న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. శుక్రవారం బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో 17, 070 కొత్త కొవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే (18వేలకుపైగా) తక్కువే అయినప్పటికీ.. పాజిటివిటీ రేటు పెరిగిపోతుండడం, రికవరీలు పెరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో కొత్తగా 17,070 కేసులు నమోదు అయ్యాయి. 23 కరోనా మరణాలు చోటు చేసుకున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 1,07, 189కి చేరింది. దేశంలో 3.40 శాతానికి కరోనా పాజిటివిటీ రేటు పెరిగింది. ఈ మధ్యకాలంలో రికవరీల సంఖ్య పెరగకపోవడంపై వైద్య విభాగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశవ్యాప్తంగా టెస్టుల సంఖ్య పెంచితే.. కేసులు ఇంకా ఎక్కువే బయటపడతాయని అంచనా వేస్తున్నారు.
ఇక సుమారు 122 రోజుల తర్వాత.. దేశంలో లక్ష మార్క్‌ను దాటేశాయి కరోనా యాక్టివ్ కేసులు. గత రెండు వారాల సగటున 78 శాతం కేసుల పెరుగుదల కనిపిస్తోందని, మరణాలు కూడా 119 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ విషయంలోనూ కేంద్రం స్పష్టమైన ప్రకటనలూ చేస్తూ వస్తోంది.
#Unite2FightCorona
— Ministry of Health (@MoHFW_INDIA) July 1, 2022
➡️ Over 86.28 Cr COVID Tests conducted so far.
➡️ Weekly Positivity Rate currently at 3.59%.
➡️ Daily Positivity Rate stands at 3.40%. pic.twitter.com/aRFcPhQ8Is
ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగానూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయ్. గత వారం రోజుల్లో 4.1 మిలియన్ కేసులు నమోదు అయ్యాయని, 18 శాతం పెరుగుదల కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కరోనా మహమ్మారి కథ ముగియలేదని, మార్పు తీసుకుని వేరియెంట్ల రూపంలో విరుచుకుపడే అవకాశం ఉందని ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తోంది డబ్ల్యూహెచ్‌వో.
Comments
Please login to add a commentAdd a comment