డేటింగ్ అనేది సక్రమ మార్గంలో వాడుకుంటే మంచిదే. ఒకర్నొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరి అభిరుచులు మరొకరికి తెలియడానికి, ఇద్దరి మధ్యా మంచి సాంగత్యానికి ఉపయోపడుతుంది. కానీ ప్రస్తుత సాంకేతిక యుగం, సోషల్ మీడియా విశృంఖలత్వంతోపాటు, డేటింగ్ యాప్‌లు ఈ అర్థాన్ని మార్చి పారేశాయి.హానికరమైన, విషపూరితమైన సంబంధాలకు నాంది పలుకుతూ కొత్త డేటింగ్ ట్రెండ్‌లు ఉద్భవించాయి. అలాంటి వాటిల్లో ఒకటి బెంచింగ్ డేటింగ్. అసలేంటి బెంచింగ్ డేటింగ్? దీనివలన లాభమా? నష్టమా? తెలుసుకుందాం ఈ కథనంలో.
ఆధునిక డేటింగ్ పదం బెంచింగ్ డేటింగ్. అంటే పేరుకు తగ్గట్టే భాగస్వాముల్లో ఒకర్ని హోల్డ్‌లో ఉంచి, మరొకరిపై ఆసక్తిగా ఉండటం. ప్రేమ భాగస్వామిని 'బెంచ్ మీద' ఉంచడం అంటే మరో బెస్ట్ ఆప్షన్ కోసం అన్వేషించడమే. అచ్చం ఒక ఆటగాడిని బెంచి మీద ఉంచడం లాంటిదన్నమాట. అంటే మెయిన్ టీంలో లేకుండా, ఆటలో పాల్గొనకుండా,సందర్భం కోసం వాడుకునేందుకు బెంచ్ మీద ఉండే ప్లేయర్ లాంటి వారు.
ఈ డేటింగ్‌లో బెంచింగ్ చేస్తున్న వారు, తోటి భాగస్వామితో స్నేహం చేస్తారు కానీ మనస్సు పూర్తిగా పూర్తిగా సంబంధానికి కట్టుబడి ఉండరు. అలాగే ఈ డేటింగ్‌లో బెంచ్‌మార్కింగ్" అంటే ఎవరైనా తమ ప్రస్తుత భాగస్వామితో, గతంలోని వారితో పోల్చపుడు, నెగెటివ్‌గా కమెంట్ చేయడం లాంటివి కూడా ఉంటాయి. అంతిమంగా ఇది రెండో వ్యక్తిలో (బెంచ్‌మీద ఉన్న) గందరగోళానికి మానసిక వేదనకు గురి చేస్తుంది. నిజాయితీ, నిబద్ధత లోపించడంతో అవతలి వారిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఒకరిమీద ఒకరికి విశ్వాసం, నమ్మకం లేనపుడు ఇక ప్రేమకు తావు ఎక్కడ ఉంటుంది. మోసపోయామన్న నిరాశ, నిస్పృహతోపాటు కొన్ని అనారోగ్యకరమైన, పెడధోరణులకు దారి తీయవచ్చు.
బెంచ్‌మార్కింగ్ సంకేతాలు
ప్రస్తుత భాగస్వామిని మాజీలు లేదా గత సంబంధాలతో క్రమం తప్పకుండా పోల్చడం.
అవాస్తవిక అంచనాలతో ఉండటం, వాళ్లు చెప్పినట్టే వినాలని అన్యాయంగా పట్టుబట్టటం
ఎపుడూ అసంతృప్తిగా ఉండటం, మరొకరితో పోల్చి, ఉద్దేశపూర్వకంగా అవమానించడం.
నమ్మకం లేకపోవడం, ఎపుడూ విమర్శిస్తూ ఉండటం
తమ రిలేషన్‌ను మరింత ఆరోగ్యకరంగా ముందుకు తీసుకెళ్లేందుకు సుతరామూ అంగీకరించకపోవడం
ఇదీ చదవండి : భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!
జాగ్రత్తలు
పైన పేర్కొన్న అనుమానాస్పద లక్షణాలు కనిపించినపుడు అప్రమత్తం కావడం మంచిది. వీటిని గమనించి నపుడు అపార్థాలకు, అపోహలకు తావులేకుండా భాగస్వామితో మనసు విప్పి మాట్లాడుకొని, బంధం ముందుకు సాగే ప్రయత్నం చేయాలి. లేదా గతాన్ని వదిలేసి, బలమైన, ఆరోగ్యకరమైన సంబంధాలపై దృష్టి పెట్టడం ఉత్తమం.
సిమ్మర్ డేటింగ్
ఒకపుడు ద్దలు కుదుర్చుకునే పెళ్లిళ్లకే ప్రాధాన్యత ఉండేది. కాల క్రమంలో ప్రేమ వివాహాలపై యువతకు ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సిమ్మర్ డేటింగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రధానంగా జనరేషన్ జెడ్ దీనిని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అసలు ఈ సిమ్మర్ డేటింగ్ అంటే ఏమిటి? సుదీర్ఘ సంబంధాలపై దృష్టి పెట్టడమే దీని ప్రత్యేకత. చాలా కాలంపాటు బంధంలో కొనసాగడం వల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుందట. ఒకరిపై ఒకరికి అవగాహన, నమ్మకం పెరిగిన తరువాత లైంగిక బంధంలోకి అడుగుపెట్టడం మంచిదని, తద్వారా బంధం బలపడుతుందని నేటియువత భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment