కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సోమవారం కర్నూలులో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ ఆదివారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా కాటసాని రామిరెడ్డి సోమవారం కర్నూలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా... ఇరు ప్రాంతాల సమన్యాయం కోసం వైఎస్ జగన్ ఒక్కరే దీక్ష చేపట్టారని కాటసాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకే ఆయనకు మద్దతుగా ఈ దీక్ష చేపట్టినట్లు తెలిపారు. త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. జగన్ చేపట్టిన దీక్షకు అందరు మద్దతు తెలపాని సీమాంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చిరంజీవి కేంద్రమంత్రి పదవి రాక ముందు ఒకలా, వచ్చిన తర్వాత మరోలా మాట్లాడుతున్నారని కాటసాని రామిరెడ్డి ఆరోపించారు.
Published Mon, Aug 26 2013 3:34 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM