అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా గుర్తింపు పొందింది. దీని నిర్మాణం 1913లో పూర్తయింది. ఈ నిర్మాణంలో భాగంగా రెండు భూగర్భ స్థాయుల్లో 44 ప్లాట్‌ఫామ్‌లు, 67 ట్రాక్‌లు ఉన్నాయి. ఈ ఐకానిక్ స్టేషన్ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం.
ఆకట్టుకునే మౌలిక సదుపాయాలు
44 ప్లాట్‌ఫామ్‌లు: ఈ స్టేషన్‌లో రెండు స్థాయుల్లో మొత్తంగా 44 ప్లాట్‌ఫామ్‌లున్నాయి. ఇది ఒకేసారి 44 రైళ్లను నడిపే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
67 ట్రాక్‌లు: ఈ ట్రాక్‌లు రెండు భూగర్భ స్థాయిల్లో విస్తరించి ఉన్నాయి. వీటిలో ఎగువ స్థాయిలో 41, దిగువ స్థాయిలో 26 ఉన్నాయి.
రోజువారీ రద్దీ: గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ ప్రతిరోజూ 1,50,000 మందికి పైగా ప్రయాణిలకు తమ గమ్యస్థానలను చేరుస్తుంది. రోజూ సుమారు 660 మెట్రో-నార్త్ రైళ్లు ఈ స్టేషన్ గుండా ప్రయాణిస్తాయి.
నిర్మాణ సౌందర్యం: ఈ స్టేషను అద్భుతమైన ‘బీక్స్-ఆర్ట్స్ ఆర్కిటెక్చర్’కు ప్రసిద్ధి చెందింది. 2,500 నక్షత్ర ఆకృతులతో అద్భుతమైన సీలింగ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.
సీక్రెట్ ప్లాట్‌ఫామ్
గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్‌లో ఎక్కువ ప్రాచుర్యం పొందని విషయాల్లో ఒకటి సీక్రెట్ ప్లాట్‌ఫామ్. ట్రాక్ 61 పరిధిలో రహస్య వేదిక ఉన్నట్లు సమాచారం. ఇది వాల్డోర్ఫ్ ఆస్టోరియా హోటల్ క్రింద ఉంది. ఈ వేదికను అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్ వెల్ట్ కోసం నిర్మించినట్లు తెలిసింది. తద్వారా అతను న్యూయార్క్ నగరం, వాషింగ్టన్ డీసీ మధ్య రహస్యంగా ప్రయాణించేవారని కొన్ని సంస్థలు వెల్లడించాయి. అయితే ఆ ట్రాక్ పరిధిలోకి సాధారణ ప్రజలకు ఇప్పటికీ నిషేధం ఉంది.
ఇదీ చదవండి: కేబీసీ తొలి విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా..?
చారిత్రక ప్రాముఖ్యత
గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్‌కు ఒక రవాణా కేంద్రంగా మాత్రమే కాకుండా ముఖ్యమైన సాంస్కృతిక, చారిత్రక కట్టడంగా గుర్తింపు ఉంది. ఇది అనేక హాలీవుడ్ సినిమాల చిత్రీకరణకు నెలవుగా మారింది. చాలామంది సందర్శకులు నిత్యం ఈ స్టేషన్‌ను వీక్షిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment