నంబర్ ప్లేట్ లేని టీడీపీ ప్రచార వాహనం
చిత్తూరు, తిరుపతి మంగళం: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మాత్రం యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచార రథాలకు వాహన నంబర్ సహా అధికారుల నుంచి అనుమతులు పొందాలి. తిరుపతి రూరల్ మండలం శెట్టిపల్లి పంచాయతీ మంగళంలో గురువారం పులివర్తి నాని ఎన్నికల ప్రచారంలో భాగంగా నంబర్ ప్లేట్ లేని వాహనంతో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఏపీ03వీజెడ్‌టీఆర్ 9527 ఇసుజు వాహనానికి రిటర్నింగ్ అధికారి జారీ చేసిన పాస్ ఉన్నప్పటికీ నంబర్ ప్లేట్ లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో లెక్కలేనన్ని వాహనాలను అనుమతులు లేకుండా ప్రచారం కోసం వినియోగిస్తున్నారని అంతర్గత సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment