understanding
-
బెంచింగ్ డేటింగ్ గురించి తెలుసా, ఇలా అయితే డేంజరే!
డేటింగ్ అనేది సక్రమ మార్గంలో వాడుకుంటే మంచిదే. ఒకర్నొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరి అభిరుచులు మరొకరికి తెలియడానికి, ఇద్దరి మధ్యా మంచి సాంగత్యానికి ఉపయోపడుతుంది. కానీ ప్రస్తుత సాంకేతిక యుగం, సోషల్ మీడియా విశృంఖలత్వంతోపాటు, డేటింగ్ యాప్‌లు ఈ అర్థాన్ని మార్చి పారేశాయి.హానికరమైన, విషపూరితమైన సంబంధాలకు నాంది పలుకుతూ కొత్త డేటింగ్ ట్రెండ్లు ఉద్భవించాయి. అలాంటి వాటిల్లో ఒకటి బెంచింగ్ డేటింగ్. అసలేంటి బెంచింగ్ డేటింగ్? దీనివలన లాభమా? నష్టమా? తెలుసుకుందాం ఈ కథనంలో.ఆధునిక డేటింగ్ పదం బెంచింగ్ డేటింగ్. అంటే పేరుకు తగ్గట్టే భాగస్వాముల్లో ఒకర్ని హోల్డ్‌లో ఉంచి, మరొకరిపై ఆసక్తిగా ఉండటం. ప్రేమ భాగస్వామిని 'బెంచ్ మీద' ఉంచడం అంటే మరో బెస్ట్ ఆప్షన్ కోసం అన్వేషించడమే. అచ్చం ఒక ఆటగాడిని బెంచి మీద ఉంచడం లాంటిదన్నమాట. అంటే మెయిన్ టీంలో లేకుండా, ఆటలో పాల్గొనకుండా,సందర్భం కోసం వాడుకునేందుకు బెంచ్ మీద ఉండే ప్లేయర్ లాంటి వారు. ఈ డేటింగ్లో బెంచింగ్ చేస్తున్న వారు, తోటి భాగస్వామితో స్నేహం చేస్తారు కానీ మనస్సు పూర్తిగా పూర్తిగా సంబంధానికి కట్టుబడి ఉండరు. అలాగే ఈ డేటింగ్లో బెంచ్‌మార్కింగ్" అంటే ఎవరైనా తమ ప్రస్తుత భాగస్వామితో, గతంలోని వారితో పోల్చపుడు, నెగెటివ్‌గా కమెంట్ చేయడం లాంటివి కూడా ఉంటాయి. అంతిమంగా ఇది రెండో వ్యక్తిలో (బెంచ్‌మీద ఉన్న) గందరగోళానికి మానసిక వేదనకు గురి చేస్తుంది. నిజాయితీ, నిబద్ధత లోపించడంతో అవతలి వారిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఒకరిమీద ఒకరికి విశ్వాసం, నమ్మకం లేనపుడు ఇక ప్రేమకు తావు ఎక్కడ ఉంటుంది. మోసపోయామన్న నిరాశ, నిస్పృహతోపాటు కొన్ని అనారోగ్యకరమైన, పెడధోరణులకు దారి తీయవచ్చు.బెంచ్‌మార్కింగ్ సంకేతాలుప్రస్తుత భాగస్వామిని మాజీలు లేదా గత సంబంధాలతో క్రమం తప్పకుండా పోల్చడం.అవాస్తవిక అంచనాలతో ఉండటం, వాళ్లు చెప్పినట్టే వినాలని అన్యాయంగా పట్టుబట్టటంఎపుడూ అసంతృప్తిగా ఉండటం, మరొకరితో పోల్చి, ఉద్దేశపూర్వకంగా అవమానించడం.నమ్మకం లేకపోవడం, ఎపుడూ విమర్శిస్తూ ఉండటం తమ రిలేషన్‌ను మరింత ఆరోగ్యకరంగా ముందుకు తీసుకెళ్లేందుకు సుతరామూ అంగీకరించకపోవడంఇదీ చదవండి : భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా! జాగ్రత్తలుపైన పేర్కొన్న అనుమానాస్పద లక్షణాలు కనిపించినపుడు అప్రమత్తం కావడం మంచిది. వీటిని గమనించి నపుడు అపార్థాలకు, అపోహలకు తావులేకుండా భాగస్వామితో మనసు విప్పి మాట్లాడుకొని, బంధం ముందుకు సాగే ప్రయత్నం చేయాలి. లేదా గతాన్ని వదిలేసి, బలమైన, ఆరోగ్యకరమైన సంబంధాలపై దృష్టి పెట్టడం ఉత్తమం. సిమ్మర్ డేటింగ్ఒకపుడు ద్దలు కుదుర్చుకునే పెళ్లిళ్లకే ప్రాధాన్యత ఉండేది. కాల క్రమంలో ప్రేమ వివాహాలపై యువతకు ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సిమ్మర్ డేటింగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రధానంగా జనరేషన్ జెడ్ దీనిని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అసలు ఈ సిమ్మర్ డేటింగ్ అంటే ఏమిటి? సుదీర్ఘ సంబంధాలపై దృష్టి పెట్టడమే దీని ప్రత్యేకత. చాలా కాలంపాటు బంధంలో కొనసాగడం వల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుందట. ఒకరిపై ఒకరికి అవగాహన, నమ్మకం పెరిగిన తరువాత లైంగిక బంధంలోకి అడుగుపెట్టడం మంచిదని, తద్వారా బంధం బలపడుతుందని నేటియువత భావిస్తోంది. -
ఏ బంధంలోనైనా హద్దులు అవసరం
ప్రియకు 28 ఏళ్లు. ఒక అంతర్జాతీయ సంస్థలో అకౌంటెంట్ గా పనిచేస్తుంది. రోహిత్‌తో రెండేళ్ల కిందట పెళ్లయ్యింది. మొదట్లో అంతా బానే ఉంది. కాలం గడిచేకొద్దీ వైవాహిక బంధంలో ఉక్కపోత మొదలైంది. తన డ్రెస్సింగ్ నుంచి ఫ్రెండ్స్ వరకూ అంతా తనకు నచ్చినట్లే ఉండాలంటాడు. అలా లేకుంటే ఏదో ఒక కారణంతో గొడవ పెట్టుకుంటున్నాడు. తన ప్రవర్తనను, స్నేహాలను కూడా నియంత్రించడం ప్రియకు నచ్చడంలేదు. క్రమంగా ఇద్దరి మధ్యా దూరం పెరిగింది. దాన్ని సరిచేసుకునేందుకు రోహిత్ ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. తానేం చేయాలో ప్రియకు అర్థంకాక కౌన్సెలింగ్ కు వచ్చింది.స్వేచ్ఛ వర్సెస్ సంప్రదాయంప్రేమంటే రెండు మనసుల కలయిక, పెళ్లంటే రెండు జీవితాల కలయిక. మనదేశంలో మాత్రం పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎలాంటి పరిచయం లేకపోయినా, ప్రేమ లేకపోయినా, కనీస అవగాహన లేకపోయినా... కులం, మతం, జాతకం, ఆర్థిక స్థాయిలు కలిస్తే చాలు, పెళ్లి చేసేస్తారు. ఆ తర్వాత ఆ రెండు కుటుంబాల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆ జంటపై ఉంటుంది. ఇప్పుడదే భారం ప్రియపై ఉంది. తన వ్యక్తిగత స్వేచ్ఛకు, ఆత్మగౌరవానికి.. కుటుంబ గౌరవానికి, సంప్రదాయానికి మధ్య పోరాటం నడుస్తోంది.కాలంతో పాటు మారని మనుషులు... సాంప్రదాయ పితృస్వామ్య వ్యవస్థ ఏర్పాటు చేసిన వివాహంలో.. భర్తంటే భరించేవాడు. కుటుంబంలో భర్తదే ప్రధానపాత్ర. అతని మార్గాన్నే భార్య అనుసరించాలి. కాలం మారినా, పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్న రోజులొచ్చినా చాలామంది పురుషులు తమ ఆధిపత్యమే నడవాలనే భావజాలంలోనే ఉంటారు, ఉంటున్నారు. రోహిత్ ది కూడా అదే బాట. అందుకే తన భార్య తనకు నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడు, అలా కోరుకోవడంలో తప్పు లేదనుకుంటున్నాడు. ఆ క్రమంలో వారిద్దరి మధ్యా దూరం పెరిగింది. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ప్రియ తన మనసులోని మాట చెప్పలేకపోతోంది. దాంతో మనసులో అసహనం, కోపం పెరిగిపోతున్నాయి. ఆ నేపథ్యంలోనే కౌన్సెలింగ్ కు వచ్చింది. ఆమె చెప్పినదంతా విన్నాక, వారికి ‘హెల్తీ బౌండరీస్’ గురించి అవగాహన లేదని అర్థమైంది.టాక్సిక్ రిలేషన్స్ లక్షణాలు...• జంటలో ఒకరి ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యం• తరచుగా వ్యంగ్యం, నిందలు, అవమానాలు• ఫోన్ చెక్ చేయడం, ఫ్రెండ్స్, పేరెంట్స్‌కు దూరం చేయడం• పార్టనర్ ను సంప్రదించకుండానే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడం• పార్టనర్ ను కంట్రోల్ చేయడానికి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం• పార్టనర్ తెలివిని, నిర్ణయాలనూ చులకన చేయడం• ఎవరితో క్లోజ్‌గా ఉన్నా అసూయ పడటం, దూరం చేయడానికి ప్రయత్నించడం• ప్రతీ చిన్న విషయానికీ గొడవపడుతుండటంసరిహద్దుల అవసరం... ఏ బంధంలోనైనా బౌండరీస్ అవసరం. భార్య అయినంత మాత్రాన తన మాట తప్పక వినాలనీ, భర్త అయినంత మాత్రాన తాను చెప్పినట్లే నడుచుకోవాలనీ అనుకోవడమే జంటల మధ్య చాలా సమస్యలకు కారణం. సరిహద్దులు అనేవి మన శారీరక, మానసిక వెల్ బీయింగ్ ను కాపాడుకోవడానికి మన చుట్టూ గీసుకునే అదృశ్య రేఖలు, మీ అవసరాలు, అంచనాలు, ఆమోదయోగ్యమైన ప్రవర్తన ఏమిటో తెలియజేసే చర్యలు. ప్రతీ జంటకూ హెల్తీ బౌండరీస్ గురించిన అవగాహన అవసరం. • ప్రతి వ్యక్తికీ తనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు, అభప్రాయాలు ఉంటాయి. వాటిని గుర్తించి, గౌరవించినప్పుడే బంధం బలపడుతుంది. అది సంప్రదాయాన్ని తిరస్కరించడం కాదు. బంధం మరింత బలపడటానికి మార్గం. • ‘‘నువ్వలా చేస్తున్నావు’’, ‘‘నువ్విలా అంటున్నావు’’ అని కాకుండా... ‘‘నేనిలా అనుకుంటున్నాను’’, ‘‘నేనిలా ఫీలవుతున్నాను’’ అని మాట్లాడటం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ఉదాహరణకు, ‘‘నేనే డ్రెస్ వేసుకోవాలో నువ్వు చెప్పినప్పుడు నాకు అసౌకర్యంగా ఉంటుంది. ఇద్దరికీ నచ్చేదాని గురించి మాట్లాడుకుందామా?’’ అని చెప్పడం, ఇష్టంలేకుండా ఒప్పుకోవడం నుంచి మాట్లాడి పరిష్కరించుకోవడానికి దారితీస్తుంది. • ఒక వ్యక్తిని గౌరవించడమంటే వారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం. వారి స్వేచ్ఛకు, స్నేహాలకు విలువనివ్వడం. భార్యకు లేదా భర్తకు కూడా పర్సనల్ స్పేస్ ఉంటుందని గుర్తించడం. అది వారిని నచ్చిన పాటలు వినడం కావచ్చు, తన ఫ్రెండ్స్ తో మాట్లాడటం కావచ్చు. • మారుతున్న కాలంతో పాటు సంప్రదాయాల్లోనూ మార్పు వస్తుందని గుర్తించాలి. సంప్రదాయానికి, స్వేచ్ఛకు మధ్య సమతుల్యత సాధించాలి. అది ఒకరి పట్ల మరొకరికి అవగాహనను, నమ్మకాన్ని పెంచుతుంది. • సరిహద్దులను సెట్ చేయడం సవాలే. మీ భాగస్వామి ఒప్పుకోకపోవచ్చు. అది మీ బాధ్యత కాదు. మీ అంచనాలకు అనుగుణంగా స్థిరంగా ఉండండి. • మీ హద్దులు దాటితే పరిణామాలు ఎలా ఉంటాయో నిర్ణయించుకోండి. పరస్పర చర్చల ద్వారా హద్దులను సర్దుబాటు చేసుకోండి.ప్రియ, రోహిత్ లకు మూడు సెషన్లలో వీటిని వివరించి, వారి మధ్య ఉన్న అపోహలను తొలగించి, ఓపెన్ కమ్యూనికేషన్ డెవలప్ అయ్యేలా కొన్ని ఎక్సర్ సైజ్ లు చేయించాను. ఇప్పుడిద్దరూ చిలకాగోరింకల్లా జీవిస్తున్నారు. అప్పుడప్పుడూ వాట్సప్ లో పలకరిస్తుంటారు.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066psy.vishesh@gmail.com -
వ్యక్తం... అవ్యక్తం
పైకి పచ్చగా కనిపించే చెట్టు ఎంత విస్తరించి ఉన్నదో అంత కన్న ఎక్కువగా దాని వేళ్ళు నేలలో పాతుకుని పోయి ఉంటాయి. చెట్టు అంటే పైకి కనిపించే కొమ్మలు, ఆకులు, పూలు, పళ్ళు మాత్రమే అనుకుంటే ఎంత పొరపాటో తెలుస్తోంది కదా. అదే విధంగా మనకి పైకి కనిపించే ప్రపంచం వెనుక ఎంతో ప్రయత్నం ఉంది. కనపడేది ఒక వంతు మాత్రమే... మూలమైనది మూడు వంతులు అని మన ఋషులు దర్శించి తెలియ చేశారు. ఒక వైద్యుడి దగ్గరకి వెళ్లినప్పుడు ఆయన నాలుగు మాటలు చకచక రాయటం చూసి, ఈ మాత్రానికే రూ. 500 తీసుకున్నాడు అని వాపోతారు. కాని, ఆ నాలుగు మాటలు, అంటే మందుల పేర్లు రాయటానికి ఆయన ఎంత కాలం కృషి చేసి ఉంటారో . ఒకసారి ఒక యంత్రం హఠాత్తుగా ఆగిపోయిందట. అందరూ రకరకాలుగా ప్రయత్నం చేశారు కానీ అది మొండికేసింది. ఒక ఇంజినీర్ని పిలిచారు. ఆయన వచ్చి అటు ఇటు పరిశీలించి సుత్తి తీసుకుని సున్నితంగా ఒక దెబ్బ వెయ్యగానే అది పని చెయ్యటం మొదలు పెట్టింది. తన ఫీజు అడగగానే ఒక సుత్తిదెబ్బ ఇంత ఖరీదా? అని అడిగాడట యజమాని. దానికి ఆ ఇంజినీరు సుత్తి దెబ్బకి ఒక రూపాయే. కానీ ఎక్కడ కొట్టాలో, ఎట్లా కొట్టాలో తెలుసుకున్నందుకు మిగిలినది అన్నాడట. నిజమే కదా. సుత్తిదెబ్బ అయితే ఎవరైనా కొట్టి ఉండ వచ్చుగా. ఇంజినీరు ని పిలవటం ఎందుకు? పైకి కనిపించే పని వెనక ఉన్న కృషే పనిలో నైపుణ్యానికి కారణం. ‘‘పాదోస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతమ్ దివి’’ అంది పురుష సూక్తం. అది అర్థం కావటానికి మానవుడు స్వయంగా ఇతర ప్రమేయం లేకుండా తయారు చెయ్యగల ఒకే ఒక్కమాట ని ఉదాహరణగా తీసుకోవచ్చు.‘‘త్రీణి నిహితా గుహాని తాని విదుర్ర్బాహ్మణా మనీషిణః నేంగయన్తి తురీయమ్ వాచో మనుష్యా వదంతి’’పరా, పశ్యంతి, మాధ్య మా అనే మూడుస్థాయుల ప్రయత్నం తరువాత వైఖరి అనబడే అందరికి వినపడే వాక్కు వెలువడుతుంది. మనకి తెలియకుండానే ఇంత ప్రయత్నం జరిగిపోతోంది. ఇది అర్థం చేసుకోగలిగితే సృష్టి రహస్యం చాలా వరకు తెలిసినట్టే. దృశ్యమాన జగత్తుకి కారణమైన అదృశ్యంగా ఉన్న దానిని కనీసం ఊహించగలుగుతాం. ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక నాటక ప్రదర్శననో, చలనచిత్రాన్నో చూడండి. రంగస్థలం మీద ఒక గంటో, రెండుగంటలో ప్రదర్శించే నాటకానికి పూర్వరంగం అంటే ముందు చేసే ప్రయత్నం ఎంతో. తెరమీద కనపడే ఒక దృశ్యాన్ని చిత్రీకరించటానికి ఎంతమంది ఎన్నిరోజులు శ్రమించి ఉంటారో ఈ మధ్య కాలంలో బాగా ప్రచారం చేస్తూనే ఉన్నారుగా. ఒక గంట పాట కచేరీకి ఇన్ని వేలా? అని ప్రశ్నించే వారికి సమాధానం అది ఆ గంట కచేరీకి కాదు, దానికి ముందు చేసిన సాధనకి అని. ఒక మేథావి ఇచ్చిన గంట ఉపన్యాసం వింటే వంద గ్రంథాలు చదివినట్టే అనేది అందుకనే. ఒక్క గంట మాట్లాడటానికి వాళ్ళు అప్పటికి కొన్ని గ్రంథాలు చదువుతారు. అంతకుముందే ఎన్నో గ్రంథాలు చదివి ఉంటారు. దానికి వారి అనుభవం, విశ్లేషణ జోడించబడతాయి. ఈ దృష్టి అలవరచుకుంటే వ్యక్తం నుండి అవ్యక్తానికి ప్రస్థానం ప్రారంభమైనట్టే. ఒక చెట్టుని కొట్టటానికి గంట పట్టింది. ఎంత తేలిగ్గా అయిపోయిందో అని చూసే వాళ్ళు అనుకుంటారు. కాని, గంట సమయంలో కొట్టటానికి గాను గొడ్డలికి తగినంత పదును పెట్టటానికి కనీసం పది గంటలు పట్టి ఉంటుంది. కనపడే పని వెనక కనపడకుండా ఉన్న సంసిద్ధత కోసం చేసిన ప్రయత్నం ఎంత ఉంటుందో అర్థం చేసుకుంటే పని సమయాన్ని సరిగా అంచనా వేసినట్టు అవుతుంది. చాలా సందర్భాలలో చేసే పని విలువని సరిగా అంచనా వెయ్యలేకపోవటానికి ఇటువంటి అవగాహనాలోపమే కారణం. – డా. ఎన్.అనంత లక్ష్మి -
ఎడ్యుకేషన్‌లోన్ కావాలా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
విదేశాల్లో చదువుకుని, కెరీర్‌ను గ్రాండ్‌గా మొదలు పెట్టాలన్నది చైతన్య (24) డ్రీమ్. బీటెక్ చేసిన తర్వాత రెండేళ్లపాటు సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేశాడు. ఫ్రాన్స్‌లోని మాంట్పెల్లియర్ బిజినెస్ స్కూల్లో ఎంఎస్సీ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నాడు. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కోర్సుకు పాక్షికంగా స్కాలర్ షిప్ రావడంతో అతడు ఎంతో సంతోషించాడు. కానీ, అప్పుడే అసలు సవాలు ఎదురైంది. వచ్చిన స్కాలర్షిప్ కొద్ది మొత్తమే, మిగిలిన మొత్తాన్ని రుణం ద్వారా సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. విద్యా రుణం సులభంగా లభిస్తుందని అనుకోవచ్చు. కానీ, ఆచరణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. నెల రోజుల పాటు ప్రశాంతత కోల్పోయి అతడు చేసిన ప్రయత్నం ఫలించింది. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో సీటు కావడంతో బ్యాంకు విద్యా రుణానికి ఓకే చెప్పింది. అందుకే, విద్యా రుణం పొందడం అనుకున్నంత సులభం కాదు. రుణం ఇచ్చే సంస్థ అన్ని విషయాలను స్పృశిస్తుంది. ఎలా వ్యవహరిస్తే సులభంగా రుణం లభిస్తుంది? ఈ విషయంలో ఉన్న సవాళ్లు, వాటిని అధిగమించడంపై అవగాహన కల్పించే కథనమే ఇది. ఏటా వేలాది మంది భారత విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతున్నారు. విదేశాంగ శాఖ వద్దనున్న తాజా సమాచారం మేరకు.. కరోనా తర్వాత కూడా విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యలో వృద్ధి కనిపిస్తోంది. 2021లో 11 లక్షల మంది భారత విద్యార్థులు విదేశీ చదువుల కోసం వెళ్లారు. 2024లో భారత్ నుంచి సుమారు 18 లక్షల మంది విదేశాల్లో ఉన్నత విద్యను ఎంపిక చేసుకోవచ్చని కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ అంచనా. వారు చేసే ఖర్చు వార్షికంగా 80 బిలియన్ డాలర్లు (రూ.6.16 లక్షల కోట్లు) ఉంటుందని ఈ సంస్థ పేర్కొంది. విద్యా రుణాన్ని నమ్ముకుని విదేశీ విద్యకు ప్లాన్ చేసుకునే వారు ముందుగానే ఇందుకు సంబంధించి వాస్తవ అంశాలను, పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా విచారించుకోవాలి. ‘‘ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం విద్యా రుణాలను పరిమితంగానే మంజూరు చేస్తోంది. వచ్చిన ప్రతి దరఖాస్తుకు ఆమోదం చెప్పడం లేదు. గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, విద్యా సంస్థల పూర్తి జాబితానే చాలా బ్యాంకుల వద్ద లేదంటే విద్యా రుణాల విషయంలో వాటికి ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు’’అని లాంచ్మైకెరీర్ అనే కెరీర్ కౌన్సెలింగ్ ప్లాట్‌ఫామ్ గ్లోబల్ లీడర్ సుష్మాశర్మ తెలిపారు. బ్యాంకును గుర్తించడం.. విద్యా సంస్థలు, దేశాలకు సంబంధించి పరిమితులు ఉన్నాయి. తమ ముందుకు వచ్చే ప్రతి విదేశీ విద్యా రుణ దరఖాస్తును బ్యాంకులు ఆమోదించవు. పైగా ఒక బ్యాంకుకు సంబంధించి కూడా అన్ని శాఖలు ఈ వ్యాపారం చూడడం లేదు. చైతన్య ముందుగా ఎన్బీఎఫ్సీ నుంచి రుణం తీసుకుందామని అనుకున్నాడు. సులభంగా, వేగంగా వస్తుందని అనుకుని కొన్ని ఎన్బీఎఫ్సీలను సంప్రదించాడు. కానీ, ఒక్కటంటే ఒక్కటీ చైతన్య సీటు సంపాదించిన యూనివర్సిటీ కోర్సులకు రుణాలను ఆఫర్ చేయడం లేదని తెలిసి ఆశ్చర్యపోయాడు. చివరికి ఎస్బీఐని సంప్రదించగా అతడి ప్రయత్నం ఫలించింది. అదీ మెయిన్ బ్రాంచ్‌కు వెళ్లాల్సి వచ్చింది. కావాల్సినంత రుణం.. విదేశీ విద్యా కోర్సు అంటే ఫీజులకే బోలెడు ఖర్చు అవుతుంది. ఇదే పెద్ద సవాలు. విదేశీ విద్యా సంస్థల్లో సీటు కోసం దరఖాస్తు చేసుకునే ముందే ట్యూషన్ పీజులతోపాటు అక్కడ నివసించేందుకు అయ్యే వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుష్మాశర్మ సూచించారు. ఇక కావాల్సినంత రుణం లభించక, తాము సొం తంగా సమకూర్చుకోలేని సందర్భాల్లో విద్యార్థులు రాజీమార్గాలను అనుసరించడాన్ని గమనించొచ్చు. కావాల్సి నంత రుణం/నిధులు సమకూరని సందర్భంలో అవసరమైతే కోర్సును లేదంటే విద్యా సంస్థను మార్చే వారు కూడా ఉన్నట్టు ఫ్లై మాస్టర్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఎండీ రాజేష్ వర్మ తెలిపారు. ఉద్యోగ అవకాశాలు.. రుణం ఇచ్చే ముందు ఏ బ్యాంకు అయినా, మరో సంస్థ అయినా ఏం చూస్తుంది..? రుణం తీసుకున్న వ్యక్తికి తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా..? అనే కదా.. అలాగే, విద్యా రుణం విషయంలో బ్యాంకులు అభ్యర్థి చేస్తున్న కోర్సు, ఉద్యోగ మార్కెట్లో ఆ కోర్సుకు ఉన్న డిమాండ్‌ను పరిశీలిస్తాయి. ఇందులో భాగంగా విద్యార్థి చదవబోయే విద్యాసంస్థకు ఉన్న పేరు, గుర్తింపు, అందులో చదివిన వారికి ఉపాధి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ‘‘విద్యార్థి కేంబ్రిడ్జ్ లేదా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వంటి విద్యా సంస్థలకు వెళ్లొచ్చు. కానీ, ఈ తరహా ప్రతిష్టాత్మక, పేరొందిన ఇనిస్టిట్యూషన్స్‌కు నేరుగా దరఖాస్తు చేసుకోవడానికి బదులు విద్యార్థులు ఏజెన్సీలను ఆశ్రయిస్తుంటారు. దాంతో చివరికి పెద్దగా తెలియని యూనివర్సిటీలో అడ్మిషన్‌తో వారు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అటువంటప్పుడు విద్యా రుణం కష్టంగా మారుతుంది’’ అని విద్యా రుణాల మార్కెట్‌ప్లేస్ అయిన విమేక్స్కాలర్స్ సహ వ్యవస్థాపకుడు అర్జున్ ఆర్ కృష్ణ తెలిపారు. పేపర్ వర్క్ కావాల్సిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవడం ముఖ్యమైన కార్యక్రమం. డాక్యుమెంట్ ప్రక్రియ ఎంత క్లిష్టమో ఇప్పటికే రుణం తీసుకుని విదేశీ విద్యా కోర్సు చేస్తున్న వారిని అడిగితేనే తెలుస్తుంది. విభా షణ్ముఖ్ (33) యూఎస్‌లోని రైస్ యూనివర్సిటీలో పీహెచ్డీ చదువుతున్నారు. డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఎంత క్లిష్టతరమో తన అనుభవాన్ని వెల్లడించారు. డల్లాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివేందుకు 2013లో ఆయన ఓ ప్రభుత్వ రంగ బ్యాం కులో రుణానికి దరఖాస్తు చేసుకున్నారు. ‘‘బ్యాంకు అడిగిన అన్ని పత్రాలను తీసుకెళ్లి ఇచ్చాను. అయినా కానీ, కోర్సుకు అయ్యే ఖర్చు, ఇతర వ్యయాలకు సంబంధించి యూనివర్సిటీ నుంచి ధ్రువీకరణ పత్రం కావాలని బ్యాంకు అడిగింది. కానీ యూనివర్సిటీల నుంచి ఈ తరహా పత్రాలు పొందడం అదిపెద్ద సవాలు’’అని షణ్ముఖ్ తెలిపారు. తాకట్టు.. దేశీ యూనివర్సిటీల్లో కోర్సుల కోసం రుణాలు తీసుకునేట్టు అయితే బ్యాంకులు తనఖా కోరవు. కానీ, విదేశీ వర్సిటీల్లో విద్య కోసం తీసుకునే రుణాలకు సంబంధించి తనఖా పెట్టాలని బ్యాంకులు అడుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులు తనఖా కోరుతున్నాయి. తనఖా కింద స్తిరాస్థి, ప్రావిడెంట్ ఫండ్ లేదా సెక్యూరిటీ డిపాజిట్ ఇస్తే సరిపోతుంది. చాలా ఎన్బీఎఫ్సీలు, ప్రైవేటు బ్యాంకులు తనఖా అడగడం లేదు. మాస్టర్స్ కోర్సులకు తనఖా లేకుండానే ఇవి రుణాలు ఇస్తున్నాయి. వివరాలు సమగ్రంగా తెలుసుకుని ముందడుగు వేయాలి. అధిక వ్యయాలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో విద్యా రుణానికి డాక్యుమెంట్లు సమర్పణ, ఆమోదం ప్రక్రియ కొద్దిగా కష్టం అనిపిస్తుంది. అదే ఎన్బీఎఫ్సీలు, ప్రైవేటు బ్యాంకుల నుంచి విద్యా రుణం సులభంగానే లభిస్తుంది. కాకపోతే ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే వీటిల్లో వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ చార్జీలు ఎక్కువగా ఉంటుంటాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో విద్యా రుణాలపై రేట్లు 6.9 శాతం నుంచి 12.5 శాతం మధ్య ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో 10.5 శాతం నుంచి 13 శాతం మధ్య ఉన్నాయి. ఎన్బీఎఫ్సీలు, ప్రైవేటు బ్యాంకులు (ఎక్కువ శాతం) ఇచ్చే విద్యా రుణాలకు మారటోరియం ఉండడం లేదు. దీంతో రుణం మంజూరు చేసిన మరుసటి నెల నుంచే చెల్లింపులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. మారటోరియం అంటే.. కోర్సు కాల వ్యవధికి ముగిసిన తర్వాత ఆరు నెలల వరకు రుణానికి చెల్లింపులు చేయక్కర్లేదు. కోర్సు అనంతరం ఉద్యోగం పొందేందుకు వీలుగా ఆరు నెలల వ్యవధి ఉంటుంది. దీనివల్ల విద్యార్థి కుటుంబానికి ఎంతో ఉపశమనం ఉంటుంది. అందుకుని రుణానికి వెంటనే చెల్లింపులు చేయలేని వారు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మారటోరియంతో కూడిన విద్యా రుణానికే ప్రయత్నించాలి. రుణానికి ముందే ప్రణాళిక ఉండాలి.. సాధారణంగా విద్యార్థులు తమ బడ్జెట్ కోణం నుంచి విదేశాల్లో ప్రవేశాలకు ప్రయత్నిస్తుంటారు. అంటే తక్కువ వ్యయాలు అయ్యే ప్రాంతాలను ఎంపిక చేసుకుంటుంటారు. దీనివల్ల అంతగా ప్రాచుర్యం లేని దేశం లేదా విద్యా సంస్థలో చేరాల్సి వస్తుంది. అందుబాటు ధరలు ఏ దేశంలో ఉన్నాయో విచారించుకుని అక్కడ విద్యాసంస్థను ఎంపిక చేసుకుంటున్నారు. ‘‘ఉదాహరణకు ఒక విద్యార్థి రూ.20లక్షలు ఖర్చు చేయగలనని అనుకుంటే ఆమె లేదా అతడు జర్మనీలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్నారు. అంతకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టుకోగలిగితే యూఎస్ లేదా యూకేలో ప్రవేశం కోసం ప్రయత్నం చేస్తున్నారు. విద్యా రుణం పొందే విషయంలో పేరున్న యూనివర్సిటీయే కాకుండా, దేశానికీ ప్రాధాన్యం ఉంటుంది’’అని కృష్ణ వివరించారు. విద్యా సంస్థలు పేరున్నవి, ప్రతిష్టాత్మకమైనవి అయితే బ్యాంకులు తనఖా కోరడం లేదు. ప్రభుత్వరంగ బ్యాంకులు అయితే యూనివర్సిటీలు, కోర్సులతో జాబితాను నిర్వహిస్తున్నాయి. ఏఏ వర్సిటీలు, ఏ కోర్సులకు తక్కువ వడ్డీ రేటు రుణాలు, తక్కువ తనఖాతో మంజూరు చేయాలో ఈ జాబితానే వాటికి ప్రామాణికంగా ఉంటోంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతోపాటు ప్రొడిగీ ఫైనాన్స్, ఎంపవర్ ఫైనాన్సింగ్ తదితర అంతర్జాతీయ సంస్థలు సైతం విద్యా రుణాలు ఇస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులకు విద్యారుణాల పరంగా సాయాన్ని అందిస్తున్నాయి. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నవారు, సరైన పత్రాలను అందించలేని వారికి విద్యా రుణం పరంగా ప్రైవేటు బ్యాంకులు సౌకర్యం’’అని కృష్ణ తెలిపారు. స్కాలర్షిప్ ‘‘విదేశీ విద్య కోసం వెళ్లే వారిలో కోర్సుకు అయ్యే వ్యయం మేర పూర్తి స్కాలర్షిప్ పొందే అవకాశం 2–3 శాతం మందికే ఉంటుంది. కానీ, పాక్షిక స్కాలర్షిప్ను అందించే విద్యా మండళ్లు, ఇనిస్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి’’అని కృష్ణ తెలిపారు. దరఖాస్తు సమయంలోనే స్కాలర్షిప్ కోసం ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఇందుకోసం ఎన్నో పథకాలు అవకాశాలున్నట్టు చెప్పారు. సున్నా వడ్డీ రుణాలు, విరాళాలు కూడా అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. టాటా ఫౌండేషన్, అగాఖాన్ ఫౌండేషన్ తదితర సంస్థలు సాయం అందిస్తున్నాయి. స్కాలర్షిప్ పొందడంలో సాయపడే జ్ఞాన్‌ధన్, విమేక్ సొల్యూషన్స్ తదితర సంస్థలు కూడా ఉన్నాయి. క్రెడిట్ స్కోరు విద్యా రుణం విషయంలోనూ మంచి క్రెడిట్ స్కోరు సాయపడుతుంది. దరఖాస్తు ఆమోదానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. కనుక పిల్లలను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాలనుకునే వారు మంచి క్రెడిట్ స్కోరు ఉండేలా చర్యలు తీసుకోవాలి. కాలేజీకి వచ్చిన పిల్లలు ‘బై నౌ పే లేటర్’ సదుపాయాలను విచ్చలవిడిగా ఉపయోగించుకుని చెల్లించకుండా వదిలేస్తున్నారు. ఈ తరహా చర్యలు రుణాలకు అడ్డంకిగా మారతాయి. విదేశ విద్య ప్రణాళిక ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్ హిస్టరీలో మచ్చ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులూ ఈ విషయంలో పిల్లల వ్యయాల పట్ల శ్రద్ధ చూపాలి. డాక్యుమెంట్లు విద్యా రుణానికి కేవైసీ డాక్యుమెంట్లు అన్నీ సిద్ధం చేసుకోవాలి. కేవైసీ అంటే గుర్తింపు, వయసు, చిరునామాను ధ్రువీకరించేవి. వీటితోపాటు గ్రాడ్యుయేషన్ మార్కుల మెమో షీటు, సెకండరీ స్కూల్, హైస్కూల్ ఇలా విద్యకు సంబంధించి అన్ని మెమో పత్రాలను దగ్గర ఉంచుకోవాలి. తల్లిదండ్రులు లేదంటే సంరక్షకుల ఆదాయ రుజువు సర్టిఫికెట్ అవసరం. తనఖా కోసం ఉంచతగిన ఇల్లు, పొలం, ప్లాట్, ఫిక్స్డ్ డిపాజిట్ లేదంటే పీపీఎఫ్ ఖాతా పాస్ బుక్, యూనివర్సిటీలో ప్రవేశాన్ని ధ్రువీకరిస్తూ మంజూరు చేసే లేఖ, కోర్సు ఫీజుల చెల్లింపుల షెడ్యూల్, స్కాలర్షిప్ లెటర్, రుణ గ్రహీత బ్యాంకు స్టేట్మెంట్ (చివరి ఆరు నెలలు), తల్లిదండ్రి లేదా సంరక్షకుడి బ్యాంకు ఖాతా స్టేట్మెంట్, ఆదాయపన్ను రిటర్నుల పత్రాలు, తల్లిదండ్రుల ఆదాయపన్ను రిటర్నుల పత్రాలు సిద్ధం చేసుకోవాలి. కొన్ని బ్యాంకులు రుణ దరఖాస్తుదారుడి వాటా కింద చెల్లించే మొత్తానికి మూలాన్ని అడుగుతాయి. అవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు చూడాలి రుణం సాయంతో విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారు చూడాల్సిన ముఖ్యమైన వాటిల్లో.. కోర్సు అనంతరం ఉపాధి అవకాశాలు ఒకటి. దీనివల్ల తీసుకునే రుణాన్ని తిరిగి తీర్చివేసే సామర్థ్యాలపై స్పష్టత తెచ్చుకోవచ్చు. విద్యా రుణాల్లో పెరుగుతున్న ఎగవేతలు ఈ విషయంలో ముందు జాగ్రత్త అవసరమని తెలియజేస్తన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు ఇచ్చిన విద్యా రుణాల్లో 9.55 శాతం నిరర్థక ఆస్తులుగా (ఎన్పీఏలు) 2020లో వర్గీకరించినట్టు 2021 పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం స్వయంగా తెలిపింది. కోర్సు అనంతరం అక్కడే కొంతకాలంపాటు ఉండి ఉపాధి అవకాశాన్ని సొంతం చేసుకోవాలన్నది నిపుణుల సూచన. ‘‘గతంలో అయితే కొన్ని దేశాలు కోర్సు అనంతరం కేవలం కొన్ని నెలల పాటే ఉపాధి అవకాశాల అన్వేషణకు వీలుగా ఉండనిచ్చేవి. కానీ, ఇప్పుడు బ్రిటన్ సహా చాలా దేశాలు గ్రాడ్యుయేట్ రూట్ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టాయి. వీటి కింద ఉన్నతవిద్య అనంతరం అక్కడే కొన్నేళ్లపాటు ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు’’అని ఓ కన్సల్టెన్సీ అధినేత తెలిపారు. -
మంచి మాట: అభిప్రాయం కాదు... అవగాహన
వ్యక్తి తన వ్యక్తిత్వానికి అతీతంగా వస్తుతత్త్వానికి, ఉన్న విషయానికి మాలిమి అవాలి. అనుకోవడం నుంచి తెలుసుకోవడానికి పయనించాలి. అభిప్రాయం నుండి అవగాహనలోకీ చేరాలి. అనుకోవడం అంటేనే తెలివిడిలేనితనం. ‘ఇది నా అభిప్రాయం‘ అనడం ఒక మనిషి అవగాహనా రాహిత్యాన్ని తెలియజేస్తూంటుంది. విషయం, వాస్తవం, సత్యం ఇవి మనిషి మనిషికీ మారవు. అభిప్రాయాలే వేర్వేరుగానూ, రకరకాలుగానూ ఉంటాయి. ఒక విషయం గురించి ఏదో అనుకోవడం ఏమిటి? విషయాల్ని తెలుసుకోవడం లేదా తటస్థంగా ఉండడం అన్నదే సరైనది. లోకంలో ప్రతి ఒక్కరూ అభిప్రాయపడడం గొప్ప అనుకుంటూంటారు. ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న 67% మధ్యతరగతి వ్యక్తులు అభిప్రాయపడుతూ బతుకుతూంటారు. అభిప్రాయాలు మనిషి అశక్తతకు, తెలివిడిలేనితనానికి వ్యక్తీకరణలు. అభిప్రాయపడడం అన్నది మధ్యతరగతి మాంద్యంగానూ, జాడ్యంగానూ ఉంది. అందువల్ల గందరగోళం తప్పితే మరొకటి ఉండదు. ఉపిరి పీల్చుకోవడం తరువాత ఒక వ్యక్తి తప్పకుండా చేసే పని అభిప్రాయపడడమే. మనుషులకు తప్పితే ఏ జంతువుకూ అభిప్రాయాలుండవు. అందుకే జంతువుల్లో లేని అశాంతి మనుషుల్లో మాత్రమే ఉంది. ‘ఇది నా అభిప్రాయం’, ‘నేను ఏమనుకుంటున్నానంటే‘, ‘నేను చెప్పేదేమిటంటే’... అనే స్థితి నుండీ, స్థాయి నుండీ మధ్య తరగతి మనిషి ఇంకా ఎదగలేదు. మనిషి అవగాహనకూ అతీతంగా తన అభిప్రాయాల వల్లా, ఏదో అనుకోవడం వల్లా తన ఎదుగుదలకు తానే అడ్డుపడుతున్నాడు. ఒక కుటుంబంలోని వ్యక్తుల అభిప్రాయాల వల్లా, ఏదేదో అనుకోవడం వల్లా ఆ కుటుంబాలు ఛిద్రమైన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. అభిప్రాయపడడం, అనుకోవడం ఒక మానసిక బలహీనత. హిట్లర్ అభిప్రాయాల వల్ల రెండవ ప్రపంచ యుద్ధం వచ్చి మొత్తం మానవాళికి పెనుహాని జరిగింది. అభిప్రాయపడడం కూడా మూర్ఖత్వంలాగే అపాయకరమైనదే! కొన్ని సందర్భాల్లో మూఢనమ్మకంలాగా కీడు చేసేదే! నా అభిప్రాయం మేరకు అనేది ప్రపంచానికి మేలు చేసినది కాకపోగా అనర్థాల్ని కలిగించింది, మనుషుల మధ్య అంతరాల్ని పెంచింది. మనస్పర్థలను సృష్టించింది. ఈ చింతనతో ఎన్నో దశాబ్దుల క్రితం నుండీ అంతర్జాతీయ సంస్థలు ప్రపంచానికీ, మానవాళికీ అత్యవసరమయ్యే ఎన్నో ఉత్పాదనల్ని ఉత్పత్తి చేసి అందుబాటులోకి తెచ్చాయి, సగటు మనిషికి హితాన్ని చేకూర్చాయి. చూడడం, వినడం, అవగతం చేసుకోవడం, చెప్పడం ఇవి మనిషికి సరిగ్గా అలవడలేదు. వ్యక్తిగత అభిప్రాయాలూ, ఉద్దేశాల వల్ల సాటి మనిషికీ, సమాజానికీ ప్రయోజనం ఉండదు. అభిప్రాయాలు, ఉద్దేశాలు, అనుకోవడం ఇవి కాదు ఎరుక, అవగాహన, విజ్ఞతలే కావాలి. ఒకరి ఎరుక, అవగాహన మరొకరికీ, సమాజానికీ ఉపయోగపడతాయి. ఈ ప్రపంచానికి మేలు చేసినవన్నీ అవగాహనలే, వాస్తవాలే, సత్యాలే. ఒక వైద్యుడి చదువు లేదా ఎరుక మాత్రమే రోగికి అవసరమవుతుంది. ఒక అధ్యాపకుడికి ఎరుక ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థికి సరైన విద్య వస్తుంది. ’రెండు రెళ్లు నాలుగు’ అన్న ఎఱుకను మాత్రమే ఉపాధ్యాయుడు విద్యార్థికి అందజెయ్యాలి. అదే విద్యార్థికి కావాల్సింది. ఆ రెండురెళ్లు నాలుగు అన్నది అవగాహన. ఆ అవగాహనే ఒక వ్యక్తి జీవనానికి తోడ్పడేది. ఇలా ఏ విషయంలోనైనా ఎరుకవల్ల వచ్చే లేదా వచ్చిన అవగాహన మాత్రమే మేలు చేస్తుంది. అభిప్రాయం అనేది పూర్తిగా వ్యక్తిగతం. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. అభిప్రాయాలు సార్వత్రికమైనవి కావు అపై సార్వజనీనమైనవీ కావు. మనం సరిగ్గా ఉండాలంటే మనకు ఉండాల్సింది అభిప్రాయాలు కాదు అవగాహనలు. బతకడం అంటే అభిప్రాయాల్ని మోసుకుంటూ ఉండిపోవడమా? కాదు. బతకడం అంటే తెలుసుకుని అవగాహనతో సాగడం. అభిప్రాయపడడం ఒక వ్యక్తికి ఆరంభదశ కావచ్చు. కానీ వ్యక్తి అక్కడే ఉండిపోకూడదు. తన అభిప్రాయాన్ని వాస్తవం లేదా ఉన్న విషయంతో సరిపోల్చి చూసుకోవాలి. తాను అనుకున్న దానికి ఏ మాత్రం ఉనికి ఉంది అన్నదాన్ని పరిశీలించగలగాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఒక గాయకుడు గొప్ప గాయకుడు అన్న అభిప్రాయం ఉంటే ఆ గాయకుడి సామర్థ్యాన్ని, గాయకుడి వ్యాప్తిని, తరువాతి తరం వాళ్లపై ఆ గాయకుడి ప్రభావాన్ని, పరిశీలించగలిగితే ఆ గాయకుడు గొప్ప గాయకుడు అన్న అభిప్రాయం సరైనదా కాదా అనేది తెలిసిపోతుంది. విజ్ఞానశాస్త్రవేత్తల ఆవిష్కరణలను పరిశీలిస్తే మనకు అవగాహన అన్నది ఏమిటో అర్థమై పోతుంది. విజ్ఞాన శాస్త్రవేత్తలు ఒక అభిప్రాయంతోనో, ఏదో ఒకటనుకునో మొదలుపెడతారు. ప్రయోగాలు, ఆలోచనలు, పరిశీలనలు చేస్తూ, చేస్తూ తమను తాము మార్చుకుంటూ, సరిచేసుకుంటూ ఒక దశలో వాళ్లు సరైన ఆవిష్కరణలు చెయ్యగలుతారు. ఆ ఆవిష్కరణ జరిగాక అది అవగాహన అవుతుంది. ఆ అవగాహనే లోకానికి ఉపయోగ పడేదవుతుంది. అవగాహన మనిషికి స్వేచ్ఛను ఇస్తుంది. సాటి మనిషికి, సమాజానికి మేలు చేస్తుంది. శాంతిని ఇస్తుంది. ఈ సత్యాన్ని బుద్ధిలోకి తీసుకుందాం. అభిప్రాయాలకు అతీతంగా ‘బతకడం’ నేర్చుకుందాం. అభిప్రాయపడడం ఒక వ్యక్తికి ఆరంభదశ కావచ్చు. కానీ వ్యక్తి అక్కడే ఉండిపోకూడదు. తన అభిప్రాయాన్ని వాస్తవం లేదా ఉన్న విషయంతో సరిపోల్చి చూసుకోవాలి. తాను అనుకున్న దానికి ఏ మాత్రం ఉనికి ఉంది అన్నదాన్ని పరిశీలించగలగాలి. – రోచిష్మాన్ -
అవగాహనతోనే సమస్యల పరిష్కారం
► జిల్లా న్యాయమూర్తి నిర్మలా గీతాంబ రాజాం రూరల్ : అవగాహనతో వ్యవహరిస్తే ఎటువంటి సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చునని జిల్లా న్యాయమూర్తి నిర్మలాగీతాంబ అన్నారు. శనివారం స్థానిక కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నేడు చాలా మంది అవగాహనలోపంతో ప్రతి చిన్న విషయాన్నీ పెద్దదిగా చేసి, వివాదాలకు వెళ్తున్నారని చెప్పారు. గ్రామస్థాయిలో పెద్దల సమక్షంలో వీటిని పరిష్కరించుకోవాలని సూచించారు. గ్రామాల్లో వర్గవిభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ నిత్యం ఏదో ఒక ఉపాధి పని చేసుకుంటూ ఉండాలని చెప్పారు. ఎస్పీ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో వివాదాలు లేని సమాజాన్ని తయారు చేయాలని పిలుపునిచ్చారు. బాల్యవివాహాలను నిషేధించడం,మద్యం అమ్మకాలు లేకుండా చూడ డం, యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మంచి సమాజం సాధ్యమవుతుందని చెప్పారు. అంతకుముందు ఈ లోక్‌అదాలత్‌లో 277 కేసులు పరిష్కారమైనట్లు సీని యర్ సివిల్ జడ్జి ఎంపీ సన్నిధిరావు తెలిపారు. క్రిమినల్ కేసులు 33, చెక్ బౌన్స్ కేసు 1, భార్యాభర్తల కేసు ఒకటి పరిష్కారమయ్యాయని వివరించారు. అలాగే మెయింటినెన్స్ కేసులు రెండు పరిష్కారం కాగా.. రూ.2.50 లక్షలు, సివిల్ కేసు ల రెండు ‡ద్వారా రూ.20వేలు, 221 పెట్టీ కేసుల నుంచి రూ.1,67,500లు వసూలు చేసినట్లు తెలి పారు. అక్రమంగా మందుగుండు కలిగిన 17 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. ఈ అదాలత్‌లో ఎస్.అప్పలనాయుడు, జూనియ ర్ సివిల్ జడ్జి కృష్ణసత్యలత, బూరి దామోదరరావు, పాలకొండ డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ, రాజాం సర్కిల్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
న్యాయసేవలపై అవగాహన అవసరం
∙న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కమలాకర్‌రెడ్డి అనంతపురం (బుక్కరాయసముద్రం ): న్యాయసేవలపై ప్రతి ఒక్కరికీ అవగాహ న తప్పని సరి అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కమలాకర్‌రెడ్డి తెలిపారు. నగరంలోని ప్రభుత్వ ఆర్‌్ట్స కళా శాలలో శనివారం రాజనీతి శాస్త్ర శాఖ, జి ల్లా న్యాయసేవాధికార సంస్థ, నెహ్రూ యువకేంద్రం, ఎన్ఎస్ఎస్ సంయుక్తంగా ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రంగస్వామి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా కమలాకర్‌రెడ్డి మా ట్లాడారు. ప్రజలకు న్యాయపరమైన సేవ లు అందించేందుకు 24 గంటలూ న్యాయసేవాధికార సంస్థ అందుబాటులో ఉం టుందన్నారు. ఎవరిౖకెనా అన్యాయం జరిగితే ఈ సంస్థను సంప్రదించాలన్నారు. ప్ర ముఖ న్యాయవాది పద్మజ, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ శివకుమార్, రాజనీతిశాస్త్ర అధిపతి ప్రొఫెసర్ దివాకర్‌రెడ్డి, అధ్యాపకులు శ్యాం ప్రసాద్, శేషారెడ్డి, ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నగదు రహిత లావాదేవీలకు సహకరించాలి
విజయవాడ : జిల్లాలో వ్యాపారులు నగదు రహిత లావాదేవీలు నిర్వహించి డిజిటల్ క్యాష్‌లెస్ ఎకనామీకి సహకరించాలని కలెక్టర్ బాబు.ఎ కోరారు. నగరంలో తన క్యాంపు ఆయన గురువారం బ్యాంకర్లు, హోల్ సేల్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రైతు బజార్ల ఏస్టేల్ అధికారులు, బ్యాంకర్లతో క్యాష్ లెస్ ఎకనామీపై సమావేశమయ్యారు. దేశంలో తొలిసారిగా ఈ జిల్లాలో నగదు రహిత వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి అందరికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరు ముందస్తు ప్రణాళికతో సిద్ధం కావాలని సూచించారు. జిల్లాలో సుమారు 60 వేల మంది వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, వీరిలో 7,500 మంది మాత్రమే ఫోస్ మిషన్లు వినియోగిస్తున్నారని వివరించారు. వాటిని పూర్తి స్థాయిలో వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని తెలిపారు. వ్యాపారస్తులు నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు జిల్లాలో విజయవాడలో కలెక్టర్ క్యాంపు కార్యాలయం, సబ్–కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) విధానంలో స్మార్ట్ ఫోన్ల ద్వారా లేదా సాధారణ ఫోన్ ద్వారా నగదును బదిలీచేసే సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. దీన్ని సామాన్యులు సైతం కొద్దిపాటి అవగాహనతో వినియోగించుకోవచ్చన్నారు. యూరోపియన్ దేశాలైన నార్వే, స్వీడన్, ఫీన్ల్యాండ్ వంటి దేశాలలో ఎటువంటి కరెన్సీ నోట్లు లేకుండా పూర్తిగా నగదు రహిత ఎకనామీ ఉపయోగిస్తున్నారని చెప్పారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి దీన్ని అమలు చేయాలన్సిన అవసరం ఉందన్నారు. నగదు రహితంగా వస్తువులు కొనుగోలు నిర్వహిస్తే సయయం ఆదా అవుతుందన్నారు. గ్రామాలు, పట్టణాలు, మండలాల్లో ప్రజలు నగదు రహితంగా కొనుగోలుపై అవగాహన కల్పిస్తామన్నారు. జిల్లాలో ఇప్పటికే నగదు రహితంగా చౌకధరల దుకాణాలలో నిత్యావసర వస్తువులను అందిస్తున్నామని, 90 శాతం పైగా ప్రజలకు బ్యాంకు ఖాతాలు అనుసంధానించామని పేర్కొన్నారు. జిల్లాలో 29వేల ఈ–పోస్ మిషన్లు పని చేస్తున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో క్యాష్ లెస్ పేమెంట్ విధానంపై పవర్‌పాయంట్ ప్రజెంటేషన్ ద్వారా వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. సబ్–కలెక్టర్ సలోనీ సిదాన, ఆర్డీవోలు పి.సాయిబాబు, చక్రపాణి, డీఎస్డీ వి.రవికిరణ్, ఎల్డీఎం వెంకటేశ్వరరెడ్డి, బ్యాంకర్లు, అసోసియేషన్ ప్రతినిధులు వక్కలగడ్డ బాస్కరరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
ప్రశ్నించే గుణం అలవర్చుకోవాలి
డిచ్పల్లి : విద్యార్థులు ప్రశ్నించే గుణం అలవర్చుకోవాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి హరినాథ్ అన్నారు. సోమవారం డిచ్పల్లి ప్రభుత్వ మోడల్ స్కూల్/కాలేజ్‌లో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హరినాథ్ మాట్లాడుతూ.. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, రాజ్యాంగం పట్ల విధేయతతో మెలగాలని, హక్కులతో పాటు, విధులను పాటించాలన్నారు. బాల్య వివాహలు, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా అన్ని రకాల న్యాయ సేవలు అందిస్తారని తెలిపారు. మహిళలు ప్రస్తుతం పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకెళుతున్నారని, ఇందుకు మలావత్ పూర్ణ, పీవీసింధు లను ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. కార్యక్రమంలో లీగల్ అథారిటీ సభ్యులు రాజ్‌కుమార్ సుబేదార్, మాణిక్యరాజ్, సుదర్శన్‌రావు తో పాటు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గణేశ్‌కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కొనసాగాలనే అనుకున్నా...
♦ కానీ ప్రభుత్వంతో అవగాహన కుదరలేదు.. ♦ ఆర్బీఐ గవర్నర్ రాజన్ వెల్లడి న్యూఢిల్లీ: రెండు రోజుల్లో (సెప్టెంబర్ 4) రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా మూడేళ్ల బాధ్యతల నుంచి తప్పుకుంటున్న రఘురామ్ రాజన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను వెల్లడించారు. ఆర్బీఐ గవర్నర్‌గా మరికొంత కాలం కొనసాగాలనే అనుకున్నట్లు పేర్కొన్నారు. అరుుతే పదవీ బాధ్యతల పొడిగింపు విషయమై ప్రభుత్వంతో ‘‘తగిన విధమైన అవగాహనకు’’ రాలేకపోరుునట్లు పేర్కొన్నారు. నిజానికి పదవిలో కొనసాగే విషయమై చర్చలు జరిగాయని, ఒక దశ దాటి అవి ముందుకు సాగలేదని తెలిపారు. అరుుతే ఈ ‘‘అవగాహన’’ ఏమిటన్న విషయంపై ఆయన స్పష్టతను ఇవ్వలేదు. పూర్తి చేయాల్సిఉన్న పనులు ఇంకా మిగిలి ఉండడమే బాధ్యతల్లో కొనసాగాలనుకోవడానికి కారణమని అన్నారు. అరుునా తన బాధ్యతలను సంతృప్తిగానే విరమిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఆర్బీఐ గవర్నర్‌గా నియమితులైన ఉర్జిత్ పటేల్ గురువారంనాడు ముంబైలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమయ్యారు. -
అమ్మపాలు అమృతంతో సమానం
దుబ్బాక: అమ్మ పాలు అమృతంతో సమానమని, బిడ్డలకు అమ్మ పాలే శ్రేష్ఠమని ఎంపీపీ ర్యాకం పద్మ అన్నారు. బుధవారం మండలంలోని చిట్టాపూర్, పోతారం, హబ్షీపూర్, తిమ్మాపూర్, బల్వంతాపూర్, అప్పనపల్లి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో తల్లి పాల వారోత్సవాలు నిర్వహించారు. తల్లి పాల విశిష్టతపై తల్లులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టిన అరగంటలోపే తల్లి పాలను పారబోయకుండా బిడ్డకు పట్టించాలని సూచించారు. తల్లి పాలల్లో రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుందని, మూఢ నమ్మకాలతో ముర్రుపాలను వృథా చేస్తున్నారన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సేవలను గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింత మరణాలు తగ్గించడానికి అంగన్వాడీ, ఆశా వర్కర్లు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్‌లు పోతనక రాజయ్య, ఇప్పలపల్లి నాగమణి, అబ్బుల లావణ్య, కొంగరి కనకవ్వ, చెర్లపల్లి బాలమణి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు హేమలత, యాస్మిన్ భాషా బేగం, అంగన్వాడీలు కవిత, జ్యోతి, జయ, మంజుల, బాల్‌లక్ష్మి, మంజుల, తార, పుష్పలత, శైలజ, రాజమణి, కవిత ఏఎన్ఎంలు మంజులు, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. -
పిల్లల్లో ఆరోగ్య సమస్యలపై జాతీయ టాస్క్‌ఫోర్స్
♦ ఆసియా-పసిఫిక్ పీడియాట్రిక్ సదస్సులో తీర్మానం ♦ స్థూలకాయం, ఆహార అలవాట్లపై పాఠశాలల్లో అవగాహన ♦ దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా నాలుగు నగరాల ఎంపిక సాక్షి, హైదరాబాద్: పిల్లల్లో ఆరోగ్య సమస్యలపై, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లపై పెద్ద ఎత్తున అవగాహన పెంచేందుకు జాతీయ స్థాయిలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది. పిల్లల్లో మధుమేహం, స్థూలకాయం, కేన్సర్, గుండె జబ్బులు పరిపాటిగా మారిన నేపథ్యంలో విద్యార్థినీ విద్యార్థులకు, 19 ఏళ్ల లోపు యువతీ యువకులకు వీటిపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ టాస్క్‌ఫోర్స్ కృషిచేస్తుంది. హైదరాబాద్‌లో జరుగుతున్న పెడికాన్-2016 సదస్సులో రెండో రోజు శుక్రవారం ఈ మేరకు తీర్మానించారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ నిర్మలతో పాటు స్వాతి భావే (పుణే), రేఖ హరీశ్ (జమ్ము కశ్మీర్), వాసుదేవ్ (ఢిల్లీ), రమేశ్ ధంపురి టాస్క్‌ఫోర్స్‌లో ఉన్నారు. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లోని పాఠశాలల విద్యార్థులతో వీరు భేటీ అయి ఈ సమస్యలపై వారికి అవగాహన కల్పిస్తారు. పాఠశాలల్లో జంక్‌ఫుడ్ తినకుండా పిల్లలను, రోజువారీ వ్యాయామం ప్రాధాన్యంపై ఉపాధ్యాయులను చైతన్యపరుస్తారు. ఆయా నగరాల్లో ఎంపిక చేసిన స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపడతారు. యువతలో పొగాకు, మద్యానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడతారు. సీబీఎస్సీ స్కూళ్లల్లో జంక్‌ఫుడ్ తినొద్దంటూతీసుకున్న నిర్ణయం అంతటా అములయ్యేలా చూస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను కలిసి వీటిపై అవగాహన చర్యలు చేపడతారు. ఏడాది పాటు పైలట్ ప్రాజెక్టును అమలు చేశాక, ఆ అనుభవంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రచించాలని సదస్సు పిలుపునిచ్చింది. ప్రధానంగా 10-19 ఏళ్ల పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల ప్రకారం మద్యం, పొగాకుకు పిల్లలను దూరంగా ఉంచడం, వారికి వ్యాయామం తప్పనిసరి చేయడం. టీవీ వీక్షణ తగ్గించడంపై దృష్టి పెట్టాలని కూడా నిర్ణయించింది. దేశవిదేశాల నుంచి వచ్చిన పిల్లల వైద్య నిపుణులు పిల్లల ఆరోగ్యం పట్ల సదస్సులో తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. పిల్లల్లో ఇన్ఫెక్షన్లు తగ్గినా స్థూలకాయం, మధుమేహం, కేన్సర్, బీపీ తదితరాలు పరిపాటిగా మారాయని వ్యక్తంచేశారు. పిల్లలకు అనవసరంగా యాంటీబయాటిక్స్ ఇవ్వడాన్ని ఆపాలని సదస్సు కోరింది. ఇండియా అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మహిళా విభాగం ఆధ్వర్యంలో వాక్ నిర్వహించారు. -
సాక్షి భవిత అవగాహన సదస్సుకు విశేష స్పందన
-
ఇంటర్ పరీక్షలపై ఏం చేశారు ?
రెండు రాష్ట్రాల విద్యాశాఖలకు గవర్నర్ కార్యదర్శి లేఖ సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షలపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలపాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విద్యాశాఖలకు గవర్నర్ కార్యాలయ కార్యదర్శి శనివారం ఒక లేఖ రాశారు. గవర్నర్ నరసింహన్ సమక్షంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, గంటా శ్రీనివాసరావులు గతంలో సమావేశమై ఉమ్మడిగానే ఇంటర్ పరీక్షలు నిర్వహించే అంశంపై అవగాహనకు వచ్చిన సంగతి తెలిసిందే. -
స్వచ్ఛభారత్‌పై అవగాహన కల్పించాలి
నెల్లూరు (బాలాజీనగర్): ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంపై విద్యార్థులు తమ తల్లిదండ్రలకు అవగాహన కల్పించాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంపై నెల్లూరులోని పురమందిరంలో సన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులకు జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ పరిసరాల పరిశుభ్రతపై చర్చించుకోవాల్సి రావడం బాధాకరమన్నారు. ప్రధాని చేపట్టిన స్వచ్ఛభారత్‌తో ఐదేళ్లలో దేశం అద్భుతంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవడం ద్వారా ఈ కార్యక్రమం విజయవంతమవుతుందన్నారు. దేశంలో ప్రస్తుతం 13 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందన్నారు. వీటికి రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతుందన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందజేస్తున్న సాయాన్ని రూ.15 వేలకు పెంచాలని సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన తిలకించారు. అనంతరం ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో వొమ్మిన నాగసతీష్, నరసింహం, సర్వేపల్లి రామమూర్తి, బలరామయ్యనాయుడు, ఈవీఎస్ నాయుడు, శింగంశెట్టి మురళీమోహన్, గుడి నారాయణబాబు, భవాని నాగేంద్ర ప్రసాద్, అలూరి శిరోమణి శర్మ, ఎం.భాస్కర్, మెట్టు రామచంద్రప్రసాద్, తమ్మినేని పాండు, టైగర్ మహమ్మద్ పాల్గొన్నారు. -
అవయవదానంపై పెరుగుతున్న అవగాహన
మరణించి ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపిన వర్ధమాన సినీ నటుడు శ్రీనివాస్ పంజగుట్ట: అవయవదానంపై రోజురోజుకీ అవగాహన పెరుగుతున్నది. ఇటీవలే ఓ పోలీస్ ఉద్యోగిని అవయవదానం చేయగా తాజాగా ఓ వర్ధమాన సినీ నటుడు అవయవ దానం చేశారు. నిమ్స్ జీవన్‌దాన్ విభాగం ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా కొండాపూర్‌లో నివాసం ఉండే డి.శ్రీనివాసులు(26) పలు సినిమాల్లో నటించాడు. రక్తచరిత్ర, క్షేత్రం, లౌలీ లాంటి 6 సినిమాల్లో, 6 షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాడు. పోలీస్‌డైరీ లాంటి సీరియల్స్‌లో కూడా నటించాడు. ఇతనికి నెలరోజుల క్రితమే నాగమణితో వివాహమయ్యింది. శ్రీనివాసులు గత నెల 30న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పరిగి వద్ద ప్రమాదానికి గురయ్యాడు. ఇతని తలకు బలమైన గాయం కావడంతో వెంటనే అతన్ని స్థానికంగా ఉండే ఎస్వీఆర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నగరంలోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకొవచ్చారు. ఈ నెల 1వ తేదీన శ్రీనివాస్‌కు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. కిమ్స్ జీవన్‌దాన్ కో ఆర్డినేటర్ అశోక్‌రెడ్డి... శ్రీనివాస్ భార్య నాగమణికి అవయవదానంపై అవగాహన కల్పించారు. అవయవదానానికి ఒప్పుకోవడంతో శ్రీనివాస్‌కు శస్త్రచికిత్స నిర్వహించి రెండు కిడ్నీలు, లివర్, రెండు హార్ట్వాల్వ్స్తోపాటు మొత్తం ఐదు అవయవాలు తీసుకుని అవసరమైన వారికి అమర్చారు. -
హక్కులపై అవగాహన అవసరం
సిరిసిల్ల : ప్రవాస భారతీయులు చట్టపరమైన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి తడకమడ్ల మురళీధర్ సూచించారు. సిరిసిల్ల కోర్టులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రవాస భారతీయులకు చట్టపరంగా లభించే హక్కులు, రక్షణ చట్టాలపై అవగాహన కల్పించేందుకు సిరిసిల్లలో శనివా రం ఉదయం పది గంటలకు పద్మశాలి కల్యాణ మండపంలో న్యాయచైతన్య సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాస్‌పోర్టు చట్టం, ఇమిగ్రేషన్, ప్రవాసీ భారతీయ బీమాయోజన, మహాత్మాగాంధీ ప్రవాసీ సురక్షయోజన, వలసదారులకు ఉండే హక్కులు, పరిహార చట్టం, ప్రమాద బీమా వంటి సదుపాయాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సదస్సు ఏర్పాటు చేశామన్నారు. లెసైన్స్ కలిగిన గల్ఫ్ ఏజెంట్లు, వీసాల జారీ వ్యవహారం వంటి అంశాలపై వివరిస్తారని తెలిపారు. ఈ సదస్సుకు వలసదారుల హక్కుల మండలి కార్యదర్శి మంద భీమ్‌రెడ్డి, ఎమిగ్రేట్స్ వెల్ఫేర్ ప్రొటక్షన్ ఫోరం ప్రతినిధి నాగుల రమేశ్ తోపాటు పలువురు అధికారులు హాజరవుతారని చెప్పారు. డివిజన్లోని వలస వెళ్లే కార్మికు లు ఈ సదస్సుకు హాజరై చట్టపరమైన హక్కులపై అవగాహన పెంచుకోవాలని మురళీధర్ కోరారు. జడ్జి వెంట లోక్‌అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్ ఉన్నారు. -
వినియోగం అనే లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ?
సోషల్ - మెథడ్స్ బోధనా లక్ష్యాలు- స్పష్టీకరణాలు అవగాహన: ఉపాధ్యాయుడు తరగతిలో జ్ఞానం అనే లక్ష్యాన్ని బోధించిన తర్వాత అవగాహన అనే లక్ష్యాన్ని సాధించాలి. జ్ఞానం అవగాహనకు సోపానం. అవగాహన అంటే ఏదైనా భావనలను యథాతథంగా కాకుండా అర్థవంతంగా అభ్యసించడం. అవగాహన స్పష్టీకరణలు: విచక్షణ: విద్యార్థి భావనలు, సూత్రాలు, యధార్థాల మధ్య తేడాలు (తారతమ్యాలు భేదాలు, వ్యత్యాసాలు) గుర్తించడం. 1. ప్రత్యక్ష పన్నులకు, పరోక్ష పన్నులకు మధ్య తేడా తెలుసుకోవడం. 2. సూర్య, చంద్ర గ్రహణాల మధ్య తేడా తెలుసుకోవడం. 3. చెక్కుకు, డ్రాఫ్టుకు మధ్య తేడా తెలుసుకో వడం. వర్గీకరించడం: భావనలను విద్యార్థి వివిధ రకాలుగా పేర్కొనడం. 1. బడ్జెట్‌ను మిగులు బడ్జెట్, లోటు బడ్జెట్, సంతులిత బడ్జెట్లుగా వర్గీకరించడం. 2. నిరుద్యోగాన్ని ఇచ్ఛాపూర్వక, అనిచ్ఛాపూ ర్వక నిరుద్యోగంగా వర్గీకరించడం. 3. ప్రభుత్వాన్ని శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖలుగా వర్గీకరించడం. సరిపోల్చడం: భావనల మధ్య పోలికలను చెప్పడం. 1. జైనమతాన్ని, బౌద్ధమతంతో సరిపోల్చడం. 2. గవర్నర్ అధికారాలను రాష్ర్టపతి అధికారా లతో సరిపోల్చడం. 3. హైకోర్టు విధులను సుప్రీంకోర్టు విధులతో సరిపోల్చడం. ఉదాహరణలివ్వడం: ఉపాధ్యాయుడు ఉదాహర ణలివ్వడం ఒక బోధన నైపుణ్యం. దానికి అదనంగా విద్యార్థి మరో ఉదాహరణ ఇచ్చిన ట్లయితే అతడు పాఠ్యాంశాలను అర్థం చేసుకున్నాడని భావం. 1. ఉచిత వస్తువులకు గాలి, నీరు ఉదాహరణగా పేర్కొనడం. 2. ఆహార పంటలకు వరి, గోధుమ జొన్న ఉదాహరణగా పేర్కొనడం. 3. ఐచ్ఛిక ద్రవ్యానికి చెక్కు, డ్రాఫ్టులను ఉదాహరణగా పేర్కొనడం. పరస్పర సంబంధాలను గుర్తించడం: వివిధ భావనల మధ్య విద్యార్థి సంబంధాలను గుర్తించడం. 1. ధరకు డిమాండ్‌కు మధ్య విలోమ సంబంధాన్ని గుర్తించడం. 2. డిమాండ్‌కు సప్లయ్‌కు మధ్య అనులోమ సంబంధాన్ని గుర్తించడం. 3. అడవుల నరికివేతకు, వాతావరణ సమతౌ ల్యం దెబ్బ తినడానికి మధ్య సంబంధాన్ని గుర్తించడం. వివరించడం: విద్యార్థి ఏదైనా ఒక భావనను సులభం నుంచి క్లిష్టతకు, తెలిసిన అంశాల నుంచి తెలియని అంశాలకు అర్థవంతంగా చెప్పడాన్ని వివరిం చడం అంటారు. 1. విద్యార్థి భూభ్రమణం, భూపరిభ్రమణం అనే అంశాలను అర్థవంతంగా చెప్పడం. వ్యాఖ్యానించడం: విద్యార్థి దత్తాంశాలను అర్థవంతంగా చెప్పడం. 1. 1951 నుంచి 2011 వరకు వివిధ దశాబ్దాల్లోని అక్షరాస్యత రేటు ఆధారంగా భారతదేశంలో అక్షరాస్యత పెరిగింది అని వ్యాఖ్యానించడం. 1951 18.3% 1991 52.5% 2001 65% 2011 74.04% తప్పులను గుర్తించడం: విద్యార్థి ఏదైనా ఒక వాక్యంలో తప్పులను గుర్తించడం. 1. ‘మొఘలు సామ్రాజ్య స్థాపకుడు అక్బర్’ అనే వాక్యం తప్పు అని విద్యార్థి గుర్తించాడు. తప్పులను సరిదిద్దడం: విద్యార్థి ఏదైనా ఒక వాక్యంలో తప్పులను గుర్తించి వాటిని సరి దిద్దడం. 1. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు అక్బర్ అనే వాక్యంలోని తప్పును అక్బర్‌కు బదులుగా బాబర్‌గా విద్యార్థి సరిదిద్దాడు. గతంలో అడిగిన ప్రశ్నలు 1. వినియోగం అనే లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? (డీఎస్సీ-2006) 1) విచక్షణ చేయడం 2) ఉదాహరణలు ఇవ్వడం 3) సాధారణీకరించడం 4) నమూనాలను తయారుచేయడం 2. ప్రపంచ శాంతిని కాపాడటంలో ఐక్య రాజ్యసమితి పాత్రలో ప్రధానంగా అభినందించదగింది? (డీఎస్సీ-2006) 1) నైపుణ్యానికి సంబంధించింది 2) మానసిక, చలనాత్మక రంగానికి సంబంధించింది 3) జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది 4) భావావేశ రంగానికి సంబంధించింది 3. విద్యార్థి బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన తుఫానును చక్రవాత వర్షపాతానికి ఉదాహరణగా పేర్కొన్నాడు. ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం? (డీఎస్సీ-2006) 1) అవగాహన 2) నైపుణ్యం 3) జ్ఞానం 4) వినియోగం 4. సౌర కుటుంబం పాఠాన్ని 8వ తరగతి విద్యార్థి అభ్యసించిన తర్వాత ఓ రోజు స్నేహితులతో కలిసి నక్షత్రశాలను సందర్శించాడు. దీన్ని బట్టి అతడు ఏ లక్ష్యాన్ని సాధించాడని చెప్పొచ్చు? (డీఎస్సీ-2004) 1) వైఖరి 2) అభిరుచి 3) నైపుణ్యం 4) ప్రశంస 5. విద్యావిధానం విద్యా లక్ష్యాల వైపు పయనిస్తున్నపుడు ఆ మార్గంలో ఆచరణ ద్వారా సాధించగలిగే స్థాయిని సూచించే బిందువు? (డీఎస్సీ-2004) 1. సామర్థ్యం 2. కనీస అభ్యసన స్థాయి 3. లక్ష్యం 4. ఉద్దేశం సమాధానాలు 1) 3; 2) 4; 3) 1; 4) 2; 5) 3. మాదిరి ప్రశ్నలు 1. బ్లూమ్స్ వర్గీకరించిన జ్ఞానాత్మక రంగం లోని లక్ష్యాలు సరళం నుంచి క్లిష్టతకు ఏ ఆధిక్యత శ్రేణిలో ఉంటాయి? 1) జ్ఞానం, అవగాహన, సంశ్లేషణ, విశ్లే షణ, మూల్యాంకనం, వినియోగం 2) జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లే షణ, సంశ్లేషణ, మూల్యాంకనం 3) జ్ఞానం, అవగాహన, సంశ్లేషణ, విని యోగం, విశ్లేషణ, మూల్యాంకనం 4) జ్ఞానం, అవగాహన, మూల్యాంకనం, వినియోగం, సంశ్లేషణ, విశ్లేషణ 2. 2001 భారతదేశ అక్షరాస్యత రేటు, ఆంధ్ర ప్రదేశ్ అక్షరాస్యత రేటుకు సంబంధించిన దత్తాంశాలను వ్యాఖ్యానించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) జ్ఞానం 2) అవగాహన 3) వినియోగం 4) నైపుణ్యం 3. మదర్ థెరిసా సేవానిరతిని ప్రశంసించిన విద్యార్థి ఏ రంగంలోని ప్రవర్తనలో మార్పు కలిగింది? 1) జ్ఞానాత్మక రంగం 2) భావావేశ రంగం 3) మానసిక చలనాత్మక రంగం 4) జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం 4. పరీక్ష మార్కులతో నిమిత్తం లేకుండా ఉత్తీర్ణులయ్యే పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం? 1) 1961 2) 1971 3) 1981 4) 1977 5. కిందివాటిలో అవగాహన అనే లక్ష్యానికి సంబంధించింది? 1) దత్తాంశాలను వ్యాఖ్యానిస్తాడు 2) దత్తాంశాలను విశ్లేషిస్తాడు 3) దత్తాంశాల ఆధారంగా పరస్పర సంబంధాలు గుర్తిస్తాడు 4) పోలికలు, భేదాలు చెపుతాడు 6. ‘విద్యార్థులు పాలు పంచుకునే గుణానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి. కానీ లక్ష్య సాధనకు కాదు’ అని అభిప్రాయపడినవారు? 1) ఆర్నవెల్ 2) జాన్సన్ 3) బ్లూమ్స్ 4) డివే 7. జర్మనీ ఏకీకరణలో బిస్మార్‌క నిర్వహించిన పాత్రను వివరించండి? అనే ప్రశ్న ద్వారా ఉపాధ్యాయుడు పరీక్షించదలచుకున్న లక్ష్యం? 1) జ్ఞానం 2) వినియోగం 3) అవగాహన 4) నైపుణ్యం 8. నాణేలను సేకరించడం, ఆల్బమ్‌ల్లో చిత్రా లను భద్రపరచడం మొదలైన ప్రవ ర్తనాంశాలను కలిగిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) అభిరుచులు 2) వైఖరులు 3) ప్రశంస 4) వినియోగం 9. పటాలను కచ్చితమైన స్కేల్‌తో గీయగలిగిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) వినియోగం 2) నైపుణ్యం 3) అవగాహన 4) జ్ఞానం 10. కిందివాటిలో వినియోగం అనే లక్ష్యానికి సంబంధించని స్పష్టీకరణం? 1) పరికల్పన రూపొందించడం 2) వ్యాఖ్యానించడం 3) ఫలితాలను ఊహించడం 4) సాధారణీకరించడం 11. కిందివాటిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించని లక్ష్యం? 1) సంశ్లేషణ 2) గ్రహించడం 3) విశ్లేషణ 4) మూల్యాంకనం 12. జాతీయ సమైక్యత అనే పాఠ్యాంశాన్ని విన్న తర్వాత దేశభక్తి, సహనం కలిగిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) అభిరుచులు 2) వైఖరులు 3) వినియోగం 4) ప్రశంస 13. ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం మధ్య విలోమ సంబంధం పేర్కొన్న విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) జ్ఞానం 2) అవగాహన 3) వినియోగం 4) నైపుణ్యం 14. సూర్య కుటుంబం నమూనాను తయారు చేసిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) జ్ఞానం 2) అవగాహన 3) వినియోగం 4) నైపుణ్యం 15. వీచే దిశలను బట్టి పవనాలను వర్గీకరించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) జ్ఞానం 2) అవగాహన 3) వినియోగం 4) నైపుణ్యం 16. కింది వాటిలో భావావేశ రంగానికి సంబంధించని లక్ష్యం? 1) సహజీకరణం 2) శీల స్థాపనం 3) ప్రతిస్పందనం 4) వ్యవస్థాపనం 17. భారతదేశంలో అధిక జనాభాకు కారణాలను విశ్లేషించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) జ్ఞానం 2) అవగాహన 3) వినియోగం 4) నైపుణ్యం 18. నౌకాశ్రయానికి - ఓడరేవుకు మధ్య తేడాలను పేర్కొన్న విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) జ్ఞానం 2) అవగాహన 3) వినియోగం 4) నైపుణ్యం 19. నీలి విప్లవం అంటే ఏమిటి అనే ప్రశ్న ద్వారా మాపనం చేయదలచుకున్న లక్ష్యం? 1) జ్ఞానం 2) అవగాహన 3) వినియోగం 4) నైపుణ్యం 20. హైస్కూల్ విద్యార్థి 10వ తరగతిలో దర్శనీయ ప్రదేశాలు అనే పాఠ్యాంశం విన్న తర్వాత చిత్తూరు జిల్లాలోని తిరుపతిని సందర్శించాడు. ఆ విద్యార్థిలో ఏ రంగంలో మార్పు కలిగింది? 1) జ్ఞానాత్మక రంగం 2) భావావేశ రంగం 3) మానసిక చలనాత్మక రంగం 4) జ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక రంగాలు 21. గత మూడు రోజుల నివేదిక ఆధారంగా రేపటి ఉష్ణోగ్రతను ఒక విద్యార్థి ఊహించగలగడం అనే సామర్థ్యం ఏ లక్ష్య సాధనకు సంబంధించింది? 1) జ్ఞానం 2) అభిరుచి 3) వినియోగం 4) అవగాహన 22. ఇతరుల మాటలను గౌరవంగా వినడం ఏ బోధనా లక్ష్యానికి సంబంధించింది? 1) అవగాహన 2) వైఖరి 3) నైపుణ్యం 4) జ్ఞానం 23. రాజ్యాంగ ప్రవేశికను గుర్తుకు తెచ్చుకున్న విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) జ్ఞానం 2) అవగాహన 3) వినియోగం 4) అభిరుచి 24. ద్రవ్యాన్ని న్యాయాత్మకమైన టెండర్ ద్రవ్యం, ఇచ్ఛాపూర్వక ద్రవ్యంగా వర్గీ కరించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) జ్ఞానం 2) అవగాహన 3) వినియోగం 4) నైపుణ్యం 25. ఎకనమిక్ సర్వే దత్తాంశాల ఆధారంగా మరణ రేటు తగ్గింది అని వ్యాఖ్యానించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) జ్ఞానం 2) అవగాహన 3) వినియోగం 4) అభిరుచులు 26. సమస్యా పరిష్కార పద్ధతి ప్రధానంగా ఏ రంగానికి సంబంధించింది? 1) భావావేశ రంగం 2) జ్ఞానాత్మక రంగం 3) మానసిక చలనాత్మక రంగం 4) చలనాత్మక రంగం 27. కింది వాటిలో భావావేశ రంగానికి చెందినవారు? 1) ఎలిజబెత్ సింపసన్ 2) డేవిడ్ ఆర్.క్రాత్ హోల్ 3) ఆర్. హెచ్. దావే 4) హౌరో 28. భావావేశ రంగంలో లక్ష్యాలు సరళత నుంచి క్లిష్టతకు వరుసగా? 1) గ్రహించడం, ప్రతిస్పందించడం, వ్యవస్థాపనం, విలువకట్టడం, శీల స్థాపనం 2) గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం 3) గ్రహించడం, ప్రతిస్పందించడం, శీల స్థాపనం, విలువకట్టడం, వ్యవస్థాపనం 4) గ్రహించడం, ప్రతిస్పందించడం, వ్యవ స్థాపనం, శీలస్థాపనం, విలువ కట్టడం 29. వివిధ జాతుల మధ్య పరస్పర సంబంధాలను విద్యార్థి ప్రశంసించడం ఏ రంగానికి చెందిన లక్ష్యం? 1) భావావేశ 2) జ్ఞానాత్మక 3) మానసిక చలనాత్మక 4) పైవేవీ కాదు 30. మానసిక చలనాత్మక రంగానికి సంబం ధించిన లక్ష్యాలు సరళత నుంచి క్లిష్టతకు వరుసగా 1) సునిశితత్వం, అనుకరణ, హస్తలాఘ వం, సహజీకరణం, సమన్వయం 2) అనుకరణ, హస్తలాఘవం, సునిశి తత్వం, సహజీకరణం 3) అనుకరణ, హస్తలాఘవం, సమ న్వయం, సునిశితత్వం, సహజీకరణం 4) అనుకరణ, హస్తలాఘవం, సమన్వయం, సునిశితత్వం, సహజీకరణం 31. నైపుణ్యం అనే లక్ష్యాన్ని సాధించడానికి అనువైన పాఠ్యపథక సోపానం? 1) పునర్విమర్శ 2) గైహికం 3) సామాన్యీకరణం 4) ప్రావేశిక చర్య 32. నదీ తీర ప్రాంతాల్లో నాగరికతలు అభివృద్ధి చెందడానికి కారణాలను పేర్కొన్న విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) జ్ఞానం 2) అవగాహన 3) వినియోగం 4) నైపుణ్యం 33. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర పాఠ్యాం శాలు విన్న విద్యార్థి దేశభక్తిని కలిగి ఉన్నాడు. ఆ విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) అభిరుచులు 2) వైఖరులు 3) ప్రశంస 4) వినియోగం సమాధానాలు 1) 2; 2) 2; 3) 4; 4) 2 5) 2; 6) 2; 7) 3; 8) 1; 9) 2; 10) 2; 11) 2; 12) 2; 13) 2; 14) 4; 15) 2; 16) 1; 17) 3; 18) 2; 19) 1; 20) 2; 21) 3; 22) 2; 23) 1; 24) 2; 25) 2; 26) 2; 27) 2; 28) 2; 29) 1; 30) 2; 31) 2; 32) 3; 33) 2. -
నేడు అవయవ దానంపై అవగాహన సదస్సు
హాజరుకానున్న అక్కినేని నాగార్జున సాక్షి, సిటీబ్యూరో: అవయవ దానంపై విస్తృత ప్రచారం నిర్వహించి, ప్రజలను చైతన్యపరిచేందుకు యశోద ఆస్పత్రి యాజమాన్యం, జీవన్‌దాన్ సంయుక్తంగా నడుం బిగించాయి. ఆర్గాన్ డొనేషన్ డ్రైవ్ పేరుతో శనివారం ఉదయం 11.45 గంటలకు శిల్పారామంలోని శిల్పకళా వేదికలో అవగాహన కార్యక్రమాన్ని నిర్విహ స్తున్నాయి. సినీ నటుడు అక్కినేని నాగార్జున, యశోద ఆస్పత్రి ఎమ్డీ జీఎస్ రావు తదితరులు పాల్గొంటారు. అవయవ మార్పిడితో పునర్జన్మ నగరంలోని మోహన్ ఫౌండేషన్ ద్వారా గత పదేళ్లలో 155 బ్రెయిన్‌డెడ్ కేసుల నుంచి వెయ్యి ఆర్గాన్స్‌ను సేకరించి, 854 మందికి పునర్జన్మను ప్రసాదించినట్టు చెబుతున్నారు. 2013 జులై వరకు నిమ్స్ జీవన్‌దాన్ ద్వారా 370 మందికి ప్రాణం పోశారు. కేవలం వైద్యులు నిర్ధారించిన బ్రెయిన్‌డెడ్ బాధితులే కాదు... బతికుండగానే శరీరంలో సగ భాగాన్ని బాధితులకు ఉచితంగా ఇచ్చేందుకు బంధువులూ (లైవ్ డోనర్స్) ముందుకు వస్తున్నారు. అరుదైన శస్త్ర చికిత్సలకు, ఫార్మా కంపెనీలకు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ప్రసిద్ధి చెందిన ఆరోగ్య రాజధాని హైదరాబాద్ తాజాగా ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్లకు కేంద్ర బిందువుగా మారుతోంది. నిమ్స్‌లో ఇప్పటి వరకు 650 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు జరిగితే, గ్లోబల్ ఆస్పత్రిలో 300 కాలేయ మార్పిడి, 110 మూత్ర పిండాలు, ఐదు గుండె మార్పిడి శస్త్ర చ్రికిత్సలు జరిగాయి. రాష్ట్రంలో తొలిసారిగా యశోద ఆస్పత్రిలో రెండు ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. గాంధీ, ఉసామనియా, కిమ్స్, అపోలో, కేర్, స్టార్, ఆస్పత్రుల్లోనూ అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఈ శస్త్ర చికిత్స చేయించుకున్న వారిలో 80 శాతం మంది సజీవంగాఉన్నట్లు సంబంధిత వైద్యులు చెబుతున్నారు. -
కుక్క కాటుకు దూరంగా...
అవగాహన కుక్క సామాజిక జంతువు. అది మనిషితోపాటుగా జీవించడానికి ఇష్టపడుతుంది. యజమానికి రక్షణ కల్పించే బాధ్యతను తీసుకుంటుంది. అయితే కుక్కలను సరిగ్గా మలుచుకోకపోతే మనిషిని ఏ క్షణాన అయినా కరిచేస్తాయి. పక్కింటి వారిని, వీథిలో వెళ్తూన్న వారిని ఎవరి మీదనైనా సరే దాడి చేసేస్తాయి. అందుకే కుక్క కాటు నుంచి రక్షణ పొందడం మనిషి ప్రధానకర్తవ్యం కూడా. పరుగెత్తే వారి మీద లంఘించి దాడిచేయడం, కరవడం కుక్కల సహజ లక్షణం. కాబట్టి కుక్క దాడి చేస్తుందనిపించినప్పుడు పరుగెత్తకూడదు. అరవకూడదు కూడా. దానిని పట్టించుకోకుండా ఒక చోట కదలకుండా నిలబడిపోతే కుక్క కూడా మనిషిని పట్టించుకోదు. కుక్క మన మీద నుంచి దృష్టి మరల్చిన తర్వాత మెల్లగా ఆక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలి. అలవాటు పడిన కుక్కలతో ఆటలాడవచ్చు కానీ కొత్త వాటి జోలికి పోకూడదు. పాలు, పేపర్ బాయ్స్, పోస్ట్ మ్యాన్, పేపర్ కలెక్షన్ బాయ్స్, కేబుల్ బిల్ కలెక్షన్ బాయ్స్ మొదలైన వాళ్లు (అనేక ఇళ్లకు వెళ్లాల్సిన వాళ్లు), తాము వెళ్లే ఇళ్లలో కుక్కలు ఉంటే వాటిని అలవాటు చేసుకోక తప్పదు. అలాగే వాటికి వ్యాక్సినేషన్ వేయిస్తున్నారో లేదోనని తెలుసుకోవడం మంచిది. పిల్లలను పెట్డాగ్స్ని పెంచుకునే వారింటికి ఆటలకు పంపించేటప్పుడు జాగ్రత్తలు చెప్పాలి. -
లైంగికదాడుల నివారణపై అవగాహన
వేలూరు: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు లైంగికదాడుల నివారణపై అవగాహన కల్పించాలని కలెక్టర్ నందగోపాల్ తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లైంగికదాడుల నివారణపై రెండు రోజుల పాటు జరుగనున్న అవగాహన కార్యక్రమాన్ని బుధవారం కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ లైంగికదాడులకు పాల్పడే వారికి కఠిన శిక్ష పడే చట్టాలున్నాయన్నారు. ఆడ పిల్లల పట్ల ఎవరైనా ప్రేమగా మాట్లాడుతున్నారా లేక వ్యత్యాసంగా మాట్లాడుతున్నారా అనే విషయాలను తరచూ తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలన్నారు. జిల్లాలో లైంగికదాడుల కేసులు తక్కువగా ఉన్నాయన్నారు. ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలు లైంగికదాడుల నివా రణపై అవగాహన కల్పిస్తున్నాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలు, వసతి గృహాల వద్ద కూడా అవగాహన కల్పిస్తే జిల్లాలో పూర్తిగా లైంగికదాడుల కేసు లు లేకుండా చేయవచ్చునన్నారు. ప్రస్తుతం శిక్షణ పొం దుతున్న అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఆయా తాలుకా కేంద్రాల్లో లైంగికదాడుల నివారణపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. శిశు సంక్షేమ శాఖ అధికారి శరవణన్, అసిస్టెంట్ డెరైక్టర్ కల్పన, మహిళా వసతి గృహం సూపర్వైజర్ ఉమామహేశ్వరి, సీనియర్ న్యాయవాది వీరరాఘవులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
బిడ్డను దత్తత తీసుకోవాలంటే...
అవగాహన ఇంట్లో పిల్లలు తిరుగాడాలని కోరుకోని వాళ్లుండరు. కానీ కొందరికి పిల్లలు కలగడం అందని చందమామగానే ఉండిపోతోంది. అలాంటి వారు తల్లిదండ్రులకు దూరమైన మరో బిడ్డకు మాతృత్వాన్ని పంచితే... ఏకకాలంలో ముగ్గురి సమస్యలు పరిష్కారమైనట్లే. ముగ్గురి ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. మరి బిడ్డను దత్తత తీసుకోవడం ఎలాగంటే... రాష్ట్ర ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని సంప్రదించాలి. ఈ కార్యాలయం హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉంది. జిల్లాల్లో అయితే దత్తత వ్యవహారాలు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతాయి. దరఖాస్తు పెట్టుకున్న వారిని ముఖాముఖి పరిశీలిస్తారు. వారు వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి. వారి ఆర్థిక పరిస్థితి బిడ్డను పెంచడానికి సహకరించేదిగా ఉండాలి. దరఖాస్తు చేసుకున్న వారి మీద క్రిమినల్ కేసులు కానీ, బాలల హక్కులకు భంగం కలిగించినట్లు కేసులు కానీ ఉండరాదు. బిడ్డను దత్తత చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టినా కూడా ఈ బిడ్డను వదలకుండా పెంచుతామని ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత బిడ్డను ఇస్తారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న వారు ఈ నంబర్లలో సంప్రదించాలి: దత్తత విభాగం అడిషనల్ డెరైక్టర్ ఆంధ్రప్రదేశ్‌కు- 9440814425, తెలంగాణకు - 9440100185 . రెండు రాష్ట్రాల్లోని జిల్లాల వారు సంబంధిత రాష్ట్ర అడిషనల్ డెరైక్టర్‌కు ఫోన్ చేసి, తమ జిల్లా కార్యాలయం నంబరు తీసుకోవచ్చు. -
అవయవ దానంతో ప్రాణదానం
నగరవాసుల్లో పెరుగుతున్న అవగాహన సాక్షి, ముంబై: అవయవ దానంపై నగరవాసుల్లో అవగాహన పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 19 శవదానాలు నమోదుకాగా, గత ఏడాదిలో 20 శవదానాలు మాత్రమే నమోదయ్యాయి. నగరంలో చాలా మంది శరీర అవయవాలు పనిచేయక వీటి దానం కోసం వేచి చూస్తున్నారు. గతంలో లక్షలు ఖర్చుచేసి వీటిని పొందాలనుకున్నా ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు వచ్చేవారు కాదు. అయితే ఇప్పుడిప్పుడే దీనిపై నగరవాసుల్లో అవగాహన పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 33 కిడ్నీలు, 17 కాలేయాలు దానం చేశారు. అయితే 2013 ఏడాది మొత్తంలో దాతలు 34 కిడ్నీలు, 17 కాలేయాలే దానం చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలా వుండగా, నగర ఆస్పత్రులు అవయవ దానం విషయంలో 2012 రికార్డును కూడా అధిగమించనున్నాయి. 2012లో 26 శవదానాలు జరుగగా, 43 కిడ్నీలు, 18 కాలేయాల దానం జరిగింది. అంతేకాకుండా ఈ ఏడాదిలో రెండు ఊపిరితిత్తుల దానం కూడా జరిగిందని అధికారి తెలిపారు. ఈ సందర్భంగా అవయవాలను ఆస్పత్రులకు సరఫరా చేసే జోనల్ ట్రాన్ప్‌ప్లాంట్ కో-ఆర్డినేషన్ కమిటీ (జెడ్టీసీసీ) సభ్యుడు మాట్లాడుతూ.. అవయవ దానంపై నగర వాసుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. జాతీయ మహిళా కమిషన్, మాజీ ముంబై మేయర్ నిర్మల సమంత్ ప్రభావాల్కర్ కుమార్తె (18) మెదడులో రక్తస్రావం జరగడంతో మరణించింది. ఆమెకు అవయవ దానంపై అవగాహన ఉండడంతో కూతురి అవయవాలను దానం చేసింది. సదరు బాలిక కిడ్నీ, కాలేయం ఇద్దరు రోగులకు అమర్చడంతో ప్రాణాలను నిలబెట్టింది. ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ ఏ కన్నతల్లికైనా తన కూతురి అవయవాలను దానం చేయడం చాలా కఠినంగా ఉంటుందని అన్నారు. అయితే ఆ అవయవాలు మరికొన్ని ప్రాణాలను నిలబె ట్టేందుకు ఉపయోగపడినప్పుడు దానం చేయడమే ఉత్తమమన్నారు. దీనివల్ల తమ పిల్లలు వేరే రూపంలో బతికే ఉన్నారనే ఆత్మసంతృప్తి మిగులుతుందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జెడ్టీసీపీ అధ్యక్షుడు గుస్తాద్ దేవర్ మాట్లాడుతూ.. అవయవ దానంపై నగర వాసుల్లో అవగాహన పెరగడంతో స్థానికంగా చాలా ఆస్పత్రులు అవయవ మార్పడి చేస్తున్నాయన్నారు. జెడ్టీసీపీలో దాదాపు 3,050 మంది రోగులు కిడ్నీ కోసం రిజిస్టర్ చేసుకోగా, 200 మంది కాలేయ మార్పిడి కోసం రిజిస్టర్ చేసుకున్నారని ఆయన వివరించారు. -
విత్తన ఎంపికలో అయోమయం
పాలకోడేరు రూరల్, న్యూస్‌లైన్ : విత్తనాల ఎంపికపై సరైన అవగాహన కొరవడటంతో కొందరు రైతులు నష్టపోతున్నారు. విత్తనోత్పత్తికి వాడే విత్తనాలను తీసుకుని సాధారణ సాగు చేసి.. ఆనక దిగుబడి తగ్గడంతో లబోదిబోమంటున్నారు. వ్యవసాయ శాఖ విత్తనోత్పత్తి పథకం కింద ప్రతి మండలానికి కొన్ని బస్తాలు ఫాండేషన్ విత్తనం పంపిణీ చేస్తోంది. వీటిని వ్యవసాయ అధికారులు సబ్సిడీపై రైతులకు విక్రయిస్తుంటారు. అయితే ఇదే అసలు విత్తనం అనుకుని రైతులు కొనుగోలు చేసి ఖరీఫ్‌లో సాధారణ సాగు చేస్తున్నారు. తీరా పంట దిగుబడి వచ్చేసరికి బయట విత్తనంతో పోల్చుకుంటే ఫౌండేషన్ విత్తనంతో సాగు చేసిన పొలంలో ఎకరాకు 5 బస్తాలు దిగుబడి తగ్గుతోంది. దీంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. గతేడాది సార్వాలో చాలామంది రైతులు విత్తనోత్పత్తి విత్తనాలను తీసుకుని సాధారణ సాగుచేసి దిగుబడి కోల్పోయారు. అసలు విషయం ఏమిటో కొందరు రైతులు తెలుసుకోగా.. మరికొందరు పంట తేలిపోయి ఉంటుందని, వరి సరిగ్గా పాలుపోసుకోలేదని తదితర కారణాలతో సరిపెట్టుకుంటుండటం గమనార్హం. సార్వాకు దాళ్వా.. దాళ్వాకు సార్వా విత్తనం ఇవ్వాలి విత్తనోత్పత్తి పథకంలో దాళ్వా సాగుకు ఉపయోగించే 1010 లాంటి విత్తనాలను సార్వా సాగు సమయంలో ఇస్తే రైతులు వాటిని తమ పొలాల్లో కొంత మేర ఆ విత్తనం సాగు చేసి.. ఆ తర్వాత దాళ్వా సమయం వచ్చినప్పుడు సాధారణ సాగు చేయాలి. అలాగే సార్వాలో ఉపయోగించే స్వర్ణ లాంటి విత్తనాలను దాళ్వా సాగు సమయంలో ఇస్తే రైతులు కొంత మేర ఆ విత్తనం సాగు చేసి.. ఆనక సార్వా వచ్చినప్పుడు దానిని సాగు చేయాలి. అయితే రైతులు అలా చేయకుండా విత్తనోత్పత్తి విత్తనాలను కొనుగోలు చేసిన వెంటనే సాధారణ సాగు చేయడంతో దిగుబడి తగ్గిపోయి రైతులు గగ్గోలు పెడుతున్నారు. వ్యవసాయ శాఖ కూడా సార్వా సాగు సమయంలో దాళ్వా విత్తనాలను కాకుండా సార్వా విత్తనాన్ని విత్తనోత్పత్తి పథకం కింద సరఫరా చేస్తుండడంతో రైతులు గందరగోళానికి గురవుతున్నారు. దీనిపై అవగాహన కల్పించాల్సి ఉన్నా వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం విత్తనోత్పత్తి ఎంటీయూ 7029 స్వర్ణ విత్తనాలు మండల వ్యవసాయ కార్యాలయాలకు చేరాయి. విత్తనాల అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. 30 కేజీల బస్తా రూ.780 ఉంటే సబ్సిడీపై రూ.390కు విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు స్పందించి రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంది. -
రక్తదానంపై అవగాహన పెరగాలి
రక్తనిధి కేంద్రం అధికారి డాక్టర్ సత్యశ్రీనివాస్ విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: రక్తదానంపై యువతకు మరింత అవగాహన పెరగాలని ప్రభుత్వ రక్తనిధి కేంద్రం జిల్లా అధికారి డాక్టర్ సత్యశ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎస్బీఐ గ్రామీణ ఉపాధి శిక్షణ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధి శిక్షణ కోసం వచ్చిన యువతీయువకులు సమాజానికి అవసరమైన సేవా కార్యక్రమలపై దృష్టి సారించాలన్నారు. అత్యవసర సమయంలో రక్తం అందక చాలా మంది మృత్యువాత పడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చాలామందికి రక్తదానం చేస్తే నీరసించిపోతామనే అపోహలున్నాయని,అటువంటి వాటిని విడనాడాలని సూచించారు. ఆరోగ్యంగా ఉన్న వారు ప్రతి మూడు నెలలకొకసారి రక్తదానం చేయవచ్చన్నారు. రక్తనిధి కేంద్రాల్లో కూడా నిల్వలు లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని, అటువంటి సమయంలో రక్తం అవసరమైన రోగులు చాలా ఇబ్బందిపడుతున్నరని చెప్పారు. శిక్షణకు వచ్చిన వారిని చైతన్యపరిచి రక్తదానం శిబిరం నిర్వహించిన శిక్షణ కేంద్రం నిర్వాహకులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహించాలని సూచించారు. అనంతరం 15 మంది విద్యార్థులు, సంస్థ సిబ్బంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో సంస్థ డెరైక్టర్ వేమూరి శివశంకర్, సిబ్బంది వర్మ, తదితరులు పాల్గొన్నారు.