
కరోనా కేసులు భారత్‌లో తగ్గుముఖం పట్టడం లేదు. పాజిటివిటీ రేటు ఏకంగా 4పైకి..
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. గత వారంగా క్రమం తప్పకుండా 15వేలకు పైనే కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దీనికి తోడు డెయిలీ పాజిటివిటీ రేటు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. టెస్టుల సంఖ్య పెంచితే.. కేసులు ఇంకా ఎక్కువే బయటపడతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. అదే సమయంలో జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు.
తాజాగా.. దేశంలో ఒక్కరోజులో 17,092 కేసులు నమోదు అయ్యాయి. మరణాలు 29 నమోదుకాగా.. 14,684 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,09,568కి చేరుకోగా.. పాజిటివిటీ రేటు 4.14 శాతానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రేసింగ్‌పై దృష్టిసారించాలని కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు కేంద్రం సూచిస్తోంది. మరోవైపు కరోనా జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరుతోంది.
#AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) July 2, 2022
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/VkryOJG5vz pic.twitter.com/QxO99p5odW
భారత్‌లో ఇప్పటిదాకా కరోనాతో 5,25,168 మంది మరణించారు. కరోనా రికవరీ రేటు 98.54 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 4,28,51,590 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా 1,97,84,80, 015 డోసుల వ్యాక్సినేషన్ పూర్తైంది. కొత్త వేరియెంట్ల ముప్పు పొంచి ఉందన్న డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలను ఇప్పటికే పలు దేశాలు పరిగణనలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నాయి.