Post Man
-
తాతలు ఉత్తరాలు బట్వాడా చేసేవారని..
బహ్రాయిచ్ : ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి అత్యంత విచిత్రమైన రీతిలో పొట్టపోసుకుంటున్నాడు. జిల్లాకు చెందిన సురేష్ కుమార్ గత 40 ఏళ్లుగా పోస్ట్‌మ్యాన్ రూపంలో ఇంటింటికీ తిరుగుతున్నాడు. ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తూ, తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఈ వింత పంథాను ఎంచుకున్నాడు. తన తాత, ముత్తాతల కాలం నుంచి తమ కుటుంబంలోని వారు ఉత్తరాలు బట్వాడా చేసేవారని సురేష్ కుమార్ మీడియాకు తెలిపారు. పూర్వంరోజుల్లో అతని పూర్వీకులు బ్రిటీష్ వారికి ఉత్తరాలు అందజేసేవారట. ఇప్పుడు సురేష్ పోస్ట్‌మ్యాన్ గెటప్‌తో అందరినీ పలుకరిస్తున్నాడు. దీనికి ప్రతిఫలంగా వారు ఏది ఇచ్చినా తీసుకుంటూ, దానితో కుటుంబాన్ని పోషిస్తున్నాడు.సురేశ్ ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పోస్ట్‌మ్యాన్ వేషధారణతో తిరుగుతుంటాడు. ఇంటింటికీ వెళ్లి మీ పేరు మీద ఉత్తరం వచ్చిందని వారికి చెబుతుంటాడు. వారు తొలుత అతనిని పోస్ట్‌మ్యాన్‌గా భావిస్తారు. తరువాత విషయం తెలుసుకుని, ఆనందంగా తమకు తోచినంత సురేష్‌కు ముట్టజెపుతుంటారు.స్థానికులు అతనిని పోస్ట్‌మ్యాన్ అని పిలుస్తుంటారు. సురేష్ కుమార్ పోస్ట్‌మ్యాన్ యూనిఫాం ధరించి, తలపై టోపీ పెట్టుకుంటాడు. అలాగే కళ్లద్దాలు కూడా పెట్టుకుంటాడు. చేతిలో వైర్లెస్ వాకీ-టాకీ కూడా ఉంటుంది. ఒకప్పుడు ఎంతో గొప్పగా వెలుగొందిన ఈ వృత్తిని అనుకరిస్తూ సురేష్ కుమార్ పొట్టపోసుకోవడం విశేషమే మరి.ఇది కూడా చదవండి: ఆ పేరుతో సర్టిఫికెట్ మార్చి ఇస్తాం -
World Post Day 2021: జ్ఞాపకాల మూట
World Post Day 2021: నిన్న మొన్నటి వరకూ టెలిఫోన్ కలిగిన వారిదే. మధ్యతరగతిది ఉత్తరం. పేదవాడికి పోస్ట్‌కార్డ్. కనీసం ఐదు దశాబ్దాల భారతీయుల జీవన భావోద్వేగాలు లేఖలు, ఉత్తరాలు, ఇంటర్వ్యూ కార్డులు, మనీ ఆర్డర్ల చుట్టే తిరిగాయి. ఉత్తరం లేకపోతే... పోస్ట్‌మేన్ లేకపోతే ఆ జ్ఞాపకాలు ఉండేవా? అక్టోబర్ 9 ‘వరల్డ్ పోస్ట్ డే’ సందర్భంగా కొన్ని ఉద్వేగాల రీవిజిట్. ‘ఇద్దరం ఉద్యోగానికి అప్లై చేద్దాం. నా వంతు డబ్బులు నావి. ఏవీ... మీ డబ్బులు ఇవ్వండి’ అని నిస్సిగ్గుగా సావిత్రి దగ్గరి నుంచి అడిగి మరీ తీసుకుంటాడు ఎన్టీఆర్ ‘మిస్సమ్మ’లో. ఆ నిరుద్యోగ రోజులు అలాంటివి. వారి అప్లికేషన్ పోస్ట్‌లో అందుకున్న వెంటనే ఎస్.వి.రంగారావు ‘యూ ఆర్ సెలెక్టెడ్’ అని టెలిగ్రామ్ ఇమ్మంటాడు మేనల్లుడు ఏఎన్నార్‌ని. అంతేనా ఖర్చులకు 200 ఎం.ఓ కూడా చేయమంటాడు. చూడండి... ఒక్క సీనులో ఎన్ని పోస్టాఫీసు సేవలు అవసరమయ్యాయో. ఆ సేవలు లేకుంటే ఎన్టీఆర్, సావిత్రి ఉద్యోగంలో చేరేవారూ కాదు... ‘రావోయి చందమామ’ పాడేవారూ కాదు. గాంధీ గారికి ఉత్తరాలు రాయకుండా ఏ రోజూ గడవలేదు. నెహ్రూ జైలులో ఉండి తన కుమార్తె ఇందిరకు తెగ ఉత్తరాలు రాశారు. ఉత్తరం రాయడం ఒక మర్యాద. ఉత్తరం అందుకోవడం ఒక గౌరవం. ఉత్తరాలు ఒకరికొకరు రాసుకుంటూ ఉండటం స్నేహం. కాని ఉత్తరం కేవలం పెద్దవాళ్ల వ్యవహారంగా కొంతకాలమే ఉంది. పేదవాళ్లు, మధ్యతరగతి వారు ఉత్తరాలను మొదలెట్టారు. వీధి మొదలులో వేలాడదీసి ఉండే ఎర్రటి పోస్ట్ డబ్బాను గుర్తించారు. ఊళ్లో ఆ రోజుల్లో స్కూల్ మేష్టారు లేదంటే పోస్ట్మేస్టారే కదా గౌరవనీయులు. ‘పెళ్లి చేసి చూడు’లో ఏఎన్నార్ తండ్రి తెలుగు మేష్టారు రావికొండలరావు. కొడుకు పంపాల్సిన మనియార్డర్ ఏదిరా అని పోస్ట్మేన్ని దబాయిస్తాడు. ‘రాలేదు మేష్టారు’ అనంటే ‘వస్తే అందరూ ఇస్తారు. రాకపోయినా ఇవ్వడమే గొప్పదనం’ అంటాడు. 1970లు, 80లు కొడుకుల మనిఆర్డర్ల కోసం తల్లిదండ్రుల కళ్లు కాయలు కాచేలా చేశాయి. నిరుద్యోగ భారతంలో కొడుకు ఉద్యోగం సంపాదించి ఎంతో కొంత పంపితేనే జరుగుబాటైన ఇళ్లు. ఆ రోజుల్లో అకౌంట్లు ఎవరికీ ట్రాన్స్ఫర్లు ఎవరికీ ఫోన్‌పేలు ఎవరికీ? మని ఆర్డరే. పోస్ట్‌మేన్ మనీ ఆర్డర్ తెచ్చి ఇస్తే సంతోషించి ఆ ఇంటి ఇల్లాలు మజ్జిగ ఇచ్చేది. ఇంటి పెద్ద రూపాయో రెండ్రూపాయలో బక్షీసు ఇచ్చేవాడు. ఆ పూట ఆ ఇంట్లో గుండెల మీద కాకుండా వంటగదిలోనే కుంపటి వెలిగేది. సౌదీ, అమెరికా, రంగూన్... వలస వెళ్లిన వారి ఉత్తరాలు నెలల తరబడి వేచి చూస్తే తప్ప వచ్చేవి కావు. సైన్యంలో చేరిన వారి బాగోగులు ఉత్తరాలు చెప్తే తప్ప తెలిసేవి కావు. పట్నంలో చదువుకుంటున్న కొడుకు పరీక్ష ఫీజు కోసం రాసిన పోస్ట్‌కార్డు అతి బరువుగా అనిపించేది. కాపురానికి వెళ్లిన కూతురు నుంచి వచ్చిన ప్రతి ఉత్తరం ఉలికిపాటును తెచ్చేదే. ఆ కూతురు కూడా తక్కువ తిన్నదా? కష్టాలన్నీ తాను దిగమింగుతూ సంతోషంగా ఉన్నట్టు తెగ నటించదూ? ఇంటర్వూకు కాల్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, స్టడీ మెటీరియల్, కలం స్నేహం కోసం మొదలెట్టిన జాబులు, పత్రికకు పంపిన కథకు జవాబు, తకరారులో చిక్కుకుంటే వచ్చే కోర్టు నోటీసు, వ్యాపార లావాదేవీల కరెస్పాండెన్సు, అభిమాన హీరోకు లేఖ రాస్తే పంపే ఫొటో, వశీకరణ ఉంగరం... ఎన్నని. అన్నీ ఆ ఖాకీ బట్టల పోస్ట్‌మేన్ చేతుల మీదుగా అందేవి. తెలిసేవి. సంతోషపెట్టేవి. బాధించేవి. గెలిపించేవి. ఓడించేవి. ఇక కథల్లో, నవలల్లో, సినిమాల్లో ఉత్తరాలు సృష్టించిన ‘డ్రామా’ అంతా ఇంతా కాదు. ‘పోస్ట్ అన్న కేకతో పడక్కుర్చీలోని పరంధామయ్యగారు ఉలిక్కిపడ్డారు’ అనే లైనుతో ఎన్నో కథలు మొదలయ్యేవి. ఉత్తరాలు అందక ఏర్పడిన అపార్థాలు, ఒకరి ఉత్తరం ఇంకొకరికి చేరి చేసే హంగామాలు, ఒకరి పేరుతో మరొకరు రాసే ప్రేమ లేఖలు.. వీటిలో పోస్ట్మేన్లది ఏ పాపమూ ఉండదు. కాని వారికి తెలియకనే వ్యవహారమంతా వారి చేతుల మీదుగా నడుస్తుంటుంది. ఉత్తరాలు బట్వాడా చేయాల్సింది వారే కదా. కొందరు పోస్ట్‌బాక్స్ నంబర్ తీసుకుని ఆ నంబర్ మీదే సవాలక్ష వ్యవహారాలు నడిపేవారు. బుక్పోస్ట్ను ఉపయోగించి పుస్తకాలు పంపని కవులు, రచయితలు లేరు. రిజిస్టర్డ్ పోస్ట్ విత్ డ్యూ అక్నాలెడ్జ్మెంట్ అయితే ఆ ధీమా వేరు. ‘టెలిగ్రామ్’కు పాజిటివ్ ఇమేజ్ లేదు. అది వచ్చిందంటే ఏదో కొంపలు మునిగే వ్యవహారమే. సంతవ్సరం పొడుగూతా సేవ చేసే పోస్ట్‌మేన్ మహా అయితే అడిగితే దసరా మామూలు. అది కూడా ఇవ్వక వారిని చిన్నబుచ్చేవారు కొందరు. చాలీ చాలని జీతంతో, ఎండనక వాననక సైకిల్ తొక్కుతూ ఇల్లిల్లు తిరిగి క్షేమ సమాచారాలు ఇచ్చి ఊరడింప చేసే ఆత్మీయుడు పోస్ట్‌మేన్ మధ్యతరగతి భారతదేశంలో కనిపించని పాత్ర పోషించాడు. ఇవాళ కథే మారిపోయి ఉండవచ్చు. ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో ఒక పోస్టాఫీసు, బ్యాంకు, టెలిగ్రామ్ ఆఫీసు ఉండొచ్చు. కాని ఆ రోజుల్లో ఉండే మానవీయ అంశ ఈ కృత్రిమ మెషీన్లో ఎక్కడిది. చేతిరాతతో అందుకునే ఉత్తరం జాడ ఎక్కడిది. ఆ చెరగని గుర్తు ఎక్కడిది. దాచుకున్న ఉత్తరాలు జ్ఞాపకాల మూటగా మారడం ఇవాళ ఎవరికి తెలుసు. ఆ కాలానికి ధన్యవాదాలు. థ్యాంక్యూ పోస్ట్‌మేన్. ‘‘ఇప్పుడు ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో ఒక పోస్టాఫీసు, బ్యాంకు, టెలిగ్రామ్ ఆఫీసు ఉండొచ్చు. కాని ఆ రోజుల్లో ఉండే మానవీయ అంశ ఈ కృత్రిమ మెషీన్లో ఎక్కడిది. దాచుకున్న ఉత్తరాలు జ్ఞాపకాల మూటగా మారడం ఇవాళ ఎవరికి తెలుసు.’’ -
ఇంటి వద్దే ఆధార్ మొబైల్ నెంబరు అప్డేట్ సేవలు
ఆధార్ కార్డుదారులకు శుభవార్త. ఇక నుంచి ఆధార్ హోల్డర్ తన ఇంటి వద్దనే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ ను అప్డేట్ చేసుకోవచ్చు. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఎఐ) ఆధార్ లో మొబైల్ నంబర్ ను అప్డేట్ చేయడానికి కొత్త సేవలను ప్రారంభించినట్లు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబి) నేడు(జూలై 20) ప్రకటించింది. ఆధార్ హోల్డర్ ఇంటి వద్దే మొబైల్ నంబర్ ను పోస్ట్ మాన్ ఆధార్ లో అప్డేట్ చేయనున్నట్లు ఐపిపీబి ఒక ప్రకటనలో తెలిపింది. దేశ వ్యాప్తంగా ఉన్న 650 ఐపిపీబి బ్రాంచీలు, 1,46,000 పోస్ట్ మెన్ లు, గ్రామీణ్ డాక్ సేవక్ ల ద్వారా ఈ సేవలు అందనున్నాయి. ప్రస్తుతం, ఐపీపీబి మొబైల్ అప్డేట్ సేవలను మాత్రమే అందిస్తోంది. అతి త్వరలోనే ఐపీపీబి నెట్ వర్క్ ద్వారా పిల్లల నమోదు సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్డేట్ తో పాటు, పోస్ట్ మెన్ లు, గ్రామీణ్ డాక్ సేవకులు అనేక బ్యాంకింగ్ సేవలను అందిస్తారు. "ఆధార్ సంబంధిత సేవలను సులభతరం చేయడానికి యుఐడీఎఐ తన నిరంతర ప్రయత్నంలో భాగంగా పోస్ట్ మాన్, గ్రామీణ్ డాక్ సేవకుల ద్వారా నివాసితుల ఇంటి వద్దే మొబైల్ అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది. అనేక యుఐడీఎఐ ఆన్ లైన్ అప్ డేట్ సదుపాయాలతో పాటు అనేక ప్రభుత్వ సంక్షేమ సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు" అని యుఐడీఎఐ సిఈఓ సౌరభ్ గార్గ్ తెలిపారు. Now a resident Aadhaar holder can get his mobile number updated in Aadhaar by the postman at his door step. 👉👉@IPPBOnline launched today a service for updating mobile number in Aadhaar as a Registrar for @UIDAI . pic.twitter.com/TGjiGhHPeG — PIB_INDIA Ministry of Communications (@pib_comm) July 20, 2021 -
ఇంటికే డబ్బులు తెచ్చిస్తారు
వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు శుభవార్త. ఇకపై వీరంతా నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ కట్టాల్సిన పని లేదు. బ్యాంక్ పాస్‌బుక్, విత్ డ్రా ఫామ్, ఏటీఎం కార్డులూ అవసరం లేవు. ఇంట్లో ఉండే నగదు డ్రా చేసుకోవచ్చు. ఎలాగంటారా?.. మీ మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ ద్వారా పోస్టల్ టోల్ ఫ్రీ నంబర్ 155299కు ఫోన్ చేసి రిక్వెస్ట్ పంపితే చాలు. మీ ఏరియా పోస్ట్‌మేన్ ‘మొబైల్ మైక్రో ఏటీఎం’తో మీ ఇంటికే వస్తారు. ఆయన అడిగిన వివరాలు అందిస్తే చాలు.. అవసరమైన మొత్తాన్ని కనీసం రూ.100 నుంచి రూ.10 వేల వరకు పొందవచ్చు. బ్యాలెన్స్, లావాదేవీల వివరాలూ తెలుసుకోవచ్చు. ఈ సేవలన్నీ ఉచితమే.. సాక్షి, సిటీబ్యూరో : పోస్టల్ శాఖ ఉత్తరాలు, మనీ ఆర్డర్ల బట్వాడాకే పరిమితం కాకుండా.. మార్పులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నీ అందిపుచ్చుకొంటోంది. ఈ క్రమంలోనే బ్యాంకింగ్ సేవలకు శ్రీకారం చుట్టింది. గతేడాది ‘ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్’ పేరుతో బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించిన తపాలా శాఖ పోస్టాఫీసులతో పాటు ఇంటి వద్దకు కూడా సేవలను అందిస్తోంది. ఇప్పటి వరకు పోస్టాఫీస్‌కు వెళ్లలేని మహిళలు, వృద్ధులు, దివ్యాంగులైన ఐపీపీబీ ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలందిస్తూ వచ్చిన తపాలా శాఖ ఇటీవల వివిధ బ్యాంక్‌ల ఖాతాదారులకు సైతం ఇంటి వద్ద బ్యాంకింగ్ సేవలందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. హెడ్, సబ్ పోస్టాఫీసుల ద్వారా కేవలం ఆధార్ నంబర్ ఆధారంగా ‘ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్’ ద్వారా ఏ బ్యాంక్‌లో ఖాతా ఉన్నా నగదు విత్ డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించిన తపాలా శాఖ తాజాగా ఇంటి ముంగిటకు ఆధార్ ఏటీఎం పేరుతో సేవలను విస్తరించింది. మొబైల్ మైక్రో ఏటీఎంలు తపాలా శాఖ హైదరాబాద్ నగర పరిధిలోని 950 మంది పోస్ట్మేన్లకు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ విధానంపై శిక్షణనిచ్చింది. మొబైల్ ఫోన్లలో మైక్రో ఏటీఎం యాప్‌లను డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్లను సైతం అందజేసింది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉత్తరాలు బట్వాడా చేసే వీరంతా అవసరమైన వారికి ఆధార్ ఏటీఎంల ద్వారా సేవలందిస్తున్నారు. ఆధార్ ఏటీఎం సేవలు ఇలా.. - 155299 నంబర్‌కు రిక్వెస్ట్ పంపగానే, ఆ ఏరియా పోస్ట్‌మేన్ ‘మొబైల్ మైక్రో ఏటీఎం’తో మీ ఇంటి వద్దకు వస్తారు. - పోస్ట్‌మేన్ మీ పేరు, మొబైల్ నంబరు తీసుకుని ఎంటర్ చేయగానే, మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయగానే ఆధార్ నంబర్ అడుగుతుంది. - అది నమోదు చేయగానే కావల్సిన నగదు, బ్యాంక్ పేరు అడుగుతుంది. నగదు మొత్తం ఎంటర్ చేసి, ఖాతా కలిగిన బ్యాంక్ పేరును ఎంపిక చేసుకోవాలి (ఆధార్‌తో ఆ బ్యాంక్ ఖాతా అనుసంధానమై ఉండాలి). - ఆపై బయోమెట్రిక్ అందిస్తే.. అది ఆమోదం కాగానే నగదు విత్ డ్రా, మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్ విచారణ, ఫుల్ మనీ ఆప్షన్లు వస్తాయి. - ఉదాహరణకు నగదు విత్ డ్రా ఆప్షన్ ఎంచుకుంటే.. నగదు మొత్తం ధ్రువీకరణ కోసం మరోమారు బయోమెట్రిక్ అందించాలి. - ఈ ప్రక్రియ పూర్తి కాగానే, పోస్ట్‌మేన్ ఆ నగదు అందజేస్తారు. ఏరియా పోస్ట్మేన్లను అడిగితే చెబుతారు ఏరియా పోస్ట్మేన్లను సంప్రందించి ఇంటి ముంగిటే ఆధార్ ఏటీఎంల సేవలు పొందవచ్చు. బ్యాంక్, ఏటీఎంలకు వెళ్లలేని వృద్ధులు, మహిళలు, వికలాంగులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకోసం ఎలాంటి సర్వీస్ చార్జీ ఉండదు. టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే మీ ఏరియా పోస్ట్‌మేన్ అందుబాటులోకి వస్తారు. – జయరాజ్, చీఫ్ పోస్ట్‌మాస్టర్, జనరల్ పోస్టాఫీసు, హైదరాబాద్ -
ప్రాంతీయ భాషల్లో మళ్లీ ‘పోస్ట్‌మెన్’ పరీక్ష
న్యూఢిల్లీ: తమిళ పార్టీల ఆందోళనకు కేంద్రం దిగి వచ్చింది. ఈ నెల 14న నిర్వహించిన పోస్ట్‌మెన్ పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించింది, ప్రాంతీయ భాషల్లో మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని కేంద్రప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో ప్రకటించింది. హిందీ, ఇంగ్లిష్‌లో మాత్రమే పోస్టల్ శాఖ నిర్వహించిన పరీక్షను రద్దు చేయాలని రాజ్యసభలో ఏఐడీఎంకే నాయకత్వంలో చేపట్టిన నిరసనలో డీఎంకే, సీపీఐ, సీపీఎం పాల్గొన్నాయి. సభ్యుల ఆందోళనతో లంచ్ విరామానికి ముందు సభ మూడుసార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభమైనా సభ్యులు ఆందోళన కొనసాగించడంతో మరోసారి అర్ధగంట వాయిదాపడింది. పోస్టుమెన్, సహాయకుల కోసం పోస్టల్ శాఖ గత ఆదివారం నిర్వహించిన పరీక్షను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు న్యాయ, సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. తమిళంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. త్రిభాషా సూత్రానికి అనుగుణంగా అన్ని ప్రభుత్వశాఖల పరీక్షలు, ఇంటర్వ్యూలను నిర్వహించాలని సభలో కాంగ్రెస్ పక్ష ఉపనాయకుడు ఆనంద్‌శర్మ డిమాండ్ చేశారు. కేంద్రం తాజా నిర్ణయాన్ని అన్నాడీఎంకే, డీఎంకే, సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ పార్టీలు స్వాగతించాయి. -
పోస్టుకార్డుకు 141 ఏళ్లు
ఇంటి ముందు నుంచి పోస్ట్ అని గట్టిగా పిలుపు వినపడగానే ఏదో ఉత్తరం వచ్చిందనుకునే పరుగెత్తే దృశ్యాలు పాతకాలంలో కనిపించేవి. ఆ చిన్ని ఉత్తరం రాగానే ఇంటిల్లిపాది ఒకచోట చేరి దానిని చదివి ఎంతో ఆనందించేవారు. అదే పోస్టుకార్డు. చిన్నగా ఉండే ఆ పోస్టు కార్డు ఎన్నో పెద్దపెద్ద విషయాలను మోసుకొచ్చేది. ఆ చిట్టి పోస్టుకార్డే కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచేది. మనుషుల మధ్య బలమైన సంబంధాలను ఏర్పర్చేది. అంతటి ఘన కీర్తి కలిగిన ఆ పోస్టుకార్డుకు ప్రస్తుతం ఆదరణ లేదు. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఆ పోస్టుకార్డుకు స్థానం లేదు. తమ భావాలను పంచుకునేందుకు, విషయాలను వివరించేందుకు ఆ పోస్టుకార్డు ఉనికి లేదు. సర్వం మొబైల్ మయం. నేడు పోస్టుకార్డు దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం సాక్షి, పాల్వంచరూరల్(ఖమ్మం) : నాడు ఎంతో ఆదరణ పొందిన పోస్టుకార్డుకు మారుతున్న ఆధునిక సమాజంలో ఆదరణ కరువైంది. సాంకేతిక విప్లవంతో అధునాతమైన మొబైళ్లు అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్ యుగం రాకెట్ స్పీడుతో దూసుకుపోతుండటంతో 14 దశాబ్దాల ఘనమైన చరిత్ర కలిగిన, మంచిచెడుల సమాచారాన్ని చేరవేసే తోకలేని పిట్ట పోస్టుకార్డు నిరాదరణకు గురై కనుమరుగు అయ్యే పరిస్థితి నెలకొంది. భారతదేశంలో నాడు పాలించిన అంగ్లేయుల పాలనలో ఈస్ట్ ఇండియా కంపెనీ తయారు చేసినట్లు చెబుతున్న పోస్టుకార్డు 1879 జూలై 1న ఆవిర్భవించింది. నాడు ఈ కార్డును అణాపైసకు విక్రయించేవారు. అన్ని వర్గాల ప్రజలు ఈ పోస్టుకార్డును వినియోగించుకునేవారు. సూదూర ప్రాంతాల్లోని బంధువుల యోగ క్షేమాల సమాచారం కార్డు ద్వారానే తెలుసుకునే అవకాశం ఉండేది. గతంలో ప్రభుత్వాలు కూడా పోస్టు కార్డు మీద ప్రభుత్వ సంక్షేమ పథకాలను ముద్రించి ప్రచారం చేసేవి. కానీ, గతంతో పరీశీలించి చూస్తే ప్రస్తుతం కార్డు ప్రభావం గణనీయంగా తగ్గింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల ప్రవేశంతో పోస్టుకార్డు నేడు ఉనికిని కోల్పోయే దశకు చేరింది. ప్రజలకు ఈ కార్డు ఆవసరం లేకుండా పోయింది. తొలి తెలంగాణ ఉద్యమంలో పోస్టుకార్డు కూడా కీలక భూమిక పోషించిందని నాటి స్వాతంత్య్ర సమరయోధులు అంటున్నారు. మలి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర అవశ్యకతను వివరించడానికి రాష్ట్రపతికి, ప్రధాన మంత్రులకు పోస్టుకార్డు ద్వారా లేఖలు రాశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటనను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందు నియమించిన శ్రీకృష్ణ కమిటీకి కూడా ప్రజలు పోస్టుకార్డు ద్వారా అభిప్రాయాలు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. సామాజిక మాధ్యమాల ప్రభావంతో పోస్టుకార్డుల వినియోగాన్ని ప్రజలు మరిచిపోయారు. దీంతో ప్రస్తుతం అర్ధ రూపాయి ధర కలిగిన పోస్టుకార్డును పోస్టు ఆఫీస్‌లోకి వెళ్లి కొనుగోలు చేసే దిక్కులేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. కనుమరుగవుతున్న పోస్టుకార్డుకు భవిష్యత్లోలైనా పూర్వవైభవం రావాలని అశిద్దాం. అదరణలేక పోవడం బాధాకరం మారుతున్న కాలంలో పోస్టుకార్డులకు ఆదరణ లేకపోవడం బాధాకరంగా ఉంది. నాకు ఉద్యోగం రాకముందు గొళ్లపూడిలో 1983 నుంచి 87 వరకు పోస్టుమాస్టర్‌గా పనిచేశాను. సంక్రాంతి పండగ, రాఖీ, నూతన సంవత్సరం వచ్చిందంటే చాలు భారీగా పోస్టుకార్డులు వచ్చేవి. వాటిని పంపిణీ చేయించడానికి రెండురోజులు పట్టేది. పోటీ పడి వాటిని తీసుకునేవారు. అంతటి ఆదరణ కలిగిన పోస్టుకార్డులు నేడు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. -రామశాస్త్రి, ఈఓఆర్డీ, పాల్వంచ నేటి ప్రజలు మరిచిపోయారు.. తక్కువ ఖర్చుతో పోస్టుకార్డు ద్వారా ఎక్కువ సమాచారం అందించవచ్చు. నేను చదువుకునే రోజుల్లో హాస్టల్‌కు గానీ, కళాశాలల్లోగానీ పోస్టుకార్డు వస్తే నోటీస్ బోర్డులోకి వెళ్లి చూసుకునేది. కార్డుపై రాస్తే అందరికీ కనిపిస్తుందని భయమేసేది. అందరూ చదువుకునేవాళ్లు. అప్పట్లో ఎంతో అదరణ పొందిన పోస్టుకార్డును నేటి ప్రజలు మరిచిపోయారు. డాక్టర్ వై.చిన్నప్ప, ప్రిన్సిపాల్, జీడీసీ పాల్వంచ పోస్టుమెన్ కోసం ఎదురుచూసే వాళ్లం.. సెల్ఫోన్లు, వాట్సాప్‌లు, ట్విట్టర్లు, ఈమెయిళ్లు లేని రోజుల్లో కేవలం పోస్టుకార్డులపై ఆధారపడ్డాం. పోస్టుమెన్ ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ నిరీక్షించేవాళ్లం. పొరుగు ఊరు నుంచి బంధువులు పోస్టుకార్డుపై యోగ క్షేమాలు రాసి పంపేవారు. కార్డులు చదువుకుని తిరిగి మళ్లీకార్డుపై రాసి పంపించాం. డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల క్షేమ సమాచారం తెలుసుకునేవాళ్లం.. దూర ప్రాంతాల్లో బంధువులు, కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాలను కేవలం పోస్టుకార్డుపై రాసి తెలుసుకునేవాళ్లం. నాటికి నేటికి ఎంతో తేడా ఉంది. వెంకటేశ్వర్లు, వ్యాపారి, కొత్తగూడెం -
టీడీపీ నేతల కోడ్ ఉల్లంఘన
సాక్షి, కర్నూలు: ఓటమి బయంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల కోడ్‌ను అడుగడుగునా ఉల్లంఘిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నా కూడా పట్టించుకొవడం లేదు. శుక్రవారం జిల్లాలోని బనగానపల్లె నియోజకర్గంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ టీడీపీ నేతలు. సుమారు రూ. 2 లక్షల 33 వేల మందికి పోస్టల్ ద్వారా కరపత్రాలు పంపిణి చేస్తున్నారు. పోస్టు ఆఫీస్ ముద్ర లేకుండా గ్రామాల్లో కరపత్రాలు పంపిణి చేస్తున్న పోస్టుమ్యాన్లు. కేవలం రూ. 5 స్టాంప్ అంటించి పోస్ట్ ముద్ర లేకుండా పంపిణీ చేసిన పోస్ట్ అధికారులు. దీనిపై బనగానపల్లె వెస్సార్సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
పోస్టుమెన్ పోస్టులకు భారీగా దరఖాస్తులు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): పోస్టుమెన్/ మెయిల్‌గార్డు పోస్టులకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. పోటీ పెరగడంతో నిరుద్యోగులు ఫీజు కట్టేందుకు కూడా అగచాట్లు ఎదుర్కొంటున్నారు. గత నెల 14న నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తును ఆన్లైన్లో పూరించుకుని ఫీజు పోస్టాఫీసుల్లో చెల్లించుకునే పద్ధతి పెట్టారు. రీజియన్ పరిధిలో 60 పోస్టులు ఉన్నాయి. ఇందులో జిల్లాకు 21 కేటాయించారు. వాటిలో ఎస్సీలకు 5, ఎస్టీలకు 5, మిగతా 11 పోస్టులు అన్‌రిజర్వుడ్ కేటగిరీలోకి వస్తాయి. పురుషులు రూ. 500, మహిళలు, ఎస్సీ, ఎస్టీలు రూ.100 చొప్పున హెడ్ పోస్టాఫీసుల్లో ఫీజు కట్టాల్సి ఉంది. జిల్లాలో కర్నూలు, ఆదోని, నంద్యాలలో మాత్రమే హెడ్ పోస్టాఫీసులు ఉన్నాయి. జిల్లా నలుమూలల నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువత ఫీజులు కట్టేందుకు ఈ మూడు పోస్టాఫీసులే శరణ్యమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య పెరగడంతో చాంతాడంత క్యూలు ఏర్పడుతున్నాయి. అభ్యర్థులు పోస్టాఫీసు తెరవక ముందే వచ్చి కూర్చుంటున్నారు. పక్షం రోజుల వ్యవధిలోనే కర్నూలు, ఆదోని, నంద్యాల హెడ్ పోస్టాఫీసుల్లో 15 వేల దరఖాస్తులు రావడం గమనార్హం. ఇంకా పక్షం రోజుల గడువు ఉండటంతో మరో 15 వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రోజూ వందలాది అభ్యర్థులు పోస్టాఫీసులకు వస్తున్నా..అధికారులు వారికి కనీసం మంచినీటి సదుపాయం కూడా సమకూర్చడం లేదు. -
పోస్టుమెన్ నిర్లక్ష్యంతో ఇంటర్వ్యూ కోల్పోయిన నిరుద్యోగి
మనూరు: పోస్ట్ మ్యాన్ నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడు ఇంటర్వ్యూను కోల్పోయాడు. బాధితుడు భూతపిల్లి తుకారాం శుక్రవారం స్థానిక విలేకరుల ముందు తన గోడును వెల్లబోసుకున్నాడు. మండలంలోని మాయికోడ్ గ్రామానికి చెందిన యువకుడు బి.తుకారామ్‌కు జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం నుంచి భారత్ పెట్రోలియంలో ఉపాధి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని 6న ఇంటర్వ్యూకు హాజరవ్వాలని జూన్ 4 న నారాయణఖేడ్ ఫోస్టాఫీస్‌కు రిజిస్టర్ పోస్టు వచ్చింది. ఈ క్రమంలో సంబంధిత పోస్టును ఖేడ్ పోస్టు కార్యాలయ సిబ్బంది మాయికోడ్ పోస్టుమెన్‌కు అదే రోజు అందచేశారు. అయితే గ్రామానికి చెందిన పోస్టుమ్యాన్ సుధాకర్ సంబంధిత రిజష్టర్ పోస్టును యువకుడికి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. వచ్చిన రోజు కాకుండా 18న సదరు రిజిష్టర్ పోస్టును కుటుంబీకులకు ఇచ్చి సంతకం తీసుకోకుండానే వెళ్లిపోయాడు. కాల్‌లెటర్ చూసిన యువకుడు పోస్టుమెన్ నిర్లక్ష్యం కారణంగా తాను ఉపాధి కోల్పోయానని మనోవేదనకు గురయ్యాడు. కాగా పోస్టుమెన్ పుండ్లిక్‌పై చర్యలు తీసుకోవాలని తాను జిల్లా పోస్టాఫీసులో ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నాడు. ఇక ముందు పోస్టుమెన్లు నిర్లక్ష్యం చేయకుండా ఉండేందుకు తాను సంబంధిత పోస్టుమెన్‌పై న్యాయపోరాటం చేస్తానని పేర్కొన్నాడు. కాగా ఖేడ్ పరిధిలోని పోస్టుమెన్లు నిర్లక్ష్యంగా, ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాలకు చెందిన పలువురు యువకులు పేర్కొన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి పోస్టుమెన్లు నిర్లక్ష్యం వహించకుండా తగు చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. -
కుక్క కాటుకు దూరంగా...
అవగాహన కుక్క సామాజిక జంతువు. అది మనిషితోపాటుగా జీవించడానికి ఇష్టపడుతుంది. యజమానికి రక్షణ కల్పించే బాధ్యతను తీసుకుంటుంది. అయితే కుక్కలను సరిగ్గా మలుచుకోకపోతే మనిషిని ఏ క్షణాన అయినా కరిచేస్తాయి. పక్కింటి వారిని, వీథిలో వెళ్తూన్న వారిని ఎవరి మీదనైనా సరే దాడి చేసేస్తాయి. అందుకే కుక్క కాటు నుంచి రక్షణ పొందడం మనిషి ప్రధానకర్తవ్యం కూడా. పరుగెత్తే వారి మీద లంఘించి దాడిచేయడం, కరవడం కుక్కల సహజ లక్షణం. కాబట్టి కుక్క దాడి చేస్తుందనిపించినప్పుడు పరుగెత్తకూడదు. అరవకూడదు కూడా. దానిని పట్టించుకోకుండా ఒక చోట కదలకుండా నిలబడిపోతే కుక్క కూడా మనిషిని పట్టించుకోదు. కుక్క మన మీద నుంచి దృష్టి మరల్చిన తర్వాత మెల్లగా ఆక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలి. అలవాటు పడిన కుక్కలతో ఆటలాడవచ్చు కానీ కొత్త వాటి జోలికి పోకూడదు. పాలు, పేపర్ బాయ్స్, పోస్ట్ మ్యాన్, పేపర్ కలెక్షన్ బాయ్స్, కేబుల్ బిల్ కలెక్షన్ బాయ్స్ మొదలైన వాళ్లు (అనేక ఇళ్లకు వెళ్లాల్సిన వాళ్లు), తాము వెళ్లే ఇళ్లలో కుక్కలు ఉంటే వాటిని అలవాటు చేసుకోక తప్పదు. అలాగే వాటికి వ్యాక్సినేషన్ వేయిస్తున్నారో లేదోనని తెలుసుకోవడం మంచిది. పిల్లలను పెట్డాగ్స్ని పెంచుకునే వారింటికి ఆటలకు పంపించేటప్పుడు జాగ్రత్తలు చెప్పాలి.