High tensions
-
తైవాన్‌లో అడుగుపెట్టిన నాన్సీ పెలోసీ.. చైనాను రెచ్చగొట్టేలా ట్వీట్లు
తైపీ/బీజింగ్: తీవ్ర ఉద్రిక్తతల నడుమ తైవాన్‌లో అడుగుపెట్టారు అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ. తైపీ ఎయిర్‌పోర్ట్‌లో భారత కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి దిగిన ఆమెకు సాదర స్వాగతలం లభించింది. అయితే దిగీదిగంగానే ఆమె చేసిన ట్వీట్లు.. చైనాను రెచ్చగొట్టేలా ఉన్నాయి. అమెరికా ముందు నుంచి చెప్తున్నట్లు తైవాన్ ప్రజాస్వామ్యానికి మద్దతుగా, అలాగే ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛకు మేం కట్టుబడి ఉంటామని ఆమె ట్వీట్లు చేశారు. మరోవైపు నాన్సీ పెలోసీ ల్యాండ్ అయిన విషయం తెలుసుకున్న చైనా.. జరగబోయే పరిణామాలన్నింటికి అమెరికానే కారణమంటూ ప్రకటించింది. Our delegation’s visit to Taiwan honors America’s unwavering commitment to supporting Taiwan’s vibrant Democracy. Our discussions with Taiwan leadership reaffirm our support for our partner & promote our shared interests, including advancing a free & open Indo-Pacific region. — Nancy Pelosi (@SpeakerPelosi) August 2, 2022 ఇప్పటికే చైనా-తైవాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే ఉంటుంది. చైనా తీవ్ర అభ్యంతరాలు, హెచ్చరికల నడుమే తైవాన్‌లో అడుగుపెట్టారు యూఎస్ హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ. మొదటి నుంచి ఆమె పర్యటనను వ్యతిరేకిస్తున్న చైనా.. తాజాగా తైవాన్ భూ భాగంలోకి ఫైటర్ జెట్స్‌ను ప్రయోగించింది. అంతేకాదు తైవాన్ ప్రభుత్వ వెబ్సైట్లను సైతం హ్యాక్ చేసింది. ట్రెండింగ్‌లో వరల్డ్‌వార్ త్రీ తైవాన్-చైనా ఉద్రిక్తతల నడుమ యుద్ధ వాతావరణం నెలకొనడంతో మూడో ప్రపంచ యుద్ధం అంటూ ట్విటర్ ట్రెండ్ నడుస్తోంది. స్వీయ పరిపాలన ఉన్న తైవాన్ను తమ సొంతంగా ప్రకటించుకుంది చైనా. అలాగే.. పెలోసీ పర్యటన తమ(చైనా) తైవాన్ పర్యటన.. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని, చైనా ఆర్మీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించింది. తైవాన్ పర్యటన తర్వాత.. సింగపూర్, మలేషియా, జపాన్, సౌత్ కొరియాలోనూ ఆమె పర్యటించనున్నారు. -
రాజన్న సిరిసిల్ల: ట్రాక్టర్ హత్య.. పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో గురువారం తీవ్ర ఉద్రికత వాతావరణం నెలకొంది. భూవివాదంలో ఓ వ్యక్తిని ట్రాక్టర్‌తో ఢీకొట్టించి హత్య చేశారు. ఈ ఉదంతంలో నిందితుడిని తమకు అప్పగించాలంటూ మృతుడి బంధువులు స్టేషన్ ఎదుట గొడవకు దిగారు. దీంతో రుద్రంగి పోలీస్‌స్టేషన్ హైటెన్షన్ నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ట్రాక్టర్ ఢీకొని నేవూరి నరసయ్య (42 ) అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే బైక్‌పై వెళ్తున్న నరసయ్యను.. కిషన్ అనే వ్యక్తి ట్రాక్టర్‌తో కావాలనే ఢీకొట్టి హతమార్చాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇద్దరి మధ్య గత కొద్ది రోజులుగా భూ వివాదం ఉందని, అందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అంటున్నారు. ఇక హత్య అనంతరం నిందితుడు రుద్రంగి పోలీసులకు లొంగిపోయాడని సమాచారం. దీంతో పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగారు మృతుడి బంధువులు. తన భర్తను అన్యాయంగా చంపేశారంటూ పీఎస్ ముందు మృతుడి భార్య బైఠాయించింది. తన తాళి కూడా తీసుకొండంటూ సీఐకి చూపించిందామె. ఈ క్రమంలో బంధువులు పీఎస్‌లోపలికి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకుంటున్నారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు నరసయ్య బంధవులు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో.. సమీపంలోని చందుర్తి పోలీసులను కూడా రుద్రంగికి పంపించారు ఉన్నతాధికారులు. -
బాసర IIIT వద్ద హై టెన్షన్
-
అమలాపురంలో విధ్వంసం
-
శ్రీలంక ప్రధాని ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఏ క్షణం ఏం జరుగుతుందో?
కొలంబో: ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక ప్రజలు ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. ఏకంగా ప్రధాని మహింద్ర రాజపక్సే ఇంటిని ముట్టడించారు. పోలీసులు వారిని నిలువరించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బారికేడ్లు విరగొట్టి ప్రధాని ఇంటి వైపునకు ఆందోళనకారులు దూసుకెళ్లారు. ఈక్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక ఆర్మీ రంగంలోకి దిగింది. ప్రధాని ఇంటివద్దకు భారీ ఎత్తున పోలీసులు, ఆర్మీ బలగాలు చేరుకున్నాయి. ఇక ఆందోళనకారులు ప్రవేశించిన చోట విద్యుత్ నిలిపేసిన పోలీసులు వారికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోవాలని లేదంటే పరిస్థితులు చేయిదాటిపోతాయని వార్నింగ్ ఇచ్చారు. ప్రధాని ఇంటి వద్ద లెవల్-2 సెక్యురిటీ లైన్ దాటితే టియర్ గ్యాస్ ప్రయోగించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మూడో లెవల్ సెక్యురిటీ లైన్ దాటితే కాల్పులు జరిపే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో మీడియా సిబ్బందిని పోలీసులు అక్కడ నుంచి దూరంగా పంపించివేశారు. (చదవండి: భారత్, మోదీపై లంక క్రికెటర్ సనత్ జయసూర్య ఆసక్తికర కామెంట్స్) -
కరోనా: కరీంనగర్లో హైటెన్షన్!
సాక్షి, కరీంనగర్: కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో కరీంనగర్లో హై టెన్షన్ కొనసాగుతుంది. జిల్లాలో పర్యటించిన ఇండోనేషియాకు చెందిన పది మంది మతప్రచారకులతో పాటు నగరానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమయింది. ఈ క్రమంలోనే వైరస్ వ్యాప్తి నివారణకు పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఇండోనేషియా బృందం పర్యటించిన ప్రాంతాలను గత పది రోజులుగా దిగ్బంధం చేసి, ఆ ప్రాంతంలో నివాసం ఉండేవారు ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. బుధవారం ఆ ప్రాంతంలో వైద్య బృందాలతో ర్యాపిడ్ హెల్త్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించగా కరోనా లక్షణాలు ఎవ్వరికీ లేకపోవడంతో ఇతర ప్రాంతాల వారి మాదిరిగా వారికి కాస్త వెసులుబాటు ఇచ్చారు. (మరో వారం రోజులు కీలకం..) గురువారం ఒక్కసారిగా ఆ ప్రాంత వాసులు రోడ్లపైకి, మార్కెట్‌కు రావడంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం వెంటనే డేంజర్ జోన్ పరిధిలోని దారులన్నీ బారిగేడ్స్తో మూసివేసి పోలీస్ పహారా ఏర్పాటు చేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మరో రెండు మూడు వారాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఢిల్లీ ప్రార్థనలకు వెళ్ళి వచ్చిన 57 మందిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. గురువారం ఉదయం నాటికి తెలంగాణలో 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఇప్పటి వరకు 1980 మంది కరోనా బారినా పడగా.. 59 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 144 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 9 లక్షలు దాటాయి. -
సున్నపురాళ్లపల్లిలో ఉద్రిక్తత
-
నందిగామలో ఉద్రిక్తత
-
శబరిమలలో మళ్లీ ఉద్రిక్తత
సాక్షి, చెన్నై / పంబా: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం వద్ద మళ్లీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ ఎన్జీవో బృందంలోని రుతుస్రావ వయసు ఉన్న 11 మంది మహిళలను ఆందోళనకారులు ఆదివారం తరిమికొట్టారు. తమిళనాడుకు చెందిన మణిది అనే సంస్థ తరఫున ఈ మహిళలు అయ్యప్పను దర్శించుకునేందుకు తెల్లవారుజామున తమిళనాడు–కేరళ సరిహద్దు ద్వారా పంబాకు వచ్చారు. మార్గమధ్యంలో చాలామంది వీరి వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించగా, పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. అనంతరం ఆలయానికి వెళ్లేదారిలో వీరిని వందలాది మంది భక్తులు, ఆందోళనకారులు నిలువరించారు. ఈ సందర్భంగా స్వామి దర్శనానికి వెళితే ఉద్రిక్త పరిస్థితి తలెత్తే అవకాశముందని పోలీసులు నచ్చజెప్పగా, అయ్యప్పను దర్శించుకున్నాకే వెనక్కి వెళతామని మణిది సభ్యులు స్పష్టం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా ఆరు గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. దీంతో చివరకు మణిది సభ్యులను కొండపైకి తీసుకెళ్లేందుకు పోలీసులు యత్నించగా, వందలాది మంది భక్తులు వెంటపడి తరిమికొట్టారు. రాళ్లవర్షం కురిపించారు. అప్రమత్తమైన అధికారులు మహిళా భక్తులను సమీపంలోని భద్రతాసిబ్బంది ఉండే గదిలోకి తీసుకెళ్లారు. పరిస్థితి చేయిదాటడంతో వీరంతా అయ్యప్పను దర్శించుకోకుండానే వెనక్కు వెళ్లేందుకు అంగీకరించారు. దీంతో ఈ 11 మంది మహిళల్ని గట్టి భద్రత నడుమ సరిహద్దు దాటించారు. ఈ విషయమై మణిది సంస్థ సమన్వయకర్త సెల్వీ మాట్లాడుతూ..‘ఆందోళనల నేపథ్యంలో వెనక్కు వెళ్లాలని పోలీసులు చెబుతున్నారు. ఈ 11 మంది తొలి బృందం మాత్రమే. ఇంకా చాలామంది శబరిమలకు రాబోతున్నారు’అని చెప్పారు. అయ్యప్ప దర్శనానికి మహిళల్ని పోలీసులు తీసుకెళ్లేందుకు యత్నించడాన్ని బీజేపీ నేత కె.సురేంద్రన్ తప్పుపట్టారు. వీరి వెనుక ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ఈ ఘటనను నిరసిస్తూ బీజేపీ, హిందుత్వ సంస్థల కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. -
చిదంబరం స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, చెన్నై : కావేరీ మేనేజ్మెంట్ బోర్డు వ్యవహారంపై తమిళనాడు రగిలిపోతుండగా.. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ తంబీలకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. నేటి సీఎస్కే-కేకేఆర్ మ్యాచ్‌ను అడ్డుకుని తీరతామన్న ఆందోళనకారులు.. స్టేడియాన్ని ముట్టడించేందుకు విఫలయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో స్టేడియం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు అరెస్టుల పర్వం కొనసాగుతున్నప్పటికీ.. భారీ భద్రత వలయాన్ని చేధించుకుంటూ ఆందోళనకారులు స్టేడియం వద్దకు దూసుకొస్తున్నారు. భారీ భద్రత నడుమ సీఎస్కే-కేకేఆర్ టీమ్ సభ్యులు మైదానంకు చేరుకున్నారు. స్టేడియం దారులన్నీ తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. పాసులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే ప్రేక్షకులను లోపలికి అనుమతిస్తున్నారు. దీంతో తమిళ సంఘాలు స్టేడియం దగ్గర్లోని కూడలిలో ఆందోళన చేపట్టాయి. ప్రస్తుతం మైదానం వద్ద చోటుచేసుకున్న పరిస్థితులపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ మ్యాచ్‌లను నిర్వహించేందుకు చెన్నై పోలీసులు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.(ఐపీఎల్ మ్యాచ్‌లు.. రాజకీయాలొద్దు) -
నిర్మల్‌లో ఉద్రిక్తత
నిర్మల్/నిర్మల్‌టౌన్ : నిర్మల్‌లో ఆదివారం జరిగిన శ్రీరామ రథయాత్ర సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. యాత్ర ముగింపు సమయంలో స్థానిక పెద్దమార్కెట్ ప్రాంతంలో ఓ వర్గంవారు తమ ప్రార్థన మందిరంపై మరో వర్గానికి చెందినవారు రాళ్లు రువ్వారంటూ ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఇరు వర్గాలకు చెందిన వందలాది మంది రాళ్లు రువ్వుకున్నారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా ఏఎస్పీ దక్షిణామూర్తి, క్యూఆర్టీ కానిస్టేబుల్‌కు రాళ్లు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు లాఠీచార్జీ, బాష్పవాయు ప్రయోగం చేయడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. జిల్లా ఇన్చార్జి ఎస్పీ విష్ణు ఎస్. వారియర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సంఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించాలని, శాంతియుతంగా ఉండాలని కోరారు. -
అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
-
అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినం నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ జెండా ఎగరేసేందుకు బీజేపీ ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి యత్నించారు. అందులోభాగంగా ఆయన వాహనంలో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే కిషన్‌రెడ్డి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు... కిషన్‌రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
గుంటూరు అర్బన్ బ్యాంక్ వద్ద ఉద్రిక్తత
గుంటూరు : గుంటూరు అర్బన్ బ్యాంక్ చైర్మన్ పదవికి తెలుగుదేశం, బీజేపీ నేతలు పోటాపోటీగా నామినేషన్లు వేసేందుకు తరలిరావడంతో బ్యాంక్ అవరణ వద్ద ఉద్రిక్తపరిస్థితి ఏర్పడింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు బుధవారం చివరి గడువు కావడంతో ఉదయం నుంచే రెండు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా బ్యాంకు వద్దకు చేరుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అర్బన్ బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్ పదవులకు టీడీపీ అభ్యర్థులుగా శ్రీనివాసయాదవ్, జగ్గంపూడి శ్రీనివాస్ నామినేషన్లు వేసేందుకు తరలి వచ్చారు. అలాగే బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ అనుచరులు ప్రస్తుత చైర్మన్, వైస్‌చైర్మన్ కొత్తమాక శ్రీనివాస్, రత్నబాబు కూడా తమ అనుచరులతో నామినేషన్ వేసేందుకు వచ్చారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు డి.నరేంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితర టీడీపీ నేతలు రాజీ కుదిర్చేందుకు చర్చలు జరుపుతున్నారు. దాంతో ఇరు పార్టీల నేతలకు చెందిన అనుచరులు, పార్టీల కార్యకర్తలతో అర్బన్ బ్యాంక్ ఆవరణ సందడిగా మారింది. -
గూడెపువలసలో ఉద్రిక్తత
విజయనగరం : విజయనగరం జిల్లా భోగాపురం మండలం గూడెపువలస గ్రామంలో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎయిర్పోర్ట్ భూసేకరణ కోసం సర్వేయర్లు గ్రామంలో ప్రవేశించారు. ఆ విషయాన్ని గమనించి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆ క్రమంలో సర్వేయర్లతో వారు వాగ్వాదానికి దిగారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని... గ్రామస్తులను సముదాయించేందుకు యత్నించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు... పోలీసులతో వాగ్వాదానికి దిగారు. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇద్దరు న్యాయవాదులతోపాటు నలుగురు గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
ఆంధ్రా - కర్ణాటక సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత
-
ఆంధ్రా - కర్ణాటక సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత
అనంతపురం : స్వర్ణముఖి నదిపై నిర్మించిన గోడ వివాదం నేపథ్యంలో ఆంధ్రా - కర్ణాటక సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత ఆదివారం కూడ కొనసాగుతోంది. దీంతో సరిహద్దు ప్రాంతంలో ఇరు రాష్ట్రాల పోలీసులు బలగాలు భారీగా మోహరించారు. నదిపై నిర్మించిన గోడను తొలగిస్తే ఆగలి చెరువుకు నీరు రాదని ఆంధ్రప్రదేశ్ రైతులు ఆరోపిస్తున్నారు. ఈ గోడ తొలగిస్తామని ఇప్పటికే కర్ణాటక రైతు సంఘాలు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. సదరు రైతు సంఘాలు ఇచ్చిన పిలుపును ఆంధ్రప్రదేశ్ రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందులోభాగంగా రైతులు నదిపై నిర్మించిన గోడ వద్దకు చేరుకుంటున్నారు. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
పాత గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు
గుంటూరు : గుంటూరు నగరంలోని పాత గుంటూరు ప్రాంతంలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక యాదవుల బజారులోని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగారావు విగ్రహాన్ని గత అర్ధరాత్రి ఆగంతకులు ధ్వంసం చేశారు. ఆ విషయాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి... వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు రహదారిపై బైఠాయించారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు యాదవ బజారుకు చేరుకున్నారు. -
కాల్పులతో సరిహద్దు గ్రామాల్లో ఉద్రిక్తత
-
గుంటూరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తం
-
గుంటూరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తం
గుంటూరు : గుంటూరు నగరంలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించేందుకు వచ్చిన మంత్రులను కలిసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాన్ని పోలీసు అడ్డుకున్నారు. దాంతో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో నవజాత శిశువును ఎలుకలు కొరికాయి. దాంతో తీవ్ర గాయాలపాలైన శిశువు మరణించింది. స ఈ నేపథ్యంలో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, నారాయణ, ఎంపీ గల్లా జయదేవ్‌లు ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ విషయం తెలిసిన వైఎస్ఆర్ సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, వంగవీటి రాధ, మేరుగ నాగార్జునలు ఆసుపత్రికి చేరుకుని... ఆసుపత్రి దుస్థితి వివరించేందుకు ప్రయత్నించారు. అనుమతి లేదంటూ వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు, వైఎస్ఆర్ సీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
భారీ బడ్జెట్ సినిమాలు హిట్ కొడుతున్నాయా..?
-
కళ్ళు చెదిరే బడ్జెట్
-
శవయాత్రలో డిష్యుం డిష్యుం... గాలిలో కాల్పులు
టీనగర్: అంతిమయాత్రలో జరిగిన ఘర్షణకు సంబంధించి నలభై మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీ సులు గాలిలోకి కాల్పులు జరిపారు. 40 మందిపై కేసు నమోదు చేశారు. ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడకుండా భారీ పోలీసు భద్రత కల్పించారు. ఈ ఘటన తేనిలో చోటుచేసుకుంది. తేని జిల్లా ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమిళన్ (37). అవివాహితుడైన ఆయన బెంగళూరులో లా కోర్సు చదివారు. పరీక్షలు రాసేందుకు బెంగళూరుకు వెళ్లిన తమిళన్ తాను బసచేసిన గదిలో గుండెపోటుతో మృతిచెందారు. ఆయన మృతదేహానికి అంత్యక్రియలు జరిపేందుకు తేనికి తీసుకొచ్చారు. శనివారం మధ్యాహ్నం ఆయన మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఆ సమయంలో ఊరేగింపుగా వెళ్లిన వారికి, మరో వర్గానికి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆ ప్రాంతం యుద్ధవాతావరణాన్ని తలపించింది. బొమ్మయ్గౌండన్పట్టికి చెందిన రామర్ (45) ట్రాక్టర్ నుంచి పడి తీవ్రంగా గాయపడి అతను మృతిచెందాడు. ఘర్షణలో