ఏపీ భవన్లో ఉద్రిక్తత | High tensions at Andhra Bhavan | Sakshi
Sakshi News home page

ఏపీ భవన్లో ఉద్రిక్తత

Published Wed, Feb 5 2014 12:19 PM | Last Updated on Sat, Aug 18 2018 4:35 PM

High tensions at Andhra Bhavan

తెలంగాణ, సమైక్య నినాదాలతో ఏపీ భవన్ బుధవారం దద్దరిల్లింది. తెలంగాణ బిల్లును అడ్డుకోవదంటూ ఆ ప్రాంత వాదులు సీఎంకు వ్యతిరేకంగా, తెలంగాణకు అనుకూలంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అక్కడే ఉన్న సమైక్య వాదులు సమైక్య రాష్ట్రానికి మద్దతుగా నినాదాలు చేశారు. దాంతో ఇరుప్రాంతవాసుల నినాదాలతో ఏపీ భవన్ పరిసర ప్రాంతాలు దిక్కులు పెక్కుటిల్లాయి. 

 

ఏపీ భవన్లో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. అయితే అదే సమయంలో ఏపీ భవన్లో ఉన్న సీఎం కిరణ్ క్వాన్నాయ్లో బయటకు బయలుదేరారు. దాంతో అక్కడే ఉన్న తెలంగాణవాదులు ఒక్కసారిగా సీఎం కాన్వాయ్లోకి దూసుకెళ్లారు. తెలంగాణ వాదుల ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఏపీ భవన్తో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరు ప్రాంతాల వారిని శాంతింప చేశారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement