Necessary
-
Tit For Tat: ఇంగ్లండ్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన భారత్
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ రేసిజం చూపిస్తున్న ఇంగ్లండ్‌కు భారత్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇక మీదట ఇంగ్లాండ్ నుంచి భారత్‌కు వచ్చే యూకే సిటిజన్స్‌కు పదిరోజుల క్వారంటైన్ నిబంధనను తప్పినిసరి చేసింది. రెండు డోసులు వ్యాక్సినేషన్ వేసుకున్నప్పటికీ ఈ నిబంధనను పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే సోమవారం నుంచి భారత్ పర్యటనకు వచ్చే యూకే సిటిజన్లందరికీ క్వారంటైన్ నిబంధన అమలులోకి వస్తుందని కేంద్రం ఉత్తర్వులను జారీచేసింది. అదేవిధంగా.. భారత్‌కు వచ్చే ఇంగ్లండ్ పౌరులు తమ ప్రయాణానికి 72 గంటల ముందు మూడు సార్లు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది. భారత్‌కు చేరుకున్న తర్వాత యూకే సిటిజన్లు తాము వెళ్లదలుచుకున్న డెస్టినేషన్‌కు ముందు పదిరోజుల పాటు హోం క్వారంటైన్ ఉండాల్సిందేనని అధికార వర్గాలు తెలిపాయి. ఇంగ్లండ్‌లో వ్యాక్సిన్ తప్పనిసరి నిబంధనను సడలించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు అధికారులు విజ్జప్తి చేసినప్పటికీ యూకే పెడచెవిన పెట్టింది. దీంతో కేంద్రం కూడా అదే తరహాలో ఇంగ్లండ్‌కు గట్టి షాక్ ఇస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: ‘మా పెన్నులు విరగ్గొట్టకండి’.. అఫ్గన్ మహిళల వినూత్నంగా.. -
న్యాయసేవలపై అవగాహన అవసరం
∙న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కమలాకర్‌రెడ్డి అనంతపురం (బుక్కరాయసముద్రం ): న్యాయసేవలపై ప్రతి ఒక్కరికీ అవగాహ న తప్పని సరి అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కమలాకర్‌రెడ్డి తెలిపారు. నగరంలోని ప్రభుత్వ ఆర్‌్ట్స కళా శాలలో శనివారం రాజనీతి శాస్త్ర శాఖ, జి ల్లా న్యాయసేవాధికార సంస్థ, నెహ్రూ యువకేంద్రం, ఎన్ఎస్ఎస్ సంయుక్తంగా ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రంగస్వామి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా కమలాకర్‌రెడ్డి మా ట్లాడారు. ప్రజలకు న్యాయపరమైన సేవ లు అందించేందుకు 24 గంటలూ న్యాయసేవాధికార సంస్థ అందుబాటులో ఉం టుందన్నారు. ఎవరిౖకెనా అన్యాయం జరిగితే ఈ సంస్థను సంప్రదించాలన్నారు. ప్ర ముఖ న్యాయవాది పద్మజ, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ శివకుమార్, రాజనీతిశాస్త్ర అధిపతి ప్రొఫెసర్ దివాకర్‌రెడ్డి, అధ్యాపకులు శ్యాం ప్రసాద్, శేషారెడ్డి, ఈశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.