సాక్షి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో గురువారం తీవ్ర ఉద్రికత వాతావరణం నెలకొంది. భూవివాదంలో ఓ వ్యక్తిని ట్రాక్టర్‌తో ఢీకొట్టించి హత్య చేశారు. ఈ ఉదంతంలో నిందితుడిని తమకు అప్పగించాలంటూ మృతుడి బంధువులు స్టేషన్ ఎదుట గొడవకు దిగారు. దీంతో రుద్రంగి పోలీస్‌స్టేషన్ హైటెన్షన్ నెలకొంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ట్రాక్టర్ ఢీకొని నేవూరి నరసయ్య (42 ) అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే బైక్‌పై వెళ్తున్న నరసయ్యను.. కిషన్ అనే వ్యక్తి ట్రాక్టర్తో కావాలనే ఢీకొట్టి హతమార్చాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇద్దరి మధ్య గత కొద్ది రోజులుగా భూ వివాదం ఉందని, అందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అంటున్నారు.
ఇక హత్య అనంతరం నిందితుడు రుద్రంగి పోలీసులకు లొంగిపోయాడని సమాచారం. దీంతో పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగారు మృతుడి బంధువులు. తన భర్తను అన్యాయంగా చంపేశారంటూ పీఎస్ ముందు మృతుడి భార్య బైఠాయించింది. తన తాళి కూడా తీసుకొండంటూ సీఐకి చూపించిందామె. ఈ క్రమంలో బంధువులు పీఎస్‌లోపలికి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకుంటున్నారు.
నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు నరసయ్య బంధవులు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో.. సమీపంలోని చందుర్తి పోలీసులను కూడా రుద్రంగికి పంపించారు ఉన్నతాధికారులు.
Comments
Please login to add a commentAdd a comment