అల్లినగరం, పల్లివోడై వీధికి చెందిన మలైసామి (35) మృతిచెందాడు. విషయం తెలిసి జిల్లా ఎస్పీ మహేష్, పోలీసులను అక్కడికి చేరుకున్నారు. రాళ్లదాడికి పాల్పడిన వ్యక్తులపై లాఠీచార్జి జరిపి వారిని చెదరగొట్టారు. ఆ తర్వాత అల్లినగరంలోను ఊరేగింపు జరుగుతుండగా రాళ్లదాడి జరిగింది. అక్కడ తెరచివున్న దుకాణాలపై కొందరు రాళ్లు రువ్వారు. ప్రభుత్వ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. రాళ్ల దాడిలో ఎస్పీ మహేష్ సహా తొమ్మిది మంది గాయపడ్డారు. శవయాత్ర రత్నానగర్ చేరుకుంటుండగా అక్కడ ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఆ సమయంలో జరిగిన రాళ ్లదాడిలో డీఎస్పీ శీనిసామి, ఇన్స్పెక్టర్ ఆరుముగం, సాయుధపోలీసు రమేష్ గాయపడ్డారు. అప్పటికీ సద్దుమణగక పోవడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. దక్షిణ డివిజన్ ఐజీ అభయ్‌కుమార్, దిండుగల్ సర్కిల్ డీఐజీ అరివుసెల్వం, జిల్లా ఎస్పీ శరణన్ తేనికి చేరుకున్నారు. తేనీలో దుకాణాలను బంద్ చేశారు. ఆ ప్రాంతంలో భారీ పోలీసు భద్రత ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా 40 మందిపై కేసు నమోదు చేశారు. -
కప్పట్రాళ్ళ కేసు : 21 మందికి జీవిత ఖైదు
-
కప్పట్రాళ్లలో టెన్షన్ టెన్షన్
-
కప్పట్రాళ్లలో టెన్షన్ టెన్షన్
కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో ఆదోని కోర్టు బుధవారం తుదితీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో కప్పట్రాళ్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అంతేకాకుండా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా... ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా పోలీసులను మోహరించారు. 2008, మే 17నే కప్పట్రాళ్ల నుంచి కోడుమూరుకు వెంకటప్పనాయుడు ఆయన అనుచరులు వాహనంలో బయలుదేరారు. కాగా వారి కోసం ముందుగానే దేవనకొండ మండలం మాచాపురం వద్ద ఆయన ప్రత్యర్థులు కాపుకాచి కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి వాహనాన్ని లారీతో ఢీ కొట్టారు. అనంతరం ప్రత్యర్థులు బాంబులతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో కప్పట్రాళ్లతోపాటు ఆయన అనుచరులు పది మంది మరణిచారు. దీంతో కప్పట్రాళ్ల వెంకటపనాయుడి కుమారుడు ప్రత్యర్థి వర్గంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఈ హత్య కేసులో 48 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల నివేదిక ఆధారంగా ఈ హత్య కేసును పత్తికొండ మేజిస్ట్రేట్ కోర్టు విచారణకు తీసుకుంది. నిందితుల భద్రత దృష్ట్యా ఈ కేసును ఆదోని జిల్లా సెషన్స్ కోర్టుకు మార్చారు. ఈ కేసులో తుది తీర్పు ఈ రోజు వెలువడనుంది. దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామ సర్పంచ్‌గా కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు 27 ఏళ్ల వయస్సులోనే ఎన్నికయ్యారు. -
ఇస్లామాబాద్‌లో పరిస్థితి ఉద్రిక్తం
కరాచీ: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ఆ దేశంలో రోజురోజూకు తీవ్రమవుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఇస్లామాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలు మిన్నంటాయి. ఈ ఆందోళనలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ప్రధాని నవాజ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లతో ఇస్లామాబాద్ మారుమోగుపోతుంది. దాంతో ఇస్లామాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇస్లామాబాద్‌లో అత్యవసర పరిస్థితిని ప్రభుత్వం ప్రకటించింది. -
మునిసిపల్ కార్యాలయం ఎదుట కాటసాని ధర్నా
కర్నూలు జిల్లా బనగానపల్లెలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నివాసాలను కూల్చివేయాలంటూ టీడీపీ నేతలు మునిసిపల్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దాంతో మునిసిపల్ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నివాసాలు కూల్చివేసేందుకు రంగం సిద్దం చేశారు. ఆ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బనగానపల్లె మునిసిపల్ కార్యాలయానికి చేరుకుని.... తమ పార్టీ కార్యకర్తల నివాసాలు కూల్చివేయాలన్న ఆలోచన విరమించుకోవాలని సూచించారు. అందుకు మునిసిపల్ అధికారులు ససేమిరా అనడంతో కాటసాని రామిరెడ్డి మునిసిపల్ కార్యాలయం ఎదుటు ఆందోళనకు దిగారు. ఆందోళనలో వైఎస్ఆర్ సీపీ కాంగ్రెస్ కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరైయ్యారు. -
హఫీజ్‌పేటలో ఉద్రిక్తత
హైదరాబాద్ నగరంలోని హఫీజ్‌పేటలో బుధవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. దాంతో అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు... కూల్చివేస్తున్న నిర్మాణాలకు అడ్డంగా నిల్చున్నారు. ఆ క్రమంలో అధికారులు, స్థానికుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అయితే స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకోంది. అయితే హఫీజ్రపేటలో భారీగా పోలీసులు మోహరించారు. -
శ్రీకాకుళంలో 'కిమ్స్' వద్ద ఉద్రిక్తత
శ్రీకాకుళంలోని కిమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టౌన్‌ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధంగా కిమ్స్ ఆసుపత్రి సెల్లార్ నిర్మాణం జరిగిందని ఆరోపిస్తూ మున్సిపల్ సిబ్బంది బుధవారం ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆ క్రమంలో సెల్లార్ నిర్మాణం కూల్చివేసేందుకు మున్సిపల్ సిబ్బంది సమయాత్తమైయ్యారు. మున్సిపల్ సిబ్బంది చర్యలను ఆసుపత్రి సిబ్బంది ప్రతిఘటించారు. దాంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ సంఖ్యలో కిమ్స్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
ఏపీ భవన్లో ఉద్రిక్తత
తెలంగాణ, సమైక్య నినాదాలతో ఏపీ భవన్ బుధవారం దద్దరిల్లింది. తెలంగాణ బిల్లును అడ్డుకోవదంటూ ఆ ప్రాంత వాదులు సీఎంకు వ్యతిరేకంగా, తెలంగాణకు అనుకూలంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అక్కడే ఉన్న సమైక్య వాదులు సమైక్య రాష్ట్రానికి మద్దతుగా నినాదాలు చేశారు. దాంతో ఇరుప్రాంతవాసుల నినాదాలతో ఏపీ భవన్ పరిసర ప్రాంతాలు దిక్కులు పెక్కుటిల్లాయి. ఏపీ భవన్లో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. అయితే అదే సమయంలో ఏపీ భవన్లో ఉన్న సీఎం కిరణ్ క్వాన్నాయ్లో బయటకు బయలుదేరారు. దాంతో అక్కడే ఉన్న తెలంగాణవాదులు ఒక్కసారిగా సీఎం కాన్వాయ్‌లోకి దూసుకెళ్లారు. తెలంగాణ వాదుల ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఏపీ భవన్‌తో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరు ప్రాంతాల వారిని శాంతింప చేశారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. -
ప్రత్తికోళ్లలంకలో తీవ్ర ఉద్రిక్తత
ఏలూరు రూరల్ మండలంలోని ప్రత్తికొళ్లలంక గ్రామంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాంతో గ్రామంలో పోలీసులు పికిటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇరు వర్గీయులపై ఇప్పటివరకు 11 కేసులు నమోదు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. గ్రామంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు గట్టి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.