రైల్వేస్టేషన్లలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నామని రైల్వే జీఎం పికె శ్రీవాత్సవ తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ ...
గుంటూరు : రైల్వేస్టేషన్లలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నామని రైల్వే జీఎం పికె శ్రీవాత్సవ తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ రైల్వేస్టేషన్లలో బహిరంగంగా మల విసర్జన చేసే భారీ జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు. పరిశుభ్రతపై త్వరలో రైల్వే చట్టాల్లో మార్పులు తీసుకు వస్తామని రైల్వే జీఎం తెలిపారు. కాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 32 రైల్వే స్టేషన్లలో పరిశుభ్రతను 450 సిసిటివిల ద్వారా పర్యవేక్షించే వ్యవస్ధను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దేశ రైల్వే చరిత్రలో 32 పెద్ద రైల్వే స్టేషన్లలో పరిశుభ్రతను చేపట్టడం, సిసిటివీల ద్వారా పర్యవేక్షించడం ఇదే ప్రథమం.