
ఓటర్లకు బల్ల బండ్లు, తోపుడు బండ్లు, కుట్టు మిషన్ల పంపిణీ
ఓ ప్రదేశంలో వాటిని నిలిపి.. ఓటర్లే వాటిని తీసుకెళ్లేలా ఒత్తిడి
అధికారులకు అనుమానం రాకుండా కొనసాగుతున్న ప్రలోభాలపర్వం
మంగళగిరి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఆ పార్టీ కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఓటర్లకు తాయిలాల రూపంలో బల్ల రిక్షాలు, తోపుడు బండ్లు, కుట్టుమిషన్‌లను పంపిణీ చేస్తోంది. ఈ పంపిణీ తతంగంపై అధికారులకు అనుమానం రాకుండా టీడీపీ నాయకులు వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నారు. తయారు చేయించిన బల్ల రిక్షాలు, తోపుడు బండ్లను ఏదో ఒక ప్రాంతంలో ఉంచుతారు.
ఆ ప్రాంతాన్ని ఓటర్లకు చెప్పి అక్కడకు వెళ్లి వాటిని తీసుకెళ్లాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో పలువురు ఓటర్లు బండ్లు ఉన్న ప్రాంతానికి వెళ్లి వాటిని తీసుకెళుతున్నారు. కుట్టుమిషన్లను టీడీపీ కార్యకర్తలే బైక్‌లపై పెట్టుకుని ఓటర్ల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేస్తుండటం విశేషం. ఎన్నికల అధికారులు మరింత నిఘా పెంచి టీడీపీ ప్రలోభాలపర్వాన్ని అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment