కుక్క కాటుకు దూరంగా... | Bitten by the dog away ... | Sakshi
Sakshi News home page

కుక్క కాటుకు దూరంగా...

Published Tue, Jul 22 2014 12:05 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

కుక్క కాటుకు దూరంగా... - Sakshi

కుక్క కాటుకు దూరంగా...

అవగాహన
 
కుక్క సామాజిక జంతువు. అది మనిషితోపాటుగా జీవించడానికి ఇష్టపడుతుంది. యజమానికి రక్షణ కల్పించే బాధ్యతను తీసుకుంటుంది. అయితే కుక్కలను సరిగ్గా మలుచుకోకపోతే మనిషిని ఏ క్షణాన అయినా కరిచేస్తాయి. పక్కింటి వారిని, వీథిలో వెళ్తూన్న వారిని ఎవరి మీదనైనా సరే దాడి చేసేస్తాయి. అందుకే కుక్క కాటు నుంచి రక్షణ పొందడం మనిషి ప్రధానకర్తవ్యం కూడా.
     
పరుగెత్తే వారి మీద లంఘించి దాడిచేయడం, కరవడం కుక్కల సహజ లక్షణం. కాబట్టి కుక్క దాడి చేస్తుందనిపించినప్పుడు పరుగెత్తకూడదు. అరవకూడదు కూడా. దానిని పట్టించుకోకుండా ఒక చోట కదలకుండా నిలబడిపోతే కుక్క కూడా మనిషిని పట్టించుకోదు.
     
కుక్క మన మీద నుంచి దృష్టి మరల్చిన తర్వాత మెల్లగా ఆక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలి.
 
అలవాటు పడిన కుక్కలతో ఆటలాడవచ్చు కానీ కొత్త వాటి జోలికి పోకూడదు.
 
పాలు, పేపర్ బాయ్స్, పోస్ట్ మ్యాన్, పేపర్ కలెక్షన్ బాయ్స్, కేబుల్ బిల్ కలెక్షన్ బాయ్స్ మొదలైన వాళ్లు (అనేక ఇళ్లకు వెళ్లాల్సిన వాళ్లు), తాము వెళ్లే ఇళ్లలో కుక్కలు ఉంటే వాటిని అలవాటు చేసుకోక తప్పదు. అలాగే వాటికి వ్యాక్సినేషన్ వేయిస్తున్నారో లేదోనని తెలుసుకోవడం మంచిది.
 
పిల్లలను పెట్‌డాగ్స్‌ని పెంచుకునే వారింటికి ఆటలకు పంపించేటప్పుడు జాగ్రత్తలు చెప్పాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement