కృష్ణా పుష్కరాలకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏర్పాట్లు
కృష్ణా పుష్కరాలకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏర్పాట్లు
Published Fri, Aug 12 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
డీఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీ
అల్లిపురం: కృష్ణా పుష్కరాలకు వెళ్లే యాత్రికులు సౌకర్యార్థ్ధం ఈ నెల 12వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే విస్తత ఏర్పాట్లు చేసినట్లు డీఆర్‌ఎం చంద్రలేఖముఖర్జీ తెలిపారు. ఈ మేరకు డీఆర్‌ఎం కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఏర్పాటు చేసిన సౌకర్యాలను యాత్రికులు ఉపయోగించుకుని, రైల్వే అధికారులతో సహకరించాలని కోరారు. పుష్కరాల రద్దీని దష్టిలో పెట్టుకుని డైలీ, వీక్లీ ట్రై న్‌లకు ఏప్రిల్ వరకు 98 ఉండగా ప్రస్తుతం 115కు పెంచినట్లు తెలిపారు. 38 తర్డ్ ఏసీ కోచ్‌లు విజయవాడకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అడిషనల్ బుకింగ్ కౌంటర్లు :
ప్రస్తుతం ఉన్న 9జనరల్ బుకింగ్ కౌంటర్లతో పాటు రెండు కౌంటర్లు మెయిన్‌గేటు వైపు, రెండు కౌంటర్లు జ్ఞానాపురం వైపు ఏర్పాటు చేస్తున్నారు. అవి 24 గంటలు పనిచేస్తాయి. విశాఖపట్నం మెయిన్‌గేటు వైపు మరో రెండు పుష్కరాల యాత్రికుల కోసం రెండు టికెట్ కౌంటర్లు, 11ఏవీటీఎం (ఎనీటైం టికెట్ వెండింగ్ మిషన్స్) ఏర్పాటు చేశారు.
దువ్వాడ స్టేషన్‌లో:
దువ్వాడ స్టేషన్ ఒక జనరల్ బుకింగ్ కౌంటర్‌తో పాటు ఉదయం 6గంటల నుండి 9గంటల వరకు, మధ్యాహ్నాం 11గంటల నుండి 13గంటల వరకు 1వ నంబర్ ప్లాట్ ఫారంపై ఏర్పాటు చేసారు. అదే విధంగా ప్లాట్ ఫారం నంబరు 4లో ఉదయం 6గంటల నుండి 2గంటల వరకు సాధారణ బుకింగ్ కౌంటరు ఏర్పాటు చేసారు. 1వ నంబర్ ప్లాట్ ఫారంపై ఒకటి, నాల్గవ నంబర్ ప్లాట్ ఫారంపై ఒకటి ఏవీటీఎంలు ఏర్పాటు చేసారు.
ఫేస్ టు ఫేస్ ఎంక్వయిరీ:
ప్రస్తుతం ఉన్న ఎంక్వయిరీ కౌంటర్‌తో పాటు యాత్రికుల సౌకర్యార్ధం అధనంగా మరికొన్ని ఎంక్వయిరీ కౌంటర్లు ఏర్పాటు చేయటం జరిగింది.
హెల్ప్ డెస్క్
యాత్రికుల సౌకర్యార్ధం మూడు సహాయక కేంద్రాలు విశాఖపట్నం ప్రధాన రైల్వే స్టేషన్‌లో రెండు, జ్ఞానాపురం స్టేషన్‌లో ఒకటి, దువ్వాడ స్టేషన్‌లో ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఇవి 24గంటలు అందుబాటులో ఉంటాయి. అదే విధంగా ప్రయాణికులు సౌకర్యార్దం హెల్ప్‌లైన్ నంబర్లు విశాఖపట్నం మెయిన్‌గేటు వైపు 0891–2746330, 0891–2746338, జ్ఞానాపురం వైపు నంబరు: 0891–2746344, 0891–2744619, దువ్వాడ ప్లాట్ ఫాం నంబర్ ఒకటి వైపు నంబరు: 0891–2746323, 8500358524 నంబర్లలో సంప్రదించవచ్చు.
నిరంతర నిఘా:
విశాఖపట్నం రైల్వే స్టేషన్ కమర్షియల్ మేనేజర్ పర్యవేక్షణలో స్టేషన్‌లో నిరంతర నిఘా ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో కమర్షియల్, ఆపరేటింగ్, మెడికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నలింగ్, టెలికాం, ఆర్‌పీఎఫ్ సిబ్బంది నిరంతరాయం స్టేషన్‌లో అందుబాటులో ఉంటారు. యాత్రికులకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తుంటారు.
విస్తృ సదుపాయాలు
ప్రయాణికుల రాక పోకలు అధికంగా జరిగే రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం, జ్ఞానాపురం ద్వారం వైపు పార్కింగ్ సౌకర్యం అభివృద్ధి్ద చేయటం జరిగింది. ప్లాట్ ఫారంలు అన్నింటిపైనా కూర్చునేందుకు వీలుగా సీటింగ్ సౌకర్యం ఏర్పాటు చేసారు. తాగునీటి సౌకర్యంతో పాటు మినరల్ వాటర్ వెండింగ్ మెసీన్లు అధిక సంఖ్యలో ఏర్పాటు చేయటం జరిగింది.వృద్ధులు, వికలాంగుల సౌకర్యార్థం ప్రయాణికుల సౌకర్యార్ధం లిఫ్ట్‌లు, ఎస్కలేటర్స్, బ్యాటరీ ఆపరేటెడ్ కార్లు ఏర్పాటు చే సారు. 100 ఎంబీపీఎస్ హై స్పీడ్ వైఫ్ సౌకర్యం కల్పించారు. ప్లాట్ ఫాం నంబరు 4,5,6లలో ఎపాక్సీ కోటింగ్‌తో వాస్‌బుల్ అప్రాన్ ఏర్పాటు చేసి పరిశుభ్రమైన ప్లాట్‌ఫాంలు సిద్దం చేసారు. పుష్కరాలకు వెల్లే ప్రయాణీకులతో నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లో భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయటం జరిగింది. ఆర్‌పీఎఫ్ పోలీసులతో పకడ్బందీ బందోబస్తు కల్పిస్తున్నారు. సహాయ చర్యలు చేపట్టేందుకు ఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు 25 స్కౌట్స్ అండ్ గైడ్స్‌టీంలు, 20 సివిల్ డిఫెన్స్ టీంలను షిఫ్ట్‌లు వారీగా విధులు నిర్వహిస్తూ ప్రయాణికులకు, యాత్రికులకు సహాయంగా ఉంటారు. ప్లాట్‌ఫాం 1, 8లలో వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. నిరంతరం నర్సులు అందుబాటులో ఉంటారు. అదే విధంగా రెండు మెడికల్ బూత్‌లు ఏర్పాటు చేయటం జరిగింది.
యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు
ఉత్తరాంధ్ర జిల్లాల నుండికృష్ణా పుష్కరాలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి అధిక సంఖ్యలో యాత్రికులు ప్రయాణించే అవకాశం ఉన్నందున్న విశాఖపట్నం నుంచి∙పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు డీఆర్‌ఎం చంద్రలేఖముఖర్జీ తెలిపారు. దీంట్లో భాగంగా ఇప్పటికే ప్రతిరోజు నడుస్తున్న 36 రైల్లకు అదనంగా ఈ నెల 12 నుండి 23 వరకు మరో 20 రైల్లు నడుపుతున్నట్లు తెలిపారు. దీంతో మొత్తం రోజుకు 56 ట్రిప్పులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు.
Advertisement