ఎన్నికల కోడ్‌ను లెక్క చేయకుండా టీడీపీ నేతలు అర్థరాత్రి తోపుడు బండ్లు పంపిణీ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. టీడీపీ మంత్రి దేవినేని ఉమ అండతో టీడీపీ నేతలు ఆదివారం అర్థరాత్రి ఇబ్రహీంపట్నంలోని కొండపల్లి గ్రామంలో టీడీపీ వార్డ్ మెంబర్ మల్లెంపూడి శ్రీను ఆధ్వర్యంలో తోపుడు బండ్ల పంపిణీ చేశారు. గత వారం వైఎస్సార్‌సీపీ నాయకుడు బొమ్మసాని చలపతి రావు ఇంట్లో ఎన్నికల కోడ్ కంటే ముందే కొనుగోలు చేసిన క్రికెట్, వాలీబాల్ కిట్ లను పోలీసులు సోదాలు నిర్వహించి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.