బిడ్డను దత్తత తీసుకోవాలంటే...
అవగాహన
ఇంట్లో పిల్లలు తిరుగాడాలని కోరుకోని వాళ్లుండరు. కానీ కొందరికి పిల్లలు కలగడం అందని చందమామగానే ఉండిపోతోంది. అలాంటి వారు తల్లిదండ్రులకు దూరమైన మరో బిడ్డకు మాతృత్వాన్ని పంచితే... ఏకకాలంలో ముగ్గురి సమస్యలు పరిష్కారమైనట్లే. ముగ్గురి ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. మరి బిడ్డను దత్తత తీసుకోవడం ఎలాగంటే...
రాష్ట్ర ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌ని సంప్రదించాలి. ఈ కార్యాలయం హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉంది. జిల్లాల్లో అయితే దత్తత వ్యవహారాలు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతాయి.
దరఖాస్తు పెట్టుకున్న వారిని ముఖాముఖి పరిశీలిస్తారు. వారు వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి. వారి ఆర్థిక పరిస్థితి బిడ్డను పెంచడానికి సహకరించేదిగా ఉండాలి. దరఖాస్తు చేసుకున్న వారి మీద క్రిమినల్ కేసులు కానీ, బాలల హక్కులకు భంగం కలిగించినట్లు కేసులు కానీ ఉండరాదు. బిడ్డను దత్తత చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టినా కూడా ఈ బిడ్డను వదలకుండా పెంచుతామని ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత బిడ్డను ఇస్తారు.
హైదరాబాద్‌లో నివసిస్తున్న వారు ఈ నంబర్లలో సంప్రదించాలి: దత్తత విభాగం అడిషనల్ డెరైక్టర్ ఆంధ్రప్రదేశ్‌కు- 9440814425, తెలంగాణకు - 9440100185 . రెండు రాష్ట్రాల్లోని జిల్లాల వారు సంబంధిత రాష్ట్ర అడిషనల్ డెరైక్టర్‌కు ఫోన్ చేసి, తమ జిల్లా కార్యాలయం నంబరు తీసుకోవచ్చు.