కొలంబో: ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక ప్రజలు ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. ఏకంగా ప్రధాని మహింద్ర రాజపక్సే ఇంటిని ముట్టడించారు. పోలీసులు వారిని నిలువరించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బారికేడ్లు విరగొట్టి ప్రధాని ఇంటి వైపునకు ఆందోళనకారులు దూసుకెళ్లారు. ఈక్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక ఆర్మీ రంగంలోకి దిగింది. ప్రధాని ఇంటివద్దకు భారీ ఎత్తున పోలీసులు, ఆర్మీ బలగాలు చేరుకున్నాయి.
ఇక ఆందోళనకారులు ప్రవేశించిన చోట విద్యుత్ నిలిపేసిన పోలీసులు వారికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోవాలని లేదంటే పరిస్థితులు చేయిదాటిపోతాయని వార్నింగ్ ఇచ్చారు. ప్రధాని ఇంటి వద్ద లెవల్-2 సెక్యురిటీ లైన్ దాటితే టియర్ గ్యాస్ ప్రయోగించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మూడో లెవల్ సెక్యురిటీ లైన్ దాటితే కాల్పులు జరిపే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో మీడియా సిబ్బందిని పోలీసులు అక్కడ నుంచి దూరంగా పంపించివేశారు.
(చదవండి: భారత్, మోదీపై లంక క్రికెటర్ సనత్ జయసూర్య ఆసక్తికర కామెంట్స్)
Comments
Please login to add a commentAdd a comment