ప్రశ్నించే గుణం అలవర్చుకోవాలి
ప్రశ్నించే గుణం అలవర్చుకోవాలి
Published Mon, Sep 12 2016 10:42 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
డిచ్‌పల్లి : విద్యార్థులు ప్రశ్నించే గుణం అలవర్చుకోవాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి హరినాథ్ అన్నారు. సోమవారం డిచ్‌పల్లి ప్రభుత్వ మోడల్ స్కూల్/కాలేజ్‌లో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హరినాథ్ మాట్లాడుతూ.. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, రాజ్యాంగం పట్ల విధేయతతో మెలగాలని, హక్కులతో పాటు, విధులను పాటించాలన్నారు. బాల్య వివాహలు, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా అన్ని రకాల న్యాయ సేవలు అందిస్తారని తెలిపారు. మహిళలు ప్రస్తుతం పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకెళుతున్నారని, ఇందుకు మలావత్ పూర్ణ, పీవీసింధు లను ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. కార్యక్రమంలో లీగల్ అథారిటీ సభ్యులు రాజ్‌కుమార్ సుబేదార్, మాణిక్యరాజ్, సుదర్శన్‌రావు తో పాటు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గణేశ్‌కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement