న్యాయసేవలపై అవగాహన అవసరం
Published Sun, Dec 11 2016 1:30 AM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM
∙న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కమలాకర్‌రెడ్డి
అనంతపురం (బుక్కరాయసముద్రం ): న్యాయసేవలపై ప్రతి ఒక్కరికీ అవగాహ న తప్పని సరి అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కమలాకర్‌రెడ్డి తెలిపారు. నగరంలోని ప్రభుత్వ ఆర్‌్ట్స కళా శాలలో శనివారం రాజనీతి శాస్త్ర శాఖ, జి ల్లా న్యాయసేవాధికార సంస్థ, నెహ్రూ యువకేంద్రం, ఎన్ఎస్‌ఎస్ సంయుక్తంగా ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రంగస్వామి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా కమలాకర్‌రెడ్డి మా ట్లాడారు. ప్రజలకు న్యాయపరమైన సేవ లు అందించేందుకు 24 గంటలూ న్యాయసేవాధికార సంస్థ అందుబాటులో ఉం టుందన్నారు. ఎవరిౖకెనా అన్యాయం జరిగితే ఈ సంస్థను సంప్రదించాలన్నారు. ప్ర ముఖ న్యాయవాది పద్మజ, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ శివకుమార్, రాజనీతిశాస్త్ర అధిపతి ప్రొఫెసర్ దివాకర్‌రెడ్డి, అధ్యాపకులు శ్యాం ప్రసాద్, శేషారెడ్డి, ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement