
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) చైర్మన్‌గా చల్లా మధుసూదన్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈయన రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ఐటీ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి చల్లా మధుసూదన్ రెడ్డి పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు .ఈ కార్యక్రమానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, జయరామ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారం, ఎమ్మెల్యేలు రక్షణ నిధి, కిలారి రోషయ్య హజరయ్యారు.