. శ్రీనివాసరెడ్డి (గుంటూరు), కె. రాకేష్ తేజ్‌కుమార్ (నెల్లూరు), సీహెచ్ లావణ్య (విశాఖపట్టణం), బి. గోపీనాథ్, కె. గిరిధర్‌రెడ్డి, ఎం. అబ్దుల్ ఖాదర్ (హైదరాబాద్), బి.శ్రీవర్ధన్ (మహబూబ్‌నగర్), జి. దినేష్, అరవింద్ చప్పిడి, చంద్రమౌళి (చిత్తూరు), కిరణ్‌కుమార్ మాచినేని (కర్నూలు)లను కమిటీలో నియమించినట్లు ఆయన వెల్లడించారు. -
YSRCP ఐటీ కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డితో సాక్షి వేదిక