పాత గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు | High tensions in old guntur | Sakshi
Sakshi News home page

పాత గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు

Published Tue, Sep 29 2015 9:06 AM | Last Updated on Sun, Sep 3 2017 10:11 AM

High tensions in old guntur

గుంటూరు : గుంటూరు నగరంలోని పాత గుంటూరు ప్రాంతంలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక యాదవుల బజారులోని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు వంగవీటి మోహనరంగారావు విగ్రహాన్ని గత అర్ధరాత్రి ఆగంతకులు ధ్వంసం చేశారు. ఆ విషయాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు.

రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి... వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు రహదారిపై బైఠాయించారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు యాదవ బజారుకు చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement