మునిసిపల్ కార్యాలయం ఎదుట కాటసాని ధర్నా | High tensions at Banaganapalli in kurnool district | Sakshi
Sakshi News home page

మునిసిపల్ కార్యాలయం ఎదుట కాటసాని ధర్నా

Published Tue, Jul 1 2014 11:04 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM

High tensions at Banaganapalli in kurnool district

కర్నూలు జిల్లా బనగానపల్లెలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నివాసాలను కూల్చివేయాలంటూ టీడీపీ నేతలు మునిసిపల్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దాంతో మునిసిపల్ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నివాసాలు కూల్చివేసేందుకు రంగం సిద్దం చేశారు. ఆ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బనగానపల్లె మునిసిపల్ కార్యాలయానికి చేరుకుని.... తమ పార్టీ కార్యకర్తల నివాసాలు కూల్చివేయాలన్న ఆలోచన విరమించుకోవాలని సూచించారు. అందుకు మునిసిపల్ అధికారులు ససేమిరా అనడంతో కాటసాని రామిరెడ్డి మునిసిపల్ కార్యాలయం ఎదుటు ఆందోళనకు దిగారు. ఆందోళనలో వైఎస్ఆర్ సీపీ కాంగ్రెస్ కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరైయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement