krishana
-
20 వేల కిలో మీటర్లు ప్రయాణించి.. ఆలివ్ రిడ్లే తాబేళ్ల ఆసక్తికర విషయాలు..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని సముద్ర తీరాలకు చేరుకుంటున్నాయి. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న ఈ జాతి తాబేళ్లను రక్షించేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లలో ఏడు రకాల జాతులు ఉన్నాయి. వీటిలో 5 రకాలు జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఎక్కువ. రెండు అడుగుల వెడల్పు.. 50 కిలోల వరకూ బరువు పెరిగే ఈ తాబేలు ఎక్కడైతే గుడ్డు నుంచి పిల్లగా బయటకు వస్తుందో.. తిరిగి అక్కడికే వచ్చి గుడ్లు పెట్టడం ఈ జాతి ప్రత్యేకత. ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు సుమారు 20 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి తీరానికి వస్తాయి. దేశంలోని ఒడిశా తీరంలో ఈ జాతి తాబేళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ తరువాతి స్థానం ఆంధ్రప్రదేశ్‌దే. మన రాష్ట్రంలో కాకినాడ తీరంలోని ఉప్పాడ, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యం, కృష్ణా జిల్లాలోని కోడూరు మండలం పాలకాయతిప్ప నుంచి నాగాయలంక మండలం జింకపాలెం వరకూ, గుంటూరు జిల్లాలో నిజాంపట్నం, బాపట్ల పరిధిలోని సూర్యలంక ప్రాంతం వరకు ఈ జాతి తాబేళ్లు ఎక్కువగా వస్తుంటాయి. ఆడా.. మగా నిర్ధారించేది ఉష్ణోగ్రతలే ఆలివ్ రిడ్లే తాబేలు గుడ్లు పెట్టి పిల్లగా మారడానికి 28 డిగ్రీల నుంచి 32 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. 30 నుంచి 32 డిగ్రీల మధ్య పుట్టిన తాబేలు ఆడ తాబేలు అవుతుంది. అంతకంటే తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలో పుట్టే పిల్లలు మగ తాబేళ్లు అవుతాయి. సృష్టిలో ఒక్క తాబేలు జాతికి మాత్రమే ఇలాంటి ప్రత్యేకత ఉంది. ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఏటా అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఫలదీకరణ కోసం వస్తుంటాయి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో గుడ్లు పెడతాయి. ఇసుకలో 30 నుంచి 45 సెం.మీ. లోతున కుండాకారంలో గొయ్యి తీసి.. 60 నుంచి 120 వరకూ గుడ్లు పెడతాయి. గొయ్యి తీసేదగ్గర నుంచి గుడ్లు పెట్టడానికి 45 నిమిషాల నుంచి ఒక గంట సమయం తీసుకుంటుంది. ఈ గుడ్లు 45 నుంచి 50 రోజుల తరువాత పిల్లలు బయటకొస్తాయి. ఆలివ్ రిడ్లే తాబేళ్ల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది. సముద్రంలో ఆక్సిజన్ శాతం పెంచేందుకు.. చేపల సంతానం వృద్ధి చెందేందుకు తాబేలు ఎంతగానో దోహదపడుతుంది. చేప పిల్లలను తిని జీవించే జెల్లీ చేపలను తాబేలు తినడం వల్ల చేపల ఉత్పత్తి పెరుగుతుంది. తాబేలు ఎంత లోతులో ఉన్నా ప్రతి 45 నిమిషాలకు ఒకసారి నీటిపైకి వచ్చి ఆక్సిజన్ తీసుకుని లోపలకు వెళుతుంటుంది. అవి నీటిలో పైకి, కిందకు రావడం వల్ల నీటిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఈ విధంగా పర్యావరణానికి తాబేలు ఎంతో మేలు చేస్తుంది. గుడ్డు పెడుతున్న తాబేలు, నాగాయలంక మండలం ఐలాండ్ వద్ద సముద్రంలోకి తాబేళ్లను వదులుతున్న ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక హేచరీల ద్వారా రక్షణ అరుదైన ఆలివ్ రిడ్లే జాతి తాబేలుని రక్షించేందుకు అటవీ శాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అవనిగడ్డ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో కోడూరు మండలం పాలకాయతిప్ప వద్ద ఒకటి, నాగాయలంక మండలం లైట్‌హౌస్ శివారు ఐలాండ్ దగ్గర మూడు, సంగమేశ్వరం వద్ద ఒకటి, నిజాంపట్నం, సూర్యలంక వద్ద రెండు హేచరీలను ఏర్పాటు చేశారు. 2009 నుంచి ఇప్పటి వరకూ 5 లక్షల తాబేళ్లను సముద్రంలోకి వదిలారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ కృష్ణా జిల్లా పరిధిలో 12,624 గుడ్లను సేకరించినట్టు అధికారులు చెప్పారు. తాబేళ్ల సంఖ్య పెరుగుతోంది ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టే కాలంలో వాటి ప్రాణాలకు ముప్పు వాటిల్లే వలలు వేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. దీనిపై మత్స్యశాఖ అధికారులతో కలసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గతంలో కంటే గుడ్లు పెట్టేందుకు వచ్చే తాబేళ్ల సంఖ్య ఏటా పెరుగుతోంది. – కేవీఎస్ రాఘవరావు, ఫారెస్ట్ అధికారి, అవనిగడ్డ రేంజ్ -
దూకుడుకు కళ్లెం పడేనా?
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ అమలుకు అటు కేంద్రం, ఇటు బోర్డులు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో, దీనిని అడ్డుకునే దిశగా తెలంగాణ మరోమారు రంగంలోకి దిగుతోంది. అక్టోబర్ 14నుంచి గెజిట్ అమల్లోకి వచ్చేందుకు కేవలం 20 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అయితే ఇంతవరకు బోర్డుల స్వరూపమే సిద్ధం కాలేదనే కారణంతో గెజిట్ అమలు వాయిదా వేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు మరోమారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను కలవాలని నిర్ణయించారు. ఈ నెల 25న షెకావత్‌తో భేటీ కానున్న సీఎం..గెజిట్‌పైనే చర్చించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గెజిట్ అమలుపై చర్యలు వేగిరం ఈ నెల 6న భేటీ సందర్భంగా కూడా గెజిట్ అమలును వాయిదా వేయాలని షెకావత్‌ను కేసీఆర్ కోరారు. అమలుకు గడువు తక్కువగా ఉండ డంతో.. సిబ్బంది నియామకం, వ్యవస్థ స్థాపన, ప్రాజెక్టులకు అనుమతులు, పర్యవేక్షణ తదితర సమస్యలు ఆటంకంగా మారతాయని వివరిం చారు. దీనిపై ఆ భేటీలో కేంద్రం ఎలాంటి నిర్ణయం చెప్పకున్నా, తర్వాతైనా సానుకూలంగా స్పందించ వచ్చని తెలంగాణ ఎదురుచూసింది. అయితే దీనిపై ఎలాంటి సానుకూల నిర్ణయాలు వెలువడక పోగా.. గెజిట్ అమలు దిశగా కేంద్రం, బోర్డులు చర్యలు వేగిరం చేశాయి. గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ సీఐఎస్ఎఫ్ సిబ్బంది నియామకం అంశాన్ని తెరపైకి తెచ్చాయి. సీఐఎస్ ఎఫ్ సిబ్బందికి అవసరమయ్యే వసతి సౌకర్యాలు, మౌలిక వసతులు, వాహనాలు, కార్యాలయాల ఏర్పాటు, వారి జీతభత్యాలకు సంబంధించి ఓ ముసాయిదా పత్రాన్ని అందజేసి దానిపై ప్రభుత్వా ల వివరణలు కోరాయి. రెండు నదీ బేసిన్లపై ఉన్న ప్రాజెక్టులు, కాలువల వ్యవస్థ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా చేసే వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాల వివరాలతో పాటు ప్రాజెక్టుల డీపీఆర్ లను పది రోజుల్లో తమకు సమర్పించాలని ఆదేశిం చాయి. ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్ చూస్తున్న ఏజెన్సీల వివరాలు కోరాయి. వివాదాలపై విన్నపాలు..: బోర్డుల వేగాన్ని చూస్తే అక్టోబర్ 14 నుంచి గెజిట్ అమలు పక్కాగా ఉండనుందని తెలుస్తోంది. దీనిపై వెనకడుగు వేసే పరిస్థితులు కానరావడం లేదు. అయితే మరోపక్క గోదావరి మళ్లింపు జలాల అంశంపై ఏపీ, తెలం గాణ మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గెజిట్ అమలు విషయంలో ఉన్న అభ్యంతరాలను సీఎం కేసీఆర్ కేంద్రమంత్రికి విన్నవించే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలతారెడ్డి విజయం
సాక్షి, అమరావతి: కృష్ణా-గుంటూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా కల్పలతారెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బొడ్డు నాగేశ్వరరావుపై కల్పలతారెడ్డి గెలుపొందారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 19 మంది పోటీ చేయగా, 12,554 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
మరింత అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిల్
సాక్షి, అమరావతి: కృష్ణా నదికి భారీగా వరద నీరు పోటెత్తడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సూచించారు. ఆయన ఆదివారం కృష్ణా,గుంటూరు జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఫోన్లో మాట్లాడారు. రాత్రికి ప్రకాశం బ్యారేజీకి వరద 6 లక్షల క్యూసెక్కులు దాకా వచ్చే అవకాశం ఉండటంతో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు,దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైన పునరావాస చర్యలు తీసుకోవాలని మంత్రి అనిల్ ఆదేశించారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఆయా జిల్లాలో ఇరిగేషన్ సీఈలతో మంత్రి అనిల్ ఫోన్లో మాట్లాడారు. మూడు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేవిధంగా చర్యలు చేపట్టాలని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆదేశించారు. -
నదులకు జీవం.. అడవుల రక్షణ
సాక్షి, అమరావతి: దేశంలోని గోదావరి, కృష్ణాతోపాటు 13 జీవ నదుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. నదీ తీరం వెంబడి ఇరువైపులా అడవులను పెంచడం ద్వారా పర్యావరణ సమతుల్యాన్ని సాధించడం.. హఠాత్తుగా వచ్చే వరదల (ఫ్లాష్ ఫ్లడ్స్)కు అడ్డుకట్ట వేయడం.. ఏడాది పొడవునా నదుల్లో నీటి ప్రవాహం ఉండేలా చేయడానికి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లు రూపొందించే బాధ్యతను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్(ఐసీఎఫ్ఆర్ఈ)కి అప్పగించింది. అడవుల పెంపకం వల్ల నదీ పరీవాహక ప్రాంతంలో ఏకరీతిగా వర్షం కురిసే అవకాశం ఉంటుందని.. వర్షం నీటి ప్రవాహ ఉధృతికి అడ్డుకట్ట వేసి భూగర్భ జలాలు పెంపొందేలా చేస్తాయని.. ఇది నదిలో సహజసిద్ధ ప్రవాహాన్ని పెంచుతుందని పర్యావరణ నిపుణులు విశ్లేíÙస్తున్నారు. మరోవైపు భూమి కోతకు గురవకుండా అడవులు అడ్డుకుంటాయని, ఇది జలాశయాల్లో పూడిక సమస్యను పరిష్కరిస్తుందని చెబుతున్నారు. ‘నమామి గంగే’ తరహాలో.. ♦దేశంలో అత్యధిక శాతం ఆయకట్టుకు సాగునీటిని, అధిక శాతం ప్రజలకు తాగునీటిని అందించే జీవ నదులుగా బియాస్, చీనాబ్, జీలం, రావి, సట్లెజ్, లూని, యమున, నర్మద, గోదావరి, కృష్ణా, కావేరి, బ్రహ్మపుత్ర, మహానది పేరొందాయి. ♦గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిన ‘నమామి గంగే’ ప్రాజెక్ట్ తరహాలోనే ప్రత్యేక పద్ధతుల ద్వారా ఈ 13 నదులను పరిరక్షించకపోతే తాగు, సాగునీటి ఇబ్బందులు తప్పవని అటవీ, పర్యావరణ శాఖ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచి్చంది. ♦దీని ఆధారంగా ఈ నదుల పరిరక్షణకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లు రూపొందించే బాధ్యతను డెహ్రాడూన్ కేంద్రంగా పనిచేసే ఐసీఎఫ్ఆర్ఈకి కేంద్రం అప్పగించింది. ♦నది జన్మించిన ప్రదేశం నుంచి.. సముద్రంలో కలిసే వరకూ నదికి ఇరువైపులా ఎంత విస్తీర్ణంలో అడవుల్ని పెంచవచ్చనేది డీపీఆర్‌లో ఐసీఎఫ్ఆర్ఈ పొందుపర్చనుంది. ఈ నదుల పరిధిలోని అడవుల్లో ఎలాంటి చెట్లను పెంచాలన్నది నిర్ణయిస్తుంది. ♦ఈ ప్రాజెక్ట్ పూర్తయితే అటవీ విస్తీర్ణం పెరిగి పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల అన్నిచోట్లా ఏకరీతి వర్షపాతం సాధ్యమవుతుంది. ♦వర్షపు నీటిని అడవులు ఒడిసి పట్టడం ద్వారా నీటి ప్రవాహాన్ని క్రమబద్ధం చేసి ఫ్లాష్ ఫ్లడ్స్‌ను నివారిస్తాయి. దీనివల్ల భూగర్భ జలమట్టాలు స్థిరపడి నదిలో సహజసిద్ధ (ఊట) ప్రవాహం పెరిగేందుకు దోహదం చేస్తుంది. తద్వారా వేసవిలోనూ నదుల్లో పుష్కలంగా జలాలు లభిస్తాయి. ♦అడవుల్ని పెంచడం వల్ల జలాలు కలుషితం కావు. భూమి కోత నివారించబడి ప్రాజెక్టుల్లో పూడిక చేరదు. -
రేపు పులిచింతల నుంచి నీటి విడుదల
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వరుసగా రెండో ఏడాది కూడా జలకళ సంతరించుకున్న నేపథ్యంలో రైతుల కళ్లలో ఆనందం వెల్లువిరిస్తోంది. భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగు పెట్టిన వేళా విశేషంతో ప్రాజెక్టులన్నీ నిండుతున్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది రాష్ట్రంలో 12 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైందని, శనివారం పులిచింతల నుంచి నీరు విడుదల చేస్తామని తెలిపారు. గత నెల 27 నుంచి పోతిరెడ్డి పాడు ద్వారా నీటిని విడుదల చేస్తున్నామని, రాయలసీమలోని అన్ని ప్రాజెక్టుల్లో నీటిని నింపుతామని మంత్రి స్పష్టం చేశారు. శుక్రవారం మంత్రి అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ... ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా కరువుకి శాశ్వత పరిష్కారం చూపుతాం. రాయలసీమ లిఫ్ట్ టెండర్లు పూర్తి చేశాం. ఎన్ని అడ్డంకులు సృష్టించిన సీఎం జగన్ పూర్తి చేసి చూపిస్తారు. నీటి పంపకాల్లో మాకు వివాదాలు అవసరం లేదు. ఏపీకి రావాల్సిన వాటా నీటిని మాత్రమే వినియోగించుకుంటాం. గోదావరి వరద వలన ఎక్కడా గండి పడలేదు. వరదను సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. సీఎం జగన్ వస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని రుజువైంది. గోదావరి వరదపై ప్రతిపక్ష టీడీపీ చౌకబారు ఆరోపణలు చేస్తోంది. క్లిష్ల సమయంలోనూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు హైదరాబాద్ వెళ్లి దాక్కున్నారు. -
పందెం కోడికి భలే గిరాకీ
సాక్షి, కోనేరుసెంటర్(మచిలీపట్నం): జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. మరో మూడు వారాల్లో సంక్రాంతి పండుగ రానే వస్తుంది. పండుగ మరో 20 రోజులు ఉండగానే సంక్రాంతి సరదాలు మొదలయ్యాయి. ఏ రంగుపై ఏ రంగు కోడిని వదలాలి, ఏది గెలుస్తుంది ఏది ఓడిపోతుందనే çముచ్చట్లు మండలంలో మొదలయ్యాయి. క్రితం పండక్కి నా రసంగి, కాకిని నేలకరిపించిందిరా బావ అంటే... నీ రసంగి కాకినే కొట్టింది నా నెమలి అయితే రంగుతో పని లేకుండా నాలుగు పందేలే చేసింది రా బావ అంటూ పందెంరాయుళ్లు ముచ్చట్లు మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా మరో 20 రోజుల్లో సంకాంత్రి సందడి మొదలు కానుండటంతో ఎక్కడ చూసినా కోడిపందేలా ముచ్చట్లే వినబడుతున్నాయి. జాతిపుంజుల కోసం జల్లెడ సంక్రాంతి సమీపిస్తుండటంతో పందెంకోళ్ల కోసం పందెంరాయుళ్లు పరుగులు పెడుతున్నారు. పందెంకోడి కూతపెడితే చాలు చటుక్కున ఆగి బేరసారాలు మొదలెడుతున్నారు. రంగును బట్టి ధర నిర్ణయించి డబ్బులు విసిరేస్తున్నారు. పుంజు నచ్చితే చాలు రేటు గురించి ఆలోచించకుండా చటుక్కున చంకలో పెట్టుకుంటున్నారు. పండుగ మరో 20 రోజులు మాత్రమే ఉండటంతో పందెంకోళ్లను బరుల్లోకి వదిలేందుకు సిద్ధం చేస్తున్నారు. అందుకోసం జీడిపప్పు, పిస్తా, కోడిగుడ్లుతో పాటు మరింత ఖరీదైన మేతలతో కోళ్లను పసిపిల్లల్లా సాకుతున్నారు. రంగును బట్టి పందెకోళ్లకు గిరాకీ ఉండటంతో నచ్చిన కోడిని కొనుక్కునేందుకు పందెంరాయుళ్లు వెనుకడుగు వేయటంలేదు. కాకి, పచ్చకాకి, డేగ, కాకిడేగ, నెమలి, సీతువా, రసంగి, పర్లా, కక్కిరి, మైలా ఇలా రంగులను బట్టి ఒక్కో కోడి రూ.5000 నుంచి రూ.10000 మధ్య పలుకుతుండగా, జాతికోళ్లు అయితే రూ.8000 నుంచి రూ. 15,000 వరకు పలుకుతున్నాయి. అయితే రంగు నచ్చి కోడిపై మోజుపడితే చాలు పందెంరాయుళ్లు వాటిని కొనేందుకు ఏమాత్రం వెనుకాడటంలేదు. సండే మార్కెట్లో సందడి సంక్రాంతి సమీపిస్తుండటంతో సండే మార్కెట్లో సందడి మొదలైంది. మిగిలిన రోజుల్లో కూర కోళ్లకు మాత్రమే గిరాకీ ఉండగా గత రెండు వారాలుగా పందెంపుంజులు మార్కెట్లో కూతలు పెడుతున్నాయి. దీంతో గత రెండు ఆదివారాలుగా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే పందెంరాయుళ్లు పందెం పుంజుల కోసం సండే మార్కెట్‌కు పెద్ద సంఖ్యలో చేరతున్నారు. మచిలీపట్నంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పందెంరాయుళ్ళు సండే మార్కెట్లో పందెంకోళ్లు కోసం పడిగాపులు పడుతున్నారు. కోడి రంగు, పోట్లాట, కోడి సైజును బట్టి బేరసారాలు చేసి నచ్చిన పుంజులను పట్టుకుపోతున్నారు. దీంతో బందరు నియోజకవర్గంలో మూడు వారాల ముందుగానే సంక్రాంతి సందడి మొదలైనట్లు కనబడుతుంది. -
ఉగ్రవేణి.. ఇళ్లల్లోకి భారీగా వరద నీరు
సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. మూడో రోజైన గురువారం కూడా ప్రకాశం బ్యారేజీ వద్ద 70 గేట్లను ఎత్తివేశారు. సాయంత్రం 6 గంటలకు బ్యారేజీ నుంచి 4,51,686 క్యూసెక్కుల (39.03 టీఎంసీలు)ను సముద్రంలోకి వదులుతున్నారు. శుక్రవారం ఉదయానికి కూడా ప్రవాహ ఉధృతి మరింత పెరిగింది. పరిస్థితి ఆందోళనకరంగా మారటంతో లంక గ్రామాల్లోని ప్రజలను యుద్ధప్రాతిపదికన పునరావాస కేంద్రాలకు తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. లంక గ్రామాలను ఏ క్షణంలో అయినా వరద ముంచెత్తే అవకాశం ఉందని.. వృద్ధులు తక్షణమే పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని మైక్‌లో ప్రచారం చేశారు. విజయవాడ ప్రాంతం నుంచి సుమారు 2 వేల కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కృష్ణా జిల్లాలో ప్రస్తుతానికి 791 హెక్టార్లలో అరటి, పసుపు, మిర్చి, బొప్పాయి, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా అంచనా వేశారు. కరకట్ట వద్ద పెరిగిన ముంపు కృష్ణా కరకట్ట వెంబడి ఉన్న ఇళ్లల్లో వరద ముంపు మరింత పెరిగింది. ఇక్కడే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉన్న విషయం విదితమే. ఆ భవనాన్ని కూడా వరద చుట్టుముట్టింది. అక్కడి భవనాల్లో ఎవరూ ఉండవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొనసాగుతున్న హై అలర్ట్ కృష్ణా పరిధిలో హై అలర్ట్ కొనసాగుతోంది. రానున్న మూడు, నాలుగు రోజుల్లో ఎగువన భారీ వర్షాలు కురుస్తాయన్న భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో ఆల్మట్టి నుంచి దిగువకు 5.20 లక్షల క్యూసెక్కుల(44.93 టీఎంసీలు)ను, నారాయణపూర్ నుంచి 5.27 లక్షల క్యూసెక్కుల(45.56 టీఎంసీలు)ను వదులుతున్నారు. ఉజ్జయిని జలాశయం నుంచి 5,950 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కృష్ణా, భీమా నదుల నుంచి జూరాల ప్రాజెక్ట్‌లోకి 7.05 లక్షల క్యూసెక్కుల(60.92 టీఎంసీలు)ను విడుదల చేస్తున్నారు. తుంగభద్రలో ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి 8.62 లక్షల క్యూసెక్కుల (74.55 టీఎంసీలు) ప్రవాహం చేరుతుండగా, దిగువకు 8.61 లక్షల క్యూసెక్కులు (74.48 టీఎంసీలు) విడుదల చేస్తున్నారు. సాగర్‌లోకి 8.78 లక్షల క్యూసెక్కులు (75.95 టీఎంసీలు) చేరుతుండగా.. నీటి నిల్వ 303.95 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతల ప్రాజెక్ట్‌లోకి 6.44 లక్షల క్యూసెక్కులు (55.71 టీఎంసీలు) వస్తుండగా.. అదే పరిమాణంలో దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా వరదలపై సీఎం సమీక్ష కృష్ణా నది వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. అమెరికా పర్యటనకు వెళ్లే ముందు.. వివిధ రిజర్వాయర్ల నుంచి విడుదల అవుతున్న నీటి వివరాలను తెలుసుకున్నారు. దాదాపు 7లక్షల క్యూసెక్కులకుపైగా నీరు ప్రకాశం బ్యారేజికి చేరుతుందని అధికారులు చెప్పడంతో కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులను అప్రమత్తం చేయాలని అదేశించారు. వరద సహాయక చర్యల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. -
పోటెత్తిన వరద.. ప్రకాశం గేట్లు ఎత్తివేత
సాక్షి, విజయవాడ: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. కర్ణాటకతో సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. మంగళవారం ఉదయం నుంచి పులిచింతల ప్రాజెక్టులోని 17 గేట్లను ఎత్తి దిగువన గల ప్రకాశం బ్యారేజికి నీటిని వదులుతున్నారు. దీంతో ప్రకాశంకు భారీ ఎత్తున వరద రావడంతో ప్రాజెక్టులో నీటినిల్వ 12 అడుగులకు చేరింది. దీంతో 72 గేట్లను ఎత్తిన అధికారులు వరదను దిగువకు వదులుతున్నారు. కృష్ణానది ఉదృతంగా ప్రవహిస్తుడడంతో జగ్గయ్యపేటలోని ముత్యాల, వేదాద్రి, రావిరాల గ్రామల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు నాగార్జున సాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద చేరుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం ఉదయం ప్రాజెక్టులోని 17 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా, సాగర్ గేట్లను పూర్తిగా ఎత్తడంతో ప్రస్తుతం 152 అడుగులకు చేరింది. సాగర్, శ్రీశైలం నుంచి వరద ఉదృతంగా ఉండడంతో పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌ల్లో నీటి నిలువ గంటగంటకు పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు పరిధిలోని ముంపు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం, సాగర్‌లో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. వరదను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి విడుదలను కలెక్టర్ ఇంతియాజ్ అహ్మాద్ పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి 72 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు గేట్లు ఎత్తే ముందు సైరన్ మోగించి అప్రమత్తం చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకి వరద పెరిగే అవకాశం ఉన్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ అహమ్మద్ తెలిపారు. ముందు జాగ్రత్తగా గేట్ల ఎత్తి నీటిని విడుదల చేశామాన్నారు. పరీవాహక ప్రాంతాలను అప్రమత్తం చేశామని, మత్యకారులు వేటకు వెళ్లొద్దని ఆయన సూచించారు. వరద మరింత పెరిగినా.. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, రెస్క్యూ టీంలు కూడా సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఎక్కడ ఎవరికీ ఏ ఇబ్బంది తలెత్తినా టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం ఇవ్వచ్చని పేర్కొన్నారు. -
పర్మిషన్ లేకుండా లే అవుట్ వేస్తే తప్పేంటి...?
సాక్షి, కృష్ణా జిల్లా: అనుమతులు లేకుండా వేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు చెందిన అక్రమ లే అవుట్‌ను అధికారులు ధ్వంసం చేశారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం గొల్లగూడెం గ్రామంలో కనీసం పంచాయతీ అనుమతులు కూడా తీసుకోకుండా లే అవుట్ వేసినట్లు అధికారులు తెలిపారు. అనధికార లే అవుట్‌పై బోడె ప్రసాద్‌ను అధికారులు ప్రశ్నించగా.. ఇక్కడ కొన్ని స్థలాలు అనుమతులు లేకుండానే ఉన్నాయని.. పర్మిషన్ లేకుండా వేస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. మహిళ అధికారి అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారు. నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలని అధికారులు తెలిపారు. -
గో‘దారి’పై కసరత్తు షురూ!
సాక్షి, అమరావతి: శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు గోదావరి జలాల తరలింపుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు వేర్వురుగా కసరత్తు ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శనివారం హైదరాబాద్‌లోని పోలవరం అతిథిగృహంలో సమావేశమైన ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, సలహాదారు రోశయ్య, రిటైర్డు ఈఎన్సీలు బీఎస్ఎన్ రెడ్డి, రెహమాన్, రౌతు సత్యనారాయణ, హైడ్రాలజీ విభాగం సీఈ రత్నకుమార్ తదితరులు దీనిపై చర్చించారు. మరోవైపు జలసౌధలో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ నేతృత్వంలో అధికారులు సమావేశం నిర్వహించారు. కృష్ణా బేసిన్‌కు గోదావరి జలాల తరలింపుపై ఆంధ్రప్రదేశ్ అధికారులు మూడు ప్రతిపాదనలు చేయగా తెలంగాణ అధికారులు ఐదు ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నారు. వీటిపై జూలై 3వతేదీన హైదరాబాద్‌లో నిర్వహించే ఉమ్మడి సమావేశంలో చర్చించి తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని తరలించడంపై రెండు ప్రతిపాదనలను ఖరారు చేసి ఇద్దరు సీఎంలకు నివేదించాలని నిర్ణయించారు. ఇద్దరు సీఎంలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన ప్రతిపాదన ఆధారంగా ప్రాథమిక నివేదికను జూలై 15 నాటికి సిద్ధం చేయనున్నారు. కృష్ణా నదిలో నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో సముద్రంలో కలుస్తున్న గోదావరి వరద జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు తరలించి తెలుగు నేలను సస్యశ్యామలం చేయాలని శుక్రవారం జరిగిన భేటీలో ఇద్దరు సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్‌లు నిర్ణయించిన విషయం తెలిసిందే. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌పై దృష్టి.. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ ప్రాజెక్టును రీ–ఇంజనీరింగ్ చేయడం, సామర్థ్యాన్ని పెంచడం ద్వారా గోదావరి జలాలను సాగర్, శ్రీశైలం జలాశయాలకు తరలించాలని రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు బలంగా ప్రతిపాదిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయ/æ్ఞంలో భాగంగా 2007లో దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ ప్రాజెక్టును చేపట్టారు. 2010లో ఈ పనులు ప్రారంభమైనా తర్వాత ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ రద్దు చేసింది. ఇప్పుడు దుమ్మగూడెం టెయిల్‌పాండ్ ప్రాజెక్టును రీ–ఇంజనీరింగ్ చేయడం ద్వారా అంటే దుమ్ముగూడెం నుంచి రోజుకు నాలుగు టీఎంసీలను హాలియా వరకూ తరలించి అక్కడి నుంచి రెండు టీఎంసీలను నాగార్జునసాగర్‌లోకి, మరో రెండు టీఎంసీలను శ్రీశైలంలోకి తరలించాలని ప్రతిపాదిస్తున్నారు. దుమ్ముగూడెం నుంచి హాలియా వరకూ ఆరు చోట్ల 127 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసి 244 కి.మీ.ల పొడవున తవ్వే కాలువ ద్వారా తరలించాలి. హాలియా నుంచి ఒక బ్రాంచ్ సాగర్‌కు, మరో బ్రాంచ్ శ్రీశైలానికి తరలించాలి. హాలియా నుంచి శ్రీశైలానికి తరలించాలంటే 50 కిమీల పొడవున కెనాల్, మరో 50 కిమీల టన్నెల్ తవ్వాలి. టన్నెల్ తవ్వడం రెండేళ్లలోపు పూర్తి చేయడం అసాధ్యమని, ఈ నేపథ్యంలో అదనంగా 70 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయాల్సి వస్తుందని.. ఇది వ్యయంతో కూడుకున్నదని ప్రతిపాదిస్తున్నారు. రివర్సబుల్ టర్బైన్ల ద్వారా టెయిల్‌పాండ్ నుంచి సాగర్‌లోకి ఎత్తిపోయడం.. సాగర్ నుంచి శ్రీశైలంలోకి ఎత్తిపోయడం జలవిద్యుదుత్పత్తిపై దుష్ఫ్రభావం చూపుతుందని.. రోజుకు ఒక టీఎంసీకి మించి ఎత్తిపోయడం సాధ్యం కాదని.. ఈ నేపథ్యంలో రివర్సబుల్ టర్బైన్ల ద్వారా నీటిని ఎత్తిపోయడం చేపట్టరాదని ప్రతిపాదిస్తున్నారు. దుమ్ముగూడెం నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు రోజుకు 4 టీఎంసీల గోదావరి జలాలను తరలించే ప్రాజెక్టుకు రూ.75 వేల కోట్లకుపైగానే వ్యయం అవుతుందని.. 2,400 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని ప్రాథమికంగా తేల్చారు. పలు ప్రతిపాదనలు.. కృష్ణా బేసిన్‌కు గోదావరి వరద జలాల తరలింపుపై పలు ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. జానంపేట నుంచి పైపులైన్ ద్వారా సాగర్, శ్రీశైలంలోకి గోదావరి జలాలను తరలించడం, రాంపూర్ నుంచి గోదావరి జలాలను ఆరు దశల్లో ఎత్తిపోయడం ద్వారా సాగర్, శ్రీశైలంకు తరలించడం, ఇచ్చంపల్లి నుంచి నేరుగా శ్రీశైలంలోకి గోదావరి జలాలను తరలించి.. అక్కడి నుంచి నది ద్వారా సాగర్‌కు సరఫరా చేయడాన్ని ప్రతిపాదిస్తున్నారు. పోలవరం ఎగువన నీటి లభ్యతపై అనుమానాలు పోలవరం ప్రాజెక్టు ద్వారా 340 టీఎంసీలను నేరుగా వినియోగిస్తారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 60 టీఎంసీలను వినియోగించుకుంటే అది 400 టీఎంసీలకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో పోలవరం ఎగువన అదనంగా 480 టీఎంసీల నీటి లభ్యత ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఇరు రాష్ట్రాల అధికారులు చెబుతున్నారు. ఒకవేళ నీటి లభ్యత ఉన్నట్లు తేలితే పోలవరం నుంచి ఐదు దశల్లో నీటిని మున్నేరులోకి ఎత్తిపోసి గ్రావిటీపై పులిచింతలకు తరలించి.. పులిచింతల ప్రాజెక్టు జలవిస్తరణ ప్రాంతం నుంచి టెయిల్‌పాండ్‌లోకి నీటిని ఎత్తిపోసి.. అక్కడి నుంచి రివర్సబుల్ టర్బైన్ల ద్వారా సాగర్‌కు తరలించి.. సాగర్‌లో నీటిమట్టం 560 మీటర్లకు చేరుకున్న తర్వాత శ్రీశైలం జలవిద్యుదుత్పత్తి కేంద్రంలోని రివర్సబుల్ టర్బైన్ల ద్వారా నీటిని శ్రీశైలం జలాశయంలోకి తరలించాలని ప్రతిపాదిస్తున్నారు. దీనివల్ల అటు శ్రీశైలం, ఇటు నాగార్జునసాగర్‌లలో జలవిద్యుదుత్పత్తి చేసే అవకాశం పూర్తిగా ఉండదు. పైగా ఈ ప్రతిపాదనను అమలు చేయాలంటే అధికంగా వ్యయం చేయాల్సి ఉంటుందని, నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన సహేతుకం కాదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ జలవనరుల శాఖ ప్రతిపాదనలు ఇవీ.. 1. ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు తరలించడం 2. పోలవరం ఎగువ నుంచి మున్నేరులోకి గోదావరి జలాలను ఎత్తిపోసి అక్కడి నుంచి గ్రావిటీపై పులిచింతలకు తరలించి.. అక్కడి నుంచి నాగార్జునసాగర్‌లోకి ఎత్తిపోసి.. సాగర్ నుంచి శ్రీశైలంలోకి తరలించడం. 3. దుమ్ముగూడెం టెయిల్ పాండ్ ప్రాజెక్టును రీ–ఇంజనీరింగ్ చేయడం ద్వారా శ్రీశైలం, సాగర్‌కు గోదావరి జలాలను ఎత్తిపోయడం 4. రాంపూర్ నుంచి గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు తరలించడం 5. జానంపేట నుంచి గోదావరి జలాలను శ్రీశైలం, సాగర్‌కు తరలించడం ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రతిపాదనలు ఇవీ.. 1. దుమ్ముగూడెం టెయిల్ పాండ్ ప్రాజెక్టును రీ–ఇంజనీరింగ్ చేసి రెండు టీఎంసీల నీటిని నాగార్జునసాగర్‌లోకి ఎత్తిపోయడం.. మరో రెండు టీఎంసీలను హాలియా నుంచి శ్రీశైలం తరలించడం 2. రాంపూర్ నుంచి గోదావరి జలాలను శ్రీశైలం, సాగర్లకు తరలించడం 3. పోలవరం ఎగువ నుంచి గోదావరి జలాలను శ్రీశైలం, సాగర్లకు తరలించడం (ఈ ప్రతిపాదన చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతోపాటు నీటి లభ్యత కూడా తక్కువనే అంశాన్ని ప్రస్తావించనున్నారు) 3న అధికారుల ఉమ్మడి సమావేశం రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ఇంజనీర్–ఇన్–చీఫ్‌లు, ఉమ్మడిగా ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ, రిటైర్డు ఇంజనీర్–ఇన్–చీఫ్‌లు జూలై 3వ తేదీన హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. రెండు ప్రతిపాదనలను ఖరారు చేసి వాటిపై అధ్యయనం అనంతరం ఇద్దరు సీఎంలకు ప్రాథమిక నివేదిక అందచేయాలని నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాలకు ముందే ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే అంటే జూలై 10వతేదీకి ముందే గోదావరి జలాలను కృష్ణా పరీవాహక ప్రాంతానికి తరలించడంపై ఇద్దరు సీఎంలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావులు తిరుపతి లేదా విశాఖపట్నంలలో సమావేశమై ఏకాభిప్రాయంతో ఒక ప్రతిపాదనపై ఆమోదముద్ర వేయనున్నారు. జూలై 15 నాటికి ప్రాథమిక నివేదిక.. ఇద్దరు ముఖ్యమంత్రులు ఆమోదించిన ప్రతిపాదన ఆధారంగా గోదావరి జలాల తరలింపుపై టోఫోగ్రాఫికల్, లేడార్ సర్వే చేసి టెక్నో ఫైనాన్షియల్ వయబులిటీ (సాంకేతిక, ఆర్థిక లాభసాటి)ని అధ్యయనం చేసి జూలై 15న నాటికి ప్రాథమిక నివేదిక సిద్ధం చేయనున్నారు. ఆ నివేదిక ఆధారంగా గోదావరి జలాల తరలింపుపై ఇద్దరు సీఎంలు నిర్ణయం తీసుకోనున్నారు. -
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన దేవినేని ఉమా
-
మంత్రి అండతో టీడీపీ నేతల కోడ్ ఉల్లంఘన
సాక్షి, కృష్ణా: ఎన్నికల కోడ్‌ను లెక్క చేయకుండా టీడీపీ నేతలు అర్థరాత్రి తోపుడు బండ్లు పంపిణీ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. టీడీపీ మంత్రి దేవినేని ఉమ అండతో టీడీపీ నేతలు ఆదివారం అర్థరాత్రి ఇబ్రహీంపట్నంలోని కొండపల్లి గ్రామంలో టీడీపీ వార్డ్ మెంబర్ మల్లెంపూడి శ్రీను ఆధ్వర్యంలో తోపుడు బండ్ల పంపిణీ చేశారు. గత వారం వైఎస్సార్సీపీ నాయకుడు బొమ్మసాని చలపతి రావు ఇంట్లో ఎన్నికల కోడ్ కంటే ముందే కొనుగోలు చేసిన క్రికెట్, వాలీబాల్ కిట్ లను పోలీసులు సోదాలు నిర్వహించి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలు మాత్రం మంత్రి అండ అర్థరాత్రి తోపుడు బండ్లును పంపిణీ చేయడంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఇంత చేస్తున్నా పోలీసులు పట్టించుకొవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకొవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
బాబువి ఊసరవెల్లి రాజకీయాలు
సాక్షి, కృష్ణా: చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచిన బాబు ఇప్పుడు తమని విమర్శించడం సిగ్గు చేటని వైఎస్పార్సీపీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి మండిపడ్డారు. శనివారం ఆయన తిరువూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఏపీ ప్రత్యేక హోదాకు మద్ధతుగా తెలంగాణ కేసీఆర్ నిలబడుతున్న నేపథ్యంలో జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా వారి ఫెడరల్ ప్రంట్ కూడా మన ప్రత్యేక హోదాకు డిమాండ్ కు మరింతగా మద్దతు చేకూరుతుందనే వైఎస్. జగన్ మోహన్‌రెడ్డి అభిప్రాయం అని అన్నారు. బాబు మీలాగా ప్రజలకు పూటకో మాట, గంటకో అబద్ధమాడటం ఊసరవెల్లి రాజకీయాలు చేయడం మాకు చేతకాదని అన్నారు. ఏపీ ప్రయోజనాలు విషయంలో రాజీలేని పోరాటం చేయబట్టే జాతీయ పార్టీలకు ఏనాడు లొంగకుండా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి 13 రాజకీయ కేసులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. జాతీయ పార్టీలతో లాలూచీ పడబట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి కేసులు లేకుండా, ఉన్న కేసులు ముందుకు కదలకుండా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి పొత్తు లేకుండానే ఒంటరిగానే వైఎస్సార్ సీపీ పోటీ చేస్తుందని రక్షణనిధి తెలిపారు. -
మొదటిసారి ఒక దళితుడితో..
కిచెరైవల్(కేరళ): మనుషుల మధ్య కులమతాల బేధాలు తొలగిపోవడానికి ఇది ఒక ఉదాహరణంగా చెప్పవచ్చు. నాటి రోజుల్లో దళితులకు దేవాలయాల్లోకి ప్రవేశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు శివుడి గర్భగుడిని కృష్ణా అనే దళిత పూజారితో తెరిపించారు. ఈ సంఘటన కేరళలోని కిచెరైవల్లో చోటుచేసుకుంది. వివరాలివి.. ట్రావెన్కోర్ దేవస్థాన్ రిక్రూట్మెంట్ బోర్డు ఆరుగురు దళిత పూజారులను ఎంపిక చేసింది. వీరిలో ఎస్సీ పులియా కమ్యూనిటికి చెందిన కృష్ణా అనే వ్యక్తి కూడా ఉన్నాడు. కేరళలో దళితులను పూజరులుగా నియమించడం ఇదే మొదటిసారి. కొంతమంది దళిత పూజారులను రిజర్వేషన్ కింద గవర్నమెంట్ ఉద్యోగులుగా నియమించడం ఒక గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఈ సందర్భంగా కృష్ణా మాట్లాడుతూ.. ‘మాది త్రిసూర్‌లోని చాలక్కుడి అనే ప్రాంతం. దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఎర్నాకుళంలోని దేవి ఆలయంలో పూజరిగా పని చేశాను. అక్కడి నుంచి నేను వస్తుంటే చాలా మంది భక్తులు భావోద్వేగానికి గురయ్యారు. కృష్ణా సంస్కృతంలో పీజీ చేశాడు. ఇతని తల్లిదండ్రులు రవి, లీలా. 12 సంవత్సరాల వయసులోనే ఎర్నాకుళం తంత్రాయ పీఠంలో చేరనని కృష్ణా చెప్పాడు.‘నాకు 15 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే మా ఊరిలో పూజారిగా పనిచేశానని తెలిపాడు.’ ట్రావెన్కోర్ దేవస్థాన్ బోర్డ్ కమిషనర్ సీపీ రామ రాజా ప్రేమ ప్రసాద్ మాట్లాడుతూ.. కొత్తగా ఎంపికైనా పూజారులు 15 రోజుల్లో వారికి కేటాయించిన దేవాలయాల్లో విధులకు హజరుకావాలని తెలిపారు. కేరళ హిందూ ఐక్యా వేదిక జనరల్ సెక్రటరీ ఈ ఎస్ బిజు మాట్లాడుతూ.. గతంలో మాదిరి పరిస్థితులు ప్రస్తుతం లేవు. ప్రజల ఆలోచన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. దళిత పూజారులను ప్రజలు సంతోషంగా స్వాగతిస్తున్నారని ఆయన అన్నారు. -
భక్తజన ప్రవాహం
సంగమేశ్వరంలో కొనసాగుతున్న రద్దీ – ఘాట్ల వద్ద తగ్గిన నీటి మట్టం – ఏపీ టూరిజం రెస్టారెంట్ ప్రారంభం సంగమేశ్వరం(ఆత్మకూరు): కృష్ణా తీరంలో భక్తజన ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. సంగమేశ్వర క్షేత్రం వద్ద పుణ్య స్నానాలతో భక్తులు తరిస్తున్నారు. కృష్ణా పుష్కరాల్లో భాగంగా 8వ రోజు శుక్రవారం కడప, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వందలాది కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న భక్తులు నదీ ప్రవాహం చూసి తమను తాము మైమరిచిపోతున్నారు. పుష్కర స్నానం ఆచరించిన తర్వాత ఉమామహేశ్వర స్వామిని దర్శించుకొని పరవశిస్తున్నారు. క్షేత్ర పరిధిలో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోటు షికారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇకపోతే సంగమేశ్వరం వద్ద కృష్ణా జలాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఘాట్ల వద్ద శుక్రవారం మూడు అడుగుల మేర నీరు తగ్గింది. లలితాదేవి ఘాట్ వద్ద మెట్లపై కూర్చొని స్నానం చేసేందుకు భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఘాట్ల వద్ద రద్దీ కనిపించింది. అయితే రెండు రోజులుగా వీఐపీల తాకిడి తగ్గింది. ఈ ఘాట్‌కు సమీపంలో 4 కిలోమీటర్ల దూరంలోని తెలంగాణ రాష్ట్రంలో కొలువైన సోమశిల క్షేత్రం వద్ద వీఐపీలు, సినీ తారల సందడి అధికంగా ఉంది. ప్రారంభమైన ఏపీ టూరిజం రెస్టారెంట్ సంగమేశ్వరం ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఏపీ టూరిజం రెస్టారెంట్‌ను జేసీ హరికిరణ్ ప్రారంభించారు. పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి గురువారం రోజు వరకు ఇక్కడ ఎలాంటి క్యాంటీన్లు లేకపోవడంతో భక్తులు ఇబ్బందిపడ్డారు. దారి వెంట తెచ్చుకున్న తినుబండారాలతోనే కడుపు నింపుకోవాల్సి వచ్చింది. తాజాగా ఏర్పాటు చేసిన రెస్టారెంట్ క్షేత్రానికి వచ్చే భక్తులతో పాటు సోమశిల ప్రయాణికులకు ఉపయుక్తం కానుంది. ప్రస్తుతం టీ, టిఫెన్‌కే పరిమితమైనా.. త్వరలో శాఖాహార భోజన సదుపాయం కల్పించనున్నారు. ట్రాఫిక్ క్రమబ్ధకరణ భక్తుల రద్దీ దృష్ట్యా పార్కింగ్ ప్రాంతంతో పాటు రహదారులు వాహనాలతో కిక్కిరిశాయి. పోలీసులతో పాటు వాలంటీర్లు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు శ్రమించారు. కపిలేశ్వరం గ్రామ సమీపంలో ఆటోలు, ట్రాక్టర్లు, మినీ వ్యాన్లు, మోటార్ సైకిళ్లను నిలిపేసి పార్కింగ్ చేయించారు. అన్ని ప్రాంతాలకు చెందిన బస్సులను పుష్కరనగర్‌కు అనుమతించారు. ఇక్కడి నుంచి భక్తులు ఉచిత బస్సుల్లో సంగమేశ్వరం చేరుకుంటున్నారు. -
కృష్ణా పుష్కరాలకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏర్పాట్లు
డీఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీ అల్లిపురం: కృష్ణా పుష్కరాలకు వెళ్లే యాత్రికులు సౌకర్యార్థ్ధం ఈ నెల 12వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే విస్తత ఏర్పాట్లు చేసినట్లు డీఆర్ఎం చంద్రలేఖముఖర్జీ తెలిపారు. ఈ మేరకు డీఆర్ఎం కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏర్పాటు చేసిన సౌకర్యాలను యాత్రికులు ఉపయోగించుకుని, రైల్వే అధికారులతో సహకరించాలని కోరారు. పుష్కరాల రద్దీని దష్టిలో పెట్టుకుని డైలీ, వీక్లీ ట్రై న్లకు ఏప్రిల్ వరకు 98 ఉండగా ప్రస్తుతం 115కు పెంచినట్లు తెలిపారు. 38 తర్డ్ ఏసీ కోచ్‌లు విజయవాడకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అడిషనల్ బుకింగ్ కౌంటర్లు : ప్రస్తుతం ఉన్న 9జనరల్ బుకింగ్ కౌంటర్లతో పాటు రెండు కౌంటర్లు మెయిన్‌గేటు వైపు, రెండు కౌంటర్లు జ్ఞానాపురం వైపు ఏర్పాటు చేస్తున్నారు. అవి 24 గంటలు పనిచేస్తాయి. విశాఖపట్నం మెయిన్‌గేటు వైపు మరో రెండు పుష్కరాల యాత్రికుల కోసం రెండు టికెట్ కౌంటర్లు, 11ఏవీటీఎం (ఎనీటైం టికెట్ వెండింగ్ మిషన్స్) ఏర్పాటు చేశారు. దువ్వాడ స్టేషన్లో: దువ్వాడ స్టేషన్ ఒక జనరల్ బుకింగ్ కౌంటర్‌తో పాటు ఉదయం 6గంటల నుండి 9గంటల వరకు, మధ్యాహ్నాం 11గంటల నుండి 13గంటల వరకు 1వ నంబర్ ప్లాట్ ఫారంపై ఏర్పాటు చేసారు. అదే విధంగా ప్లాట్ ఫారం నంబరు 4లో ఉదయం 6గంటల నుండి 2గంటల వరకు సాధారణ బుకింగ్ కౌంటరు ఏర్పాటు చేసారు. 1వ నంబర్ ప్లాట్ ఫారంపై ఒకటి, నాల్గవ నంబర్ ప్లాట్ ఫారంపై ఒకటి ఏవీటీఎంలు ఏర్పాటు చేసారు. ఫేస్ టు ఫేస్ ఎంక్వయిరీ: ప్రస్తుతం ఉన్న ఎంక్వయిరీ కౌంటర్‌తో పాటు యాత్రికుల సౌకర్యార్ధం అధనంగా మరికొన్ని ఎంక్వయిరీ కౌంటర్లు ఏర్పాటు చేయటం జరిగింది. హెల్ప్ డెస్క్ యాత్రికుల సౌకర్యార్ధం మూడు సహాయక కేంద్రాలు విశాఖపట్నం ప్రధాన రైల్వే స్టేషన్లో రెండు, జ్ఞానాపురం స్టేషన్లో ఒకటి, దువ్వాడ స్టేషన్లో ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఇవి 24గంటలు అందుబాటులో ఉంటాయి. అదే విధంగా ప్రయాణికులు సౌకర్యార్దం హెల్ప్‌లైన్ నంబర్లు విశాఖపట్నం మెయిన్‌గేటు వైపు 0891–2746330, 0891–2746338, జ్ఞానాపురం వైపు నంబరు: 0891–2746344, 0891–2744619, దువ్వాడ ప్లాట్ ఫాం నంబర్ ఒకటి వైపు నంబరు: 0891–2746323, 8500358524 నంబర్లలో సంప్రదించవచ్చు. నిరంతర నిఘా: విశాఖపట్నం రైల్వే స్టేషన్ కమర్షియల్ మేనేజర్ పర్యవేక్షణలో స్టేషన్లో నిరంతర నిఘా ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో కమర్షియల్, ఆపరేటింగ్, మెడికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నలింగ్, టెలికాం, ఆర్పీఎఫ్ సిబ్బంది నిరంతరాయం స్టేషన్లో అందుబాటులో ఉంటారు. యాత్రికులకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తుంటారు. విస్తృ సదుపాయాలు ప్రయాణికుల రాక పోకలు అధికంగా జరిగే రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం, జ్ఞానాపురం ద్వారం వైపు పార్కింగ్ సౌకర్యం అభివృద్ధి్ద చేయటం జరిగింది. ప్లాట్ ఫారంలు అన్నింటిపైనా కూర్చునేందుకు వీలుగా సీటింగ్ సౌకర్యం ఏర్పాటు చేసారు. తాగునీటి సౌకర్యంతో పాటు మినరల్ వాటర్ వెండింగ్ మెసీన్లు అధిక సంఖ్యలో ఏర్పాటు చేయటం జరిగింది.వృద్ధులు, వికలాంగుల సౌకర్యార్థం ప్రయాణికుల సౌకర్యార్ధం లిఫ్ట్‌లు, ఎస్కలేటర్స్, బ్యాటరీ ఆపరేటెడ్ కార్లు ఏర్పాటు చే సారు. 100 ఎంబీపీఎస్ హై స్పీడ్ వైఫ్ సౌకర్యం కల్పించారు. ప్లాట్ ఫాం నంబరు 4,5,6లలో ఎపాక్సీ కోటింగ్‌తో వాస్బుల్ అప్రాన్ ఏర్పాటు చేసి పరిశుభ్రమైన ప్లాట్‌ఫాంలు సిద్దం చేసారు. పుష్కరాలకు వెల్లే ప్రయాణీకులతో నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయటం జరిగింది. ఆర్పీఎఫ్ పోలీసులతో పకడ్బందీ బందోబస్తు కల్పిస్తున్నారు. సహాయ చర్యలు చేపట్టేందుకు ఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు 25 స్కౌట్స్ అండ్ గైడ్స్టీంలు, 20 సివిల్ డిఫెన్స్ టీంలను షిఫ్ట్‌లు వారీగా విధులు నిర్వహిస్తూ ప్రయాణికులకు, యాత్రికులకు సహాయంగా ఉంటారు. ప్లాట్‌ఫాం 1, 8లలో వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. నిరంతరం నర్సులు అందుబాటులో ఉంటారు. అదే విధంగా రెండు మెడికల్ బూత్‌లు ఏర్పాటు చేయటం జరిగింది. యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు ఉత్తరాంధ్ర జిల్లాల నుండికృష్ణా పుష్కరాలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి అధిక సంఖ్యలో యాత్రికులు ప్రయాణించే అవకాశం ఉన్నందున్న విశాఖపట్నం నుంచి∙పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు డీఆర్ఎం చంద్రలేఖముఖర్జీ తెలిపారు. దీంట్లో భాగంగా ఇప్పటికే ప్రతిరోజు నడుస్తున్న 36 రైల్లకు అదనంగా ఈ నెల 12 నుండి 23 వరకు మరో 20 రైల్లు నడుపుతున్నట్లు తెలిపారు. దీంతో మొత్తం రోజుకు 56 ట్రిప్పులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. -
కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
మధురవాడ: కృష్ణా పుష్కరాలకు మధురవాడ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు డిపోమేనేజర్ గంగాధర్ తెలిపారు. ఈ పుష్కరాలకు మరింత ప్రత్యేకత సంతరించుకుందని చెప్పారు. ప్రయాణికుల అవసరాలకు తగిన విధంగా బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. గుంపులుగా వెళ్లాలను కునేవారికి కూడా బస్సులు అద్దె ప్రాతిపదికన ఇస్తామన్నారు. మరిన్ని వివరాలకు డిపో, ప్రయాణికుల సేవా కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు. -
ఘట్టమనేని వారి 'మనం'
అక్కినేని ఫ్యామిలీ సినిమాగా వచ్చిన 'మనం' చాలా మంది నటులను ఆలోచనలో పడేసింది. ఈ సినిమాతో తరతరాలుగా సినీరంగంలో ఉన్న చాలా కుటుంబాలు అలాంటి సినిమాలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో పాటు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కూడా ఈ ప్రయత్రాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే దర్శకులు కూడా ఆ తరహా కథలను రెడీ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మూడు తరాల నటులు కలిసి ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ డైరెక్టర్.. కృష్ణ, మహేష్, గౌతమ్‌లతో ఓ సినిమా తెరకెక్కించాడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే కథ కూడా వినిపించిన ఆ డైరెక్టర్ స్క్రిప్ట్ ను మరింత పకడ్బందీగా రెడీ చేసే పనిలో ఉన్నాడట. మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు ఆ తరువాత హీరో అయ్యాక కూడా పలు సినిమాల్లో కృష్ణ, మహేష్‌లు కలిసి నటించారు. అయితే ఘట్టమనేని మూడోతరం వారసుడిగా '1 నేనొక్కడినే' సినిమాతో గౌతమ్ పరిచయం కావడంతో.. ఈ మూడు తరాల నటులు కలిసి నటిస్తారా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు ఎప్పుడు వస్తుందో చూడాలి. -
అందరూ మెచ్చుకునే జగన్నాయకుడు
‘‘గతంలో కృష్ణ, శ్రీదేవి జంటగా ‘భోగభాగ్యాలు’ సినిమా తీశాను. ఇన్నేళ్ల విరామం తర్వాత ఈ కథ నచ్చి ఈ సినిమా చేస్తున్నాను. మూడు తరాల కథ ఇది. రాజకీయ నేపథ్యం ఉండదు’’ అని నిర్మాత వి.ఎ. పద్మనాభరెడ్డి చెప్పారు. రాజా, సుమన్, భానుచందర్ కాంబినేషన్లో పి. చంద్రశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో వట్లూరి శకుంతల రెడ్డి సమర్పణలో రూపొందుతోన్న ‘జగన్నాయకుడు’ పాటల సీడీని శుక్రవారం హైదరాబాద్‌లో తమ్మారెడ్డి భరద్వాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ -‘‘ఈ నెల 25న చెన్నైలో నా వివాహం జరుగనుంది. 30న హైదరాబాద్‌లో రిసెప్షన్ జరుగుతుంది. ఈ సందర్భంగా ‘జగన్నాయకుడు’ పాటలు విడుదల కావడం ఆనందంగా ఉంది’’ అని తెలిపారు. ఇది అందరూ మెచ్చుకునే సినిమా అవుతుందని పి. చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సినిమా బాగా వచ్చిందని భానుచందర్ చెప్పారు.