శ్రీకాకుళంలోని కిమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
శ్రీకాకుళంలోని కిమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టౌన్ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధంగా కిమ్స్ ఆసుపత్రి సెల్లార్ నిర్మాణం జరిగిందని ఆరోపిస్తూ మున్సిపల్ సిబ్బంది బుధవారం ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆ క్రమంలో సెల్లార్ నిర్మాణం కూల్చివేసేందుకు మున్సిపల్ సిబ్బంది సమయాత్తమైయ్యారు. మున్సిపల్ సిబ్బంది చర్యలను ఆసుపత్రి సిబ్బంది ప్రతిఘటించారు. దాంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ సంఖ్యలో కిమ్స్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.