హక్కులపై అవగాహన అవసరం
సిరిసిల్ల :
ప్రవాస భారతీయులు చట్టపరమైన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి తడకమడ్ల మురళీధర్ సూచించారు. సిరిసిల్ల కోర్టులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రవాస భారతీయులకు చట్టపరంగా లభించే హక్కులు, రక్షణ చట్టాలపై అవగాహన కల్పించేందుకు సిరిసిల్లలో శనివా రం ఉదయం పది గంటలకు పద్మశాలి కల్యాణ మండపంలో న్యాయచైతన్య సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాస్‌పోర్టు చట్టం, ఇమిగ్రేషన్, ప్రవాసీ భారతీయ బీమాయోజన, మహాత్మాగాంధీ ప్రవాసీ సురక్షయోజన, వలసదారులకు ఉండే హక్కులు, పరిహార చట్టం, ప్రమాద బీమా వంటి సదుపాయాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సదస్సు ఏర్పాటు చేశామన్నారు. లెసైన్స్ కలిగిన గల్ఫ్ ఏజెంట్లు, వీసాల జారీ వ్యవహారం వంటి అంశాలపై వివరిస్తారని తెలిపారు. ఈ సదస్సుకు వలసదారుల హక్కుల మండలి కార్యదర్శి మంద భీమ్‌రెడ్డి, ఎమిగ్రేట్స్ వెల్ఫేర్ ప్రొటక్షన్ ఫోరం ప్రతినిధి నాగుల రమేశ్ తోపాటు పలువురు అధికారులు హాజరవుతారని చెప్పారు. డివిజన్‌లోని వలస వెళ్లే కార్మికు లు ఈ సదస్సుకు హాజరై చట్టపరమైన హక్కులపై అవగాహన పెంచుకోవాలని మురళీధర్ కోరారు. జడ్జి వెంట లోక్‌అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్ ఉన్నారు.