గుంటూరు నగరంలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించేందుకు వచ్చిన మంత్రులను కలిసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాన్ని పోలీసు అడ్డుకున్నారు. దాంతో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో నవజాత శిశువును ఎలుకలు కొరికాయి. దాంతో తీవ్ర గాయాలపాలైన శిశువు మరణించింది.
Published Thu, Aug 27 2015 12:28 PM | Last Updated on Wed, Mar 20 2024 3:12 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement