
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ రేసిజం చూపిస్తున్న ఇంగ్లండ్‌కు భారత్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇక మీదట ఇంగ్లాండ్ నుంచి భారత్‌కు వచ్చే యూకే సిటిజన్స్‌కు పదిరోజుల క్వారంటైన్ నిబంధనను తప్పినిసరి చేసింది. రెండు డోసులు వ్యాక్సినేషన్ వేసుకున్నప్పటికీ ఈ నిబంధనను పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే సోమవారం నుంచి భారత్ పర్యటనకు వచ్చే యూకే సిటిజన్‌లందరికీ క్వారంటైన్ నిబంధన అమలులోకి వస్తుందని కేంద్రం ఉత్తర్వులను జారీచేసింది.
అదేవిధంగా.. భారత్‌కు వచ్చే ఇంగ్లండ్ పౌరులు తమ ప్రయాణానికి 72 గంటల ముందు మూడు సార్లు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది. భారత్‌కు చేరుకున్న తర్వాత యూకే సిటిజన్లు తాము వెళ్లదలుచుకున్న డెస్టినేషన్‌కు ముందు పదిరోజుల పాటు హోం క్వారంటైన్ ఉండాల్సిందేనని అధికార వర్గాలు తెలిపాయి.
ఇంగ్లండ్‌లో వ్యాక్సిన్ తప్పనిసరి నిబంధనను సడలించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు అధికారులు విజ్జప్తి చేసినప్పటికీ యూకే పెడచెవిన పెట్టింది. దీంతో కేంద్రం కూడా అదే తరహాలో ఇంగ్లండ్‌కు గట్టి షాక్ ఇస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
చదవండి: ‘మా పెన్నులు విరగ్గొట్టకండి’.. అఫ్గన్ మహిళల వినూత్నంగా..
Comments
Please login to add a commentAdd a comment